మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు…

మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన మునిగాలా సురేందర్ రావు

పరకాల నేటిధాత్రి

 

 

 

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతు మరణించిన పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి పార్థివదేహానికి తన స్వగ్రామం మండలంలోని వెంకటపూర్ గ్రామంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు మునిగాల సురేందర్ రావు నివాళులు అర్పించారు.మొగిలి మరణ వార్త తెలిసి పరకాల ప్రాంత ప్రజలు తీవ్రంగా విచారాన్ని వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.రాజకీయ నాయకులు,స్థానిక ప్రజలు ఆయన మరణంపై సంతాపం తెలియజేస్తూ,వారి ఆత్మకు శాంతి కలగాలని,కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లంబాడి లపై అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లంబాడి లపై అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదు

◆:- లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ పవర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి గోపాల్ పవర్ మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే ఈ దేశ ములనివాసులు భారత దేశ స్వాతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందినము, 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు, 1931 లో నిజాం రాజులు చేపట్టిన కులగణన లో బంజారా లంబాడిలను గిరిజనుల పట్టికలో చూపించారు 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని లంబాడిలు, సుగాలిలను భారత పార్లమెంట్ ఉభయశభల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఆర్డర్ – 1956 ప్రకారం గిరిజనులుగా గుర్తింపు పొంది గిరిజన జాబితాలో సీరియల్ నెంబర్ 19 గా చేర్చాబడ్డారు అయితే ఒకే రాష్టంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన లంబాడిలను సుమారు 25 సమ త్సరాలు గిరిజన జాబితాలో చేర్చకపోవడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ లంబాడిలను ఘోరమైన అన్యాయం చేసింది అని అన్నారు,1969 కే చందా అధ్యక్షతన వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారి నెత్రు త్వంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభ ల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) యాక్ట్ 1976 (యాక్ట్ no 108 of1976)తేదీ :సెప్టెంబర్ 19, 1976 చట్టం చేసి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను గిరిజన జాబితాలో స

క్రమ సంఖ్య 29 గలో చేర్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ గారు గత శాసన సభ ఎన్నికల్లో లంబాడిల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ తాను గద్దెనెక్కనని అనేక సభలలో ప్రకటించారు. కానీ 2017 లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో హింసత్మక ఘటనకు పాల్పడిన సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లను కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకున్నారు. తేదీ 24/07/2025 నా వీరిద్దరూ లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రిట్ ఫిటిషన్ దాఖాలు చేశారు.ఇది కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే జరిగిందా..? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై బి ఆర్ ఎస్, బీజేపీ ల వైఖరి కూడా ఎటువైపో..? సమాధానం చెప్పాలి అని అన్నారు ఈ కార్యక్రంలో జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు,

తొర్రూరు మండలం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు

తొర్రూరు మండలం ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

 

చీకటయపాలెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాండవుల బిక్షం, బూర్గుల వెంకటమ్మ అలాగే తొర్రూర్ మున్సిపాలిటీకి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త పేర్ల పుల్లయ్య, శమంతుల వేణు అలాగే కంటయపాలెం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త గోనె చిరంజీవి మరియు చింతలపల్లి గ్రామానికి చెందిన కొండం నరసింహారెడ్డి గారి తండ్రి గారు కొండం వెంకట్ రెడ్డి గారు ఇటీవల మరణించగా ఆయా కుటుంబాలను పరామర్శించి వాళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసినివాళులు అర్పించడం జరిగింది.

వీరి వెంట మండల మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య తొర్రూర్ మండల బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ లు పాకనాటి సునీల్ రెడ్డి, శ్రీరామ్ సుధీర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, కాళ్లు నాయక్, రాయిశెట్టి వెంకన్న, ప్యాక్స్ డైరెక్టర్ జనార్దన్ రాజు, కర్నే నాగరాజు, ధరావత్ జై సింగ్, తూర్పాటి రవి ,పేర్ల జంపా, లేగల వెంకటరెడ్డి, మంగళంపల్లి ఆశయ్య, నిమ్మల శేఖర్,పయ్యావుల రామ్మూర్తి, మహిళా నాయకురాలు కనకపూడి సుచరిత ,తొర్రూర్ బి ఆర్ స్ సోషల్ మీడియా అధ్యక్షులు యర్రం రాజు, ఆయా గ్రామాల పార్టీ ముఖ్య నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి…

 ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ?

 

 

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే,

 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని పార్టీలు ఈ అంశం మీద ఒక నిర్ణయానికి రావడం, తమ మద్దతు ప్రకటించడం జరిగాయి. అయితే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన స్టాండ్ ఏంటన్నది చెప్పడంలేదు. ఇప్పుడిది తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల కొన్ని షరతులు పెట్టారు. ఇది రాష్ట్ర రైతుల సమస్యలతో ముడిపడి ఉందన్న కేటీఆర్.. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రధాన విపక్ష పార్టీగా ఉన్నప్పటికీ, ఎన్‌డీఏ, ఇండియా కూటమి రెండింటికీ అదే దూరం పాటిస్తోందని చెప్పుకొచ్చారు. ఆగస్టు 20న కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు 2 లక్ష టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చే కూటమికి మాత్రమే తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ‘కృత్రిమంగా’ సృష్టించిన సమస్య అని కేటీఆర్ ఆరోపించారు. సెప్టెంబర్ 9కు ముందు యూరియా రాష్ట్రానికి రావాలి.. మోదీ ప్రభుత్వం ఇస్తే ఎన్‌డీఏ అభ్యర్థికి, రాహుల్ గాంధీ ఇస్తే ఇండియా అభ్యర్థికి తాము మద్దతిస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని, ఈ విషయమై ఇంకా ఎవరూ మాతో సంప్రదించలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రైతుల హితమే మాకు ప్రధానమని అదే సమయంలో కేటీఆర్ అంటున్నారు. కాగా, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి తెలుగు వాసి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలుగు గౌరవం’ పేరుతో బీఆర్ఎస్‌ మద్దతివ్వాలని కోరారు. కానీ, కేటీఆర్ దీన్ని తిరస్కరించి, ‘రేవంత్ రెడ్డి మూడో తరగతి సీఎం. కాంగ్రెస్ మూడో తరగతి పార్టీ అని విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని.. అసలు కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు.

ఇక, బీఆర్ఎస్ ను ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు కోరుతారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సూటిగా సమాధానమిచ్చారు. తనను అధిష్టానం ఆదేశిస్తే, తప్పక బీఆర్ఎస్ పార్టీని కోరతానని తేల్చి చెప్పారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇస్తుందా.. లేక ఎవరికీ ఇవ్వకుండా మిన్నకుంటుందా అనేది తేలాలి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్…

జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

https://youtu.be/n8XtHC_g77I?si=37zwAlH0YSjCUecg

వారం రోజులుగా కేసీఆర్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను టార్గెట్ చేయడంతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప..

హైదరాబాద్, సెప్టెంబర్ 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి వారం రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌తో.. కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. కవితను సస్పెండ్ చేయటంతో పార్టీ క్యాడర్‌లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమచారం.

మరోవైపు, పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యంగా టార్గెట్ చేయాలని కేటీఆర్ భావిస్తున్నారు. వీటితోపాటు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ‌నెల 10న కొత్తగూడెం, 11న భద్రాచలం నియోజకవర్గాల్లో కేటీఆర్ టూర్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. 13న‌ గద్వాల్ నియోజకవర్గంలో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించాలని కేటీఆర్ భావిస్తున్నారు. దసరా లోపు వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలని కేటీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

‘‘కేసీఆర్‌’’ సంతోషంలో కనిపించేది ‘‘సంతోషే’’!


`‘‘కేసీఆర్‌’’ ఆరోగ్యానికి ఔషదం ‘‘సంతోషే’’!

`చెదిరిపోని చిరునవ్వుతో ‘‘కేసిఆర్‌’’ ఆనందానికి కారణం ‘‘సంతోషే’’!

`పాతిక సంవత్సరాలకు పైగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేస్తున్నాడు.

BRS MP SANTOSH RAO

`అనుక్షణం ఆసరాగా వుంటున్నాడు.

`కుడి భుజమై కాపాడుకుంటున్నాడు.

`సహాయకుడుగా నిరంతర సేవలందిస్తున్నాడు.

`నిరంతరం ‘‘కేసీఆర్‌’’ వెన్నంటే వుంటాడు.

BRS MP SANTOSH RAO

`ఉద్యమ సమయంలో ప్రతి సందర్భంలోనూ ‘‘సంతోష్‌’’ కనిపిస్తారు.

`కన్న తండ్రికి మించి సపర్యలు చేస్తూ వుంటాడు.

`సంతోషమైనా, ఆపదైనా ‘‘కేసీఆర్‌’’ వెనకాలే వుంటాడు.

`ఆసుపత్రిలో వున్నా కన్నపిల్లలకన్నా ఎక్కువగా ‘‘కేసీఆర్‌’’ను చూసుకుంటాడు.

`అలాంటి ‘‘సంతోష్‌’’ సేవలను శంకించడం తగదు.

`అనుక్షణం ‘‘కేసీఆర్‌’’ తన వద్ద ‘‘సంతోషే’’ వుండాలని కోరుకుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్ర లేవక ముందే అక్కడుంటాడు.

`‘‘కేసీఆర్‌’’ నిద్రపోయిన తర్వాత ఇంటికెళ్తాడు.

`‘‘కేసీఆర్‌’’ ను దైవం కన్నా మిన్నగా ప్రేమిస్తాడు.

`జీతం కోసం పని చేసే వారు జీవితం త్యాగం చేయరు.

`తన వ్యక్తిగత జీవితమంతా ‘‘కేసీఆర్‌’’ కోసం త్యాగం చేస్తున్నాడు.

`ప్రతి వ్యక్తికి కుటుంబం వుంటుంది.

`జీవితంలో ప్రతి వ్యక్తి రాణించాలనే అనుకుంటాడు.

`ఆస్థులు, అంతస్తులు కోరుకోని వారుండరు.

`‘‘సంతోష్‌’’ స్థానంలో ఎవరూ ఒక్క రోజు కూడా వుండలేరు.

`‘‘సంతోష్‌’’ లాగా ‘‘కేసీఆర్‌’’ ను కంటికి రెప్పలా ఎవరూ చూసుకోలేరు.

`కన్న పిల్లల కన్నా ‘‘సంతోష్‌’’ ను ‘‘కేసీఆర్‌’’ చూసుకోవడానికి కారణం అదే.

`అయినా రాజకీయ వారసత్వం ‘‘కేటీఆర్‌’’ దే.

`కూతురుగా కుటుంబంలో కీలక స్థానం ‘‘కవిత’’దే.

`ఎంతగా ‘‘కేసీఆర్‌’’ కు సేవ చేసినా ‘‘సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే’’!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

జోగిన పల్లి సంతోష్‌రావు. ఈ పేరు పన్నెండేళ్ల క్రితం వరకు తెలంగాణ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు. తెలంగాణ కీలక ఉద్యమకారులకు, బిఆర్‌ఎస్‌ నాయకులకు, మీడియాలో కూడా కీలకమైన జర్నలిస్టులకు తప్ప పేరు తెలియని నాయకుడు. అలాంటి నాయకుడు తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ సిఎం. అయ్యాక సంతోష్‌ పేరు నిత్యం వినిపిస్తూ వచ్చింది. సంతోష్‌ గురించి కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టిన సమయంలో చాలా మందికి పరిచయం అయ్యారు. కేసిఆర్‌ ఆమరణ దీక్ష చేపట్టి నిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ దీక్ష చేస్తున్న సమయంలో సంతోష్‌ ఏమిటో? ఆయనకు పార్టీలో వున్న ప్రాదాన్యత ఏమిటో? ఆయన ఎవరో? ఆయనకు కేసిఆర్‌ కు వున్న బంధుత్వం గురించి తెలంగాణ ఉద్యమకారులకు తెలిసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత కేసిఆర్‌ తెలంగాణ ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సమయంలో కేసిఆర్‌ వెనుకే నిలబడిన వ్యక్తి సంతోష్‌ అని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుంచి ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతోద్యోగులు సంతోష్‌ గురించి చర్చించుకోవడం అందరం విన్నదే. ఎప్పుడైతే సంతోష్‌ రాజ్యసభ అయిన తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా ఆయనెవరో పూర్తిగా తెలిసింది. అప్పటి వరకు కల్వకుంట్ల కుటుంబానికి చెందిన బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌, కేసిఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్‌రావుల తర్వాత నాలుగో వ్యక్తిగా రాజకీయాల్లో సంతోష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒక దశలో సంతోష్‌ పేరే రాజకీయ, ఉద్యోగ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తూ వచ్చింది. అంతలా సంతోష్‌ గొప్పదనమేముంది? అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరిగింది. బిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ముందు సంతోష్‌కు అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజ్యసభకు ఎంపిక చేశారు. అందరూ అవాక్కయ్యారు. ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. అసలు సంతోష్‌కు రాజకీయాలకు ఏం సంబంధం అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు కేసిఆర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంతోష్‌ గురించి చెప్పడం జరిగింది. సంతోష్‌ కూడా ఆదినుంచి ఉద్యమంలోనే వున్నారనే విషయం వెల్లడిరచారు. అంతే కాకుండా ఉద్యమ నాయకుడుగా తనను కాపాడుకునే బాద్యత తీసుకున్నాడు కేసిఆర్‌ చెప్పారు. కేసిఆర్‌ను తెలంగాణ ఉద్యమం మొదలై, 2004 ఎన్నికల సమయం నుంచి సంతోష్‌ డిల్లీలో కేసిఆర్‌కు తోడుగా వుండడం మొదలు పెట్టారు. తెలంగాణలో హరీష్‌రావు, డిల్లీలో కేసిఆర్‌ వున్నప్పుడు సంతోష్‌ చూసుకుంటూ వచ్చారు. ఇలా ఇరవై ఐదు సంతవ్సరాలుగా కేసిఆర్‌ యోగ క్షేమాలు చూసుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌ ఎప్పుడు ఎవరిని కలవాలి. ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి. కేసిఆర్‌ ఎప్పుడు ఏం తినాలి. మందులు వేసుకోవాలి. అని ప్రతిపతి క్షణం కనిపెట్టుకుంటూ, కేసిఆర్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కేసిఆర్‌ తనకు ఎప్పుడు ఏ మందులు కావాలో, ఇవ్వాలో చూసుకుంటాడు. అని చెప్పినప్పటినుంచి ప్రతిపక్షాలు సంతోష్‌ను అనేక రకాలుగా ఎగతాళి చేస్తూ వచ్చారు. వివాదాలు సృష్టిస్తూ వచ్చారు. అయితే బిఆర్‌ఎస్‌ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత సంతోష్‌ మీద కుట్రలు చేసిన వారు కూడా చాల మంది వున్నారు. కవిత లాంటి వారు కూడా తమకు కేసిఆర్‌ అప్పాయింటు మెంటు ఇవ్వకుండా సంతోష్‌ను అడ్డుకుంటున్నాడంటూ కూడా సన్నిహితుల వద్ద చెప్పిన సందర్భాలున్నాయి. ఇలా అనేక విమర్శలు కూడా సంతోష్‌ ఎదుర్కొన్నారు. కేసిఆర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే సంతోష్‌ ఇక్కడ ఆస్ధులు సంపాదించాడు. అక్కడ ఆస్ధులు కొనుగోలు చేశాడంటూ కూడా అనేక వర్తాలు వచ్చేవి. వాటిని ఎవరు లీక్‌ చేసేవారో ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటే కవిత నేరుగా సంతోష్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతోంది. సంతోష్‌ను వేలెత్తి చూపిస్తోంది. కాని తన తండ్రి ఇప్పటికీ ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా, ఆరోగ్యంగా వుండడానికి కారణం సంతోష్‌ అని తెలియదా? సంతోషంగా వున్నప్పుడు ఎవరి గురించి తెలియదు. కాని బాదల్లో వున్నప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. బిఆర్‌ఎస్‌ అదికారంలో వున్న పదేళ్లకాలంలో సంతోష్‌ రావు తన కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లినట్లు గాని, కుటుంబంతో కలిసి ఏవైనా ఫంక్షన్లకు వెళ్లినట్లు గాని ఒక్క ఫోటో బైటకు రాలేదు. కాని కవిత కుటుంబం గురించి అనేక వార్తలు వచ్చాయి. కేసిఆర్‌ సిఎం. అయిన తర్వాత ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఆసుపత్రిలో కనిపించే ఏకైక నాయకుడు సంతోష్‌. కేసిఆర్‌ ఎన్ని రోజులు ఆసుపత్రిలో వుంటే అన్ని రోజులు కూడా ఆసుపత్రిలోనే వుంటూ ప్రతి క్షణం కాపాడుకునే నాయకుడు సంతోష్‌. ఈ మధ్య అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కేసిఆర్‌ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఎదురైనా ఆయనను కన్న తండ్రికన్నా ఎక్కువగా చూసుకుంటున్న ఏకైక వ్యక్తి సంతోష్‌. తన తండ్రి కేసిఆర్‌ను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా కేటిఆర్‌, కవితలు కూడా చూసుకునేవారు కాదు. ఎవరికైనా వ్యక్తిగత జీవితం వుంటుంది. పుట్టిందే జీవితాన్ని గొప్పగా అనుభవించడానికి, కాని సంతోష్‌ లాంటి వ్యక్తికి అన్నీ కళ్లముందు వున్నా అనుభవించలేని జీవితాన్ని గడుపుతున్నాడని ఎంత మందికి తెలుసు. అది అనుభవించేవారికే తెలుస్తుంది. మన కుటుంబ సభ్యులు, కన్న తల్లిదండ్రులైనా సరే ఒక్క రోజు ఆసుపత్రిలో వుంటే చూసుకోవాలంటే చిరాకు పడిపోతాము. అలాంటిది ఒక కేసిఆర్‌ను పట్టుకొని పాతిక సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంతోష్‌పై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేయడాన్ని తెలంగాణ సమాజం కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఇది కవిత గమనించాలి. సంతోష్‌ను విమర్శించి కవిత తప్పు చేసిందని బిఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. కుటుంబ సమస్యను కవిత బజారున పడేయడమే కాకుండా కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ను విమర్శిండం సరైంది కాదంటున్నారు. అంటే కేసిఆర్‌ సంతోషంగా వుండడం కవితకు ఇష్టం లేదా? కేసిఆర్‌కు సంతోష్‌ను దూరుం చేస్తారు? సరే..మరి కేసిఆర్‌ను సంతోష్‌లగా చూసుకునే వ్యక్తిని తేగలరా? రాజకీయాలు వదిలేసి కవిత తండ్రి కేసిఆర్‌ను చూసుకోగలరా? ఇవి ఇప్పుడు బిఆర్‌ఎస్‌లో జరుగుతున్న చర్చ. కేసిఆర్‌ ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తున్న సంతోషే అసలైన ఔషదం అని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. రోజూ ఎంత పని ఒత్తిడిలో వున్న చెరగని చిరునవ్వుతో కనిపించే సంతోష్‌ వల్లనే కేసిఆర్‌ ఆర్యోగంగా ఆనందంగా వుండగలుగుతున్నాడని అంటుంటారు. దేవుడికైనా గుడిలో సేవ చేసే పూజారి కూడ కొంత సమయమే వెచ్చిస్తాడు. కాని కేసిఆర్‌ను కంటికి రెప్పలా కాపాడుకునే సంతోష్‌ ఇరవైనాలుగు గంటుల కేసిఆర్‌ వెంటే వుంటారు. కేసిఆర్‌ వెన్నంటే వుంటారు. కేసిఆర్‌ కోసం జీవితమే త్యాగం చేశారు. తనను కన్న తండ్రిలా చూసుకున్న సంతోష్‌ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా కేసిఆర్‌ చూసుకుంటూ వస్తున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లుగా కంటేనే అమ్మ అని అంటే ఎలా? అన్నట్లు కేసిఆర్‌ను ఎంతో ప్రేమతో సేవలు చేస్తున్న సంతోష్‌ అంటే కూడా కేసిఆర్‌కు అంత ప్రేమ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక జీవితం వుంటుంది. కుటుంబం వుంటుంది. కాని సంతోష్‌కు జీవితం, కుటుంబం కూడా కేసిఆరే అయ్యారు. కేసిఆర్‌ను దేవుడిగా కొలుస్తూ సేవలు చేస్తున్నాడు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రకంగా రాణించాలనే వుంటుంది. ఎక్కడో జీవితం ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఆస్ధులు, అంతస్ధులు సంపాదించుకోవాలని అనుకుంటారు. కాని కేసిఆర్‌కు సేవ చేయడమే తన జీవితానికి గొప్ప అనుకోవడం సామాన్యమైన విషయం కాదు. అయినా సంతోష్‌ ఎప్పుడూ కేసిఆర్‌కు రాజకీయ వారసుడు కాదు. కుటుంబంలో కవిత కన్నా కీలకమైన స్దానం కూడా కాదు. కేసిఆర్‌కుఎంతసేవ చేసినా సంతోష్‌ ఎప్పటికీ చుట్టమే తప్ప, వారసుడు కాలేడు. ఈ సత్యం సంతోష్‌కు తెలియంది కాదు. కవితకుతెలియంది కాదు. అయినా సంతోష్‌ను వేలెత్తి చూపి ఆయన మనసు గాయపర్చడం అంటే కేసిఆర్‌ మనసు కష్టపెట్టడమే అవుతుంది. ఇప్పటికైనా కవిత ఈ సంగతి తెలుసుకోకపోవడం విడ్డూరం. ఏది ఏమైనా సంతోష్‌ లాగా కేసిఆర్‌కు సేవలు చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అంత ఓపిక వున్న వారు ఎవరూ వుండరు. ఈ విషయంలో సంతోష్‌ ఈస్‌ గ్రేట్‌ అని అందరూ అనాల్సిందే.

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123441.263.wav?_=1

ప్రాంతీయ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి :

◆:- యువనేత మొహమ్మద్ ముర్తజా

జహీరాబాద్ నేటి ధాత్రి:

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ కలిసి మన ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రము సాధించిన బిఆర్ఎస్ పార్టీ ని లేకుండా చేయాలని చేస్తున్న కుట్రలు సాగవు కెసిఆర్ కాళేశ్వరం నిర్మించి అపర భగీరతుడు అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాటకాలు గట్టిగ ఎండగట్టాడు మరియు వీళ్ళ ఆటలు సాగాలేవు అందుకని కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ బీజేపీ లు కలసి కవిత ని కేసులు పేరుతో బెదిరించి పావుగా చేసి ఆడిస్తున్న నాటకం.
ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ లేకుండా చేసే కుట్ర ఇది.జాతీయ పార్టీ రాష్ట్రము లో అధికారం లో ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ చెప్పు చేతల్లో, ఢిల్లీ కి గులాం గిరి చేయిస్తారు, స్వతంత్ర నిర్ణయం తీసుకొనే అధికారం వీళ్లకు ఉండదు.
జాతీయ పార్టీల కన్నా, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, అవసరాలు, ప్రాధాన్యతలు ప్రాంతీయ పార్టీ బిఆర్ఎస్ కె బాగా తెలుసు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ప్రాజెక్టులు, పథకాలు, నిధుల కోసం కేంద్రం దగ్గర బలంగా డిమాండ్ చేయగలదు.
స్థానిక సంస్కృతి, భాష, ఆర్థిక వ్యవస్థ, రైతాంగం, పరిశ్రమలు వంటి అంశాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ దృష్టి ప్రాధాన్యత ఇస్తుంది.ప్రజల్లారా జాగ్రత్త బిఆర్ఎస్ పార్టీ మన ప్రాంతీయ పార్టీ, అందరు కలసి కట్టుగా మన ప్రాంతీయ పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సిన సమయం ఇది, లేదంటే శాశ్వతంగా ఢిల్లీ గులాముల చేతిలో రాష్టం బందిగా ఉంటుంది.

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

కాంగ్రెస్‌లో ఉంటే.. కిరాయి ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది..

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన స్పీకర్‌ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన పదిమంది ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోటీసులపై తాజాగా.. మరోసారి గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ నోటీసులకు తాను రిప్లై ఇచ్చినట్లు తెలిపారు. తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని.. అదే విషయాన్ని స్పీకర్‌కు ఇచ్చిన రిప్లైలో చెప్పానని స్పష్టం చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో తాను పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గ పనులు జరుగుతాయని కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. కానీ పార్టీ మారి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో.. ఉంటే కిరాయి ఇంట్లో ఉన్నా అనే ఫీలింగ్ ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, హరీష్ రావు తనతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో భాగంగా పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసుల్లో పేర్కొనలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువు లోపల పది మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్‌ నిర్ణయం ప్రకటిస్తారా..? లేక పెండింగ్‌లో పెడతారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డుల్లోనూ పది మంది ఎమ్మెల్యేలూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. సుప్రీంకోర్టు గడువు ముగిసేలోపు స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

 ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు…

 ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు

 

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి….

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజలపాలిట సమస్యగా మారుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింప జేసుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2004 నుంచి ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెర్రితలలు వేస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో శాసనసభ్యులకు అపరిమిత స్వేచ్ఛను ఇవ్వడంతో వారు ప్రభుత్వ కార్యాలయాలను తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకూ అదే ఆదర్శమైంది. గతానికి భిన్నంగా ఈ జాడ్యం ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించింది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వారిని ఉద్దేశించి, వాటి గురించి స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు చెప్పాలని సూచించేవారు. ఇది ప్రజలకు రుచించలేదు. అది వేరే విషయం! 1983కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికి ఉండేది కాదు. అక్కడి ప్రజా సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించేవి. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కారు. ఎమ్మెల్యేలను కలుసుకోగలిగే పరిస్థితి జిల్లా స్థాయిలో కొద్దిమందికే ఉండేది. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లను కలుసుకోవడం అరుదైన అవకాశంగా ఉండేది. అలా కలుసుకోగలిగిన వారికి పలుకుబడి ఉన్నట్టు పరిగణించేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగక తప్పలేదు. ఫలితంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను, కుటుంబ పంచాయితీలను పరిష్కరించవలసిందిగా కూడా ఎమ్మెల్యేలను కోరేవారు. మొగుడూ పెళ్లాల పంచాయితీలు తామెందుకు పరిష్కరించాలని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు విసుక్కొనేవారు. హైదరాబాద్‌లో ఉండే తమ ఎమ్మెల్యేలను తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు వచ్చి కలుసుకొని బాధలు చెప్పుకొనేవారు. కొంతమందైతే తిరుగు ప్రయాణాలకు చార్జీలు ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యేలను కోరేవారు. తమను కలవడానికి వచ్చిన వారికి కాఫీ, టీలు తాగించడంతో పాటు భోజనం, వసతి కూడా ఏర్పాటు చేయవలసి రావడంతో శాసనసభ్యులు ఆర్థికంగా నలిగిపోయేవారు. పెళ్లిళ్లు, చావులకు వెళ్లడం విధిగా మారింది. అదే సమయంలో ఖర్చుల కోసం డబ్బు కూడా డిమాండ్‌ చేసేవారు. తెలంగాణలో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది. కొంత కాలం క్రితం ఒక లారీ డ్రైవర్‌ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి తాను డ్యూటీ మీద దూరంగా ఉన్నాననీ, పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి ప్రసవం చేయించవలసిందిగా కోరారు. ఇలాంటి విచిత్రమైన అనుభవాలను శాసనసభ్యులు గతంలో పంచుకొనేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా, దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది.

రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తిచేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ వ్యవహారం మంత్రి, ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్దిచెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులు ఏరుకోవడానికి ప్రయత్నించినట్టుగా లేదా? కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో ఒకరికొకరు ఆదర్శం అయ్యారు. ఫలితంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ కట్టాలన్నా శాసనసభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. దీంతో యావత్‌ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ, మరోవైపు భూ కబ్జాలు, దందాలలో ఎమ్మెల్యేలు మునిగితేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థులను మార్చకుండా పాతవాళ్లు అందరికీ టికెట్లు ఇచ్చారు. అప్రతిష్ఠపాలైన శాసనసభ్యులను మార్చి ఉంటే కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం భారత రాష్ట్ర సమితి ముఖ్యులలో ఇప్పటికీ ఉంది.

మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు…

మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ నాయకులు

గణపతి మండపంలో ఘనంగా పూజలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 10 వార్డు పోచమ్మ ఆలయంలో పోచమ్మతల్లి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ,ఆ వార్డు మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేపట్టి మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు హాజరైయ్యారు.పూజారి రామకృష్ణ ప్రత్యేక పూజలు చేపట్టారు. మాజీ కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని గణనాధున్ని వేడుకొన్నట్లు తెలిపారు.ఈ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట్ నారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ గోపాల్, డాక్టర్ శీలం సత్యనారాయణ, బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, మాజీ కౌన్సిలర్ మండల శ్రీనివాస్, కడారి కుమారస్వామి, ఎల్ల స్వామి, బిక్షపతి, పి.కృష్ణ,స్థానిక వ్యాపారులు బండి సుధాకర్, శ్రీనివాస్,కోడమ్ సారంగం, నాగిశెట్టి ప్రవీణ్ తదితరులు స్థానికులు పాల్గొన్నారు.

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ…

గుండంపల్లి లో గులాబీ పార్టీ కి పెద్ద దెబ్బ

కొత్తగూడ, నేటిధాత్రి:

 

సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరిక బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి & క్లస్టర్ ఇంచార్జి ఆధ్వర్యంలో… పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క. ..ములుగు అసెంబ్లీ, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి లో బిఆర్ఎస్ పార్టీ కి స్థానిక ఎన్నికల ముందు కోలుకోలేని దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ & క్లస్టర్ ఇంచార్జి వారి ఆధ్వర్యంలో నేడు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ చేరిక ..

వీరికి మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు

పార్టీలో చేరిన వారు
గట్టి బాబు ( నర్సయ్య ) మాజీ సర్పంచ్ తిమ్మాపూర్.
దానం నారాయణ వార్డ్ మెంబర్ గుండంపల్లి
రమేష్ సీనియర్ కార్యకర్త.
జాటోత్ తేజ గుండంపల్లి
భూక్య నాగులు గుండంపల్లి వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాగానే నిస్వార్ధంగా ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను అందించిన ఘనత రేవంత్ సర్కార్ ది మాత్రమే ..
ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని
మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వారి భవిష్యత్ కార్యాచరణ కోసం మహిళా సంఘాలను బలోపేతం చేశారు వడ్డీ లేని రుణాలు ఇచ్చారు వ్యవసాయ రంగంకు దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న వడ్ల కు 500 బోనస్ వరి మద్దతు ధర నిరుపేదలకు రేషన్ నూతన కార్డులను అందించి అర్హులందరికీ సన్న బియ్యం.. అందించిన ఘనత రేవంత్ సర్కార్ ..!
ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు.. ఎన్నడూ లేనివిధంగా కొత్తగూడ లో దూసుకుపోతున్న పలు అభివృద్ధి పనులు
కెసిఆర్ ఇవ్వలేనిది ప్రతి గ్రామానికి ఆనాడైనా ఈనాడైనా నిరుపేదలకు గూడు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్న సంగతి విదితమే.. వ్యవసాయ రంగంతో పాటు నిరుపేద గృహాల వెలుగులను నింపుతున్న ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలకు ఆకర్షిణితులై కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరుగుతుందని అన్నారు ములుగు నియోజకవర్గానికి సీతక్క ఎమ్మెల్యేగా .. రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులు గా ఉంటూ ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నిస్వార్ధంగా సేవలను అందిస్తున్న మంత్రి సీతక్క ఉండడం మన అదృష్టం అందుకే కాంగ్రెస్ పార్టీలో సగర్వంగా చేరుతున్నామని అన్నారు
ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ములుగు (అసెంబ్లీ ) జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.
కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు సుంకరబోయిన మొగిలి.
జిల్లా సీనియర్ నాయకులు వీరనేని వెంకటేశ్వరరావు
జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రూఫ్ సింగ్.
( గుండంపల్లి క్లస్టర్ & కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్ )
వల్లపు రంజిత్, వద్ది సోమయ్య, లక్కాకుల రాజు, గట్టి రమేష్ తోట మాధవలు బానోతు బాలు తదితరులు పాల్గొన్నారు

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు..

ప్రజా ప్రభుత్వంలో.. రైతుల కడగండ్లు

రైతు శ్రేయస్సును మరిచిన.. కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను రాజును చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది.

రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్.

బాలానగర్ /నేటి ధాత్రి

బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి వాల్యా నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతుకు ఇబ్బందులు కలగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను గాలికి వదిలేసారన్నారు. సకాలంలో ప్రభుత్వం స్పందించి త్వరితగతిన రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ఆలస్యం జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రజా ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరడం లేదన్నారు. ఆరు గ్యారెంటీ ల పథకాలు అమలు కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్ల అవినీతి అవస్తమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. వచ్చే మూడేళ్ల తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ కమల, లక్ష్మయ్య, గోపి నాయక్, లక్ష్మణ్ నాయక్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T153331.404.wav?_=2

 

మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం

పరకాల నేటిధాత్రి

 

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.సోమవారం బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ సమన్వయ కమిటీ నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ప్రజలలో బిఆర్ఎస్ కున్న అభిమానాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి మనలో మనకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని అతడికి ప్రతి ఒక్కరం సహకరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పిఎసిఎస్ చైర్మన్ నాగయ్య,సమన్వయ కమిటీ సభ్యులు ఆముదలపెల్లి అశోక్,కోరే రమేష్,మండల యూత్ అధ్యక్షులు శాతరాశి సనత్ పటేల్,గ్రామ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ వద్దిరాజుకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T150954.169-1.wav?_=3

 

ఎంపీ వద్దిరాజుకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది
Date 25/08/2025

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు ఆయన సిబ్బంది వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి సందర్భంగా ఎంపీ రవిచంద్ర వ్యక్తిగత సిబ్బంది బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసం వద్ద నవరాత్రోత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముకుంద అనిల్ పటేల్,మల్యాల శేఖర్,ముడ్డంగుల కృష్ణ,గుగులోతు నవీన్,యరగాని పృథ్వీ,అనంతుల శ్రీనివాస్,ధూదిగామ సాత్విక్ తదితరులు ఎంపీ రవిచంద్రను సోమవారం కలిశారు.ఈ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గణనాథునికి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావలసిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్రను వారు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

చర్లలో యూరియా కొరతపై ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-76.wav?_=4

చర్ల మండల రైతాంగానికి యూరియా అందించండి

బిఆర్ఎస్ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్

నేటిదాత్రి చర్ల

బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు చర్ల మండల కేంద్రంలోని అగ్రికల్చర్ కార్యాలయం ముందు పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో యూరియా కొరతపై ధర్నా నిర్వహించి అనంతరం అగ్రికల్చర్ ఏఓ లావణ్య కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెసు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని
రైతులకు మోసపూరిత హమీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెసు ప్రభుత్వం నట్టేట ముంచుతుంది ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం వలన యూరియా సరఫరా సక్రమంగా జరగక పోవడంతో రైతులు రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఏర్పడింది
పంటలు పండక పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు కనీసం యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రైతుల పట్ల కాంగ్రెసు ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది
రైతు రుణ మాఫీ రైతులందకి చేయలేదు
రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు
రైతు బీమా లేదు
నీళ్ళు లేవు కరెంటు లేదు అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు
కెసిఆర్ 9 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు యూరియా ఇబ్బందులు లేవు ఇప్పటికైన ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా అందించాలని లేని ఎడల రేపు రాబోయే ఎన్నికల్లో రైతులు ఓటు ద్వారా బుద్ది చెబుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు తడికల బుల్లబ్బాయి డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొంబత్తిని రాము బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు అంబోజీ సతీష్ కారం కన్నారావు సాదిక్ కట్టం కన్నారావు రత్నాల శ్రీరామ్మూర్తి బట్ట కొమరయ్య తడికల చంద్రశేఖర్ సంతపూరి సతీష్ ఎడ్ల రామదాస్ గాదం శెట్టి కిషోర్ కుక్క డపు సాయి గుమ్మల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్.

స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్

 

మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హైదరాబాద్, ఆగస్టు 24: 10 ఏళ్ల పాటు అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు సైతం ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది. అయితే మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనున్నాయి. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆ ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకొంటుంది.

అలాగే ప్రజల మధ్యకు వెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటిలోకి చేరారు. అలాంటి నియోజకవర్గాలపై పార్టీ అగ్రనాయకత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించింది.

దీంతో ఆ యా నియోజకవర్గాలకు చెందిన పార్టీ కేడర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఆదివారం.. అంటే ఆగస్టు 24వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కేడర్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ రోజు ఉదయం 11.00 గంటలకు మియాపూర్‌లోని నరేన్ గార్డెన్స్‌లో నేతలు, కార్యకర్తలతో కేటీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పార్టీ ఇన్ ఛార్జ్‌ను కేటీఆర్ ప్రకటించనున్నారు. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అరికేపూడి గాంధీ.. బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ నియోకవర్గాల కేడర్‌తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి.. ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆదేశించినట్లు ఓ చర్చ అయితే సాగుతోంది.

విచారణ పేరుతో కాలయాపన తగదు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T104839.140.wav?_=5

విచారణ పేరుతో కాలయాపన తగదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ గతంలో డబుల్ బెడ్ రూమ్ ల పట్టాలు అందజేసి విచారణ పేరుతో 132 లబ్ధిదారులకు తాళాలు అందజేయకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు నామరవికిరణ్ బండి మోహన్ ఆరోపించారు. ఆగస్టు 14 నాడు ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్ జరిగిన సభలో స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ రెవెన్యూ అధికారులు వారం రోజులలో తాళాలు ఇస్తామని గతంలో మాట ఇవ్వడం జరిగింది. వారు చెప్పి వారం రోజుల సమయం నిన్నటితో పూర్తయింది ఇట్టి విషయమై ఈరోజు లబ్దిదారులతో కలిసి స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ వద్ద లబ్ధిదారులకు తాళాలు వెంటనే ఇవ్వాలని ఆందోళన చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నాయకుడు నామ రవి కిరణ్ మాట్లాడుతూ లబ్ధిదారులకు వెంటనే తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, విచారణ పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదు అన్నారు గతంలో ఉన్న ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలు అందజేస్తే, కనీసం వారిపై కనికరం లేకుండా తాళాలు అందించకుండా వారికి ఇబ్బందులను గురి చేయడం సరైన పద్ధతి కాదు అన్నారు ఇట్టి విషయమై డిప్యూటీ తాసిల్దార్ ఇంకొక వారం రోజులు తప్పనిసరిగా లబ్దిదారులకు తాళాలు అందజేస్తామని చెప్పారు వారం రోజుల్లో తాళాలు తీయని యెడల లబ్ధిదారులు నేరుగా వారికి గతంలో కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించడం జరిగింది కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు శివప్ప, నాయకులు గణేష్ చంద్రయ్య విద్యార్థి విభాగం నాయకుడు రాకేష్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T104227.530.wav?_=6

 

బిఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ బయ్య రాజేందర్ శనివారం రోజున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.ఈ సందర్బంగా రాజేందర్ కు మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,మాజీ వైస్ ఎంపీపి చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి,మండల పార్టీ నాయకులు,యూత్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T140048.960.wav?_=7

బీజేపీ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్లలో బీజేపీ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టు దృష్ట్యా మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ
రాష్ట్రంలో కొన్ని వర్గాల వారు మార్వాడీ గో బ్యాక్ అనే కృత్రిమ ఉద్యమంతో తెలంగాణలో అశాంతికి ప్రయత్నిస్తున్న సమాచారంతో అలాంటి దుశ్చర్యలకు పాల్పడే వర్గాలను వదిలేసి బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు
ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు ప్రాంతీయ తత్వం అంటగట్టి , బతుకుదెరువు కోసం రాష్ట్రానికి వచ్చి ఇక్కడి సమాజంతో కలిసిమెలిసి జీవిస్తున్న మార్వాడీ లపై కొన్ని వర్గాలు ముఖ్యంగా హిందూ వ్యతిరేక భావజాలం గల శక్తులు, కమ్మ్యూనిస్ట్ భావజాలం గలవారు, ప్రాంతీయతత్వం లేకపోతే పబ్బం గడవని బిఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు ద్వేషాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.

పది రోజుల కింద హైదరాబాద్ లో మహబూబ్నగర్ కి చెందిన ఒక హిందూ కట్టెల వ్యాపారి మూలంగా తమ వ్యాపారం సరిగా జరగట్లేదని నలుగురు ముస్లింలు ఆ మహబూబ్నగర్ వ్యక్తిని హత్య చేసారు. ఆ హత్య పై ఇప్పుడు మార్వాడీ గో బ్యాక్ అని కృత్రిమ ఉద్యమానికి ప్రయత్నం చేస్తున్న ఈ హిందూ ద్రోహూలు ముస్లిం గో బ్యాక్ అని ఉద్యమం చేయలేదు. ఈ హిందూ ద్రోహులు ప్రాంతీయవాదులు ఎప్పుడూ ‘రోహింగ్యా గో బ్యాక్ బంగ్లాదేశీ గో బ్యాక్ లేదా పాకిస్తానీ గో బ్యాక్ అని ఉద్యమాలు చేయలేదు కానీ దేశ భక్తులైన మార్వాడీలను గో బ్యాక్ అంటున్నారు అంటే వాళ్ల నిజస్వరూపం ప్రజలు గ్రహించాలి.
దేశం అందరిది, ఎవరైనా ఎక్కడైనా జీవనం కొనసాగించవచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు, బతుకుదెరువు చూసుకోవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. మండలంలో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడి ప్రజలతో కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న వారికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అరెస్టు అయిన వారు మండల ప్రధాన కార్యదర్శి గాజుల అజయ్ మండల నాయకులు చిలుక ప్రణీత్ దానవీని చిన్న కుమార్ తదితరులు అరెస్టుఅయ్యారు

నారాయణపూర్ పై రవిశంకర్ ను కాంగ్రెస్ ధ్వజమెత్తింది..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-54-3.wav?_=8

నారాయణపూర్ పై మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ కు లేదు

ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్

ఐదేళ్లు నారాయణపూర్ ప్రజలకు ముఖం చూపించకుండా తప్పించుకు తిరిగిన చరిత్ర నీది కాదా?

రైతు సమస్యలు, ప్రజా సంక్షేమంపై పూర్తి అవగాహన ఉన్న గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి కోసం రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ది

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్

గంగాధర మండలం మధురానగర్ ప్రజా కార్యాలయంలో విలేకరుల సమావేశం

గంగాధర నేటిధాత్రి :

గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు లేదు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నారాయణపూర్ నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ఘనుడు రవిశంకర్, నారాయణపూర్ నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ఐదేళ్లు మొఖం చాటేసిన ఘన చరిత్ర ఆయనది. సాగునీరు అందించి పంటలు ఎండిపోకుండా కాపాడాలని కోరితే, రాళ్ల వర్షం పడి పంట నష్టపోయాం అనుకోవాలని రైతులకు నిర్లక్ష్యమైన సమాధానమిచ్చిందెవరో రైతులు మరచిపోరన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఏనాడైనా సకాలంలో నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయించిన చరిత్ర నీకుందా, పంటలు సాగు చేయడానికి ముందే నారాయణపూర్ రిజర్వాయర్ కు సాగునీటిని విడుదల చేయించి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులకు న్యాయం చేయలేక పోయింది. అబద్ధపు హామీలు పబ్బం గడుపుకోవడం తప్ప చేసింది ఏమీ లేదు. నారాయణపూర్ నిర్వాసితులకు ఒక్క రూపాయి పరిహారమైన ఇప్పించావా, పుట్టిన ఊరు అని చెప్పుకునే నువ్వు నారాయణపూర్ గ్రామానికి ఏం చేశావు, మధురానగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా. చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాది కాలంలోనే నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి, పరిహారం కోసం రూ.43 కోట్లు మంజూరు చేయించిన గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రైతు సమస్యలపై, సంక్షేమంపై అవగాహనతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారు. ఫోటోల కోసం ఫోజులు ఇస్తూ, వాటిని పేపర్లో చూసుకుంటూ మురిసిపోవడం తప్ప మాజీ ఎమ్మెల్యే రవిశంకర్కు ఏమి చేతకాదు అని నిరూపితం కావడంతోనే, చొప్పదండి నియోజకవర్గం ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారం మానుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బసి బుచ్చన్న,జాగిరపు శ్రీనివాస్ రెడ్డి,బూర్గు గంగన్న, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి,రోమాల రమేష్, సాగి అజయ్ రావు,వేముల అంజి,మంత్రి మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version