కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి…

 కేటీఆర్‌ ప్రతీదీ రాజకీయం చేస్తున్నారు: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిదీ రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే.. ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? అని ఆయన కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కావాల్సిన అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏరోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు.
మా(కాంగ్రెస్) పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పిన అనిరుధ్ రెడ్డి.. ‘మా ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంది. మీ పాలన.. నిరంకుశత్వ పాలన. మీది రౌడీయిజం పాలన. అది చూడలేకనే ప్రజలు మిమ్మల్ని.. మీ పార్టీని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేసేది ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్లు, భూకబ్జాల కోసం అని మీరు గమనించాలి’ అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.తాను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నానని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమీషన్ వస్తే చాలని, ఎప్పుడు కూడా ఈ సమస్య పై మాట్లాడలేదని మీరు గుర్తించాలని అనిరుధ్ రెడ్డి.. కేటీఆర్ ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

అసత్యపు ఆరోపణలు మానుకో..

అసత్యపు ఆరోపణలు మానుకో.. బహిరంగ చర్చకు సిద్ధమా ..?

సింగల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

అసత్యంతో కూడిన కల్పిత ఆరోపణలు మానుకోవాలని సంబంధిత ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సింగల్ విండో డైరెక్టర్(21వ వార్డు ఇంచార్జ్) ధర్ని మధుకర్ మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణకు సవాల్ విసిరారు.

గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఈనెల 2వ తేదీన స్థానిక ప్రెస్ క్లబ్ లో బేర సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడిన అసత్యపు మాటలను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

నిరాధారణమైన వాక్కులు అంత మంచివి కావని హితువు పలికారు.తాను ఎవరి భూములను అక్రమంగా తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఒకవేళ ఆధారాలతో నిరూపిస్తే దైవ సాక్షిగా ఆ భూములను ఈ ప్రాంత ప్రజలకు బే షరతుగా పంచుతానని పత్రికా ముఖంగా తెలుపుతున్నానని అన్నారు.

తగిన ఆధారాలతో శనివారం సర్వేనెంబర్ 8 లోని రైస్ మిల్లు వద్దకు వస్తే నేను అన్న మాటలకు కట్టుబడి ఉంటానని అన్నారు.

నీ పబ్బం గడుపుకోవడానికి రాజకీయ లబ్ధి కోసం అనేక పార్టీలు మారావే కానీ నిన్ను గెలిపించి రాజకీయంగా పదవులు కట్టబెట్టిన 21వ వార్డు ప్రాంత ప్రజలకు ఏ విధంగా నువ్వు సహాయం చేయలేదని విమర్శించారు.

నువ్వు ఎంపీపీ స్థానంలో ఉండి రొడ్డ రాజేశం,గాజుల విజయలక్ష్మి,తిప్పని పద్మ, పోతురాజుల రమేష్ వంటి పేద ప్రజలకు సంబంధించిన భూములను అక్రమంగా లాక్కొని వారిని అనేక రకాలుగా ఇబ్బంది చేసిన విషయాన్ని మర్చిపోయావ అని గుర్తు చేశారు.వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా 21 వార్డులో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక రాజకీయంగా భవిష్యత్తులో తన ఉనికిని కోల్పోతాడనే ఉద్దేశ్యంతో అసత్య ప్రేలాపనలు పేలుతున్నాడని మండిపడ్డారు.

భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి తాను సిద్ధమని ప్రజల మద్దతు ఎవరికో వేచి చూడాలని సవాలు విసిరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version