స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T115143.728.wav?_=1

 

 

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. గురువారం కోహీర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ శ్రేణులు ఈ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలు అండగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బరిలో జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

న్యాల్కల్ మండల్ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిఆర్ఎస్వి న్యాల్కల్ మండల్ మాజీ అధ్యక్షులు జట్గొండ మారుతి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ లో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత ఎన్నికల్లో మల్గి గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన అని అన్నారు అలాగే ఇప్పుడు న్యాల్కల్ మండల్ జడ్పిటిసి స్థానం బీసీ జనరల్ కేటాయించడంతో అధిష్టానం నాకు టికెట్ ఇస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు,

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్

అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు

ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్

కరీంనగర్, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ ఎస్‌ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్‌ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

 

ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్‌ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.

 

రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్‌ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్‌ సర్కారు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

 

స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.

 

ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం…
బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా

Vaibhavalaxmi Shopping Mall

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*

ప్రజలతో మాట్లాడుతూ….
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు,
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.

100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.

ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్..

బిఆర్ఎస్ డోకా కార్డు విడుదల చేసిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రెస్ మీట్ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వెల్లడిస్తూ ఎమ్మెల్యే మాట్లాడుతూ..
బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి కుదించి బీసీలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంటను పండించి రైతులను డోకా చేశారు.
317 జీవోను తెచ్చి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుని ఉద్యోగులకు 20వ తేదీ వరకు జీతాలు ఇవ్వలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకువచ్చిన ఘనత గత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే.
మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిది.
రైతుబంధు పేరుతో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాల్లకు,ప్రైవేట్ కాలేజీలకు ప్రజా సొమ్మును పంచిపెట్టినది బి.ఆర్.ఎస్ ప్రభుత్వానిది.
అమరవీరుల కుటుంబాలను,ఉద్యమకారులను గుర్తించకుండా వారిని మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వమే.
పదేళ్ల కాలంలో సర్పంచులతో అభివృద్ధి పనులు చేయించి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టి వారి ఆత్మహత్యలకు కారణమైనది బిఆర్ఎస్ ప్రభుత్వం.
మహిళలకు పావలా వడ్డీకే 10 లక్షల రుణం ఇస్తానని ఇవ్వకుండా దూకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని మాట తప్పి మోసం చేసింది కెసిఆర్
తెలంగాణ రాష్ట్రంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని డోకా చేసింది బిఆర్ఎస్ పార్టీ.
దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వము.
ఇంటికో ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి రాగానే ఇవ్వకుండా డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
నిరుద్యోగులకు 3000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇస్తానని డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పది సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగులను డోకా చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం.
గ్రూప్.1 ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం.
పదేళ్ల పాలనలో ఒక రేషన్ కార్డు ఇవ్వకుండా ప్రజలను డోకా చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో హడావిడి చేసి పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినది బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసి ధరణిని అడ్డుపెట్టుకొని బిఆర్ఎస్ నాయకులు భూములను అక్రమంగా కాజేసినారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..  హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ.. ప్రజలను ప్లాన్డ్‌గా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.

గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల కసరత్తు….

గెలుపు గుర్రాల కోసం ప్రధాన పార్టీల కసరత్తు!

ఎవరి వ్యూహాలు వారివే!

శాయంపేట నేటిధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో పల్లెల్లో ఎన్నికల సందడినెలకొంది ఆశావాహులు రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధమ వుతున్నారు. ఈ ఎన్నికలకు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు పార్టీ లకు అతీతంగా జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను గెలుచు కుని జెడ్పి,ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు.

చేసింది చెప్పాలని కాంగ్రెస్ పార్టీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరుగ్యారెంటీలతో రూపొం దించిన పథకంలో భాగంగా రైతు భరోసా,సన్నబియ్యం, బోనస్,మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి,చేయూత ప్రభు త్వం తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రభుత్వం చూస్తుంది ఎమ్మెల్యే పార్టీ నేతలకు మార్గదర్శకాలు చేయనున్నారు.

సాధ్యమైనన్ని గెలవాలి భారతీయ జనతా పార్టీ

భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని చూస్తుంది పార్టీ పెద్ద నేతలు దిశానిర్దేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు భూపాలపల్లి నియోజకవర్గం కార్యకర్తలకు సమన్వయంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేయా లని నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లాలని చూస్తున్నారు.

వైఫల్యాలను ఎండగట్టా లని బీఆర్ఎస్ పార్టీ కసరత్తు

టిఆర్ఎస్ నేతలు అభ్యర్థుల గెలుపునకు ప్రణాళికలు రచిస్తున్నారు మండల గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సమయతమవుతున్నారు మండల గ్రామ స్థాయిలో సమస్యలపై ప్రభావం చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అవకాశం కల్పించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని దివ్యాంగుల స్థానిక సంస్థల ప్రాతినిధ్య కమిటీ చైర్మన్ షఫీ అహ్మద్ డిమాండ్ చేశారు. జహీరాబాద్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దివ్యాంగులకు టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దివ్యాంగులు చట్టసభల్లో ఉంటే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి…

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు.
మా(కాంగ్రెస్) పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పిన అనిరుధ్ రెడ్డి.. ‘మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన.. నిరంకుశత్వ పాలన. మీది రౌడీయిజం పాలన. అది చూడలేకనే ప్రజలు మిమ్మల్ని.. మీ పార్టీని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.తాను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నానని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని, ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలని అనిరుధ్ రెడ్డి.. కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…

సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ

బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి

పరకాల,నేటిధాత్రి

పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని బిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంటా కళావతి అన్నారు.ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటారని ఆమె తెలిపారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు.ఈ సందర్భంగా పరకాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని,ప్రతి ఒక్కరూ ఆనందంగా,ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

బిఆర్ఎస్ కాండ్వా కప్పుకున్న మాజీ సర్పంచ్…

బిఆర్ఎస్ కాండ్వా కప్పుకున్న మాజీ సర్పంచ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
ఝరాసంగం మండలం గినియర్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం అధ్యక్షుడు ఎం. వెంకటేశంతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జహీరాబాద్‌కు చేరుకుని బిజెపి పార్టీకి వీడ్కోలు పలికి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ మాణిక్ రావు మరియు డిసిఎంఎస్ చైర్మన్ జిల్లా మెదక్ శివ కుమార్ బిఆర్ఎస్ పార్టీ ఖాండ్వాను ధరించి ఆయనతో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా, పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను చూడాలని ఆసక్తిగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా, రైల్వే అడ్వైజరీ బోర్డు మాజీ సభ్యుడు షేక్ ఫరీద్, గుండప, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జహీరాబాద్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ నరసింహ, గౌర్ బి. సంగమేశ్వర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాద బాధితుడికి 50 వేల సాయం చేసిన తట్టు విశ్వనాథ్…

క్షత్తగాత్రుడికి పరామర్శించి 50000 యాభై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన

◆:- తట్టు విశ్వనాధ్*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కడమంచి కిషోర్ తండ్రి లక్ష్మయ్య వయస్సు 30 సంవత్సరాలు గ్రామము అనేగుంట మండలం జహీరాబాద్ గారు బూచినెల్లి శివారులో .హైవే రోడ్డు పై బైక్ స్కిడ్ కావడం వల్ల కింద పడి తలకు తీవ్ర గాయలై సంగా రెడ్డి లోని ప్రైవేట్ ఆసుపత్రి (ధరణి) లో తలకు ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్నారు ఇట్టి విషయాన్ని కుటుంబ సభ్యులు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆదుకోవాలని కోరగా తక్షణమే తన తమ్ముడైన తట్టు విశ్వనాథ్ కు తెలుపగా సంగారెడ్డి లోని ఆసుపత్రికి చేరుకొని కిషోర్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తట్టు విశ్వనాథ్ 50000/- వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కిషోర్ కుటుంబ సభ్యులు కడిమించి ప్రేమలమ్మలక్ష్మయ్య లు తట్టునారాయణ మరియు తట్టు విశ్వనాధ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీశ్, కోమారి కిష్టయ్య, కడిమించి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

అందరికీ బతుకమ్మ పండుగ అయితే రైతులకు యూరియా బస్తాల పండుగ…

అందరికీ బతుకమ్మ పండుగ అయితే రైతులకు యూరియా బస్తాల పండుగ

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం రాష్ట్రం మొత్తంలో ఆడబిడ్డల పండుగ బతుకమ్మ రంగుల హరివిల్లులా మెరవగా రైతు ఇంట్లో మాత్రం నిశ్శబ్దం మబ్బులా అలుముకుని ఉందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి తీవ్ర వేదన వ్యక్తం చేశారు.
గత పది సంవత్సరాల పాలనలో రైతు ఒక్కసారైనా యూరియా కోసం సొసైటీల ఎదుట క్యూలో నిలబడలేదని గర్వంగా చెప్పుకున్న రోజులు ఇవేనా? ఇక ఇప్పుడు పరిస్థితి చూస్తే రాత్రి ఒకటి మూడు గంటలకు రైతు కడుపు మంటలు ఆపుకోలేని స్థితిలో ఎరువుల బస్తా కోసం కాచుకొని కూర్చోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చింది అని ఆయన ప్రశ్నించారు.
రైతు చెమటతో పాలు పిండే గడ్డిపండు వంటి భూమి ఎరువుల కోసం తహతహలాడుతున్న ఈ దృశ్యం చూసి పల్లెల గుండెల్లో రక్తం ఉడికిపోతోంది. ఇంకో రెండు మూడు నెలల్లో కోతకు వచ్చే పంట యూరియా లేక వాడిపోతుందేమోనన్న భయం రైతు కళ్లలో నిద్రను దోచేస్తోంది” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బతుకమ్మ పూలు వర్ణరంజితంగా విరబూస్తున్నా రైతు హృదయంలో మాత్రం కన్నీటి బిందువులే తొణుకుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పాటల్లో ఆనందం వినిపిస్తోంది కానీ రైతు ఊపిరిలో మాత్రం ఒకటే అనాధ విలపన యూరియా యూరియా అని కరుణాకర్ రెడ్డి హృదయ పూర్వకంగా వ్యాఖ్యానించారు

కాంగ్రెస్ – బిఆర్ఎస్ దొందు దొందే…

కాంగ్రెస్ – బిఆర్ఎస్ దొందు దొందే

బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ

శాయంపేట నేటిధాత్రి;

శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టిరామకృష్ణ మాట్లా డుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఇద్దరూ ఇసుక, భూ భకసురులేనని నియోజక వర్గంలో గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఇప్పుడు అధి కారంలో ఉన్న కాంగ్రెస్ అక్రమం గా ఇసుక రవాణా చేస్తూ ప్రజా ధనాన్ని దోచుకున్నారు. మండ లంలో కాంగ్రెస్ బిఆర్ ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు భూమి కబ్జాఆరోపణ చేసుకుం టున్నా రని ఈ రెండు పార్టీల చరిత్ర అవినీతి దోపిడేనని ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని అక్రమం దోపిడీ వాళ్ల లక్ష్య మని,మండలంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నప్పటికీ వాటిని విస్మరించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుం టూ పబ్బంగడుపుతున్నారని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మండలంలో ఉన్న యూరియా సమస్య, ఆరు గ్యారెంటీలో భాగంగా మహాల క్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇస్తానన్న 2500 రూపాయలు ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వక పోవడం విడ్డూ రం.వీళ్ళ ప్రవర్తన ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకులమొగిలి జిల్లా ఉపాధ్యక్షురాలు కోడెపాక స్వరూప, మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి జిల్లా నాయకులు ఉప్పురాజు, కొత్తపెళ్లి శ్రీకాంత్, మంద సురే ష్, మండల ఉపాధ్యక్షులు కోమటి రాజశేఖర్, మండల కార్యదర్శి మేకల సుమన్ మండల కోశాధికారి కుక్కల మహేష్ పాల్గొన్నారు.

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T144229.093.wav?_=2

రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం

చల్లా ధర్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

 

బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి అన్నంపెట్టే రైతన్నలను నిండా ముంచిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు కళ్యాణపు రాజమొగిలి(రవి) యూరియా కోసం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనగా తీవ్రగాయాలపాలై హనుమకొండలోని ప్రయివేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న ఆయనను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా రవి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నరని విమర్శించారు.పులిగిల్ల గ్రామానికి చెందిన రైతులకు వరికోలు గ్రామంలో టోకెన్లు ఇవ్వడమేంటి అక్కడ టోకెన్ తీసుకొని పరకాలలో సొసైటీలో యూరియా ఇవ్వడమేంటని ప్రశ్నించారు.
ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో యూరియా కోసం బయలుదేరిన రైతులను రోడ్డు ప్రమాదాలపాలై ప్రాణాలు కోల్పోతున్న మొద్దు నిద్రలో ఈ ప్రభుత్వం ఉన్నదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంఘటలకు తావులేదన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచిన ఘనత కేసిఆర్ దన్నారు. రైతులెవరూ అధైర్య పడొద్దని,ధైర్యంగా నిలబడి కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడి యూరియా తెచ్చుకుందామని అన్నారు.మీకు అండగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. రైతులను గోసపెడుతున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని అన్నారు.పరకాల ఆర్టీసీ డీఎం,అగ్రికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే ప్రమాదంలో కాలువిరిగిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పెదమెడిసి లేరు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేస్ వర్కర్ల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు..

పెదమెడిసి లేరు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేస్ వర్కర్ల సమ్మెకు బిఆర్ఎస్ మద్దతు

నేటిదాత్రి చర్ల

 

చర్ల మండలంలో పెద మెడిసి లేరు గిరిజన ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్లు సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు పిలుపుమేరకు ఎస్టీ సెల్ కార్యదర్శి కారం కన్నారావు ఎస్కె సాదిక్ నాయకత్వంలో సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్టీ సెల్ సెక్రెటరీ డైలీవేజ్ వర్కర్లు 12 వ తేదీ నుండి సమ్మె చేస్తున్నరు వారికి రావలసిన జీతం బకాయిలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి వారిని అనేక సంవత్సరాల నుండి పాఠశాలలో వర్క్ చేయించుకుంటున్న వారిని పర్మినెంట్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుంది వెట్టి చాకిరి చేయించుకుంటూ డైలీ వేస్ వర్కర్లకు జీతం ఇవ్వకుండా నాన ఆగచాట్లు పెడుతుంది జీతం వస్తే గాని రోజు గడవని కార్మికులకు జీతాలు ఆపి వేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించాలి భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ డైలీ వేస్ వర్కర్ల సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నామని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్యామల రామారావు కారం కోటేష్ పూనమ్ నారాయణ పూనం ముత్తయ్య తాంబ నరసింహారావు తాంబ లక్ష్మయ్య పూజారి శ్రీను పూజారి మహేష్ ఎస్కె వహీద్ తదితర టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు…

రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు

నిధులు తెచ్చే దమ్ము లేక ప్రజలను శిలాఫలకలు వేసి ఏమార్చుతున్నావ్

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ ను ఒప్పించి కొప్పుల గ్రామం నుండి పరకా ల నేషనల్ హైవే మధ్యన చలి వాగుపై బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎస్టిహెచ్డిఎఫ్ 2023-24 నుండి రూ.574 లక్షలు మరియు కొప్పుల గ్రామం నుండి పరకా ల వరకు బిటీ రోడ్డు నిర్మాణం కొరకు రూ.585 లక్షలు మం జూరు చేయించి, టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిం చడం జరిగింది. పనులు జరుగు తుంటే వాటిని వేసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సిగ్గుచేటు.నేను నిధులు తెచ్చిన అంటూ మేము వేసిన శిలా పలకాల పక్కనే శిలాఫలకాలు వేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేయడం ఏంటని ఏద్దేవా చేసిన భూపా లపల్లి మాజీఎమ్మెల్యే మండ లంలో పర్యటించిన భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లా డుతూ జోగంపల్లి గ్రామం నుండి మైలారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు హుస్సేన్ పల్లి నుండి మైలారం వరకు వయా పెద్ద చెరువు కట్ట మీదుగా కోటి అరవై లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించడం జరిగింది.కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇష్టరాజ్యంగా పనులు చేస్తున్నారు.కాంగ్రెస్ నాయ కుల వ్యవసాయ భూమి ఉందని రోడ్డు పక్కన ఉన్న చెరువుని ఆక్రమిస్తూ రోడ్డు వేస్తున్నారు.కాంగ్రెస్ నాయకు లకు సహకరించని అధికారు లను ట్రాన్స్ఫర్ చేయిస్తూ వారిపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారు.అదే విదంగా ఎస్సిలకి సంబంధించిన స్మశాన వాటికను కూడా ఆక్రమించుకు న్నారు.అంటే అధికార పార్టీ నాయకులు ఏదీ చేసిన మాఫ్ అనే ధోరణి నడుస్తుంది.
కావున ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెరువును ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం కొప్పుల గ్రామంలో వేసిన శిలా ఫలకాలను చూసి శిలాఫల కాల మోజులో ప్రజలను ఏమార్చుతున్నారు అంటూ చురకలు అంటించాడు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కక్కించే వరకు పోరాటం ఆగదు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-17T165353.065.wav?_=3

 

కక్కించే వరకు పోరాటం ఆగదు”

మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు “పెద్ది సుదర్శన్ రెడ్డి”

 ధాన్యం టెండర్ల కుంభకోణంపై బీఆర్ఎస్ విజయం!

కాంగ్రెస్ తొలి స్కాం బహిర్గతం చేసిన మాజీ ఎమ్మెల్యే “పెద్ది సుదర్శన్ రెడ్డి”

రూ.1100 కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్.

హైకోర్టులో PIL, కేంద్ర సంస్థలకు 755 పేజీల ఫిర్యాదు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేయడంతో GO MS No.15 విడుదల.

కేవలం ₹65.9 కోట్లు జప్తు – పాక్షిక చర్యపై బీఆర్ఎస్ ఆగ్రహం.

“నేటిధాత్రి”,హైదరాబాద్, సెప్టెంబర్ 17:

 

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి అవినీతి స్కాం పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఫలితాలిస్తోందని, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్ల ముసుగులో బినామీల చేతి ద్వారా కొనుగోలు చేసి రూ.1100 కోట్ల కుంభకోణం చేసినట్టు బీఆర్ఎస్ ఆరోపించింది.

“పెద్ది” 20 నెలల పోరాట ఫలితం.
మాజీ ఎమ్మెల్యే, సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ గత 20 నెలలుగా నిరంతర పోరాటం చేస్తూ, ఈ స్కాంపై హైకోర్టులో PIL (34/2024) దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కౌంటర్ దాఖలు చేయాలంటూ 20 నెలల క్రితమే నోటీసులు ఇచ్చింది.
కానీ ప్రభుత్వం 18 సార్లు వాయిదాలు కోరడం వల్ల కేసులో ఆలస్యం జరిగినట్టు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇది తాము సేకరించిన ఆధారాలు గంభీరంగా ఉన్నాయని, కేసును ఎదుర్కొనలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర సంస్థలకు 755 పేజీల రిపోర్టుతో “పెద్ది” ఫిర్యాదు.
బీఆర్ఎస్ అధ్వర్యంలో ED, CBI, సెంట్రల్ విజిలెన్స్, ACB, రాష్ట్ర విజిలెన్స్ లకు మొత్తం 755 పేజీల ఆధారాలతో కూడిన ఫిర్యాదు సమర్పించిందని చెప్పారు. ఈ స్కాంలో పాల్లెవేళుగు మిల్లర్లు, టెండర్ ఏజెన్సీలు, అధికారుల మధ్య తీవ్ర అడ్డగోలుగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు.

430 కోట్ల స్కామ్ – కేవలం ₹65.9 కోట్లు జప్తు
ఈ స్కాంలో టెండర్ విలువ కంటే అదనంగా మిల్లర్ల నుంచి టెండర్ ఏజెన్సీలు వసూలు చేసిన మొత్తం రూ.430 కోట్లు. కానీ ప్రభుత్వం జారీ చేసిన GO MS No.15 ప్రకారం కేవలం ₹65.90 కోట్లే జప్తు చేశారు. టెండర్ ఏజెన్సీలైన కేంద్రియ బండార్, LACOF సంస్థల నుంచే జప్తు చేయడం జరిగిందని, హిందూస్తాన్ లిమిటెడ్, మంచుకొండ ఏజెన్సీలపై మాత్రం ఏ చర్యలు లేకపోవడం వెనుక ప్రైవేట్ ప్రమేయమే ఉందని ఆరోపించారు.

పాక్షిక చర్యలు – పక్కదారి చర్యలు!
సామాన్యంగా ఏ టెండర్ ఏజెన్సీ నిబంధనలు ఉల్లంఘించినా EMD మొత్తాన్ని పూర్తిగా జప్తు చేయడం ఆనవాయితీగా ఉంటే, ఈ కేసులో మాత్రం పాక్షికంగా జప్తు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా వసూలు చేసిన డబ్బుపై కృతజ్ఞత చూపించినట్లే అవుతుందన్నారు.

కక్కించేవరకు పోరాటం ఆగదు ప్రభుత్వానికి “పెద్ది” హెచ్చరిక
కాంగ్రెస్ పెద్దలు తిన్న ప్రతి రూపాయిని ప్రజల ముందు కక్కించేవరకు పోరాటం ఆగదు. ఇందులో పాలుపంచుకున్న అధికారులపై కూడా చర్యలు తప్పవు. సివిల్ సప్లై వ్యవస్థను ప్రైవేట్ ఎజెన్సీల చేతుల్లోకి అప్పగించిన దారుణాన్ని బహిర్గతం చేస్తామని పెద్ది సుదర్శన్ అన్నారు.

బాధిత కుటుంబాలను పరామర్శించిన..!

పలు కుటుంబాలను పరామర్శించి సానుభూతి తెలిపిన రాజా రమేష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని 14వ వార్డ్ మాజీ కౌన్సిలర్ గడ్డం రాజు_ విజయలక్ష్మి ల తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను శనివారం బిఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు పరామర్శించారు. అనంతరం రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, మాజీ ఎంపిటిసి కళ్యాణ్ ల తల్లి భీమక్క ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించారు. వారి తల్లి భీమక్క చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామిడి కుమార్, మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదెలు, నాయకులు బొమ్మ భూమయ్య గౌడ్, జక్కన బోయిన కుమార్, నందిపేట సదానందం, రామిడి లక్ష్మీకాంత్, ఆర్నె సతీష్, చంద్రమౌళి, పైథార్ ఓదెలు, కొండ కుమార్ ,మణి ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే…

బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే
ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి

మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి

 

జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.బిజెపి,బిఆర్ఎస్ తోడుదొంగలే

ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ
షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది కాంగ్రెస్ పార్టీ
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీకి 175 కోట్ల బకాయిలు కట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం.
అవగాహన లేకుండా మాట్లాడి
జిల్లా అధ్యక్ష పదవిని నవ్వుల పాలు చేయకు యాదగిరి బాబు
రాష్ట్ర కిసాన్ సెల్ జాయిన్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ డెలిగెట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాలతో మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అధ్యక్షతన రాష్ట్ర కిసాన్ సెల్ జాయింట్ కోఆర్డినేటర్ సత్యం రెడ్డి తన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…నిన్న జరిగిన బీజేపీ మీడియా సమావేశంలో యాదగిరి బాబు మాట్లాడిన మాటలన్నీ వట్టి మాటలేనని,మొదటిసారి ఎంపీగా గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తా అని అన్నా ధర్మపురి అరవింద్ ఎక్కడ అని ప్రశ్నించారు.తిరిగి మరో మారు ఎన్నికల స్టంట్ గా షుగర్ ఫ్యాక్టరీ తెరపైకి తెచ్చి రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచిన అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పట్టించుకోలేదని అన్నారు. అప్పటి పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీ వద్ద బస చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఒక కమిటీని నియమించి ఏకకాలంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పది సంవత్సరాలుగా ఉన్న బకాయిలలో 175 కోట్ల బకాయిలు చెల్లించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అసలు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడి జిల్లా అధ్యక్ష పదవికి యాదగిరి బాబును రైతులు, ప్రజల ముందు నవ్వుల పాలు కావద్దని వాకిటి సత్యం రెడ్డి హితవు పలికారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విషయంలో మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన విషయం రైతులు మర్చిపోలేదని,రైతులపై టిఆర్ఎస్ ప్రభుత్వం మోపిన కేసులను సైతం రైతులు మర్చిపోలేదన్నారు.అంతేకాకుండా ఖచ్చితంగా నన్ను భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ నియోజకవర్గ ఎంపీగా నన్ను గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ప్రభుత్వాన్ని ఒప్పించి తెరిపించకపోతే నా సొంత డబ్బులతో షుగర్ ఫ్యాక్టరీని నేనే కట్టిస్తానని ఎంపి అరవింద్ చేసిన వాగ్దానం చేసిన మాట నిజం కాదా అని ఎద్దేవా చేశారు.బిఆర్ఎస్ పార్టీ,బిజెపి పార్టీ రెండు పార్టీలు ప్రజల్ని మోసం చేస్తేనే గుణపాఠంగా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని,ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాటమీద నిలబడ్డదని దానిని ఓరువలేని తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదల్లే కార్యక్రమాల్ని మానుకోవాలని హితువు పలుకారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన,ప్రజల కొరకు పని చేస్తుందని త్వరలోనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకొని రైతుల కళ్ళల్లో ఆనందం చూసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని మీరెన్ని అబద్ధపు మోసపూరిత మాటలు చెప్పిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని రైతులెప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు.ఈ సమావేశంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మారుతి, మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,సింగరపు అశోక్,శంకర్,గణేష్,కోరే రాజ్ కుమార్, శ్రీలోక్,రంజిత్, అన్వర్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version