చిత్తూరు ప్రాంతంలో నరువి హాస్పిటల్ సేవలు….

చిత్తూరు ప్రాంతంలో నరువి హాస్పిటల్ సేవలు

హార్ట్ అండ్ న్యూరాలజీ స్పెషలిస్ట్స్ మెడికల్ క్యాంప్

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్

 

 

చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు గుండె సంబంధిత సమస్యలు ఉన్న రోగులు నరువి హాస్పిటల్ వైద్య నిపుణుల నుండి నేరుగా చికిత్స పొందే అవకాశం కల్పించబడింది. దీని కోసం వైద్య శిబిరం ఈరోజు ప్రారంభించబడింది. చిత్తూరు ప్రీతం హాస్పిటల్ మరియు వెల్లూరు
నరువి హాస్పిటల్ సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి.
చిత్తూరు ప్రాంతంలోని గుండె రోగులు మరియు నరాల సంబంధిత రోగులు చికిత్స కోసం వెల్లూరు నరువి ఆసుపత్రికి వచ్చే సమయం మరియు ఖర్చును తగ్గించడానికి, నరువి హాస్పిటల్ వైద్య నిపుణులు చిత్తూరులో నేరుగా చికిత్స అందించగలిగేలా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
వేలూరు నరువి హాస్పిటల్ చిత్తూరు ప్రీతం హాస్పిటల్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరం నేటి నుండి చిత్తూరు ప్రీతం హాస్పిటల్‌లో ప్రారంభమైంది. ఈ శిబిరం నెలకు రెండుసార్లు నిరంతరం ఈ ఆసుపత్రిలో జరుగుతుంది.
ప్రీతమ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్, నర్వి హాస్పిటల్ కార్డియాక్ సర్జన్లు డాక్టర్ వినాయక్ శుక్లా,డాక్టర్ రే జార్జ్ మరియు నరంబిల్ సర్జన్ డాక్టర్ లోకే రోగులను పరీక్షించి చికిత్స చేస్తారు. వేలూరు
లోని నరువి హాస్పిటల్‌లో శస్త్రచికిత్స అవసరమయ్యే రోగులకు శస్త్రచికిత్స చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.ఈ వైద్య శిబిరం ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం ప్రీతమ్ హాస్పిటల్‌లో జరిగింది. నరువి హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శరవణన్ రామన్,డాక్టర్ వినాయక్ శుక్లా, డాక్టర్ రే జార్జ్,డాక్టర్ లోకేష్ మరియు ప్రీతమ్ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రమాద బాధితుడికి 50 వేల సాయం చేసిన తట్టు విశ్వనాథ్…

క్షత్తగాత్రుడికి పరామర్శించి 50000 యాభై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన

◆:- తట్టు విశ్వనాధ్*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కడమంచి కిషోర్ తండ్రి లక్ష్మయ్య వయస్సు 30 సంవత్సరాలు గ్రామము అనేగుంట మండలం జహీరాబాద్ గారు బూచినెల్లి శివారులో .హైవే రోడ్డు పై బైక్ స్కిడ్ కావడం వల్ల కింద పడి తలకు తీవ్ర గాయలై సంగా రెడ్డి లోని ప్రైవేట్ ఆసుపత్రి (ధరణి) లో తలకు ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్నారు ఇట్టి విషయాన్ని కుటుంబ సభ్యులు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆదుకోవాలని కోరగా తక్షణమే తన తమ్ముడైన తట్టు విశ్వనాథ్ కు తెలుపగా సంగారెడ్డి లోని ఆసుపత్రికి చేరుకొని కిషోర్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తట్టు విశ్వనాథ్ 50000/- వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కిషోర్ కుటుంబ సభ్యులు కడిమించి ప్రేమలమ్మలక్ష్మయ్య లు తట్టునారాయణ మరియు తట్టు విశ్వనాధ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీశ్, కోమారి కిష్టయ్య, కడిమించి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

నరువిలో అత్యాధునిక లివర్ క్లినిక్ ప్రారంభం

నరువిలో అత్యాధునిక లివర్ క్లినిక్ ప్రారంభం

తిరుపతి(నేటి ధాత్రి(ఆగస్టు 13:

 

 

వేలూరులోని నరువి ఆసుపత్రిలో ప్రత్యేకంగా గురువారం అత్యాధునిక లివర్ క్లినిక్ నరువి హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ జీవీ సంపత్ ప్రారంభించారుఇక్కడ ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయడానికి అనువుగా పరికరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు అనేకం చేసిన నరువి ఆసుపత్రి, దీనికి గాను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.ఈ సర్జరీలకు ఎల్. క్యూబ్ మెడికల్ టీమ్ సహకరించగా, ఈ టీమ్ కు డాక్టర్ జాయ్ వర్గీస్,డాక్టర్ వివేక విజ్ లు నాయకత్వం వహించారు. వీరు ఇకపై నరువి ఆసుపత్రిలోనే తమ సేవలను అందించనున్నారు.ఈ టీమ్ ఇటీవల ఒకే రోజులొ నాలుగు లివర్ ట్రాన్స్ ప్లాంట్స్ చేసినట్లు ఈ సందర్భంగా డాక్టర్ జీవి సంపత్ తెలిపారు. ఇందులో భాగంగా ఎల్ క్యూబ్,నరువి ఆసుపత్రిల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే లివర్ సమస్యలతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నరువి ఆసుపత్రికి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనితా సంపత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పాల్ హెన్రీ, జాకబ్ జోస్, శరవణన్ రామన్, నితిన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version