గడపగడపకు కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డ్ పంపిణీ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రవేశపెడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైన నేపథ్యంలో బాకీ కార్డులను క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దె రాగడి ఏరియాలో ఆ పార్టీ శ్రేణులు ఇంటింటికి పంపిణీ చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపుతో మునిసిపాలిటీలోని గద్దె రాగడిలో బాకీ కార్డులను ప్రజల వద్దకు తీసుకెళ్లి ఇంటింటికి పంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అలుగుల సత్తయ్య, కుర్మ గురువయ్య దేవి సాయి కృష్ణ, కుర్మ దినేష్, బండారు రవీందర్, శివ, అలుగుల అరవింద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
