విద్యతో పాటు సంస్కారం ఎంతో ముఖ్యమని న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్ అన్నారు వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ విద్యార్దులకు నల్గొండ జిల్లాకు చెందిన న్యాయవాది తన స్నేహితుడు కొత్తపల్లి శశాంక్ పంపించిన 10 వేల విలువ చేసే 30 స్కూల్ బ్యాగులను సంతోష్ సోమవారం విద్యార్ది నిలయంలో జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేసారు ఈ సందర్భంగా వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు అద్యక్షతన జరిగిన సమావేశంలో విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగించారు సోమవారం నిలయంలో జరిగిన చదువులతల్లి సరస్వతీదేవి పూజ సందర్భంగా విద్యార్దులకు స్కూల్ బ్యాగులను అందచేయడం సంతోషకరమని అన్నారు ఇక్కడి విద్యార్దుల క్రమశిక్షణ వారు పఠించే సంస్కృత స్లోకాలు అద్బుతమని పేర్కొన్నారు ఇక్కడి విద్యార్దుల క్రమశిక్షణను ఇతరులు చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు ఇక్కడి విద్యార్దుల గొప్పతనాన్ని తమ అడ్వకేట్స్ క్లాస్ మెట్స్ వాట్సాఫ్ గ్రూపులో పోస్ట్ చేయడంతో అనేక మంది స్పందించి విద్యార్థులకు సహాయ సహకారాలను అందచేసేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు తాము చదువుకున్న రోజులలో పడ్డ కష్టాలను ఇతరులు అనుభవించకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్దులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు తాను చెప్పిన ఒక్క మాటతో స్నేహితులు ముందుకు రావడం ఇక్కడి విద్యార్దుల గొప్పతనమేనని స్పష్టం చేసారు విద్యార్దులు కూడా దాతల నమ్మకాన్ని నిలబెట్టేలా పట్టుదలతో చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు తాను చర్ల నుండి హైకోర్టు లాయర్ గా ఎదిగానంటే దానికి చదువే కారణమన్నారు దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టిసారించాలని కోరారు వనవాసీ ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ విద్యార్దులు దాతలు అందచేసిన సహకారాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు పేద విద్యార్దుల చదువులకు పెద్ద ఎత్తున సహకరిస్తున్న దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేసారు ఈ కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ ఉపాద్యక్షుడు జవ్వాది మురళీకృష్ణ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు సభ్యురాలు పోలిన రమాదేవి నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి విద్యార్దుల తల్లిదండ్రులు ముదరయ్య ఉంగయ్య రేగుంట ఆచార్యురాలు కలం జ్యోతి పాల్గొన్నారు
సదువు సారేడు ఫిజులు బారేడు అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల తీరు చూస్తే.ఉన్నత చదువులు అంగట్లో అందుబాటులో ఉన్నాయి అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల పనితీరు.మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల దందా మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుంది.ఉన్నత చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి.ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తాము పెట్టిందే సిద్ధాంతం అంటూ అధిక ఫిసులు వసులు చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పెను భారంగా మారింది. స్కూల్ మొదలు అడ్మిషన్ ల పేరుతొ వేలకు వేలు వసులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మకూడదని ఆదేశాలు ఉన్న, తమకేమి పట్టనట్లు ఎం ఆర్ పి కి మించి ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు అమ్ముతు లక్షలు గడిస్తున్నారు.స్కూల్ యూనిఫామ్ లతో పాటు టై లు, బెల్ట్ లు, షు లు అన్ని అంగట్లో అందుబాటులో ఉన్నాయంటూ పవిత్ర పాఠశాలను అంగడి సంతగా మారుస్తున్నారు. ఇదంతా తెలిసిన విద్యాశాఖ అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ గోడును ఎవ్వరి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
మరోవైపు ఉన్నత చదువులకై ప్రభుత్వ గురుకుల, నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో టిసి కోరగా దానికి సైతం వేలల్లో డబ్బులు వసులు చేస్తున్నారు.నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి నవోదయ, గురుకుల వంటి పాఠశాలల్లో సిటు అందించినప్పటికీ,ప్రయివేట్ పాఠశాలల చేతివాటం వల్ల అధికాస్త తల్లిదండ్రులకు శాపంగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేటు పాఠశాలలలో మొత్తం ఒక్కసారిగా కడితే 10% డిస్కౌట్ అంటూ ఆఫర్ లు సైతం పెడుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటు వైపు కన్నీత్తి చూడటం లేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో నిర్దేశిత ఫీజులను అందుబాటులో ఉంచగా విద్యాశాఖ అలసత్వం వల్ల అధికాస్తా అందని ద్రాక్షగానే మారింది.మరోవైపు పరిమితికి మించి ఆటోలు టాటా ఏసీ లు, బస్సులల్లో విద్యార్థులను తీసుకుని వస్తు ప్రమాదలు జరిగి, విద్యార్థుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మండలంలోని వర్షకొండ మండల పరిషత్ పాఠశాలలో విద్యాధికారి శ్రీ బండారి మధు సందర్శించడం జరిగింది పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని అభినందించాడు అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో మొక్కలను పెంచడం ప్రతి విద్యార్థి భాద్యతగా తీసుకోవాలని విద్యార్థులకు చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్ మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
వరండాలు, చెట్ల కింద పై చదువులు • ఆరు బయట వంట • సరిపడ గదులు లేక ఇబ్బందులు..
నిజాంపేట: నేటి ధాత్రి
Principal Padma Reddy’s
ఆరు బయట చెట్ల కింద, వరండాలలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరు బయట చదువులు కొనసాగించలేమని విద్యార్థులు వాపోతున్నారు. సరైన గదులు లేక ఆరుబయటే వంట కూడా కొనసాగించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరు బయట వంటశాలకు విష సర్పాలు వస్తున్నాయని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని వేడుకుంటున్నారు.
ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి వివరణ
పాఠశాలలో అదనపు గదులు లేక ఆరుబయటే చదువులు కొనసాగించడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకోబోయినట్లు పేర్కొన్నారు.
విద్యను కషాయంగా మార్చుతున్న కేంద్ర పాలకులు రాదండి. దేవేందర్
భూపాలపల్లి నేటిధాత్రి
జాతీయ విద్యావిధానం 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు “కాషాయ విష గరళం”గా మార్చుతున్నారని తెలంగాణవిద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాదండి దేవేందర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం కాషాయం “కషాయం”గా మారి “విషం” గా మారితే ప్రజలు సహించరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి పెద్దలు గ్రహించాలి. విద్యా కాషాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యా కాషాయంతో “బహుజన దేశం” గా ఉన్న భారతదేశాన్ని “బ్రాహ్మణ దేశం”గా మార్చాలని ప్రయత్నిస్తూన్న బిజెపి అంతర్గత కుట్రపూరిత ఎజెండాను ప్రజలు అర్థం చేసుకొని తిప్పి కొట్టడానికి ఎంతో కాలం పట్టదు అని వారు అన్నారు
జిల్లా విద్యాశాఖ అధికారి యం రాజేందర్ డిఆర్డిఏ పిడి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఉల్లాస్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి వయోజనులను అక్షరాస్యత క్రమము పెంచే దిశగా ఈ కార్యక్రమము కొనసాగుతుందని ప్రతి గ్రామము మండలంలో వయోజనులలో నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులుగా తీర్చి దిద్దడానికి అందరూ కృషి చేయాలని కోరారు. చదువుకోవాలని కోరిక గల వారికి ఉజ్వల భవిష్యత్తును తెలంగాణ ఓపెన్ స్కూల్ విద్యావకాశాన్ని కల్పిస్తుందని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలు, గ్రామీణ యువత, పనిచేసే స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఇతరులకు విద్యను అందించడమే తెలంగాణ ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని, అందరికీ విద్యను అందించే ఉద్దేశంతో తెలంగాణ ఓపెన్ స్కూల్ 2008-09 విద్యా సంవత్సరం నుండి పదవ తరగతి కోర్సును అందిస్తుందన్నారు. 2010-11 నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ ను కోర్సును ప్రారంభించిందని తెలియజేశారు.కమ్యూనిటీ మొబైలైజ్డ్ అధికారి సామల రమేష్ మాట్లాడుతూ అక్షరాస్యత తోనే అభివృద్ధిని సాధించగలమని అందుకు అనుగుణంగా మండల పరిధిలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ పరిధిలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు అందరము ఉమ్మడిగా పనిచేసి తమ తమ పరిధిలోగల వయోజనులందరిని అక్షరాస్యతులుగా చేసినట్లయితే దేశ పురోభివృద్ధిలో వారి పాత్ర గణనీయంగా ఉంటుందని, దానివల్ల దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు మెరుగవుతాయని మీ అందరూ వీటికి అనుగుణంగా పనిచేసి మన జిల్లాను ముందు వరసలో నిలపాలని వారు ప్రత్యేకంగా కోరినారు. పూర్వపు వరంగల్ జిల్లా సార్వత్రిక విద్యాపీఠం కోఆర్డినేటర్ సదానందం మాట్లాడుతూ వయోజనులలో గుర్తించిన నిరక్షరాస్యులను పదో తరగతి ఇంటర్మీడియట్ లలో ప్రవేశము పొందడానికి వారిని గుర్తించి సంబంధిత మండలంలోని పాఠశాలలో కోఆర్డినేటర్ కు సార్వత్రిక విద్యాపీఠము పదవ తరగతి, ఇంటర్మీడియట్లలో చేర్పించవలసిందిగా వారు కోరినారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య విభాగ కోఆర్డినేటర్ వేణుగోపాల్ జిల్లాలోని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సి ఆర్ పి లు డిఆర్డిఏ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
అంగవైకల్యాన్ని అధిగమించి డాక్టరేట్ గౌరవాన్ని అందుకున్న బొల్లారం సంజీవ్
పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన బొల్లారం అగమ్మ లింగయ్య దంపతుల మూడవ సంతానం సంజీవ్, పుట్టుకతోనే శారీరక అంగవైకల్యం ఉన్నప్పటికీ, జీవితంపై నమ్మకంతో,విద్యపై తపనతో తనను తాను తీర్చిదిద్దుకున్న ఉత్తమ ఉదాహరణ,ఆయన చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలను,ఒంటరితనాన్ని, సామాజిక దూరాన్ని,ఆర్థిక ఇబ్బందులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో దొమ్మటి రాజేందర్ మరియు స్నేహితులు ఆత్మస్థైర్యం అందించి ప్రోత్సహించారు.
ఎన్నో కష్టాలను ఎదుర్కొని విద్యాబ్యాసం
ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువుపై దృష్టి సారిస్తూ ముందుకు సాగాడు.తల్లిని కోల్పోయిన సంజీవ్ ఆ బాధను దిగమింగుకుంటూనే విద్యను తన సాధనంగా మలుచుకున్నాడు.ఇటు చదువుకొనసాగిస్తూనే కీ కొద్ది సంవత్సరాలు,వరంగల్ సెంట్రల్ జైలులో సైకాలాజి కౌన్సిలర్ గా కొద్దిరోజులు సేవాలందించారు.తనకు వచ్చిన చిన్న చిన్న పనులను చేసుకుంటూ ఒకరిమీద ఆధారపడకుండా తన జీవితాన్ని కొనసాగించాడు,క్రమంగా ఉన్నత విద్యను అభ్యసిస్తూ,పోరాట పంథాలోనే ప్రగతి సాధించాడు.
గవర్నర్ చేతులమీదుగా డాక్టరేట్
సూపర్వైజర్ ఆచార్య తక్కలపెల్లి.దయాకర్ రావు ఆధ్వర్యంలో పూర్తి చేసి ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న 23వ కన్వొకేషన్ సభలో,పిహెచ్డి(డాక్టరేట్) సోమవారం రోజున రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్నారు.ఇది కేవలం ఆయన వ్యక్తిగత విజయమే కాదు ఇది సమాజానికి ఒక స్పష్టమైన సందేశం “అంగవైకల్యం శరీరానికి మాత్రమే.మనసు,విజ్ఞానం, కలలకి కాదు”అనే వాక్యం సంజీవ్ జీవితంలో పటిష్ఠంగా నిలిచింది.కుటుంబ పరిస్థితులు,శారీరక సమస్యలు,పర్యావరణ అడ్డంకులు అన్నిటినీ దాటి తన స్థానం సంపాదించుకున్న ఆయన అంగవైకల్యం ఉన్న విద్యార్థులకే కాదు,ప్రతీ సామాన్య యువకునికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సంజీవ్ విద్యతోపాటు సామాజిక స్పృహతో కూడిన వ్యక్తిగా, ఇతర దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తూ సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.ఈ క్షణం,అయన జీవితంలోని ఒక చరిత్రాత్మక ఘట్టం ఈ సందర్భంగా సంజీవ్ ని సత్కరించి,ఆయన విజయాన్ని గర్వంగా గుర్తించాల్సిన అవసరం సమాజంపై ఉంది.ఆయన జీవిత ప్రయాణం పరిమితి ఉన్న శరీరం,అపరిమితమైన ఆశయాల మధ్య జరిగే ఓ గొప్ప పోరాటమని చెప్పవచ్చు.
ఈ కార్యంతో మాగ్రామానికి యువతకు ఆదర్శప్రాయంగా ఉంటాడు-కాలనీ వాసులు
బొల్లారం సంజీవ గవర్నర్ చేతులమీదుగా పిహెచ్డి అందుకోవడం చాలా గర్వంగా ఉంది.మేము చిన్నత్తనంనుండి సంజీవ ను చూస్తువస్తున్నాం పేదరికంలో పుట్టి పెరిగి అంగవైకల్యం ఉన్నప్పటికీ అనేక కష్టాలు పడి పేదరికంతో పోరాడి కస్టపడి చదివి ఈ స్థాయికీ చేరుకోవడం మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆనందకరంగా ఉన్నదని మా గ్రామం తరుపున మా కాలనీ తరుపున హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ప్రవైట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఝరాసంగం ఎంఐఎం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ అన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయిలో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లల కోసం ఉచితంగా కేటాయించాలని ఇది 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించా లని అన్నారు.
విద్యా హక్కు చట్టం (RTE) 2009
, ప్రైవేట్ పాఠశాలలు
RTE చట్టం, 2009 ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రారంభ స్థాయి తరగతుల్లో 25% సీట్లను బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాలని అన్నారు.ఈ సీట్లలో పిల్లలకు ఉచితంగా విద్యను అందించి, పాఠశాలలు విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాంలను కూడా అందించాలని, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుండి ఎలాంటి ప్రవేశ రుసుములు లేదా వార్షిక రుసుములు వసూలు చేయకూడదని అన్నారు.
చట్టం పొరుగు పాఠశాలలను కూడా ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తుంది. ప్రతి పిల్లవాడు తమ ఇంటికి దగ్గరగా ఉన్న పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రవేశాల కోసం పిల్లలను స్క్రీనింగ్ చేయడం లేదా క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలకు నిధులు సమకూర్చాలి, తద్వారా వారు ఉచిత విద్యను అందించగలరని,ప్రభుత్వాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయాలని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు కోరుతున్నాయి, తద్వారా వారు తమ పిల్లల విద్య కోసం ఆ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చుని RTE చట్టం ప్రైవేట్ పాఠశాలలు పిల్లలను వివక్షత లేకుండా చేర్చుకోవడానికి, వారి విద్యకు హామీ ఇవ్వడానికి ఉద్దేశించబడిందని,ఈ చట్టం అమలులో ప్రభుత్వాలు,ప్రైవేట్ పాఠశాలలు రెండు బాధ్యత వహించాలని అన్నారు.ప్రభుత్వాలు నిధులు అందించడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు సహాయం చేయాలని, తద్వారా విద్యార్థుల హక్కులను కాపాడడానికి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయవచ్చని అన్నారు.
పేద పిల్లలకు ప్రవేట్ పాఠశాలలో 25% ఉచిత విద్యను అందించాలి
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనం వద్ద ప్రైవేటు పాఠశాలల్లో విద్య హక్కు చట్టం ప్రకారం బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు 25% ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లో పొందుపరిచిన ఆర్టికల్ 12 (1) సి విద్య హక్కు చట్టం ప్రకారం 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని రాశారు కేంద్ర ప్రభుత్వం 2009 నుండి అమలులోకి తేవడం జరిగింది ఈ విద్య హక్కు చట్టాన్ని ప్రతి ప్రైవేటు పాఠశాల బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు ఉచిత విద్యను అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు కట్ల శంకరయ్య దూడపాక దుర్గయ్య అంబేద్కర్ వాదులు ఇమ్మడి వెంకటేశ్వర్లు దూడపాక శ్రీనివాస్ మైనార్టీ సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి సైదుల్ గడ్డం సదయ్య చిలువేరు దయాకర్ ఊరడి మురళి రత్నం రామకృష్ణ శనిగరపు ఆనందం ఎండి లాలు పాల్గొన్నారు
విశ్వ జంపాల,న్యాయవాది,మరియు విశ్వ సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-
భారత రాజ్యాంగం ప్రకారం కుల, మత, వర్గ, లింగ, ప్రాంత వ్యత్యాసాలు చూపకుండా, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక బేధాలు పాటించకుండా, రాజు, పేద తేడా లేకుండా అందరికి ఒకే రకమైన, నాణ్యమైన విద్యా-వైద్యాన్ని అందించాల్సిన భాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల కష్టార్జితం.ప్రజలు తమ ప్రతినిధిగా ప్రభుత్వాన్ని ఓట్ల ద్వారా ఎన్నుకుంటున్నారు.ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.నేటి బాలలే రేపటి పౌరులు” అన్న నినాదాన్ని నిజం చేయాలన్న ఆలోచన ఏ మాత్రం పాలకులకు ఉన్నా, పుట్టిన ప్రతి బిడ్డను 5 ఏళ్ళ వయస్సులో దత్తత తీసుకోవాలి. విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసి సమాజానికి అందించాలి. ఆ భాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలి. నిజానికి ఇది ప్రభుత్వం మీద ఉన్న చట్ట బద్ధమైన బాధ్యత కూడా.అన్ని ఉచితం అని ఊదర గొట్టే ప్రభుత్వాలు విద్యా-వైద్యం కోసం ప్రత్యేక ప్రతిపత్తి కల్గిన సంస్థలను ఏర్పాటు చేయాలి. బోధన రుసుములు, ఉపకార వేతనాలు, పరీక్ష ఫీజులు, భోజన సౌకర్యం, దుస్తులు, పుస్తకాల పంపిణీ, బస్సు-రైలు పాసులు, సంక్షేమ హాస్టళ్ళ నిర్వాహణ మొదలైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రజలను ప్రలోభ పెట్టే సాధనాలుగా సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుతున్నాయి. మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు గాని సామాన్య ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. విద్యా-వైద్య సమస్యలు ప్రజలను నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు పథకాలెన్ని ఉన్న ఫలితం శూన్యం. నల్లబల్ల పథకం (ఓ బి బి) 1987, ఏపీ ప్రాథమిక విద్యా పథకం (అప్పీప్) 1984, జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం (డీపీఈ పి) 1996, సర్వశిక్ష అభియాన్ (ఎస్ ఎస్ ఏ) 2002, (దీన్ని 2007లో రాజీవ్ విద్యా మిషన్ (ఆర్ వి ఎమ్) గా మార్చారు. ఏపీ పాఠశాలల ఆరోగ్య పథకం (ఏపీ ఎస్ హెచ్ పి) 1992, విద్యా విషయక దూరదర్శన్ కార్యక్రమం (ఈటీవీపీ) 1986, పాఠశాల సంసిద్ధాంత కార్యక్రమాలు (ఎస్ ఆర్ పి), ఆవాస పాఠశాలలు (ఆర్ ఎస్), దూరదర్శన్ పాఠాలు (టీవీ లెసన్స్), రేడియో పాఠాలు, టెలికాన్ఫరెన్సింగ్, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమం (స్పాట్) 1993, సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం (సీసీఆర్ టీ), జాతీయస్థాయి సంస్థలు :- కేంద్రీయ విద్యా సలహా సంఘం (సి ఏ ఈ బి) 1921, కేంద్రీయ మాధ్యమిక విద్యా సంఘం (సి ఏ ఎస్ ఈ) 1929, సార్జంట్ విద్యా కమీషన్, సెకండరీ విద్యా కమీషన్, యూనివర్సీటి గ్రాంట్ కమీషన్ (యూజీసీ) 1948, జాతీయ విద్యా పరిశోధనా మరియు శిక్షణా మండలి (ఎన్ సి ఈ ఆర్ టీ) 1961, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్ సి టీ ఈ) 1973, ప్రాంతీయ విద్యా సంస్థ (ఎన్ ఐ ఈ పి ఏ) 1979, కేంద్రీయ ఆంగ్ల మరియు విదేశీ భాషల సంస్థ (సి ఐ ఈ ఎఫ్ ఎల్) (ఇఫ్లూ) 1958. రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు :-రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి (ఎస్ సి ఈ ఆర్ టీ) 1967, పాఠ్య పుస్తకాల రచయితల కమిటి, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్ ఐ ఈ టీ) 1985, రాష్ట్ర విద్యా నిర్వహణ మరియు శిక్షణ సంస్థ (ఎస్ ఐ ఈ ఎమ్ ఏ టీ) 1979, రాష్ట్ర వనరుల కేంద్రం (ఎస్ ఆర్ సి) 1978, జిల్లా విద్యా మరియు శిక్షణ సంస్థ (డైట్) 1989, మండల వనరుల కేంద్రం (ఎమ్ ఆర్ సి), స్కూల్ కాంప్లెక్స్ (ఎస్ సి), మొదలియర్ విద్యా కమీషన్, కొఠారీ విద్యా కమీషన్, ఛటోపాధ్యాయ విద్యా కమీషన్ 1983, జాతీయ విద్యా విధానం 1986, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి, బడిబాట, రాష్ట్ర విద్యా చైతన్య ఉత్సవాలు, కస్తూర్భా బాలికా విద్యాలయాలు, సక్సెస్ పాఠశాలలు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ 2009, సాక్షర భారత్ (2009), మధ్యాహ్న భోజన పథకం 2005, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం (ఎన్ సి ఎఫ్) 2005, ప్రొఫెసర్ యశ్ పాల్ నివేదిక 1993, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2000. విద్యా ప్రైవేటీకరణ కోసం పున్నయ్య కమిటి (1992), స్వామినాదన్ కమిటి (1992), బిర్లా-అంబాని కమిటి (2000), విద్యా హక్కు చట్టం 2009, నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020, బెస్ట్ అవైలబుల్ స్కీమ్, ఫీజు రియంబర్స్మెంట్ తదితర కమిటీలు కమిషన్లు పథకాలు ప్రవేశపెట్టాయి. వికలాంగుల కోసం, స్త్రీ విద్యకోసం, బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల కోసం ప్రభుత్వం అనేక రకాల పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంది. వీటితో పాటు ఒక్కొక్క స్కూలు మొత్తం 57 రకాల రికార్డులను మరియు రిజిష్టర్లను నిర్వహిస్తుంది. వీటన్నింటినీ ప్రభుత్వాలు మొక్కు “బడి” పథకాలుగా మార్చడం విశేషం. ఆయా పథకాలను ఎట్లా ప్రవేశ పెట్టాలో, ఎట్లా నీరు కార్చాలో మన దేశ పాలకులకు తెలిసినంతగా ప్రపంచంలో మరే దేశ పాలకులకు తెలియదు. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కాషాయ విష గరళంగా మార్చిన సంగతి విధితమే. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని విద్యావేత్తలు సామాజికవేత్తలు విద్యార్థి సంఘాలు మేధావులు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తన తిరోగమన విధానాన్ని భారతీయ సమాజంపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి తన గొయ్యి తానే తీసుకోవడం తప్ప మరొకటి కాదనేది నిజం. కాషాయం కషాయంగా మారి విషంగా మారితే ప్రజలు సహించరనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏలుతున్న బిజెపి పెద్దలు గ్రహించాలి. విద్యా కాషాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. విద్యా కాషాయంతో బహుజన దేశంగా ఉన్న భారతదేశాన్ని బ్రాహ్మణ దేశంగా మార్చాలని ప్రయత్నిస్తూన్న బిజెపి అంతర్గత కుట్రపూరిత ఎజెండాను ప్రజల అర్థం చేసుకొని తిప్పి కొట్టడానికి ఎంతో కాలం పట్టదు.ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నప్పటికీ విద్యా-వైద్యం సామాన్యుడి దరి చేరడం లేదు. కారణమేదైన పాపం ప్రభుత్వాలదే. అక్కరకు రాని చుక్కలు ఎన్ని ఉంటేనేమి? సూర్యుడు ఒక్కడుంటే చాలు! అన్నట్లు వందల కొలది సంక్షేమ పథకాలు పెట్టడం కన్నా, అన్ని రకాల మౌళిక వసతులతో కూడిన సమీకృత/ఏకీకృత విద్యా-వైద్య సంస్థలను మండల కేంద్రం యూనిట్ గా స్థాపించడం మేలు. ఆరంభ సూరత్వం ఆ పైన అలసత్వం అనేది ప్రభుత్వాల పనితీరుకు అద్దం పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జాతీయ అక్షరాస్యత 74.04 శాతంగా ఉంది. అక్షరాస్యత శాతం పెరిగిన దానికన్నా రెట్టింపు స్థాయిలో నాణ్యత ప్రమాణాలు, విలువలు దిగజారి పోయాయి. దేశంలో ఉపాధ్యాయులు, డాక్టర్ల కొరత 40 శాతానికి మించే ఉంటుంది. 5వ, తరగతికి వచ్చే సరికి 78%, 10వ, తరగతికి వచ్చే సరికి 62 శాతం, ఉన్నత విద్యకు వచ్చేసరికి 7 శాతానికి విద్యార్థుల సంఖ్య మించడం లేదు. 7 శాతంగా ఉండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల అవసరాలను, మౌళిక వసతులను కూడా ప్రభుత్వం తీర్చక పోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యానికి నిదర్శనం.విద్యార్ధులు చదువు మానివేయడం వెనుక ప్రధాన కారణం పేదరికం. పేదరికానికి ప్రధానకారణం నిరుద్యోగం, మన దేశంలో నిరుద్యోగం 31 శాతం ఉంది. మిగతా 69 శాతం మందిని ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రకటిస్తున్నటికీ, చాలా మంది అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేని వారిగా, నిర్దిష్ట ఆదాయం లేని వారిగా, అరకొర పనులతో చాలిచాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం మన దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలు. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి విద్యను ఒక సాధనంగా ప్రభుత్వం ఉపయోగించుకోవచ్చు. పేదరికంతోనే ప్రజలు విద్యకు, వైద్యానికి దూరమవుతున్నారు. జాతీయ ఆరోగ్య ముసాయిదా ప్రకారం 6.3 కోట్ల మంది ప్రజలు ప్రతీ యేటా వైద్య ఖర్చుల కారణంగా దారిద్య్రంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రభుత్వం పేదరిక-నిరుద్యోగ నిర్మూలనకై కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు అందడం లేదు. రోగమొకటైతే, మందొకటి పెడితే రోగమెట్లపోవును అన్నట్లుంది ప్రభుత్వ పని విధానం. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, విద్యను ఆయుధంగా మలచుకోగలిగితే నిరుద్యోగం, పేదరికం నిర్మూలించవచ్చు. ప్రపంచంలో అత్యంత విలువైనవి, అవసరమైనవి మానవ వనరులు. మానవ వనరులు మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. మానవ వనరులను సమాజ అవసరాలకు, దేశ అవసరాలకు అనుగుణంగా తీర్చి దిద్దాల్చిన సామాజిక, చట్ట బద్ధమైన భాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది.
జిల్లాలో శితిలావస్థలో ఉన్న తరగతి గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. శిథిల గదులు ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గత 30 ఏండ్లుగా వినబడిన మాట ప్రభుత్వ పాఠశాలల విస్తరణ – విద్యావ్యాప్తి. గత పదేళ్లుగా వినబడుతున్న మాట ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ.19 కంటె తక్కువ విద్యార్ధులున్న ప్రాథమిక పాఠశాలలను, 75 కన్నా తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న వేరొక పాఠశాలలో విలీనం చేయడం. ఈ రకమైన విలీనానికి ప్రభుత్వం పెట్టిన ముద్దు పేరు హేతుబద్దీకరణ. అందరికి అందుబాటులోకి విద్యను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో పాఠశాలల విస్తరణ చేపట్టి “పల్లె పల్లెకో పాఠశాల” నినాధంతో గత ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా పాఠశాలలను ఏర్పాటు చేసి పక్కా భవనాలను నిర్మించింది. రెండు దశాబ్దాల తర్వాత వెనకకు తిరిగి చూస్తే ఆశించిన ఫలితాలు రాకపోగా విద్యా నాణ్యత ప్రమాణాలు మరింతగా దిగజారి పోయాయి. ఆ కాలంలో ప్రారంభించిన పాఠశాలల పక్కా భవనాల నిర్మాణం కారణంగా అప్పుడు ప్రభుత్వంలో వున్న పార్టీ నాయకులను కాంట్రాక్టర్లుగా తయ్యారు చేయడానికి, వారి జేబులు నింపడానికి మాత్రం ఉపయోగపడింది. పాఠశాలల ఏర్పాటులో చూపిన శ్రద్ధను మౌళిక వసతులు కల్పించడంలోను, నాణ్యమైన విద్యను అందించడంలోను ప్రభుత్వం చూపలేదు.మారిన పరిస్థితుల కారణంగా విద్యార్థులున్న చోట ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేరు. ఇద్దరు ఉన్నచోట మౌళిక వసతులు లేవు. ఈ పాఠశాలల నిర్వహణను ప్రభుత్వాలు తలకు మించిన భారంగానే భావిస్తున్నాయి. మరోప్రక్క ప్రైవేట్-కార్పోరేట్ విద్యా సంస్థలు విస్తరించిన కొద్ది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గిపోయింది. విద్యార్థులు లేరన్న కారణంతో కొన్ని పాఠశాలలను శాశ్వతంగా మూసివేసి అక్కడి విద్యార్ధులను, ఉపాధ్యాయులను దగ్గరలోని వేరొక పాఠశాలలో సర్దుబాటు చేయడం ద్వారా మెరుగైన విద్యను అందించవచ్చు, ఖర్చును తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ తీరును ఉపాధ్యాయ-విద్యార్ధి సంఘాలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హేతుబద్దీకరణతో పాఠశాల విద్యావ్యస్థ బాగు పడుతుందనుకోవడం కూడా ఒక భ్రమ మాత్రమే.ముందు చూపులేని ప్రభుత్వాలు-ఉన్నతాధికారులు “లేడికి లేచిందె పరుగు” అన్నట్లు ఒకప్పుడు పాఠశాలల విస్తరణను చేపట్టి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అంతే వేగంతో హేతుబద్దీకరణకు పూనుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను మాత్రం అన్వేషించడం లేదు. చర్చా-విశ్లేషణ, సంవాదం – సమన్వయం లేకుండా చేపట్టే ఏ కార్యాక్రమాలైన/పథకాలైన ఇలాగే కొనసాగి ఆచరణలో విఫలం అవుతాయి. విస్తరణ లేదా హేతుబద్దీకరణ ముఖ్యం కాదు. అందరికి సమానమైన, నాణ్యమైన విద్యా అందుతుందా లేదా అనేది ముఖ్యం. విస్తరణ, హేతుబద్దీకరణ రెండు ఆనాలోచిత అసంబద్ధమైన విధాన నిర్ణయాలే. పుండోకటైతే మందొకటి వేసినట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది.విస్తరణ, హేతుబద్ధీకరణతో విద్యావ్యస్థలో ఏండ్ల తరబడి ఉన్న మౌలిక సమస్యలు తీరవు.పాఠశాలల విస్తరణ పేరుతో 30 ఏండ్లు కాలం గడిపిన ప్రభుత్వాలు, హేతుబద్ధీకరణ పేరుతో మరో 30 ఏండ్లు కాలం వెల్లబుచ్చాలని ప్రయత్నిస్తున్నాయి. క్రమ క్రమంగా పాఠశాలల సంఖ్యను, ఉపాధ్యాయుల సంఖ్యను కుదించడం ద్వారా ప్రభుత్వాలు ఖర్చును తగించుకోవాలని, బాధ్యతల నుండి తప్పకోవాలని చూస్తున్నాయి. ప్రభుత్వాలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయోనన్న భయంతో విద్యార్థులు-వారి తల్లిదండ్రులు అయోమయ (సంకట) స్థితిలో నలిగిపోతూ, నష్టపోతున్నారు. వివిధ వర్గాల ప్రజల ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు తాత్కాలికంగా వెనక్కు తగ్గినప్పటికి చాప కింద నీరు లాగ హేతుబద్దీకరణ అమలుకు పూనుకుంటుంది.విద్యా వ్యవస్థలో నెలకొన్న మౌళిక సమస్యలను, అనుబంధ సమస్యలను చర్చించి, పరిష్కరించకుండా “మాయల గారడి చేతిలో మంత్రదండం” లాగా హేతు బద్దీకరణను చూపడం, హేతుబద్ధీకరణ ఒక్కటే విద్యా వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారంగా చూపడం ప్రభుత్వాల అవివేకానికి, అసమర్ధతకు నిదర్శనం. ఒక పాఠశాలను తీసి మరో పాఠశాలలో కలిపితే, వచ్చే ఫలితం సన్యాసి సన్యాసి రుద్దుకుంటే బూడిద రాలినట్లు గా ఉంటుంది. మొత్తం విద్యా వ్యవస్థలోనే అంతరాలు, అసమానతలు బలంగా ఉన్నప్పుడు ఒక పాఠశాలను మరోక పాఠశాలలో కలపడంలో ఉపయోగం ఏమి ఉండదు. లోప బూయిష్టమైన వ్యవస్థను మార్చకుండా పాఠశాలల విలీనంతో ప్రయోజనం శూన్యం. పాఠశాలల విస్తరణతో విద్యా వ్యవస్థ ఏమాత్రం మెరుగు పడలేదు. ఫలితాలు, ప్రమాణమాలు మరింతగా దిగజారిపోయాయి. విలీనంతో ఏదో ప్రయోజనం చేకూరుతుందని ఆశించడం కూడా పొరపాటే. విలీనంతో విద్యా వ్యస్థలో దిగజారుతున్న ఫలితాల పరిణామ క్రమం తగ్గకపోగా, పెరిగిపోయే ప్రమాదం ఉంది. విస్తరణ-విలీనం (హేతుబద్దీకరణ) ను ప్రక్కన పెట్టి ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను ఆలోచించాలి. సామాజిక, విద్యావేత్తల, మేధావుల, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు పాటించాలి. విద్యా వ్యవస్థలో ఏండ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని మౌలిక సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలి. సమాజ నిర్మాణంలో ప్రధాన రంగాలైన విద్యా – వైద్య రంగాలను జాతీయం చెయడమే ఏకైక పరిష్కారం.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.అమరావతి, జూన్ 29: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాది కాలంగా తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకే రోజు 32 మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం తాను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు.. కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆయన కేబినెట్‌లో విద్య శాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో విద్యా రంగంలో సమూల మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. గత నెలలో విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదవిన విద్యార్థులు మంచి ర్యాంకులు పొందారు.దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు తీవ్ర ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అదే విధంగా తల్లికి వందనం కింద వారి ఖాతాల్లో రూ.15వేలు సైతం ప్రభుత్వం వేస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి చిన్నారుల తల్లిదండ్రులు వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుతున్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం టేకుమట్ల మండలంలోని కస్తూరి భా గాంధీ గురుకుల పాఠశాలలో 2.30 కోట్ల తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగ శాల భవనాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ భూపాలపల్లి కలెక్టర్ గా విధులలో చేరిన సంవత్సర కాలంలో విద్యా, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, జిల్లాలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట మండల ప్రత్యేక అధికారులు, జిల్లా కలెక్టర్ సైతం గురుకుల పాఠశాలల్లో తనికీలు చేపడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా, భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయులు అడిగిన మేరకు పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి, చేతిపంపు, డయాస్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. జిల్లా లోని అన్ని గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలలో కావలసిన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకొని విద్యాశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారంలోకి వచ్చిన సంవత్సరన్నర కాలంలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో గవర్నమెంట్ పాఠశాలలో సీట్లు కోసం రికమెండ్ చేసే రోజులు రాబోతున్నాయని అన్నారు. గురుకులాల నుండి పాఠశాలలకు బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించే రోజులు త్వరలో రాబోతున్నాయని. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్యా బోధన అందించేందుకు మన నియోజకవర్గంలో ఘనపురం మండలం గాంధీ నగర్ గుట్ట వద్ద 30 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ స్కూల్ క్యాంప్లెక్స్ ను నిర్మించబోతున్నామని తెలిపారు. తన ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు పాఠశాలలకు 7 కోట్లు వరకు కేటాయించడం జరిగిందని ప్రభుత్వ గురుకుల పాఠశాలలులో విద్యార్థుల కు వేడి నీళ్లు కొరకు గీజర్లు , దుప్పట్లు అందించామని త్వరలో గురుకులాల్లో కావలసిన బెడ్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని తమ లక్ష్యాలను చేరుకోవాలని ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థులు ఎందులో తక్కువ కాదని నిరూపించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిసిడిఓ శైలిజ, తహసీల్దార్ విజయ లక్ష్మీ, ఎంపీడీవో అనిత, ప్రిన్సిపల్ సప్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విశ్వ జంపాల,న్యాయవాది మరియు విశ్వ సమాజం వ్యవస్థాపకులు…
మహబూబాబాద్ గార్ల నేటి ధాత్రి:
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల విద్యా-వైద్య సంస్థలను నిర్వహిస్తూన్నాయి. వాటి నిర్వాహాణకు సరిపడా నిధులు మాత్రం కెటాయించడం లేదు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నాయి.భారతదేశంలో పథకాలకు కొదువ లేదు, పైసలకు కొరత లేదు.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్తూన్నారు. ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు, కాని ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు.
స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికి సగటు భారతీయుని ప్రాథమిక హక్కులైన కూడు-గూడు-గుడ్డ తో పాటు విద్యా- వైద్యం-ఆరోగ్యం సమకూర్చడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ పూరిత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూన్నాయి.
సమగ్ర విద్యా- వైద్య- ఆరోగ్య విధానాన్ని రూపొందించడంలోను, అమలు చేయడంలోను పూర్తిగా విఫలం చెందాయి. పూర్తి నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నాయి. ఓట్లు దండుకోవడంలో, సీట్లు దక్కించుకోవడంలో కనబరిచిన శ్రద్ధాశక్తులలో పది శాతం కల్గి వున్న “అక్షర భారత్ – ఆరోగ్య భారత్” నిర్మాణం జరిగి ఉండేది.
దీని పర్యావసానమే విద్యా -వైద్య రంగాలలో ప్రైవేటీకరణ- కార్పోరేటికరణ ప్రభలంగా పెరిగి పోయింది. విద్యా – వైద్య రంగంలో కార్పోరేట్ విష పోకడలు మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించాయి.
సమస్యల సాలెగూళ్ళలో చిక్కి ప్రభుత్వ విద్యా- వైద్య సంస్థలు ప్రజాదరణ కోల్పోతున్నాయి.
కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెపుతున్న ప్రభుత్వాలు విద్యా- వైద్య సంస్థల్లో నేటికి కనీస మౌళిక వసతులు కూడా కల్పించలేదు.
కమిటీలు, కమీషన్లు వేస్తూ, కడుపు నింపని సంక్షేమ పథకాలతో కాలయాపన చేస్తూ మీన వేశాలు లెక్కపెడుతున్నాయి. చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వాల పనితీరు ప్రజల పాలిటి శాపంగా మారింది.
లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులు పోషక ఆహార లోపం, రక్తహీనత, కంటి, దంత, మూత్ర సంబంధిత వ్యాధులతో బాదపడుతున్నారు.సమాజ మనుగడకు విద్యా-వైద్యం-ఆరోగ్యం అతి ప్రధాన మైనవి. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రధాన లక్షణం.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న భారత పాలక వర్గాలు ఆచరణలో దానికి భిన్నమైన వైఖరిని కల్గి వున్నాయి.
భారత దేశంలో భూస్వాములు- పెట్టుబడిదారులు ప్రైవేట్- కార్పోరెట్ శక్తులుగా ఎదిగి పాలక వర్గాలుగా అవతరించాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గ ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అంతర్గత ఎజెండాను అమలు చేస్తూన్నాయి.
ప్రభుత్వ అనుమతితోనే విద్యా-వైద్య రంగాల్లో కార్పోరేటీకరణ విష ఫలాలనందించే వట వృక్షంగా పెరిగిపోయింది.
కార్పోరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ పాలక వర్గంలో కీలక భాగమై కూర్చున్నాయి.
విధానాల రూపకల్పనలో, అమలులో చక్రం తిప్పుతున్నాయి.
ఈ వర్గాలే సేవా రంగాలైన విద్యా-వైద్య రంగాలను అత్యంత లాభ సాటి వ్యాపారంగా మార్చాయి. ఈ వర్గాలే ప్రజలను కార్పొరేట్ రాజకీయాల వైపు మళ్లిస్తూ ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాలను శాసిస్తున్నాయి.
ప్రైవేట్, కార్పోరేట్ విద్యా-వైద్య సంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ కారణంగా స్వార్ధం, అవినీతి అక్రమాలతో కూడిన తప్పుడు విధానాలకు పూనుకుంటున్నారు.పారి శుద్యం, త్రాగు నీరు, మల మూత్ర శాలలు, భోజన శాలలు, వంట శాలలు, పడకలు, పక్కా భవనాలు, ప్రహారి నిర్మాణాలు, మురుగు కాల్వలు, ఈగలు, దోమలు, శిధిలావస్థలో వున్న భవనాలు, విద్యుత్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, మందులు తదితర మౌళిక వసతులు, సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ఆదరణ కోల్పోతున్నాయి.
వీటికి తోడు అరకొర నిధుల కెటాయింపు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, అవినీతి, నిర్లక్ష్యం తదితర ప్రధాన సమస్యలు ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలను నిత్యం పట్టి పీడిస్తున్నాయి.
సమస్యల వలయంలో చిక్కిన ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయాయి.
ఒకప్పుడు విదేశీయులు, దోపిడి దొంగల భీభత్సంతో ప్రజలు అభద్రత భావంతో బ్రతికేవారు.
నేడు విద్యా-వైద్యం అందక జీవితంపై భయంతో, బెంగతో, అభద్రతా భావంతో జీవనం సాగిస్తున్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏండ్లుగా పాలక వర్గాల మోసపూరిత, కుట్ర బుధ్ధితో విద్యా-వైద్య-ఆరోగ్య, ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. వలసలు, అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
ఆకలి చావులైనా, ఆత్మ హత్యలైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి.
నేడు దేశంలో జరుగుతున్న రైతు ఆత్మ హత్యలు, కుల వృత్తి దారుల ఆత్మ హత్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూన్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగానే ఈ ఆత్మ హత్యలు జరుగుతున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ పూరిత అనాలోచిత నిర్ణయాలు-నిర్లక్ష్యాల మూలాలే నేటి ఆత్మ హత్యలకు కారణాలు.ప్రజా ద్రోహులు, పెట్టుబడిదారులు, కార్పోరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమవుతున్నాయి
ఇది చాలా ప్రమాదకరం. ప్రజలకు ఉపకరించే ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ శక్తుల కలయిక.
భారత దేశ ప్రజలు విజయానికి, విజయం తాలూకు ఫలాలను ఆస్వాదించడానికి మధ్య ఉన్న సంధికాలంలో ఉన్నారు. ప్రజల నోటి కాడి ముద్దను దళారులు గుంజుకునేందుకు ప్రభుత్వ విధానాలే దోహదం చేస్తూన్నాయి.
ప్రజా ద్రోహులు-రాజకీయ దళారులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూన్నారు.
విద్యా-వైద్యం-ఉపాధి మొదలైన మౌళిక రంగాలలో విధానాలు రూపొందించడం- అమలుపర్చడంలో ప్రజలు మరింత చైతన్యవంతమైన పోరాట స్పూర్తిని కలిగియుండాలి.
విద్య-వైద్య రంగాలలో కార్పోరేటీకరణ మానవజాతి మనుగడకే సమస్యగా తయారై ప్రజా జీవనానికి పెను సవాలుగా మారింది. ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్య వైద్యం అందాలంటే విద్యా – వైద్యం జాతీయీకరణ చేయడమే ఏకైక పరిష్కారం.
విద్యా-వైద్యం జాతీయీకరణ జరిగేంత వరకు దోపిడి పీడన ఆగేంత వరకు అలుపెరగని పోరాటం చేయడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.
విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
నిద్రమత్తులో విద్యాశాఖ అధికారులు
పుస్తకాలు అమ్ముతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకొని అధికారులు
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి వెంకటేష్,మచ్చ రమేష్
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగరంలోని నారాయణ పాఠశాలలో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాశాఖ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ధర్నా చేస్తూ పుస్తకాలు అమ్ముతున్నారని డిఈఓ, ఏంఈఓకి సమాచారం ఇచ్చిన పట్టించుకోకుండా రాకుండా స్పందించలేదు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్ లు మాట్లాడుతూ నారాయణ పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా మరియు కరీంనగర్ జిల్లాలో నారాయణ విద్యా సంస్థలలో ఎట్లాంటి ప్రభుత్వాల అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు బుక్కులు, పెన్నులు, షూ ,టై వంటి అక్రమంగా అమ్ముతూ లాభార్జన ధ్యేయంగా నడిపిస్తున్నారని అన్నారు. జీవో 1,10,92,42 లను ఉల్లంఘించి జిల్లా కేంద్రంలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచి, పెంచిన ఫీజులను నోటీస్ బోర్డ్ లో పెట్టకుండా, స్మార్ట్ పేర్లను జోడిస్తూ గ్రౌండ్, నిబంధనలకు అనుగుణంగా విశాలమైన తరగతి గదులు లేకుండా నడిపిస్తున్నారనీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. జిల్లా కేంద్రంలో నారాయణ పాఠశాలలు తమ ఇష్టానుసారంగా వ్యవస్థను నడుపుతున్నాయని. ఇది విద్యను వ్యాపారంగా మలచే దిశగా తీసుకెళుతోంది. విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్ర భారం మోపుతోంది.వెంటనే అధికారులు మొద్దు నిద్ర వదిలి విద్యా వ్యాపారం చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నగర అధ్యక్షకార్యదర్శులు కేశాబోయిన రాము, మామిడిపల్లి హేమంత్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, సాయి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన చదువు తల్లిదండ్రులారా ఆలోచించండి
ట్రైనింగ్ పొందిన టీచర్స్
చదువులో అనుభవం ఉన్న టీచర్స్
పిల్లలకు అనుగుణంగా చదువు చెప్పే టీచర్స్
పిల్లలలోని ప్రతిభను గుర్తించే టీచర్స్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల బస్వ రాజు పల్లి పాఠశాల లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు . ప్రభుత్వ పాఠశాల లో బోదించే ఉపాధ్యాయులు మంచి ప్రతిబావంతులు ఉన్నారు ప్రజలు వారి పిల్లలని తమ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని అనవసరంగా డబ్బులు ప్రయివేట్ విద్యా సంస్థలకి వృధా చేసుకోవద్దని తీన్మార్ మల్లన్న టీమ్ గణపురం మండల అధ్యక్షులు గండు కర్ణాకర్ ప్రజలకి సూచించారు. తాను కూడా తమ గ్రామం బస్వరాజపల్లి లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకి అతని కూతురుని పంపిస్తూన్నానని ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలల వైవు చూడాలని, ముక్యంగా వివిధ పార్టీల నాయకులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని డిమాండ్ చేసారు. ఇలా చేస్తే ప్రజలకి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని చెప్పారు
భారతదేశంలోని అతి ప్రాచీనమైన యోగ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో యోగా శిబిరాలను నిర్వహిస్తూ యోగానే తన ఇంటి పేరుగా మార్చుకున్న యోగ గురువు శ్రీనివాస్ యోగా తో సంపూర్ణ ఆరోగ్యం అని భావించి, సమాజమే దేవాలయంగా గత 25 సంవత్సరాలుగా ఉచిత యోగ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి ఎన్నో లక్షలాది మంది ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రసాదించిన యోగా గురువు పోశాల శ్రీనివాస్ అభినందనీయుడు.
నేటి ధాత్రి:
ఇల్లంద గ్రామంలో జన్మించిన శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి తదినంతరం తిరుపతిలోని సాంస్క్రిట్ విద్యాపీట్లో యోగ డిప్లమా పూర్తి చేసుకుని, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం శ్రీనివాసరావు గారి సూచనతో గ్రామీణ ప్రాంతాలలో అందరికీ ఆరోగ్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో సుమారు 157 గ్రామాలలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి యోగా లో శిక్షణను ఇవ్వటమే కాకుండా…
20 24 సంవత్సరానికి గాను యోగాలో గోల్డ్ రికార్డ్ సాధించినందుకు గాను వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారద గారు అభినందిస్తున్న ఫోటో.
జూన్ 21.2024 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని అందుకున్న శ్రీనివాస్ మనందరికీ అభినందనీయుడు.
వృద్ధాశ్రమాలలో, అనాధాశ్రమాలలో , అందుల ఆశ్రమాలలో ఇలా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించి సమాజంలోని అనేకమందికి మార్గదర్శకుడిగా నిలిచాడు యోగా గురువు పోశాల శ్రీనివాస్.
సేవే పరమావధిగా భావించి అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమంది పునర్జన్మకు కారణమయ్యాడు
యోగా గురువు శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం 2014వ సంవత్సరం కిలా వరంగల్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అప్పటి డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారి చేతుల మీదుగా ఉత్తమ యోగ గురువు అవార్డును పొందడం జరిగింది.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి జీ వారి చేతుల మీదుగా…
2017 వ సంవత్సరంలో జనవరి (12- 18 ) జాతీయ యువజన వారోత్సవాల సందర్భంగా జిల్లా యువజన పురస్కారాన్ని అందుకోవడం జరిగింది.
2018 – 2022 సంవత్సరాలలో వరల్డ్ టూరిజం డే సందర్భంగా జరిగిన కార్యక్రమాలలో ఉత్తమ ప్రదర్శనను అందించినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం నుండి అవార్డులను అందుకోవటం జరిగింది.
2019వ సంవత్సరంలో ప్రముఖ చారిత్రాత్మకమైన వేయి స్తంభాల దేవాలయంలో ఒక వెయ్యి మంది విద్యార్థులతో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ ని అందుకోవటం జరిగింది.
ధరిత్రి దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతూ…
2019 సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రామప్ప దేవాలయంలో, వేయి స్తంభాల దేవాలయంలో, కిలా వరంగల్ కోటలో అంతర్జాతీయ యోగా డేలను నిర్వహించినందుకు కాను అవార్డులను అందుకోవటం జరిగింది.
2019 వ సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా జరిగిన యోగ డే ప్రోగ్రాం లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవార్డును కోవడం జరిగింది.
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ తో
2021 వ సంవత్సరంలో పెరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కరోనా సమయంలో ప్రతిరోజు వేలాదిమంది కి ఫుడ్, మెడిసిన్స్ అందించి రోగుల కొరకు విశేష కృషి చేసిన యోగా గురువుకు తెలంగాణ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాన్ని అందుకోవటం జరిగింది.
25 సంవత్సరాలుగా యోగాలో చేస్తున్న విశేష కృషిని ఆదరించి వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ని యోగా గురువు శ్రీనివాస్ కి అందించడం జరిగింది.
అదేవిధంగా లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మరియు శ్రీ షిరిడి సాయి సేవా సమాజ్ ఆధ్వర్యంలో అనేక అవార్డులను యోగా గురువు శ్రీనివాస్ అందుకోవటం జరిగింది. .
ప్రముఖ వ్యక్తులైన శ్రీ రాందేవ్ బాబా గారి చేతుల మీదుగా, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామీజీ చేతుల మీదుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా అవార్డులను అందుకోవటం జరిగింది.
యోగా గురువు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో మరియు పాఠశాలలోను,
NSS, NCC క్యాండిడేట్లకి యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.
ఆరోగ్య ప్రదాత యోగా గురువు శ్రీనివాస్.
మామునూరు లో ఉన్నటువంటి ఫోర్త్ బెటాలియన్ CRPF పోలీస్ ఆఫీసర్లకి, భీమారంలో ఉన్నటువంటి 58వ బెటాలియన్ CRPF ఆఫీసర్ లందరికీ యోగాలో శిక్షణను ఇవ్వడం జరిగింది.తన ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై యోగా లో ఉత్తమ ప్రదర్శనలు కనబరిచి అనేక అవార్డులను అందుకోవటం కూడా జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో సామాజిక సేవలో ముందుంటున్న మిత్ర ఫౌండేషన్ మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కల్వకుర్తి పట్టణానికి చెందిన అరవింద్ చారి యొక్క ఇద్దరు పిల్లలను శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం లో పదవ తరగతి చదివే వరకు వారి విద్యకు సంబంధించిన అన్ని ఖర్చులను మిత్ర ఫౌండేషన్ భరిస్తుందని పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దే దిశగా మిత్ర ఫౌండేషన్ విద్యా భరోసా కృషి చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షులు రసూల్ ఖాన్, పాఠశాల యాజమాన్యం, మిత్ర సభ్యులు శ్రీకాంత్ నేత, నరేష్, శ్రీనేష్, కార్తీక్, హలీం ,తరుణ్, మహేష్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలలో అందిస్తున్నామని, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వారి కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ కార్యక్రమాలు, స్పోర్ట్స్ లాంటి వాటికి కళాశాలలో శిక్షణ ఇస్తారని ఉన్నతంగా విద్యార్థులను అధ్యాపకులు తీర్చిదిద్దుతారని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివుకున్న విద్యార్థులకు ఎంసెట్ లక్ష ర్యాంకు వరకు ఉచితంగా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.