అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.