విద్యార్దులకు ప్రతిభ పొటీలు:
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున టి_ సాట్(T-SAT), తెలంగాణ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతు విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన, ఆసక్తిని కలిగించడానికి , ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించామని, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పింపించడం జరుగుతుందన్నారు. గెలుపోందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు.
వ్యాసరచనలో లతిక శ్రీ ఉన్నత పాఠశాల లింగంపేట(ప్రథమ), భవిష్య ఉన్నత పాఠశాల (ద్వితీయ) శ్రీవిన్ ఉన్నత పాఠశాల జోగాపూర్( తృతియ),
ఉపన్యాస పోటిలో రిషిక ఉన్నత పాఠశాల మాల్యాల(ప్రథమ), అశ్విత ఉన్నత పాఠశాల నర్సింగాపూర్(ద్వితీయ), హర్షిని ఉన్నత పాఠశాల చందుర్తి(తృతీయ),
క్విజ్ పోటిలో కీర్తన ఉన్నత పాఠశాల మల్యాల(ప్రథమ), శ్రీ చరిత ఉన్నత పాఠశాల మూడపల్లి ( ద్వితీయ) , మహి దీక్షిత ఉన్నత పాఠశాల మల్యాల (తృతీయ) బహుమతులు
గెలుపొందారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రాజు , ప్రతిభ పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు మేడికాల అంజయ్య, అంబటి శంకర్, అగ్రవ చారి,అమర్ నాద్, కార్తీక్ , సుధారాణి, ప్రకాశ్ వ్యవహరించారు.
