*నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్…

*నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్
మహదేవపూర్ ఉపాధ్యాయులు

మహాదేవపూర్ నవంబర్ 04నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో
ఛత్తిస్ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో ఈ నెల 5వ తేది నుండి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్ లో మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి. ప్రభాకర్ రెడ్డి, మరియు బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు పాల్గొననున్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 162 మంది సైన్స్ టీచర్స్ ఎంపికయ్యారు. తెలంగాణా నుండి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరు మన మహాదేవపూర్ ఉపాధ్యాయులు ఉండడం గర్వకారణం. ఈ కాన్ఫరెన్స్
నెట్వర్క్ ఆఫ్ ఆర్గనైజషన్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్,ఇస్రో నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ఇండియన్ యంగ్ ఇన్వెంటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ కాన్ఫరెన్స్ గత పద్నాలుగు సంవత్సరాలుగా సైన్స్ అభివృద్ధికి కృషి చేస్తూ, సైన్స్ మరియు మాథ్స్ టీచర్స్ కు వేదికగా టీచర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తోంది. ఈ కాన్ఫరెన్స్ ప్రముఖ శాస్త్రవేత్తలతో సంభాషించడానికి అవకాశం కల్పిస్తూ యువ వర్ధమాన శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుంది.
ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పరిశోధకులు తమ వినూత్న ఆలోచనలను, ప్రాజెక్టులను మరియు పరిశోధన పత్రాలను ప్రదర్శించడానికి ఈ కాన్ఫరెన్స్ చక్కని వేదిక.దీనికి ఎంపికైన ఉపాధ్యాయులను మండల విద్యాధికారి, ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version