పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు…

పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాలు
* నెలరోజుల పాటు ఉచిత టీకాలు
* పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
* వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు

మహాదేవపూర్ అక్టోబర్ 15 (నేటి ధాత్రి)

 

జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా పాడి పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి టీకాల కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజబాబు ఒక ప్రకటనలో బుధవారం రోజున తెలిపారు. మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికొంటువ్యాధి టీకా కార్యక్రమం అక్టోబర్ 15 నుండి నవంబర్ 14 రోజుల వరకు అనగా నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇది జాతీయ జంతు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అమలవుతుందని దీనిని మండలంలోని పాడి రైతులు అందరూ సద్వినియోగ పరచుకోవాలని కోరారు. మండలం మొత్తం మీద మూడు టీంలు ఏర్పాటు చేసి వ్యాధి నివారణ టీకాలు గ్రామాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. గాలికుంటు వ్యాధి చాలా వేగంగా వ్యాపించే వైరస్ వ్యాధి అని ఈ వ్యాధి సోకిన పశువులకు పాల ఉత్పత్తి, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిస్తుందని అంతేకాక రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుందని తెలుపుతూ మండలంలోని ప్రతి పాడే రైతు ఆరు నెలలకు టీకా వేయించడం ద్వారా తిని నివారించవచ్చని అన్నారు. ప్రతి పాడి రైతు తన పశువులకు టీకా వేయించి పషా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇది ఎఫ్ఎండి టీకా ఉచితం సురక్షితం మరియు శాశ్వత నివారణ మార్గం అని డాక్టర్ రాజబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా జిల్లా లైబ్రరీ చైర్మన్ కోట రాజబాబు, సింగల్ విండో చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి, పశు వైద్య కేంద్ర సిబ్బంది, పాడి రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు…..
– ఎస్సై దీకొండ రమేష్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలంలోని రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోత్కపల్లి ఎస్సై దికొండ రమేష్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుకోవడం వలన రాత్రి సమయాల్లో వాహనదారులు వాటిని గ్రహించలేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.రైతులెవరు రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని తెలిపినారు.ఎవరైనా రోడ్డుపై ధాన్యం ఆరబోసిన కారణంగా ప్రమాదాలు జరిగితే అట్టి ధాన్యము రాశి యజమానిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై దీకొండ రమేష్ పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ప్రయాణికుల రాకపోకల కోసం ప్రభుత్వాలు వేసిన రోడ్లపై ధాన్యం ఆరబోసి ఇబ్బంది చేయడం తగదని రైతులు ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకొని సహకరించాలని ప్రమాదాలు జరగకుండా బాధ్యతయుతంగా నడవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రైతుల ముఖ్యంగా డబల్ రోడ్లపై ఒకవైపు ధాన్యం ఆరబెట్టుట కోసం పోస్తున్నారని దానితో ప్రమాదాలు జరిగి కేసుల పాలు కావడం జరుగుతుందని ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ ఉన్నతాధికారులు సైతం వీటిపై ప్రత్యేక దృష్టి సాధించారని రైతులు అవగాహన పెంచుకొని ధాన్యం రోడ్లపై ఆరబెట్ట రాదని సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామకము…

కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామకము

వనపర్తి నేటిదాత్రి .

 

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా డి సి సి అధ్యక్షుల
ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం కొత్తకోట ,, మదనపురం మండలాల సమన్వయ కమిటీ సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు ఈసమావేశనికి ఏఐసీసీ అబ్జర్వర్లు పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి మాజీ ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ టీపీసీసీ , వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ కార్యకర్తలు పాల్గొన్నారుఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి పారదర్శకంగా, అన్ని అంశాలను పరిగణలకు తీసుకుని ఏఐసీసీడీసీసీ అధ్యక్షుడి నియామకంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు
బిసి రిజర్వేషన్లను అడ్డుకోవడంలో బి ఆర్ ఎస్ బిజెపి పార్టీలని విమర్శించారు
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నదని అన్నారు

చర్ల మండలంలో ఆర్ఎంపీలు అనధికారిక హాస్పిటల్స్ నిర్వహణ

క్వాలిఫైడ్ డాక్టర్లను మరిపించేలా చర్ల మండలం ఆర్ఎంపిలు

ఒకప్పుడు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లే నేడు హాస్పిటల్సగా నిర్వహణ

వైద్యాధికారుల అనుమతులతోనే నడుస్తున్నాయా

నేటిదాత్రి చర్ల

Vaibhavalaxmi Shopping Mall

చర్ల మండలం చతిస్గడ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతం కావడంతో అమాయకులైన ఆదివాసిలు నమ్మి ఆర్ఎంపీల వద్దకు వైద్యం కొరకు వెళ్లడంతో వారు ప్రధమ చికిత్స చేయవలసిన సదరు ఆర్ఎంపీలు స్టెరాయిడ్స హైడోస్ యాంటీబయటిక్లు ఇస్తున్నారు రక్త పరీక్షలు చేయిస్తూ మలేరియా డెంగ్యూ జ్వరాలకు కూడా వచ్చి రాని వైద్యం చేస్తున్నారు వ్యాధి ఎక్కువ అయిన తరువాత భద్రాచలం పంపిస్తూ కూడా లబ్ధి పొందుతున్నారు అక్కడకు వెళ్లి చివరి దశలో రోగులు ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోతున్నారు ఆర్ఎంపి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఇప్పుడు హాస్పిటల్ గా చలామణి అవుతున్నాయి ఎలా సాధ్యమని వివరాలు కోరితే మాకు ల్యాబ్లకు లైసెన్స్ ఉన్నాయని చెప్పడం గమనార్హం
ప్రక్కనే మెడికల్ షాపు డయాగ్నస్టిక్ సెంటర్లు ఎలా వచ్చాయి ఒకప్పుడు క్లినిక్ అని బోర్డు పెట్టడానికి భయపడే ఆర్ఎంపీలు ఇప్పుడు కొందరు హాస్పిటల్ గా ప్రభుత్వ అనుమతులతో బయో మెడికల్ మరియు డయాగ్నిక్ సెంటర్లకొరకు అడ్డదారిలో అనుమతి తీసుకుని భద్రాచలం లో ఉండే డాక్టర్లు పేర్లతో బోర్డులు తగిలించుకొని వైద్యశాలలు నడుపుతున్నారు డిఎంఎల్ టి క్వాలిఫికేషన్ ఉన్నవారికి కూడా ల్యాబ్ పర్మిషన్ లేదు ఎందుకంటే వారు ఆర్ఎంపీలకు మరియు సెల్ఫ్ గా టెస్టులు చేస్తూ వైద్యం చేస్తున్నారని వారిని నియంత్రణ చేయాలన్న ఉద్దేశంతో మినిమం ఎంబీబీఎస్ అర్హత ఉన్న వారి వద్దే ల్యాబ్ ఉండాలన్న రూల్స్ అమల్లో ఉన్నాయి కానీ ఆర్ఎంపీల డయాగ్నస్టిక్స్ సెంటర్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారు అర్థం కాని పరిస్థితి వారి ల్యాబ్లో కనీస అర్హత కలిగిన టెక్నీషియన్స్ కూడా లేకుండానే కొందరైతే ఆర్ఎంపీలే రక్త పరీక్షలు చేస్తున్నారు మండలంలోని చిన్న గ్రామాలు తెగడ సత్యనారాయణపురం ఆర్ కొత్తగూడెం లో కూడా ఆర్ఎంపీలు ల్యాబ్లు నిర్వహిస్తున్నారు ఒక ల్యాబ్లో రిపోర్టు మరో ల్యాబ్ రిపోర్టుకి సంబంధం లేకుండా ఇస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు అంతేకాకుండా వీరి మధ్య పోటీ పెరగడంతో మా వద్ద రక్త పరీక్షలకు తక్కువ ధరలు అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు ఇకనైనా అధికారులు స్పందించి నకిలీ వైద్యులను గుర్తించి వారి మీద చర్యలుతీసుకోవాల్సిందిగా చర్ల మండల ప్రజలు కోరుకుంటున్నారు

ఎస్టిపిపి ఫారెస్ట్ కాంటాక్ట్ కార్మికులపై ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి వేధింపులు..

ఎస్టిపిపి ఫారెస్ట్ కాంటాక్ట్ కార్మికులపై ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి వేధింపులు

ఫారెస్ట్ అధికారిణిని వెంటనేబదిలి చేయాలని ధర్నా చేపట్టిన హెచ్ఎంఎస్ యూనియన్

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం ఎస్టిపిపి లో పని చేస్తున్న ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారంటూ హెచ్‌ఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు.ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి కార్మికులపై అసభ్య పదజాలంతో దూషణలు చేయడం,పనిలో అనవసర ఒత్తిడులు తీసుకురావడం,వర్షాలు పడితే పని బంద్ చేసి జీతాలు ఇవ్వకపోవడం,పనికి వచ్చినా మాస్టారు ఇవ్వకపోవడం వంటి చర్యలతో కార్మికులు తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు వాపోయారు.ప్రతి రోజు 200-300 మీటర్లు పని చేయాలంటూ భారం మోపుతూ,పని చేయలేని కార్మికులకు వార్నింగ్ లెటర్లు జారీ చేస్తు వేధించడంతో విసిగిపోయిన బాధిత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు.ఈ విషయానికి స్పందించిన సింగరేణి యాజమాన్యం తరఫున జిఎం నర్సింహారావు,డీజిఎం పర్సనల్ కిరణ్ బాబు,ఇతర అధికారులు ధర్నా ప్రదేశానికి వచ్చి కార్మికుల సమస్యలను పరిశీలించి,వాటిని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.ధర్నా అనంతరం జనరల్ మేనేజర్ నరసింహారావు కి మెమోరండం అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విక్రమ్ కుమార్,ఉపాధ్యక్షులు సాయికృష్ణ,చిప్పకుర్తి సంపత్, నవీన్,గోగు మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో మైనర్ బాలికలను వేధించడం పై కఠిన హెచ్చరిక

మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, సహకరించినా జైల్ కే

◆:- ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం , మాయ మాటలు చెప్పి వెంట పడటం తర్వాత తీసుకెళ్లడం చేస్తున్నారని, ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్ళినా, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు ఎవరైనా అతనికి సహకరించినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఝరాసంగం ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ హెచ్చరించారు. మైనర్ బాలికలను వేధిస్తే పోక్సో చట్టం ప్రకారం 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. యువత భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మహేష్ యాదవ్ నుండి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

 

అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున 30000 ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ .. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 మంది అనారోగ్యంతో మృతి చెందారు అదేవిధంగా బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి కింద పడి గాయాలవడం తో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ చనిపోయిన బుడ్డమ్మ , రాజు, పున్నమ్మ ,నరసింహ లకు అదేవిధంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాద వశాత్తు కిందపడ్డ యాదయ్య లకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు .ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 6 కుటుంబాలకు 30000 ఆర్థిక సాయం చేస్తూ ఎవరు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాకు తెలియజేయాలని మీ కుటుంబాలకు అండగావుంటా అని భరోసా ఇచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, చంటి, బిక్షపతి, నవీన్, సాదిక్, రాజేష్, లక్ష్మణ్,మధు,మహేష్, రాకేష్, వినోద్ రమేష్,శ్రీకాంత్, శ్రీధర్, వంశీ,శేఖర్ గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్..

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కలిసిన మంత్రి సెట్విన్ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరామర్శించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తనతో పాటు జహీరాబాద్ నియోజకవర్గ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మల్లిఖార్జున ఖర్గేకు ఇటీవల పేస్ మేకర్ అమర్చిన వైద్యులు.ఖర్గేతో సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు,

మానసిక ఆరోగ్య అవగాహన రామడుగులో

మానసిక ఆరోగ్యమే సంపూర్ణ జీవితానికి పునాది

యువత విద్యార్థుల్లో మానసిక వికాసం– స్ఫూర్తిదాయక సమాజానికి పునాదిగా నిలుస్తుంది- ఎజ్రా మల్లేశం

రామడుగు, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

మానసిక ఆరోగ్యమే వ్యక్తి సంపూర్ణ జీవితానికి పునాదులుగా నిలుస్తాయని తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (టీపీఏ) జిల్లా అధ్యక్షులు ఎజ్రా మల్లేశం అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో టెలంగాణ సైకాలజిస్టిస్ అసోసియేషన్ (టిపిఏ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం బాగుంటేనే జీవితంలోని ప్రతి రంగంలో రాణించగలమని, ఆనంద జీవితం సాధించడానికి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యమే బలమైన ఆధారం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక బిలియన్ మంది మానసిక సమస్యలతో బాధపడుతుండగా, భారత్‌లో కూడా ఈసమస్య వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సులో ఉన్న యువతలో అరవై శాతం మంది నిద్రలేమి, డెబ్బై శాతం మంది తరగతి గదుల్లో ఏకాగ్రత లోపం సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణాలు మానసిక ఆందోళన, సెల్‌ఫోన్‌ వ్యసనం, సామాజిక మాధ్యమాల అధిక వినియోగం, చదువు ఒత్తిడి, కుటుంబ అనుబంధాల లోపం అని వివరించారు. మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం (మెడిటేషన్), ప్రాణాయామం, సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఆత్మీయ సంభాషణ అలవాటు చేసుకోవాలని సూచించారు.
“మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరానికి శక్తి, ఆత్మకు ఉల్లాసం, జీవితానికి దిశ లభిస్తుంది,” అని ఆయన అన్నారు. సైకాలజిస్ట్ అలియన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ డిజి నాగేశ్వర్ మాట్లాడుతూ మానసిక సమస్యలు తగ్గించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నెగిటివ్ ఆలోచనలు రాకుండా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో విశ్వముఖ చారి, ప్రిన్సిపాల్ మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి….

బీసీ రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయండి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు డా.సిరికొండ శ్రీనివాసాచారి

పరకాల నేటిధాత్రి

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ ల కోసం బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర బంద్ ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు,విద్యావేత్త ఎస్వీ విద్యాసంస్థల అధినేత డాక్టర్.సిరికొండ శ్రీనివాసాచారి పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ ఓ 9 కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ,రిజర్వేషన్ ల బిల్లును షెడ్యూల్ 9 లో చేర్చాలని ఇందు కోసం కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.30 బీసీ సంఘాల వాదనలు వినకుండా ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన తరువాత హైకోర్ట్ స్టే ఇవ్వడం బీసీ లను మోసం చేయడమేనని అన్నారు.ఇట్టి రిజర్వేషన్ సాధించేవరకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కొసం చేసిన తరహ ఉదృతమైన ఉద్యమాలు,పోరాటాలు సాగిస్తామని తెలిపారు.
ఇందుకోసం ఈ నెల 18 న రాష్ట్ర వ్యాప్తంగా జరుగు బీసీ ల బంద్ ను అన్నివర్గాల ప్రజలు,కులాలు,మతాలకు అతితంగా స్వచ్చందంగా బంద్ పాటించి,సహకరించి బంద్ ను విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమము లో బీసీ రాష్ట్ర నాయకులు ఎడ్ల సుధాకర్,బసాని సోమరాజుపటేల్,డా.శివదేవ్,సూత్రపు శివాజీగణేష్ నాయి,సూర సతీష్ పటేల్,అల్లం మధుసూదన్ ముదిరాజ్,మహిళా నాయకులు దుంపేటి యశోద,మౌనిక,తూముల అనిత,లక్కం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వాలీబాల్‌కు గంగాధర విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు గంగాధర విద్యార్థి ఎంపిక

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మంచి కట్ల నందకిషోర్ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బాబు శ్రీనివాస్ తెలిపారు.
ఈరాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఈనెల16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జరుగుతాయని, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్17 బాలుర జట్టులో నందకిషోర్ అత్యంత ప్రతిభ కనబరిచి బాలుర ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికైయ్యాడని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.అనిత కుమారి, ఎంపీడీవో డి.రాము, ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.

వడ్ల కొనుగోళ్లు సాఫీగా జరగాలన్న మంత్రుల ఆదేశం

రైతులకు ఇబ్బదులు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి
వనపర్తి నేటిదాత్రి .

Vaibhavalaxmi Shopping Mall

రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 బుధవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో కలిసి హైదరాబాదు నుంచి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అధికారులతో కలిసి పాల్గొన్నారు
మంత్రి మాట్లాడుతూ, జిల్లాల వారిగా కలెక్టర్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు అన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడినన్ని గన్ని సంచులు, తూకపు, తేమ యంత్రాలు, టార్పలిన్ లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు, త్రాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. వరి ధాన్యం తరలించుటకు లారీలను సమకూర్చుకోవాలని కోరారు
రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సకాలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఆదేశించారు వడ్ల సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున వడ్ల రైతులకు నష్టం జేరుగకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు కలెక్టర్లు స్వయంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని వడ్ల కొనుగోలు ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి మాట్లాడుతూ వనపర్తి జిల్లా అక్టోబర్ చివరి వారం నుండి వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు
గతంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు కలిగిన కేంద్రాల్లో మళ్ళీ ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎక్కడా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా తూకము కాంటాలు తేమ యంత్రాలు సరిగ్గా చూసుకోవాలని అన్నారు. టార్పలిన్ లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని . లారీలు, కూలీల కొరత తలెత్తకుండా చూడాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్లు రంజిత్ రెడ్డి, శ్రావ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, డి ఆర్ డి ఓ పి డి ఉమాదేవి, డి సి ఓ రాణి, డిటిఓ మానస, వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంతోష్ యాదవ్ టెక్నికల్ అఫీషియల్ గా నియామకం

నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ టెక్నికల్ అఫీషియల్ గా సంతోష్ యాదవ్.

బెల్లంపల్లి నేటిధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

బెల్లంపల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పీ.ఈ.టి గా విధులు నిర్వర్తిస్తున్న సల్పాల సంతోష్ యాదవ్
హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అక్టోబర్ 16 నుండి 18 వరకు జరగనున్న 5వ ఇండియన్ ఓపెన్ అండర్ 23 నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు టెక్నికల్ అఫీషియల్ గా నియమితులైనారు. ఈ విషయాన్ని తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఈ. మారయ్య తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ కు టెక్నికల్ అఫీషియల్ గా సంతోష్ నియామకం పట్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ రవి ప్రసాద్ ప్రధానోపాధ్యాయులు రాజా రమేష్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, బెల్లంపల్లి పట్టణ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి….

గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధ,రామలక్ష్మన్ జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడు కు రూ 40 వేల రూపాయల విలువగల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్న భూపాలపల్లి రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పూజిత,నరహరి దంపతులు. సందర్భంగా వారు మాట్లాడుతూ
నేటి సమాజంలో పుట్టినరోజు చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని,ఏదైనా ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంధాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ఏఐటీయుసి నాయకుడు రమేష్. బాలగొని రమేష్ మంతెన సమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు

అంతర్జాతీయ జపాన్ బ్రౌన్ బెల్ట్ సాధించిన ఇబ్రహీంపట్నం కరాటే విద్యార్థులు…

అంతర్జాతీయ జపాన్ బ్రౌన్ బెల్ట్ సాధించిన ఇబ్రహీంపట్నం కరాటే విద్యార్థులు

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో నాగబాబు స్టూడియో అజిజ్ నగర్ హైదరాబాద్ లో మంగళవారం రోజున నిర్వహించిన అంతర్జాతీయ, జాతీయ బ్లాక్ బెల్ట్ ప్రశంసా పత్రాల ప్రధానోస్తవ కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటుడు సుమన్ చేతుల మీదుగా ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన కరాటే విద్యార్థులు వి. హరిప్రిత్, ఏ. హృషికేశ్ కు శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ సమక్షంలో బెల్ట్ లు ప్రశంసా పత్రాన్ని, మెరిట్ అవార్డ్ పథకాలు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో విద్యార్థులు శారీరిక మానసిక వ్యక్తిత్వ వికాసానికి విద్యార్థుల ఎదుగుదలకు ఇలాంటి కరాటే ఆత్మరక్షణ విద్యలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ జపాన్ కరాటే అసోసియేషన్ ఛైర్మన్ సినీ నటుడు సుమన్, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు ఆంజనేయులు, బాగ్యరాజ్, పవన్ కళ్యాణ్, నవీన్, విశ్వ తేజ, కరాటే విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు బస్సుల సమస్యపై బీజేపీ నేతల ఆందోళన

బస్సు రాని పక్షంలో ఎల్లుండి ఆర్టీసి ఆఫీస్ ముట్టడి- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ పెగడపెల్లి నుండి గోపాలరావుపేట్ మీదుగా మోతె, గోలిరామయ్యపల్లి, కొక్కెరకుంట నుండి కరీంనగర్ వేళ్ళు బస్సు వచ్చే బస్సు ఎందుకు రావట్లేదో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని వారు అన్నారు. విద్యార్థులు, రైతులు, ఇతర ప్రాంతలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారిందని అయిన కానీ స్థానిక ఎమ్మెల్యే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పాట్ల అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ప్రజల ఇబ్బందులు అర్థం చేసుకొని వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని, లేని పక్షంలో ఎల్లుండి ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆర్టీసీ ఆర్ఎమ్ ఆఫీస్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, ఉప్పు శ్రీనివాస్ పటేల్, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా మండల అధ్యక్షులు దూరుశెట్టి రమేష్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శిలు ఎడవెళ్లి లక్ష్మణ్, దయ్యాల రాజు, చేనేత సెల్ కన్వీనర్ రమేష్, సీనియర్ నాయకులు కలిగేటి ఎల్లయ్య, షేవెళ్ళ అక్షయ్, బూత్ అధ్యక్షులు ఉత్తేం కనుకరాజు, రాగం కునకయ్య, అంబటి శ్రీనివాస్, ఉప్పు తిరుపతి, నాగి లచ్చయ్య, ఆకరపు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

 

 

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

కాంగ్రెస్ కార్యకర్తలు హాజరవ్వండి.

 

ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.

జడ్చర్ల / నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుని ఎన్నికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఈ విషయంగా పార్టీ వర్గాల అభిప్రాయసేకరణ కోసం పార్టీ అధిష్టానం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోందని బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. స్థానిక చంద్ర గార్డెన్స్ లో 17వ తేదీ శుక్రవారం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లాక్ ఏ, బ్లాక్ బీ గా రెండు దశలుగా సాగే ఈ సమావేశం ఒకేరోజు పూర్తవుతుందన్నారు. బ్లాక్ ఏ లో ఉన్న జడ్చర్ల, మిడ్జిల్, ఊర్కొండ మండలాల పార్టీ నేతలు కార్యకర్తల సమావేశం ఉదయం 10 గంటల మధ్యాహ్నం 2 గంటల వరకూ జరుగుతుందని చెప్పారు. భోజన విరామం అనంతరం బ్లాక్ బీ లోని నవాబుపేట, రాజాపూర్, బాలానగర్ మండలాల సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుందని వివరించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ హాజరు కావాలని అనిరుధ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలను తీసుకొచ్చే బాధ్యత ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలదేనని స్పష్టం చేసారు. ఈ సమావేశానికి జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి పార్టీ ప్రతినిధులు హాజరై డీసీసీకి మంచి నాయకత్వాన్ని సూచించాలని అనిరుధ్ రెడ్డి కోరారు.

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి…

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

18న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ జిల్లా జిల్లాఅధ్యక్షులు బీసీ హక్కుల సాధన సమితి

కరీంనగర్, నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బుచ్చన్న అన్నారు. కమాన్ సెంటర్లో లోజరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్యతో కలిసి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బుధవారం కరీంనగర్ లోని కమాన్ సెంటర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించవలసిన బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ బీసీల ఎడల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గమని, ఎందరో న్యాయకోవిదులు నిపుణులు చెప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ఒకసారి జీవో అని ఒకసారి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో మీదా అగ్రకులాలు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశాలు కల్పించేలా వ్యవహారించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు.
ఈమోకా తప్పితే బీసీలు ఆగమై పోతారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వెనుకాల ఉన్న బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు.
కోర్టులో గెలిచామనీ రెడ్లు టపాసులు కాల్చుకొంటున్నారనన్నారు.
ఇందుకు నిరసనగా హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన కేసు ప్రతులను దగ్ధం చేస్తూ ఇదీ బీసీలంతా గమనించాలన్నారు.
బీసీలను రోడ్లు ఎక్కేలా చేస్తున్న అగ్రకులాలు జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని, ఈనెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కోశాధికారి పైడిపల్లి రాజుగౌడ్, నాయకులు బాకం ఆంజనేయులు, జంగం కొమురయ్య యాదవ్, దానవీని రమేష్,మల్లేశం, ఓరుసుబన్నీ, మేకల కుమార్, ఎన్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ…

గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో బాకీ కార్డులను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడి ఏరియాలో ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపుతో మునిసిపాలిటీలోని గద్దె రాగడిలో బాకీ కార్డులను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇంటింటికి పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అలుగుల సత్తయ్య, కుర్మ గురువయ్య దేవి సాయి కృష్ణ, కుర్మ దినేష్, బండారు రవీందర్, శివ, అలుగుల అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి…

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

పరకాల మండల మడికొండ ప్రశాంత్ అధ్యక్షుడు

పరకాల నేటిధాత్రి

 

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు ప్రభుత్వం తక్షణమే బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ పరకాలమండల అధ్యక్షత మడికొండ ప్రశాంత్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారని దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు,7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందని 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version