నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ

మంచిర్యాల,నేటి ధాత్రి:

నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మొంథా తుఫాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ సూచించారు.ముఖ్యంగా దండేపల్లి,లక్షేట్టిపేట్,చెన్నూర్, కోటపల్లి,వేమనపల్లి,భీమిని, జైపూర్ మండలాల నదీ పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెట్లు,కరెంటు పోల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.వీలైనంతవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని కోరారు.

దాబాలపై పోలీసుల దాడులు – మద్యం స్వాధీనం…

దాబాలపై పోలీసుల దాడులు – మద్యం స్వాధీనం

జైపూర్,నేటి ధాత్రి:

దాబాలపై పోలీసుల దాడులు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని లక్ష్మిపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా దాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేందర్ గురువారం తెలిపారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.

మావోయిస్టు పార్టీ భారత్ బంద్ పిలుపు…

మావోయిస్టు పార్టీ భారత్ బంద్ పిలుపు

రాష్ట్ర సరిహద్దులో హై అలర్ట్ చేసిన పోలీసులు

జైపూర్,నేటి ధాత్రి:

 

మావోయిస్టు అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రామగుండం కమీషనరేట్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చెన్నూర్ రూరల్ పోలీస్ లు విస్తృత తనిఖీలు చేపట్టారు.సరిహద్దు వెంబడి ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్స్ ను రహదారుల వెంబడి కల్వర్ట్స్ అదేవిధంగా వాహనాల తనిఖీ ముమ్మరంగా చేపట్టారు.ఈ తనిఖీలలో చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్,కోటపల్లి ఎస్సై రాజేందేర్,కోటపల్లి,నీల్వాయి పోలీస్ లు మరియు స్పెషల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు….

పత్తి పంటను ధ్వంసం చేసిన అడవి పందులు

నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు వినతి పత్రం అందించిన రైతులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొండపేట, నాగంపేట,ఏసన్వయి,ఏడగట్ట, పిన్నారం గ్రామాలలో భారీగా అడవి పందులు పత్తి పంటను నష్టం చేశాయని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డివై ఎఫ్ఆర్ఓ లావణ్య కి వ్యవసాయ శాఖ అధికారి ఏవో సాయి రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు.పలు గ్రామాల రైతులకు జరిగిన నష్టానికి అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి వెంటనే తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సాంబ గౌడ్,కోటపల్లి మండల సీనియర్ నాయకులు కొట్టే నారాయణ,అజ్మీర, పున్నం,అన్వర్,ఆలీ,పోచం, కొట్రాంగి మల్లేష్,దేవయ్య, రూపా నాయక్,భూమయ్య, రైతులు,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version