పట్టణ పారిశుద్య సమస్యలను పరిష్కరించాలి…

పట్టణ పారిశుద్య సమస్యలను పరిష్కరించాలి.

జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి పట్టణంలోనీ పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి.పలు కాలనీలలో సమస్యలు కంపు కొడుతున్న మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని జాతీయ మాన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య హాజరై మాట్లాడడం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని విలీన గ్రామాలైనటువంటి జంగేడు,కాసింపల్లి, వేషాలపల్లి ,పుల్లూరి రామయ్యపల్లి ,కుందూరు పల్లి పెద్దకుంటపల్లి, గ్రామాలలో పారిశుధ్య పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నా చందాగా ఉన్నాయని అన్నారు . కాలనిలలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండిపోయిన అధికారులు మొద్దు నిద్ర పోవడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సరైనటువంటి సిబ్బంది లేక సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చెత్తను తీసుకుపోయేటువంటి చెత్త బండ్లు, ట్రాక్టర్లు చిన్నచిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్లు చేయించకుండా పక్కన పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పేర్కొన్నారు. వాహనాలను పక్కన పెట్టడం ద్వారా తుప్పు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని వెంటనే రిపేర్ లో ఉన్నటువంటి వాహనాలను తొందరగా రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావాలి అని కోరారు. గ్రామాలలో మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమాల ప్రాంగణాలను ముందస్తుగానే ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా 30 వార్డులకు సరిపోయేంత పారిశుద్ధ్య కార్మికులు లేరని కొత్తవారిని నియమించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించడం వలన , కాల్వలలో బ్లీచింగ్ చల్లకపోవడం ,దోమల మందు ఫ్యాగింగ్ చేయకపోవడం వలన,కాలనీలలో కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాలకు బలవుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే కాలనీ సమస్యలను పరిష్కరించాలని దీనిపైన జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి రాకేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ అమృత అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు సంగం రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి జోగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పారిశుధ్యం పక్కకు పెట్టిన అధికారులు…

గ్రామాల్లో పారిశుధ్యం పక్కకు పెట్టిన అధికారులు

మండల అధికారులు సమావేశాలు పెట్టి ఆదేశాలు జారీ చేసినప్పటికి మారని జీ.పి.అధికారుల పనితీరు

ప్రధాన సమస్యగా వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు

పరకాల నేటిధాత్రి
మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడం లేదు.వర్షాలు కురుస్తున్న సందర్భంలో గ్రామాల్లో మురికి కాలువలలో పేరుకుపోయిన మురుగునీరు,ఎక్కడ చెత్త అక్కడే వదిలేసిన తీరు చూస్తే గ్రామాల్లో గ్రామ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని చెప్పవచ్చు.భారీ వర్షాల కారణంగా గ్రామాలరోడ్లు బురదమయంతో నిండిపోయి మురికి కాలువలో మరియు నీరు లోతట్టు ప్రాంతాలలో నిలువఉండటం వలన ఆ ప్రదేశాలలో దోమలు ఎక్కువగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తరులు జారీ చేసిన,మండల అధికారులు సమావేశలు పెట్టి ఆదేశాలు జారీచేసినప్పడికి కొన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలపై పంచాయతీ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.ఈ సమయంలో దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది టైఫాయిడ్ మలేషియా సీజనల్ జ్వరాలు ఎక్కువగా వ్యాపిచెందే అవకాశలున్నాయి.వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిసినప్పటికి కొన్ని గ్రామాలలో ఇప్పటివరకు బ్లీచింగ్ పౌడర్ గాని దోమల మందు గాని స్ప్రే చేయడం నివారణ చర్యలు ఏమాత్రం చేపట్టలేదు.వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో నిల్వవున్న నీటిని కాళీ చేసే చర్యలు కూడా తీసుకోవడం లేదని ప్రజలు పంచాయతీ సిబ్బంది పనితీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నీరు నిల్వ వల్ల ప్రాణంతకమైన దోమలు గుమిగుడుతున్నాయని కొంతమంది పంచాయతీ అధికారులు అయితే ప్రజలు తమ గోడు విన్నవించుకున్నప్పటికి కొన్ని నెలలుగా మాకు ఎలాంటి నిధులు రావడంలేదని మాట దాటేస్తున్నట్టు సమాచారం,అధికారులు స్పందించి పారిశుద్ధ్యం పనులపై ప్రత్యేక శ్రద్ద వహించి గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తమ ప్రణాలను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వెలగని విద్యుత్ దీపాలు,రోడ్లకు ఇరువైపులా చెట్ల కొమ్మలు

వెలగని విద్యుత్ దీపాలే ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.గ్రామాలలో ఎక్కడ చూసిన వెలగని విద్యుత్ దీపాలు దర్శనమిస్తున్నాయి.ఒక చోట ఉంటే ఇంకోచోట ఉండకపోవడం ఇలా అన్ని గ్రామాలలో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు.వర్షాలు కురుస్తున్న తరుణంలో ఏదైనా అవసర నిమ్మిత్తం బయటకు వెళ్లాల్సివస్తే విషపురుగులు కాటేస్తాయేమో అనే భయంతోనే బయటకు వెళుతున్నామని ప్రజలు చెప్పుకొస్తున్నారు.మరికొన్ని చోట్ల అయితే రోడ్లకు ఇరువైపులా భారీగా చెట్లకొమ్మలు పెరిగి విద్యుత్ దీపాలకు అడ్డుగావచ్చి రాత్రికాల సమయంలో ప్రయాణించే వాహనదారులకు వెలుగులు లేక గుంతలు కనిపించక తమ ప్రయాణం ఒక నరకంగా వాపోతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం.

కార్మికులకు ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్యం

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారుల తీరు అసంతృప్తికరం

సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

 

 

 

కేసముద్రం మండలం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికుల ను ఉద్దేశించి ఏఐసిటియు జిల్లా కార్యదర్శి కంచ వెంకన్న మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ఆదాయము సంవత్సరమునకు సుమారు 8 కోట్ల రూపాయలని కానీ కార్మికులకు ఓ నగూరింది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ మార్కెట్ ప్రధానమంత్రి ఎక్స్లెన్స్ అవార్డు పొందిన మార్కెట్ అని కార్మికులకు మాత్రం మార్కెట్ అధికారులు మార్కెట్ ఆదాయం నుండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కట్టడం లోపల నిర్లక్ష్యం చేస్తున్నారని కార్మిక ప్రయోజనాలు పట్టింపు లేనట్టు మార్కెట్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. అదేవిధంగా పాలకులు అసంఘటితరగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏమి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టం చేయకపోవడం మూలంగా కార్మికులకు వారి యొక్క హక్కులు లేకుండా పోవుచున్నావని నిరంతరం ఎన్నో ప్రమాదాల మధ్య కార్మికులు తమ పనిని చేయుచున్నారని కానీ పాలకులకు మాత్రం కార్మికులైన వీరికి ప్రయోజనాలు కల్పించడంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని వీటి సాధన కొరకు ఉద్యమాలే శరణ్యం అని కార్మికులందరూ పోరాటాలకు సంసిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనాటి ఈ సమావేశంలో పాల్గొన్న వారు వేల్పుల వెంకన్న, గుగులోతు రాజు,రమణ బోయిన సురేష్, గద్దల సాలయ్య,బోడ వీరన్న నాయక్, ధారావత్ వీరన్న నాయక్ ,గుగులోతు లక్ష్మణ్,నేరడ వీరస్వామి,అందే భాస్కర, పుల్లన్న,మురళి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version