మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన
సాయిచరణ్ గౌడ్
గణేష్ గడ్డ… వినాయక లడ్డూ ప్రసాదంతో హరీశ్ రావును కలిసిన
పఠాన్ చేరు , నేటి ధాత్రి :
మాజీమంత్రి హరీష్ రావును వారి నివాసంలో బీఆర్‌ఎస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం వినాయక చవితి నవరాత్రులు ముగిసిన సందర్భంగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గణేష్ గడ్డ దేవాలయం లడ్డూ సొంతం చేసుకున్న సందర్బంగా, బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్‌రెడ్డితో కలిసి బీఆర్‌ఎస్ యువనాయకుడు బాలగౌని సాయిచరణ్ గౌడ్ మాజీ మంత్రి, తన్నీరు హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గణపతి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఆదర్శ్‌రెడ్డితో కలసి పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయాలని, అలాగే పార్టీ కార్యక్రమాలకు ఆదర్శ్‌రెడ్డితో కలిసి నడవాలని పిలుపునిచ్చారు.అని తెలిపారు