విద్యార్థులకు బోర్డుపై వ్రాసి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న కలెక్టర్

విద్యార్థులకు బోర్డుపై వ్రాసి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

మర్రికుంట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్ హాకీ సమ్మర్ ట్రెనినింగ్ క్యాంపు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రార oబించార విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మర్రి కుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యార్థులకు బోర్డుపై వ్రాసి ప్రశ్నలు అడిగి తెలుకున్నారు
సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాల వంటగదిని పరిశీలించారు వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బంది ని ఆదేశించారు విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మెస్ కమిటీకి చెందిన విద్యార్థులు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై కలెక్టర్ విచారణ చేశారు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలను పరిశీలించారు విద్యార్థులను ప్రశ్నలు అడిగి సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారుఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ సరస్వతి పాఠశాల సిబ్బంది, అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

పెద్దూర్ లో ఉన్న కేజీబీవీ ఆకస్మిక తనిఖీ…

పెద్దూర్ లో ఉన్న కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా మెనూ చార్ట్ పరిశీలించారు. నేరుగా డైనింగ్ రూమ్ వద్దకు చేరుకొని.. ప్లేట్ తీసుకుని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.

మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, ప్రణాళిక సిద్ధం చేసుకోవడం తదితర అంశాలపై విద్యార్థులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచనలు చేశారు. మంచిగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

అస్వస్థతకు గురైన విద్యార్థినినీ ఆసుపత్రికి తరలించిన జిల్లా కలెక్టర్

అస్వస్థతకు గురైన విద్యార్థినినీ ఆసుపత్రికి తరలించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ జడ్పీ.ఎస్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పదవతరగతి పరీక్షల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించడానికి వెళ్లగా ఘనపురం మండలం గాంధీ నగర్ లోని మహాత్మా జ్యోతి భా పులే గురుకుల పాఠశాలలో చదువుతూ పదవతరగతి పరీక్షలు రాస్తున్న” కీర్తన” అనే విద్యార్థిని ఉదయం పరీక్షా కేంద్రానికి వచ్చినప్పటి నుండి అలసటగా ఉందని శ్వాస ఆడడం లేదని ఇబ్బందులు పడుతుండగా పరీక్ష కేంద్రం పరిశీలనకు వెళ్లిన జిల్లా కలెక్టర్ విషయం తెలుసుకొని వెంటనే ప్రభుత్వ వాహనంలో తన వ్యక్తిగత సిబ్బందిని వెంట పంపి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అనంతరం పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి తిరిగి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థిని తో మాట్లాడి ధైర్యం చెప్పి తిరిగి పరీక్షా కేంద్రానికి ప్రభుత్వ వాహనంలోనే తరలించారు.
జిల్లా కలెక్టర్ స్పందించిన విధానం పట్ల పలువురు జిల్లా కలెక్టర్ ను అభిందిస్తున్నారు.

పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్ఎం రాజ్….

పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్ఎం రాజ్….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మీర్జాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం రాజ్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, విద్యార్థుల చదువుతున్న తీరు, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ తనిఖీలో సీఆర్పీ రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉపసర్పంచ్ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఉపసర్పంచ్.

చిట్యాల, నేటిదాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని చిట్యాల గ్రామ పంచాయతీ వెంకట్రావుపల్లి (c) ప్రాదమిక పాఠశాలలో సర్పంచి తౌటం లక్ష్మి ఆదేశానుసారం పాఠశాలను తనిఖీ చేసిన ఉపసర్పంచి బుర్ర వెంకటేష్ గౌడ్ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు మౌలిక సదుపాయాల గూర్చి అడిగి తెలుసుకోవడం జరిగింది కార్యక్రమంలో వార్డు సభ్యులు జెట్టి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సాతారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల…

సాతారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలను మౌలిక వసతులను పరిశీలించిన నోడల్ ఆఫీసర్
మల్లాపూర్ జనవరి 27 నేటి ధాత్రి

విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించుకునేందుకు ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని జిల్లా తనిఖీ బృందం నోడల్ ఆఫీసర్ కొమ్మిడి లక్ష్మన్న సూచించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాతారం లో విద్యార్థుల సామర్థ్యాలను జిల్లా ప్యానల్ తనిఖీ బృందం మంగళవారం పరిశీలించింది. పాఠశాలలొని మౌలిక వసతులు విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల రికార్డుల నిర్వహణ మార్కుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం తదితర అంశాలను పరిశీలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనా విధానాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కొమ్మిడి లక్ష్మన్న మాట్లాడుతూ విద్యార్థులు అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేకత తరగతుల నిర్వహిస్తూ స్లిప్ టెస్ట్ ద్వారా వారి సామర్థ్యాన్ని అంచనా వేసి ఫలితాల ఆధారంగా గ్రూపులుగా విభజించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సామర్థ్యాల పెరుగుదలకు ప్రత్యేక చొరవ తీసుకొని ఉపాధ్యాయులు వారిని చదివించాలని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పరీక్షలలో మంచి చేతిరాత నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, వారికి పాఠశాల అంటే ఆసక్తి కలిగేలా బోధన ఉండాలని దాని కొరకు ప్రత్యేక ప్రణాళికలు రచించాలని సూచించారు .పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల రివిజన్ అవుతుందని తెలిపారు
పాఠశాలలో తప్పక ల్యాబ్ నిర్వహించాలని సూచించారు విద్యార్థులు పఠానాస పెంపొందించడానికి గ్రంథాలయ నిర్వహణ కమిటీని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు .వారి స్థాయిని బట్టి పుస్తకాలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తనిఖీ బృంద సభ్యులు శ్రీనివాసరావు ,దాసరి రామస్వామి, ధర్మేందర్, శ్రీనివాస్ ,శ్రీధర్ ,రవీందర్, సంశుద్దిన్ ,లక్ష్మీనారాయణ నాయక్, మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీహరి, ఉపాధ్యాయులు శేషగిరి ,శ్రీనివాస్, చంద్ర ప్రకాష్ ,హరికృష్ణ ,మల్లేశం అర్చన ,హరి శ్రీనిల్ ,ఎండి .కాజా మొయినుద్దీన్ ,డి చంద్రకళ ,గీత ,రాజేంద్రప్రసాద్ ,స్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం…

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం

నేటి ధాత్రి అయినవోలు:-

 

సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐనవోలు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన ఆమె ఆలోచనలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలక పాత్ర అమూల్యమైందని పేర్కొంటూ వారి త్యాగం, సేవాభావాన్ని ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, వార్డు సభ్యులు దూపెల్లి రాజు, సుజాత కుమార్, నాగలక్ష్మి అశోక్, సరిత జాన్సన్, కొత్తూరి రాజు, పురుషోత్తం, చందు, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం..

ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం

రాయపర్తి మండలం, పెరికేడు గ్రామంలో అవగాహన కార్యక్రమం.

నేటిధాత్రి, రాయపర్తి.

 

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, పెరికేడు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టి డి ఎస్ ఏ) ఆధ్వర్యంలో ప్రాజెక్ట్–4 లో భాగంగా ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్ ఫర్ ఎవరీ చైల్డ్) అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా. ఆశిష్ రామడుగు సమర్థవంతంగా సమన్వయం చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు (ఓరల్ చెకప్) నిర్వహించారు. అలాగే చిన్నారులకు నోటి ఆరోగ్యం ప్రాముఖ్యత, దంతాల సంరక్షణ విధానాలు, చెడు నోటి అలవాట్ల ప్రభావం, సరైన బ్రషింగ్ పద్ధతుల వంటి అంశాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరణతో పాటు ప్రాక్టికల్ డెమో ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం చిన్నారుల్లో నోటి ఆరోగ్యం పట్ల చైతన్యం పెంచడంలో ఎంతో ఉపయోగపడిందని పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఎంపీపీఎస్ పొత్కపల్లి (బాలికల) పాఠశాలకు టీవీ బహుమానం..

ఎంపీపీఎస్ పొత్కపల్లి (బాలికల) పాఠశాలకు టీవీ బహుమానం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఎంపీపీఎస్ పోత్కపల్లి బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న యేబూషి సతీష్ కుమార్ యొక్క ప్రియమైన శిష్యుడు అమెరికా నుండి టీవీ ని ఎంపీపీ ఎస్ బాలికల పాఠశాలకు బహుమతిగా పంపించడం జరిగింది.దానిని మండల విద్యాధికారి రమేష్ చేతుల మీదుగా ఈరోజు తీసుకోవడం జరిగింది.ఇది గురుశిష్యుల బంధానికి ప్రతీక ఇలా ప్రభుత్వ పాఠశాలపై ఇష్టంతో గురువు పై భక్తితో టీవీ ని పంపించినందుకు పాఠశాల బృందం శిష్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రాధా రాణి, కరుణాకర్ , మిర్జా సైఫ్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా…

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా
వనపర్తి నేటిదాత్రి .

 

డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాలను కంచిరావుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంధాలయానికి కాలగమనం పుస్తకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కంటే నిరంజనయ్యా విద్యార్థుల తో మాట్లాడుతూ కాలగమనం పుస్తకంలో 55 కవిత అంశాలు ఉన్నాయని వాటిని చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి మాట్లాడుతూ నిరంజనయ్యా రచించిన పుస్తకంములో సామాజికాంశాలు ఉన్నాయని వీటితోపాటు తల్లి తండ్రి గురువు దైవం విద్యార్థి సమాజం రాజ్యాంగము మహాత్మా పూలే అంబేద్కర్ అంశాలు ఉన్నాయని పుస్తకం చదవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సరస్వతి ఉపాధ్యాయులు కవి రచయిత కంటే నిరంజనయ్యను అభినందించారు

పరిశుభ్రత పై నగరం పాఠశాల….

పరిశుభ్రత పై నగరం పాఠశాల
మండలంలోనే మొదటి స్థానం..

నిజాంపేట ,నేటి ధాత్రి

 

స్వచ్చత పరిశుభ్రత హరిత పాఠశాల కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను నిజాంపేట మండలం నగరం ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానాన్ని దక్కించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రత విషయం లో 61 అంశాల్లో పాఠశాల పురోగతిని పరిశీలించి రేటింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రేటింగ్స్ లో మండలంలోని నగరం తండా గ్రామంలో గల పాఠశాల ఫైవ్ స్టార్ రేటింగ్ తో మొదటి స్థానం లో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన ఉన్నారు.

కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134240.033.wav?_=1

 

— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్

నిజాంపేట: నేటి ధాత్రి

 

విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ…

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@
స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు.
ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి…

ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీర్లగుట్ట కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్
విద్యా శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు
ఐదు తరగతులకు ఒకే టీచర్ ఉన్నారని తిరిమాల్ తెలిపారు
5 తరగతులకు ఓకే గది ఉండడంవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదనపు గదులను నిర్మించాలని అన్నారు
పాఠశాలలో మరుగుదొడ్లు వసతులు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వన్ని కోరారు

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

17వ బెటాలియన్ విద్యార్థులకు షూ, టై, బెల్ట్ పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141913.546-1.wav?_=2

 

17వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థులకు షూ,టైప్,బెల్టులు పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల అన్యువల్ రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఈరోజు సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సిరిసిల్ల జిల్లా 17 వ బెటాలియన్ అధికారి ఆర్.ఎస్.ఐ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు షూ, టై, బెల్ట్‌లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. అంతేకాకుండా
తిరుపతి మాట్లాడు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాల కృషి చేస్తారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

నిరుపేద బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల ఆర్థిక సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T151931.764.wav?_=3

 

నిరుపేద బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల ఆర్థిక సాయం

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ నిజాముద్దిన్ ఆనారోగ్యం చేత మరణించగా అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన ముగ్గురు కుమార్తెలు విద్యనభ్యసిస్తుండగా తమ దీన స్థితిని గమనించి మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం శనివారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు . నిరుపేద కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని కోరారు. పరమర్శించిన వారిలో ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ ,ఉపాధ్యాయులు,గంగనర్సయ్య, వేణుగోపాల్, జ్యోతిరాణి, సావిత్రి, సరోజ, పద్మ, కనకయ్య ఉన్నారు.

మల్లక్కపేటలో ఉచిత వైద్య శిభిరం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T152606.374.wav?_=4

మల్లక్కపేటలో ఉచిత వైద్య శిభిరం

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరాన్ని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఐఎంఎ స్టేట్ కౌన్సిల్ మెంబర్,ఎంజీఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.దొమ్మటి ప్రసన్న కుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరువుతున్నట్టు తెలిపారు.గ్రామంలో ఆదివారం రోజున ఉదయం 9గంటలనుండి సాయంత్రం 3గంటలవరకు అనస్తిషియా,గుండె నిపుణులు,కిడ్నీ వైద్య నిపుణులు,స్త్రీల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని అగర్వాల్ కంటి ఆసుపత్రి వారు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

ప్రధానోపాధ్యాయ పదోన్నతి: వెబ్ ఆపరేషన్ ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T125911.773-1.wav?_=5

 

ప్రధానోపాధ్యాయ పదోన్నతి: వెబ్ ఆపరేషన్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించే వెబ్ ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన ప్రధానోపాధ్యాయులు http://transfer.de.telangana.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబడతాయి.

వీణవంకలో 79వ స్వాతంత్ర దినోత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-50.wav?_=6

ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

వీణవంక మండల కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రభుత్వ కార్యాలయంలో జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ అంబాటి రజిత జాతీయ జెండా ఆవిష్కరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆవుల తిరుపతి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీధర్ జెండా ఆవిష్కరించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నవాబ్ తాసిల్దార్ నిజాముద్దీన్, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version