బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.!

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకే

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రామడుగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పాల్గోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్కొండ కిష్టారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ తౌటు మురళి, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో నారగాని మాధవి-శ్రీధర్ గౌడ్ కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చి. ల. సౌ. అమూల్య -చి.శ్రీకాంత్ గౌడ్ ను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన గణపురం మండల బిఆర్ఎస్ నాయకులు
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, బి ఆర్ఎస్ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రా రెడ్డి, యాత్ నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మార్క సాయి గౌడ్,బబ్లుగౌడ్, హఫీజ్ మరియు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

బిఆర్ఎస్ బహిరంగ సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ.

మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

ఈనెల 27 న వరంగల్ జిల్లా సమీప ఎల్కతుర్తిలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పట్ల నర్సంపేట రూరల్ మండలంలోని ఇటుకలపల్లి,ఆకుల తండా,ఏనుగుల తండా,ఇప్పల్ తండ గ్రామలలో బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆయా గ్రామాల్లో మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.అనంతరం గోడ పత్రికలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రుణ మాఫీ పట్ల ప్రకటన ప్రకారం మిగిలిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ రంగాల్లో విఫలమయ్యిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,క్లస్టర్ ఇన్చార్జిలు మోటూరి రవి,కడారి కుమారస్వామి,మాజీ ఎంపీటీసీ భూక్యా వీరన్న,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,ఇటుకాపల్లి గ్రామకమిటీ అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్,ఆకుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు కూకట్ల రవి,ఇప్పల్ తండ గ్రామ పార్టి అధ్యక్షుడు ధరావత్ బద్దు,ఏనుగుల తండ గ్రామ పార్టి అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ బానోతు రవి,మాజీ సర్పంచ్ లు మండల రవీందర్,భానోత్ శంకర్ నాయక్,మాజీ ఉప సర్పంచ్ జమాల చంద్రమౌళి,వాడికారి గోపాల్,కుసుంబ కోటి,మండల రాజమౌళి,రాధరపు రాజు,నకినబొయిన సారంగం,జామచెట్ల చేరాలు, సాంబయ్య,గజ్జి బాబు, హరీష్, సుమన్,కిషన్ నాయక్,బోయిని సమ్మాలు,పాసికంటి శంకర్ లింగం,కన్నెబోయిన రాజు, కూకట్ల కుమార్ ఉప్పునూతల వీరాచారి,గోపు సాంబయ్య,బానోతు దశ్రు,కిషన్,ధరావత్ దసురు,జై కిసాన్ బద్రు,గ్రామ కమిటీ సభ్యులు,నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం…

బిఆర్ఎస్ నియోజక వర్గ ఇన్చార్జి రాజా రమేష్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

ఈనెల 27న ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజా రమేష్ అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలో సభకు సంబంధించి కేసీఆర్ వాల్ రైటింగ్ తో ప్రజలను, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.అనంతరం రాజా రమేష్ మాట్లాడుతూ..

BRS Silver Jubilee Celebration

మున్సిపాలిటీలోని 14,15,17,18,20 వార్డు లలో వాల్ పోస్టర్లను అంటించడం అంటించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంభగోని సుదర్శన్ గౌడ్,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామిడి కుమార్, బడికల సంపత్,ఆలుగుల సత్తయ్య,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య,బోయినపల్లి అనిల్ రావు,రేవెల్లి ఓదెలు, జిలకర మహేష్,పారుపల్లి తిరుపతి,గడ్డం రాజు, చంద్రమౌళి, లక్ష్మారెడ్డి,రంగరాజు,పైతారి ఓదెలు,మేకల రమేష్,వేనంక శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్,ఆశనవేణి సత్యనారాయణ,టైలర్ రాజు,చంద్ర కిరణ్,కుర్మ దినేష్,దేవి సాయి కృష్ణ, శివ,మణి, గోనె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే గారి కృషి తో మంజూరైన ₹54,000/- విలువ గల చెక్కును రంజోల్ గ్రామానికి చెందిన రాము గారికి అందజేసిన సీనియర్ నాయకులు నామ రవికిరణ్,సత్యం ముదిరాజ్ గార్లు .ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారికి,నాయకులకు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే.!

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు

◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి

◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

MLA Manik Rao

 

కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే బిఆర్ఎస్ రచోత్సవ సభకు సంబంధించిన గొడ పత్రిక ను బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.ఈనెల 27న ఎల్కతుర్తి బిఆర్ఎస్ రచోత్సవ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుండి సుమారు 5 వేలకు పైగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళుతున్నారని అన్నారు. తెలంగాణ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని, పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నంబర్ వన్ గా మారిందని పేర్కొన్నారు.

BRS

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించి పెద్ద తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో జరుగనున్న రజతోత్సవ సభలో కేసీఆర్‌ తెలంగాణ ప్రజల భవిష్యత్‌ గురించి దిశా నిర్దేశం చేయనున్నారని, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి జడ్పిటిసి స్వప్న భాస్కర్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,మాజి సర్పంచ్ శేఖర్ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,నాయకులు గణేష్ , చంద్రయ్య,దీపక్ తదితరులు పాల్గొన్నారు.

కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం.

మెట్ పల్లి ఏప్రిల్ 10 నేటి ధాత్రి

మెట్ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం వెల్లుల్ల రోడ్డు ఫంక్షన్ హాల్ లో జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మార్క్ ఫండ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ముఖ్య కార్తి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
మల్లాపూర్ మండల్ ముత్యంపేట ఆటో యూనియన్ వారు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవం వరంగల్ లో జరిగే చలో వరంగల్ కార్యక్రమానికి పార్టీ నిధులు కింద 5000 రూపాయలు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కి అందజేశారు.
ఈ సమావేశంలో ముఖ్య కార్యకర్తలు వారి సలహాలు సూచనలు మాట్లాడిన
అనంతరం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కార్యకర్తలు పార్టీ బలోపేత నికి కృషి చేయాలని కెసిఆర్ అడుగుజాడల్లో నడిచి పూర్వ వైభవం పార్టీకి తేవాలని నియోజకవర్గంలో మన పార్టీకి బెంచి పట్టు ఉందని దానికి ప్రతి కార్యకర్త వచ్చే సర్పంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ వరంగల్ లో జరిగే టిఆర్ఎస్ రజతోత్సవాలు పురస్కరించుకొని చలో వరంగల్ సభను ఘన జరుపుకుందామని దానికి ప్రతి బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలను కలిసి మనం చేసిన అభివృద్ధి పనులు గురించి తెలిపి వరంగల్ సభకు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మారు సాయి రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ , మాజీ జడ్పిటిసిలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

BRS పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష.

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష

ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్

సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవనంలో ఈరోజు

సిరిసిల్ల నేటి ధాత్రి:

 

బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష భక్తులకు భిక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ముఖ్య అతిథిగా బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

BRS & KTR

అనంతరం మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి కృప, కటాక్షం సుఖ:సంతోషాలతో ఎల్లవేళలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కే.టీ.ఆర్ కోరాతు, స్వామి వారి చిత్రపటాన్ని స్వీకరిస్తూ, అనంతరం హనుమాన్ దీక్ష స్వాములతో బిక్ష కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు హనుమాన్ దీక్ష పరులు పాల్గొన్నారు.

ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా.

ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండా…

రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన పార్టీ బిఆర్ఎస్…

రాష్ట్రం కోసం పదవులను త్యాగం చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులది…

నీళ్ళివ్వకుండ చెక్ డ్యామ్ కులగొట్టిన ఘనత మన ప్రస్తుత ఎమ్మెల్యే ది..

ఏప్రిల్ 27న జరగబోయే మన సభా రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకు రానుంది…

:-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో భాగంగా నేడు మొగుళ్ళపల్లి మండలంలోని ఆకినపల్లి, ఇప్పలపల్లి, పోతుగల్,కొరికిశాల ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

ఈ సందర్భంగా ఆకినపల్లి మాజీ సర్పంచ్ దూడపాక భద్రయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దూడపాక సమ్మయ్య మరియు యువత అబద్దాల కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ ఎమ్మెల్యే రమణన్న సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.

మాజీ ఎమ్మెల్యే రమణన్న మాట్లాడుతూ…

2001 ఏప్రిల్ 27 వ తారీఖు నాడు కెసిఆర్ గారు ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటువంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ ఆరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్తయి 25వ సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం. భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించలేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవా సభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు.

BRS party

 

 

ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటువంటి ప్రభుత్వాలు ఉండవు,దానికి కారణమేంటంటే అమలు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం.

ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పని చేస్తున్నటువంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు.

ఈరోజు ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపాలన, అసమర్ధ పరిపాలన, చేతగాని వ్యవహారం ఇవన్నీ చేసుకుంటు ఈరోజు ప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.

ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.

రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ఎస్ జెండానే, గెలిచేది బిఆర్ఎస్ అభ్యర్దులే…

ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి.

కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మృతి…

నేటి ధాత్రి.

 

తంగళ్ళపల్లి మండలం కస్బేకట్కూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జూపల్లి సందీప్ రావు మృతి చెందారు తెలిపినారు.

తెలిసిన సమాచారం ప్రకారం కట్కూర్ గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సికింద్రాబాద్లోనియశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 12 గంటల 15 నిమిషాలకు మృతి చెందారనివారి కుటుంబ సభ్యులు తెలియచేశారు.

వారి మరణం పార్టీకి ఎంతో లోటని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు తెలిపారు

బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి.

చేనేత కార్మికులకు మద్దతుగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి )

 

ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సిఐటియు వారి ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు కూలి పెంచే విషయంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది అట్టి నిరాహార దీక్షలో పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇస్తూ జిందాం చక్రపాణి మాట్లాడుతూ చేనేత కార్మికుల కోసం సిరిసిల్ల చేనేత చీరలకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినటువంటి దానికి కూలి పెంచాలని, వైపని కార్మికులకు, వర్పిన్ కార్మికులకు మర మొగ్గల పవర్ లుమ్ కార్మికులకు కూలి పెంచాలని , తెలంగాణ రాష్ట్రంలోని చేనేత చీరలకు అత్యధికoగా ధర కల్పించాలని కోరుతూ ఈరోజు చేనేత కార్మికులకు మద్దతు పలకడం జరిగింది. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోదండ రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ముషం రమేష్, మాజీ వార్డ్ కౌన్సిలర్ దార్ల సందీప్ కీర్తన, తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

BRS మాజీ సర్పంచ్లకు భయపడుతున్నCM.

బిఆర్ఎస్ మాజీ సర్పంచ్లకు భయపడుతున్న సిఎం

ముందస్తు అరెస్ట్ లను ఖండించిన మాజీ సర్పంచ్ విద్యాసాగర్

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రజా పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న సీఎం గత తాజా మాజీ సర్పంచుల పిండింగ్ బిల్లుల పట్ల బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు పోరాటం చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ ఆరోపించారు.

BRS party

తనతో పాటు నియోజకవర్గం పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ,ఖ నాపురం, నర్సంపేట మండలాల తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టులు చేసి ఆయా పోలీసు స్టేషన్లో నిర్బందించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులు నిలిపివేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన పెడింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.

బిఆర్ఎస్ నాయకుల అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం.

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో అడ్వకేట్ వెంకన్నకు ఘన సన్మానం

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గొట్లకొండ గ్రామానికి చెందిన యువ అడ్వకేట్ మాలోతు వెంకన్న జాదవ్ ను బి ఆర్ఎస్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ గుంటుక సోమయ్య, మాజీ వైస్ ఎంపీపీ సారంగం, వాగ్య నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఎగ్జామ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను మాలోతు వెంకన్న జాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుంటుక సోమయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఎగ్జామ్స్ లో వెంకన్న ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో పసునూటి లక్ష్మీనారాయణ, రెడ్యానాయక్, శ్రీను, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు…

ముందస్తు అరెస్టులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలలానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగా అరెస్టు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నిషేధంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన టిఆర్ఎస్వి నాయకులు ముందస్తుగా అడ్డుకొని ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్కు ట్రాఫిక్ జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మాకు సంబంధించిన విషయాల గురించి అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మమ్మల్ని అరెస్టు చేసి తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని ఈ సందర్భంగా అరెస్ట్ అయిన వారిలో చీమల ప్రశాంత్ యాదవ్ బొలవేణి ఎల్లం యాదవ్ పొందాల చక్రపాణి నందగిరి భాస్కర్ గౌడ్ తదితరులు అరెస్టు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు వీరిని మాజీ జెడ్పిటిసి బిఆర్ఎస్ నాయకులు కోడి యంతయ్య జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధు తదితరులు పరామర్శించారు

కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు.!

50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారు

గణపురం బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం
కాంగ్రెస్ పార్టీనే దళిత వ్యతిరేక పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్ రెడ్డి అన్నారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దళిత ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారన్నారు. అగ్ర కులస్తులకు పెద్దపీట వేసింది, దళితులను సేవకులుగా చూసిన నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు సరైన గౌరవం లేదని, ఇప్పటివరకు మాదిగ కులస్తులకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకుండా దళితులను అవమానించిందన్నారు.
దళిత నాయకుల పట్ల దళిత ప్రజా ప్రతినిధుల పట్ల అమర్యాదగా మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన స్పీకర్ పై ఏక వచనంతో ఎక్కడ కూడా మాట్లాడలేదని, ఈ సస్పెన్షన్ అక్రమం, అన్యాయం అని అన్నారు.
సభ సంప్రదాయాలు ఎక్కడ కూడానూ ఉల్లంగించలేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నిరంకుశ విధానాలకు ఇదే నిదర్శనమని అదే విదంగా దళితులపట్ల గాని దళిత ప్రజా ప్రతినిధుల పట్ల గాని అనుచితంగా అమర్యాదగా మాట్లడింది కాంగ్రెస్ పార్టి అనిను ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అదికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇంకా మా బిఅర్ఎస్ పార్టి మిద ఏడవడం ఎందుకని ముందు ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చండి అనిటూ మెము ఇంకా ప్రతిపక్షాల్లోనే ఉన్నామనే భ్రమలో కాంగ్రెస్ పార్టి ఉందని వారు విమర్శించారు.
అలాగె జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ను ఏఎత్తివేయాలని డిమాండ్ చేశారు

ఉప ఎన్నికలొస్తే ఉద్యమకారులకే టిక్కెట్లు?

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమే అని అఫిడవిట్లు ఇచ్చిన వారిపై రాజీనామాకు ఒత్తిళ్లు?

`ఎలాగైనా ఉప ఎన్నికలు తేవాలన్నదే కేసిఆర్‌ ఎత్తుగడ!

`పది సీట్లు గెలుచుకుంటేనే బిఆర్‌ఎస్‌ మనుగడ!

`ఉప ఎన్నికలు వస్తే జగిత్యాల నుంచి ‘‘కవిత’’ పోటీ.

`ఉప ఎన్నికలు తెచ్చి ఒక్క సీటు ఓడిపోయినా బిఆర్‌ఎస్‌ అడ్రెస్‌ గల్లంతే!

`ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని సంకేతాలు వెళ్లినట్లే!

`ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశాలు.

`అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.

`తాము బీఆర్‌ఎస్‌ లో వున్నామని చెప్పినా సుప్రీం కోర్టు అంగీకరించినా, పార్టీ పరంగా అంగీకరించకూడదని నిర్ణయం.

`అందరూ అఫిడవిట్లు దాఖలు చేసేదాకా ఎదురు చూడాలనుకుంటున్నారు.

`అదును చూసి రాజీనామాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

`అఫిడవిట్లు ఇస్తే అటు కాంగ్రెస్‌ ఆదరించదు.

`ఇటు బీఆర్‌ఎస్‌ దరి చేరనివ్వదు.

`రాజీనామా చేయని గత్యంతర పరిస్థితుల్లోకి ఎమ్మెల్యేలు.

`నియోజకవర్గాల వారిగా ఇప్పటికే నివేదికలు.

`కొన్ని నియోజకవర్గాలలో నాయకులకు కేసిఆర్‌ అభయం.

`ఆశావహులను కూడా పరిగణలోకి తీసుకొని, సమిష్టి నిర్ణయం తీసుకోనున్నారు.

`నాయకుల అభిప్రాయాల మేరకు టిక్కెట్లు కేటాయించాలని అనుకుంటున్నారు.

`అటు కేటిఆర్‌, ఇటు హరీష్‌ రావులు అదే పనిలో నిమగ్నమై వున్నారు.

`కేటిఆర్‌ జిల్లాల పర్యటన కూడా అందులో ఒక భాగమే అంటున్నారు.

`ప్రజాభిప్రాయ సేకరణ నేరుగా సేకరించాలనుకుంటున్నారు.

`పార్లమెంటు ఎన్నికల సమయంలో తొందరపడి పరువు పోగొట్డుకున్నారు.

`ఆ తొందరపాటు మళ్లీ పునరావృతం కాకుండా అడుగులేయాలనుకుంటున్నారు.

`ఇక కొడితే రాజకీయాలు షేక్‌ కావాలని చూస్తున్నారు.

`బీఆర్‌ఎస్‌ బలం రుచి చూపించాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 రాజకీయాలలో తొందరపాటు ఎంత అనర్ధ దాయకమో పది మంది జంపింగ్‌ ఎమ్మెల్యేలను చూస్తే అర్దమౌతుంది. ఇప్పుడు లాక్కొలేక, పీక్కోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్దితి వస్తుందని ఊహించలేదు. ఆసల్యం అమృతం విషమనుకున్నారు. తొందరపాటు మొదటికే మోసమని గ్రహించలేకపోయారు. పరిస్దితులను అర్ధం చేసుకోలేకపోయారు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేకపోయారు. పార్టీ మారితే ప్రాదాన్యత పెరుగుతుందనుకున్నారు. పదవులు, పనులు వచ్చి ఒళ్లో వాలుతాయని కలలుగన్నారు. వరుస పెట్టి క్యూ కట్టారు. వరద ఆగిపోగానే దిక్కులు చూస్తున్నారు. తమ పలాయనం తర్వాత బిఆర్‌ఎస్‌ ఖళీ అవుతుందనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎనలేని ప్రాదాన్యత లభిస్తుందనుకున్నారు. నియోజక వర్గ అభివృద్దికి నిధుల వరద పారుతుందనుకున్నారు. అదనంగా పదవులు, అనుచరులకు మేలు కల్గుతుందని అనుకున్నారు. కాని డామిట్‌ కధ అడ్డం తిరిగింది. కాంగ్రెస్‌లో చేరి ఇంత కాలమైనా గుర్తింపు లేదు. ఆదరింపు లేదు. అలకపూనినా పలకరించేవారు లేదు. ఆపద వస్తున్నా అయ్యే అనేవారు లేదు. అసలు కాంగ్రెస్‌ నేతలకు తప్ప కప్పదాటు నాయకులకు పార్టీలో చోటే లేదని తెలుసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి నటరాజన్‌ తేల్చి చెప్పడంతో దిక్కు తోచని స్తితిలోకి నెట్టేయబడ్డారు. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్‌ అధినేత సైలెంటుగా తన వ్యూహాలు తాను చేసుకుంటూ పోతున్నారు. ఇవ్వాల కాకపోయినా, రేపైనా సరే ఉప ఎన్నికలు ఖాయమన్న నమ్మకంతో కేసిఆర్‌ వున్నారు. పైగా సుప్రింకోర్డులో బలంగానే పార్టీ తరుపున వాదనలు వినిపిస్తున్నారు. దాంతో ఏ క్షణమైనా పిరాయింపు ఎమ్మెల్యేపై వేటు పడొచ్చన్న ఆశతో బిఆర్‌ఎస్‌ నాయకులున్నారు. ఇదిలా వుంటే సుప్రింకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్‌గానే వున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిరాయింపుల చట్టం అమలు కోసం డైరెక్షన్‌ ఇచ్చేలానే వుంది. జంపింగ్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకెంత కాలమంటూ తెలంగాణ స్పీకర్‌ కార్యాలయానికి నోటీసులు కూడా పంపింది. ఈ నెల 22 లోపు ఏదో ఒక సమాధానం చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే సుప్రింకోర్టు స్పీకర్‌కు సైతం నోటీసులు జారీ చేసింది. అప్పుడు కొంత సమయం కావాలంటూ స్పీకర్‌ తరుపున న్యాయవాదులు సమయం కోరారు. అదే సమయంలో ఇంకెంత కాలం కావాలంటూ సుప్రింకోర్టు ప్రశ్నించింది. సరైన సమయం చూసి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్‌ తరుపు న్యాయవాదులు చెప్పడంతో, సరైన సమయం అంటే ఎంత కాలం..పుణ్యకాలం వెళ్లిపోయేంత వరకా? అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 22 డెడ్‌ లైన్‌ పెట్టింది. దాంతో స్పీకర్‌ కార్యాలయం ఈ నెల22లోపు ఏదో ఒక సమాధానం చెప్పలేని పరిస్ధితి ఎదురైంది. ఆలోపు తాము పార్టీ మారలేదంటూ కొంత మంది ఎమ్మెల్యేలు సుప్రింకోర్టుకు వ్యక్తిగతంగా లిఖితపూర్వక సమాదానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పీకర్‌తోపాటు, ఎమ్మెల్యేలకు కూడా సుప్రింకోర్టు విడివిడిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాము పార్టీలోనే వున్నామని, కాకపోతే అభివృద్దిపనులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం మాత్రమే జరిగిందని నోటీసులకు సమాదానం చెప్పినట్లు కూడా సమాచారం. అయితే ఈ సమాధానాలు సుప్రింకోర్టు అంగీకరిస్తుందా? బిఆర్‌ఎస్‌ పార్టీ తరుపున న్యాయవాదులు ప్రశ్నించకుండా వుంటారా? ఎమ్మెల్యేలుకండువాలు మార్చకున్న ఫోటోలు, వీడియాలో సుప్రింకోర్టుకు సమర్పించకుండా వుంటారా? అయితే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఒకడుగు ముందుకేసి కాంగ్రెస్‌ పార్టీ నుంచి సికింద్రాబాద్‌ ఎంపిగా పోటీచేశారు. బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయలేదు. ఎమ్మెల్యే పదవిని వదులుకోలేదు. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎంపి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ తరుపునపోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై ఖచ్చితంగా వేటు పడుతుందని అంటున్నారు. ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా వేటు పడుతుందనే అనుకుంటున్నారు. ఆయన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా బిఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. తన కూతురుకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపి టికెట్‌ తెచ్చుకున్నారు. ఎంపి ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా వుంటూ మరో పార్టీకి ప్రచారం చేయడం తప్పు. అది ఎన్నికల నియమావళికి విరుద్దం. అందువల్ల కడియం శ్రీహరి ఎన్నిక రద్దయ్యే అవకాశం లేకపోలేదు. ఇక మిగతా ఎమ్మెల్యేలలో కొంత మంది మళ్లీ బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకునేందుకు సిద్దంగా వున్నారు. అయినా బిఆర్‌ఎస్‌ ఎప్పుడో డోర్స్‌ క్లోజ్‌ చేసింది. వారికి శిక్ష పడాలనే కోరుకుంటోంది. రాజకీయాల్లో కక్షసాదింపులు, వేధింపులు కొత్త కాదు. రాజకీయాలు పుట్టిన నాటి నుంచే వున్నాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే రాజకీయాలలో ఎదుగుతారు. ఇవన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి ఎవరూ రారు. సామాన్యంగా క్షేత్ర స్దాయి రాజకీయాలను చేసే వారే అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయినా తట్టుకొని పార్టీకోసం పనిచేస్తారు. అలాంటిది ఎమ్మెల్యే స్ధాయి నాయకులు కూడా తమ స్వలాభాపేక్ష కోసం పార్టీ మారడాన్ని ఎవరూ సహించరు. ఈ సంగతి ఇలా వుంటే పది స్ధానాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ స్ధానాలలో ఎవరిని నిలబెట్టాలన్న దానిపై కూడా బిఆర్‌ఎస్‌లో చర్చల మీద చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతే కాకుండా ఈ పది సీట్లలో ఉద్యమ కారులను నిలబెట్టి, బిఆర్‌ఎస్‌ ఉద్యమకారుల పార్టీయే అని మరోసారి నిరూపించాలని అనుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ పేరు మారినా తెలంగాణ ఆత్మ నిండా నింపుకొని వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌ మాత్రమే అని ఇతర పక్షాలకు తెలిసొచ్చేలా చేయాలని అనుకుంటున్నారు. అందుకే అవకాశ వాదులకు కాకుండా ఉద్యమ కారులైన బిఆర్‌ఎస్‌ నాయకులకు ఈసారి పది టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ కోరుకుంటోంది. బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ కూడా అదే అనుకుంటున్నారు. దాంతో ఆశావహులు పెరుగుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాలలో నాయకులకు పనులు చేసుకొమ్మని కూడా కేసిఆర్‌ హమీ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఎలాగైనా ఉప ఎన్నికలుతేవాలి. మళ్లీ బిఆర్‌ఎస్‌ ఊపు తగ్గలేదని నిరూపించాలన్న కసితో బిఆర్‌ఎస్‌ వుంది. నాయకులు కూడా అదే స్ధాయిలో పనిచేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో పదికి పది బిఆర్‌ఎస్‌ గెలవకపోతే ఆ పార్టీ బలహీనపడినట్లే అని అనుకోవాల్సి వస్తుంది. ఏ ఒక్క సీటు కోల్పోయినా అంతర్మధనంలో పడాల్సివస్తుంది. వచ్చేనాలుగేళ్లు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఉప ఎన్నికల్లో గెలిస్తేనే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ది పై చేయి అవుతుంది. లేకుంటే అవతలి నుంచి బిజేపి తరుముకొస్తుంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి బలం పెంచుకున్నది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మంచి ఊపు మీద వుంది. బిఆర్‌ఎస్‌ బలహీనపడిరదన్న సంకేతాలు అందితే ఇక బిజేపి దూకుడు పెంచుతుంది. గ్రామ గ్రామాన బలపడుతుంది. బిఆర్‌ఎస్‌ ద్వితీయశ్రేణి నాయకులను ఆకర్షిస్తుంది. ఉప ఎన్నికల్లో ఏమాత్రం బిఆర్‌ఎస్‌ గెలుపుకు అవరోధం ఏర్పడినా, ఒక్క సీటునైనా కాంగ్రెస్‌, బిజేపిలు కైవసం చేసుకుంటే బిఆర్‌ఎస్‌లో ముందడుకున్నా వెనుకడుగే ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకే బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు క్షేత్ర స్ధాయి పర్యటలను మొదలు పెట్టారు. వాటి పర్యవేక్షణ, రాజకీయాలను హరీష్‌రావు దగ్గరుండిచూసుకుంటున్నారు. ఇద్దరు రెండు వైపుల నుంచి రాజకీయాలను కనుసైగల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో వున్న రాజకీయ పరిస్దితులను అవగతం చేసుకునేందుకు బయలు దేరారు. ఇక ఉప ఎన్నికలలో జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే ఆమె జగిత్యాల నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాని త్యాగం చేశారు. కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు ఎమ్మెల్యే సంజయ్‌ పార్టీ మారి, కవితకు అవకాశం కల్పించనట్లైంది. మిగతా స్ధానాలలో ఎవరిని ఎంపిక చేసి రంగంలోకి దింపుతారో చూడాలి. కాని జంపింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ కాంగ్రెస్‌ అవకాశం కల్పిస్తుందా? లేదా అన్నది కూడా తేలాల్సి వుంది. ఎందుకంటే పదవులు ఇచ్చేందుకే కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా లేనప్పుడు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుందన్న గ్యారెంటీ మాత్రం కనిపించడం లేదు. స్వయం కృతాపరాధమంటే ఇదే! మరి.

బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ.!

బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి
____________________
కాంగ్రెస్ నేత మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

Arrested

యుత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ దళితుడైన శాసనసభాపతిని అగౌరవపరుస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ను గౌరపరచడం సిగ్గు చేటాని అన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదని అన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, ఐ ఎన్ టి యు సి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్ , నియోజకవర్గ మహీళ అధ్యక్షురాలు అస్మా నాయకులు ఖాజా మీయ , గౌస్ భాయ్ , ఇనాయత్ , జయరాజ్ , విష్ణువర్ధన్ రెడ్డి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

Arrested
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version