ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ…

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ

చిట్యాల,నేటి ధాత్రి :

 

సమాజంలోని ప్రతి ఒక్కరు చదువుతూ తన యొక్క వ్యక్తిగత జీవన విధానమును మార్చుకోవాలని మానవ వనరుల కేంద్రం చిట్యాల నందు వాలంటరీ టీచర్స్ నకు ఉల్లాస్ పుస్తకాల పంపిణీ మండల విద్యాశాఖాధికారి కోడెపాక రఘుపతి పంపిణీ చేసినారు.
మండల విద్యాశాఖాధికారి రఘుపతి మాట్లాడుతూ చదువు అనేది సమాజంలో మంచి గుర్తింపు ఇస్తుందని ముఖ్యంగా మహిళల అక్షరాస్యతను పెంచవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని చదువుకున్న మహిళ తన ఇంటిని పిల్లలను సక్రమమైన మార్గంలో పయనింప చేయడానికి కృషి చేస్తుందని అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారని అదేవిధంగా అందరూ చదువుతూ అందరూ ఎదగాలని వారు కోరారు .చిట్యాల మండలంలో వాలంటరీ టీచర్స్ 279. లర్నర్స్ 2790 మందిని గుర్తించామని వాలంటరీ టీచర్స్ అందరూ కూడా లర్నర్స్ ను చదువు వైపునకు మళ్ళించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉల్లాస్ కార్యక్రమమును దిగ్వి జయం చేయుటకు ప్రతి ఒక్కరు దీనినీ యజ్ఞములా భావించి పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీయం గుర్రపు రాజేందర్ ఉల్లాస్ కార్యక్రమ ఇన్చార్జ్ బోనగిరి తిరుపతి వాలంటరీ టీచర్స్  పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version