రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి…

రిజర్వేషన్లు దక్కకుండా అగ్రకులాలు చేస్తున్న కుట్రలను బీసీలు తిప్పికొట్టాలి

18న తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి

కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ జిల్లా జిల్లాఅధ్యక్షులు బీసీ హక్కుల సాధన సమితి

కరీంనగర్, నేటిధాత్రి:

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు చట్టాన్ని ఆమోదించకుండా మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యహరించడం వల్లనే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో అనేక ఆటంకాలు కలుగుతున్నాయనీ బుచ్చన్న అన్నారు. కమాన్ సెంటర్లో లోజరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, ప్రధానకార్యదర్శి పిట్టల సమ్మయ్యతో కలిసి మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బుధవారం కరీంనగర్ లోని కమాన్ సెంటర్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి ఆమోదించవలసిన బీసీ ప్రధాన మంత్రిని అంటున్న మోడీ బీసీల ఎడల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగానే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు జరగాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ఒక్కటే మార్గమని, ఎందరో న్యాయకోవిదులు నిపుణులు చెప్పుతున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్ అని ఒకసారి జీవో అని ఒకసారి కాలయాపన చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల జీవో మీదా అగ్రకులాలు న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశాలు కల్పించేలా వ్యవహారించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లు సాధించడానికి అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని ఐక్య కార్యాచరణ ద్వారా బలమైన ఉద్యమాన్ని నిర్మించి మోడీ ప్రభుత్వం బీసీ చట్టాన్ని 9వ షెడ్యూల్ లో చేర్చే విధంగా కృషి చేయాలన్నారు.
ఈమోకా తప్పితే బీసీలు ఆగమై పోతారు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల వెనుకాల ఉన్న బీసీలంతా రాజకీయాలకు అతీతంగా ఎక్కడికక్కడ జేఏసీలుగా ఏర్పడి బీసీ రిజర్వేషన్లను సాధించుకోవాలని అన్నారు.
కోర్టులో గెలిచామనీ రెడ్లు టపాసులు కాల్చుకొంటున్నారనన్నారు.
ఇందుకు నిరసనగా హైకోర్టులో బుట్టెంగారి మాధవరెడ్డి వేసిన కేసు ప్రతులను దగ్ధం చేస్తూ ఇదీ బీసీలంతా గమనించాలన్నారు.
బీసీలను రోడ్లు ఎక్కేలా చేస్తున్న అగ్రకులాలు జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని, ఈనెల 18న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, కోశాధికారి పైడిపల్లి రాజుగౌడ్, నాయకులు బాకం ఆంజనేయులు, జంగం కొమురయ్య యాదవ్, దానవీని రమేష్,మల్లేశం, ఓరుసుబన్నీ, మేకల కుమార్, ఎన్.కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version