పదవి విరమణ పొందిన శంకర్ గౌడ్ ను అభినందించిన..

పదవి విరమణ పొందిన శంకర్ గౌడ్ ను అభినందించిన మాజీ ఎంపీ రావుల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి
,
కళా సాహితీ వేదిక అధ్యక్షులు,ప్రధానోపాధ్యాయులు పలుస.శంకర్ గౌడ్ పదవీ విరమణ వీడ్కోలు సభ శ్రీ లక్ష్మీ కృష్ణ గార్డెన్ లో నిర్వహించారు ఈసందర్భంగా పదవి విరమణ పొందిన పలుస శంకర్ గాడ్ తన అనుభవం తో సామాజిక సేవలో పాల్గొనాలని మాజీమంత్రి నిరంజాన్ రెడ్డి కోరారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే గురువు విద్య చదువు వారి ఆశీస్సులు ఉండాకాని అన్నారు వనపర్తి రాజా వారి సంస్థానం విద్యకు,సాగునీరు,తాగు నీరుకు పాలకులు పెట్టింది పేరని అటువంటి మన వనపర్తిని ప్రజాప్రతినిధులు ఎవరైనా బ్రాండ్ ఇమేజ్ ను కాపాడాలని సూచించారు. ఈమేరకు మాజీఎంపీ రావుల మాజీమంత్రి నిరంజన్ రెడ్డి శంకర్ గౌడ్ ను అభినందించారు
ఈ కార్యక్రమములో గట్టు యాదవ్, వామను గౌడ్,వాకిటి శ్రీధర్, మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస.రమేష్ మీడియా ఇంచార్జి నందిమల్ల.అశోక్,ఉపాద్యాయులు రవిప్రసాద్,కంటే.ఆంజనేయులు,వరప్రసాద్,జన జ్వాల.రాధాకృష్ణ,రాజారాం ప్రకాష్,షేక్.జహంగీర్,బండారు.కృష్ణ,ఉంగ్లం.తిరుమల్, నాగన్న యాదవ్,ఆవుల.రమేష్,యుగంధర్ రెడ్డి,చిట్యాల.రాము తదితరులు పాల్గొన్నారు

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన శ్రామిక.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన శ్రామిక వర్గానికి అభినందనలు

పాలకులు ఇప్పటికైనా శ్రమ దోపిడి విధానాలను మానుకోవాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

వినాశనకర దోపిడీ విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక కర్షక ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ విధానాలకు చరమగీతం పాడి శ్రామికులకు అనుకూలంగా పాలన కొనసాగించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం అయిన సందర్భంగా స్థానిక వరంగల్ పట్టణ ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహజ సంపదను, ఆర్థిక వ్యవస్థను, మానవ శ్రమను పెట్టుబడుదారులకు కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధంగా విధానాల రూపకల్పన చేస్తూ అందుకు అనుకూలంగా చట్టాలను రూపొందించి ఊడిగం చేస్తున్నదని అన్నారు.మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక కర్షక ఐక్య పోరాటాలు రాజకీయాలకతీతంగా ఉధృతం అవుతున్నాయని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రైతు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని రైతులు పండించిన పంటకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధర చట్టాన్ని రూపొందించాలని తెలిపారు. కార్మికులకు పాత చట్టాలను పునరుద్ధరించి కనీస వేతనం అమలు 26వేల రూపాయలు చేయాలని అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 10 గంటల పని దినం పెంపును ఉపసంహరించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఎంసిపిఐ యు జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్,నాయకులు ఎగ్గని మల్లికార్జున్, నలివెల రవి, రాయినేని ఐలయ్య, జటబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

 

Pawan Kalyan on Kamal Haasan: వైవిధ్యమైన నటనకు మారుపేరుగా సినీ అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు.. ఆస్కార్ అకాడమీ కమిటీలో చోటు దక్కడంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

Pawan Kalyan congratulates Kamal Haasan: కెరీర్‌లో లెక్కకు మిక్కిలి వైవిధ్యమైన పాత్రలు ధరించి సినీ అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సినీరంగంలో దశాబ్దాల కృషి అనంతరం ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ కమిటీ సభ్యునిగా ఆయనకు ఆహ్వానం లభించింది. పదుల కొద్దీ రాష్ట్ర, జాతీయ, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న కమల్‌కు ఈ గౌరవం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డు-2025 కమిటీ సభ్యుడిగా పద్మభూషణ్ కమలహాసన్ ఎంపిక కావడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. ఆరు దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనా జీవితాన్ని గడిపిన కమల్ హాసన్ గారు కేవలం నటుడి కంటే ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ, ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటుడిగా చిత్రనిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయన అసాధారణమైన పట్టు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిజమైన కళాత్మక నిపుణుడు. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ సినిమాకు ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రభావవంతమైన సేవ చేయాలని కోరుకుంటున్నాను.’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

మున్సిపల్ కమిషనర్ అభినందనలు

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్ అభినందనలు

◆ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ నియమితులైనందుకు స్వాగతించిన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా డి.సజ్జష్ రావు దేశ్ ముఖ్ బాధ్యతలు స్వీకరించారు. జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అలీ అలీమ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అహ్మద్ ముహమ్మద్ కాలనీ ముహమ్మద్ సలీమ్, ప్రధాన కార్యదర్శి, ఆయనను అభినందించారు మరియు జహీరాబాద్ కమిషనర్‌గా నియమితులైనందుకు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు మరియు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటామని మునిసిపాలిటీ కమిషనర్ డి. సుభాష్ రావు దేఖ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం తనను సంప్రదించవచ్చు. ఈ సందర్భంగా ముహమ్మద్ సలీం సద్దాం హుస్సేన్ షేక్ ఖలీద్ పాషా అబూ యూసఫ్ రిజ్వాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన.

సిపిఐ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి వేణు

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన పంజాల శ్రీనివాస్ ను శనివారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం విద్యారంగంలో మార్పుల కోసం అనేక పోరాటాలు శ్రీనివాస్ చేశాడని, ఏఐవైఎఫ్ నాయకుడిగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, వారి సమస్యలపై కూడా ఎన్నో ఉద్యమాలు నిర్మించాడని, అనంతరం సిపిఐలో జిల్లా కౌన్సిల్ సభ్యులుగా, కార్యవర్గ సభ్యులుగా, కరీంనగర్ నగర కార్యదర్శిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసి నేడు జిల్లా కార్యదర్శి స్థాయికి అతి చిన్న వయస్సులో ఎదగడం అభినందనీయమని, భవిష్యత్తులో ప్రజలకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారు సూచించారు. ఈకార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత.!

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని,విద్యార్థులకు శుభాకాంక్షలు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మల్లెల రణధీర్
(మాజీ సర్పంచ్ కొత్తగూడ)

కొత్తగూడ మండలం లోని విద్యార్థులు
నేడు ఇంటర్ పరీక్ష ఉత్తిర్ణత సాధించడం చాలా గొప్ప విషయం..
విద్యార్థులు ఉన్నత చదువులతో ముందుకుసాగాలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
ఉజ్వల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునేవిధంగా నడవాలి
క్షణికావేశంలో ఫెయిల్ అయినా మనే బాధతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మరొక అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటునన్నాను..
ఈరోజు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాల ను ఉద్దేశించి
మల్లెల రణధీర్
.గారు మాట్లాడుతూ,,
ఈరోజు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని-విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే,ఓటమి-గెలుపులు అనేటివి సాధారణమే అని,ఉత్తీర్ణత రాని వారు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా,మరో అవకాశాన్ని సద్వినియోగించుకుని,గెలుపును చవిచూడాలన్నారు.ఉత్తీర్ణత సాధించిన వారికి దీనిని వారధిగా నిలుపుకుని,మరో మెట్టు ఎక్కుతూ,అత్యున్నత శీకరాగ్ర స్థానన్ని సంపాదించుకుని,మంచి మంచి అవకాశాలను అధిరోహించాలని,తల్లిదండ్రులను సంతోషపరుస్తూ,తమదైన శైలిలో గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు.…

ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

పాత బాగ్దాద్ మసీదులో తరావీహ్‌లో ఖురాన్ పూర్తి చేసినందుకు ఇమామ్ మరియు ముజ్జిన్‌లకు అభినందనలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ నగరంలోని పురాతన మరియు చారిత్రాత్మకమైన బాగ్దాదీ మసీదులో, హజ్రత్ సయ్యద్ షా అబ్దుల్ అజీజ్ ఖాద్రీ షహీద్ బాగ్దాదీ మందిరం లోపల ఉన్న తరావీహ్ ప్రార్థనల సమయంలో ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ ప్రతిరోజూ మూడు అధ్యాయాలను పఠిస్తూ మొత్తం ఖురాన్ షరీఫ్‌ను పఠించే అధికారాన్ని పొందారు. హజ్రత్ సయ్యద్ షా అజీజుద్దీన్ ఖాద్రీ సాహిబ్ ఖిబ్లా మరియు సయ్యద్ షా హుస్సాముద్దీన్ ఖాద్రీ ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్, హఫీజ్ ముహమ్మద్ షకీల్ నూరి మరియు బాగ్దాదీ మసీదు డిప్యూటీ ముజ్జిన్ ముహమ్మద్ ఖైరుద్దీన్ లపై పూల వర్షం కురిపించి, వారికి అభినందనలు మరియు నైవేద్యాలను అందించారు. ముఫ్తీ ముహమ్మద్ ఇలియాస్ అహ్మద్ సాహిబ్ పవిత్ర ఖురాన్ పారాయణంతో అభినందన కార్యక్రమం ప్రారంభమైంది. రిటైర్డ్ ఏఎస్ఐ ముహమ్మద్ జిలానీ నాత్ షరీఫ్ పారాయణం చేశారు. మసీదులో సింహరాశి కూడా పంపిణీ చేయబడింది. ఇది షామ్ జహీరాబాద్‌లోని ఒక పెద్ద మరియు ప్రత్యేకమైన మసీదు అని గమనించాలి, ఇక్కడ మసీదులోని ఎక్కువ మంది ఆరాధకులు ఉంటారు మరియు తరావీహ్ ప్రార్థనల సమయంలో వెయ్యి మందికి పైగా ఆరాధకులు వినయం మరియు భక్తితో పవిత్ర ఖురాన్ వింటారు. మరియు రంజాన్ మాసంలో, తరావీహ్ సమయంలో ఖురాన్ యొక్క మూడు పారాయణలు ఏర్పాటు చేయబడతాయి. ఈ సత్కార కార్యక్రమంలో ఖాజీ సయ్యద్ జియావుద్దీన్ ఓం, ఖతీబ్ ఈద్గా మరియు హఫీజ్ ముబిన్ అహ్మద్ ఖాస్మి, ముహమ్మద్ మోర్, మియా సికందర్ ఆసిద్ షకీర్, ఉస్తాద్ ముహమ్మద్ హషీం, ముహమ్మద్ రఫీ, ముహమ్మద్ రిషాద్ డానిష్ హుస్సేన్ రఫీక్ అన్సారీ, ఆరిఫ్ టోరి ముహమ్మద్ బాబా నిష్, ముహమ్మద్ అజీమ్ బారిల్, షానవాజ్ ఇంజనీర్ అబ్దుల్ ఖాదిర్ మరియు మసీదు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దర్శకత్వ బాధ్యతలను సయ్యద్ షా ఫర్హాన్ ఖాద్రీ బాగ్దాది నిర్వర్తించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version