స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేయాలి: ఎమ్మెల్యే, డిసిఎంఎస్ చైర్మన్
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్నారు. గురువారం కోహీర్ మండల కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, బీఆర్ఎస్ శ్రేణులు ఈ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థులకు కార్యకర్తలు అండగా నిలిచి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.