డ్రామారావు అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ ప్రతినిధి బర్ల సహదేవ్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T134240.451.wav?_=1

 

 

డ్రామారావు అసత్య ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ ప్రతినిధి బర్ల సహదేవ్
*మీ 10 ఏండ్ల పాలనపై, కాంగ్రెస్ పార్టీ 2 ఏండ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాలు విసురుతున్న

వర్దన్నపేట (నేటిధాత్రి ):

 

జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి, ఈ -కార్ రేస్ అవినీతి పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చేసరికి చిన్న మెదడు చితికి, మతి బ్రమించి సీఎం రేవంత్ రెడ్డి గారి పై అసత్య ఆరోపణలు చేస్తున్న డ్రామారావు అలియాస్ టిల్లు వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్న వర్దన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బర్ల సహాదేవ్ (అడ్వకేట్ )
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమితో బిఆర్ఎస్ కు పట్టపగలే చుక్కలు కనిపించాయి.కుంభ కోణలు చేసేది మీరు. మీ 10 ఏండ్ల పరిపాలన కాలంలో అన్ని కుంబకోణలే అందువల్లే మీ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు చిత్తుగా ఓడగొట్టారు.
హిల్టప్ (హైదరాబాద్ పారిశ్రమిక భూముల బదిలీ విధానం) పై అసత్య ఆరోపణలు మానుకోవాలి.
పెట్టుబడులు తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచలనే తమ ఉద్దేశలను వక్రీకరిస్తూ KTR పచ్చి అబద్దాలు చెప్పడం సరికాదు.తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఈ-కార్ రేస్ అవినీతి పై గవర్నర్ గారు విచారణకు అనుమతి ఇచ్చేసరికి ప్రజల దృష్టిని మల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజా క్షేత్రంలోకి రా చూసుకుందాం అంతే తప్ప ఇలాంటి అబద్ధ ఆరోపణలు చేయడం మానుకోవాలి లేకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా మిమ్మల్ని మీ పార్టీని చీత్తు చిత్తు గా ఓడగొట్టి మీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది.

విజయం కోసం కృషి చేసిన నాయకుని ఘనంగా సన్మానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-17T123107.878.wav?_=2

 

విజయం కోసం కృషి చేసిన నాయకుని ఘనంగా సన్మానం

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి విజయం సాధించిన తర్వాత మొదటి సారి జహీరాబాద్ విచ్చేసిన సందర్భంగా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సెట్విన్ చైర్మన్ ఎన్ గిరిధర్ రెడ్డి కలిసి శాలువా పులమలలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు ముల్తాన్,సిడిసి చైర్మన్ ముబీన్ జహీరాబాద్ మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి యువ నాయకులు నాగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నవాజ్ రెడ్డి, అభిలాష్ రెడ్డి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు,

పాలనపై పట్టు..ఎన్నికలలో హిట్టు!

`జూబ్లీ గెలుపుతో ‘‘రేవంత్‌’’ గ్రాఫ్‌ ఎవరెస్టు

`‘‘సీఎం. రేవంత్‌’’ ప్రచారం జూబ్లీ విజయం

`‘‘రేవంత్‌’’ పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది

`‘‘రేవంత్‌’’ పాలనే బాగుందనుకున్నారు

-‘‘బీఆర్‌ఎస్‌’’ కన్నా మెరుగే అని విశ్వసించినట్లున్నారు

-జూబ్లీ ఎన్నికల ముందున్న ఆలోచనలన్నీ పటా పంచెలు

REVANTH REDDY VICTORY IN JUBLIEE HILLS BY-ELECTION

-ఇక ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’కి తిరుగులేదు

-పార్టీలోనూ ఎదురులేకుండా చూసుకున్నారు

-వరుస విజయాలతో దూసుకుపోతున్నారు

-సాధారణ ఎన్నికలు ఒంటి చేత్తో గెలిపించారు

-ఉప ఎన్నికలన్నీ గెలుస్తూ వస్తున్నారు

-పార్లమెంటు ఎన్నికలలోనూ మెరుగైన ఫలితాలు సాధించిపెట్టారు

-ఈ విజయాల పరంపర కొనసాగిస్తే ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి ఎదురుండదు

అంచనాలకు అందని నాయకుడు ‘‘సిఎం. రేవంత్‌ రెడ్డి’’. రాజకీయంగా స్వయం కృషితో బాటలు వేసుకొని విజయాలు సొంతం చేసుకోవడం ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి కొత్త కాదు. అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీ హిల్స్‌ CONGRESS‌ కైవసం ఒక చరిత్ర. జూబ్లీ హిల్స్‌ ఎలక్షన్‌లో వార్‌ వన్‌ సైడ్‌ చేసి అఖండ మెజారిటీతో అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ను గెలిపించారు. దటీజ్‌ ‘‘రేవంత్‌ రెడ్డి’’ అని నిరూపించారు. బిఆర్‌ఎస్‌ ఆశలను పటాపంచెలు చేసి కాంగ్రెస్‌ కు విజయాన్ని అందించారు. అటు పాలనలో దూసుకుపోతున్నారు. ఇటు పార్టీకి ఎన్నికల వరుస విజయాలు అందిస్తున్న ‘‘రేవంత్‌ రెడ్డి’’ వ్యూహాలను చేధించడం ఎవరి వల్ల కాదని మరోసారి నిరూపించారు. గెలుపంటే ఇదీ అని రాజకీయాలకే ఒక పాఠం నేర్పి, పార్టీకి మరింత బలాన్ని ‘‘రేవంత్‌ రెడ్డి (REVANTH REDDY) ’’ పెంచారు. అంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ‘‘రోహిన్‌ రెడ్డి’’(ROHIN REDDY), నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కాని ప్రతి ఎన్నికను గెలిపించుకోవాల్సిన అవసరం వుంటుంది. అలా ప్రతి ఎన్నికను గెలిపించుకునే నాయకులు చిరిత్ర సృష్టిస్తారు. అందులో సిఎం. రేవంత్‌ రెడ్డి వుంటారు. ఇది అతిశయోక్తి అసలే కాదు. ఎందుకంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఒంటి చేత్తో అందించిన విజయాలు రాష్ట్రంలో అనేకం వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నమ్మకం కల్గించడంలో రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. తెలంగాణ ఇచ్చినా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో వుంది. అనేక అపజయాలు చవి చూడాల్సి వచ్చింది. అది ఏ ఒక్కరి లోపం కాదు. కాని గెలవలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. అయితే ప్రజల్లో నమ్మకం నింపే నాయకుడు పార్టీలకు కావాలి. పాలకులుగా వుండాలి. ముందు ఏ నాయకుడైనా పార్టీకి ధైర్యం కావాలి. నాయకులకు భరోసా కల్పించే స్దితిలో వుండాలి. ప్రజలకు నమ్మకం కల్గించాలి. పార్టీ మీద ప్రజలకు విశ్వాసం నింపాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో వున్నా గెలుపు తీరాలకు చేర్చే పూర్తి భాధ్యతను భుజాన వేసుకునే నాయకుడుగా కాంగ్రెస్‌ అధిష్టానానికి రేవంత్‌ రెడ్డి కల్పించారు. అది సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో శ్రమ పడాల్సి వుంటుంది. పార్టీ పెద్దలకు నమ్మకం కల్పించాల్సి వుంటుంది. ఏ రకమైన సవాలునైనా స్వీకరించే స్ధితిలో నాయకుడు వుండాలి. అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తివంతుడై వుండాలి. అవన్నీ సిఎం. రేవంత్‌ రెడ్డిలో వున్నాయి. అందుకే కాంగ్రెస్‌లో చేరిన అనతి కాలంలోనే ఆయన పార్టీకి పిసిసి. అధ్యక్షుడు కాగలిగారు. పార్టీని గాడిలో పెట్టగలిగారు. ఆనాడు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి కుటుంబ పెద్దకు ఇంటి సమస్యలుంటాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడు కుటుంబమైనా, రాజకీయ పార్టీ అయినా దారిలో పడుతుంది. అందుకు ఆ పెద్దకు ఎంతో ఓపిక కావాలి. ఒక కుటుంబంలోనే నలుగురు నాలుగు రకాలై ఆలోచనలతో వుంటారు. రాజకీయ పార్టీలో కొన్న లక్షల మంది వుంటారు. అందర్నీ సంతృప్తి పర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే పార్టీ నిలబడుతుంది. అని బలంగా నమ్మిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎవరి అంచనాలకు అందని నాయకుడు. ఆయన వేసే అడుగులు ఎంత బలంగా వుంటాయో…ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతు చిక్క కుండా వుంటాయి. అందుకే తాజాగా గెలిచిన జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపొందారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు పరిస్దితి ఎలా వుందో అందిరికీ తెలుసు. కాకపోతే అవన్నీ బిఆర్‌ఎస్‌ ఊహలు మాత్రమే. ప్రభుత్వం మీద ఎంతో ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లు సోషల్‌మీడియా ద్వారా విసృతంగా ప్రచారం చేశారు. నిండు కుండ తొనకదు అన్నట్లు రేవంత్‌ రెడ్డి ఎప్పుడూ స్పందించలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంత ప్రచారం చేసుకుంటుందో చేసుకోని అని చూశారు. బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని సిఎం. రేవంత్‌ రెడ్డికి తెలుసు. బిఆర్‌ఎస్‌ చేస్తున్న అబద్దపు ప్రచారంలో అర్ధం లేదు. నిజం అంతకన్నా లేదని ప్రజలకు తెలుసు. సిఎం.రేవంత్‌ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన గుంభనంగా వున్నారు. కాని బిఆర్‌ఎస్‌ ఎగిరెగిరి పడిరది. ఆఖరుకు ఏమైంది. సిఎం. రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగారు. వార్‌ వన్‌సైడ్‌ చేశారు. అదీ నాయకుడి గొప్పదనం. బిఆర్‌ఎస్‌ అనేది ఉద్యమ కాలంలో ఒక రకమైన సెంటిమెంటు, అధికారంలో వున్నప్పుడు అబద్దాలు విసృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు జనాలకు బిఆర్‌ఎస్‌ అంటే ఏమిటో పూర్తిగా తెలిసిపోయింది. ఆ పార్టీ అంతా పైన పటారం, లోన లొటారం అనేది తెలిసింది. అందుకే జూబ్లీలో ప్రజలు మరోసారి బిఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టారు. అందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనే నిదర్శనం. కాంగ్రెస్‌ ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ కన్నా ఎంతో బాగుంది. రేవంత్‌ రెడ్డి పాలన ఎంతో మెరుగ్గా వుంది. అందుకే బిఆర్‌ఎస్‌కు వీలుకాని ఏ ఉప ఎన్నికలో వీలుకాని మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ను గెల్చుకున్నది. సిఎం. రేవంత్‌ రెడ్డి స్వయం ప్రకాశవంతమైన నాయకుడు. స్వయంకృషితో ఎదిగిన నాయకుడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చిన నాయకుడు. పేద ప్రజలు కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఆశలు తెలుసు. వారి ఆలోచనలు కూడా రేవంత్‌ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ప్రజలు కూడా మా నాయకుడు. పేదల నాయకుడు అని గుండెల్లో పెట్టుకున్నారు. సమయం వచ్చింది. జూబ్లీ ఉప పోరులో సిఎం. రేవంత్‌ రెడ్డిపై వున్న మమకారం మరోసారి చూపించారు. రేవంత్‌ రెడ్డి అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి ఒక చరిత్ర. జూబ్లీ ఉప ఎన్నికను వార్‌ వన్‌ సైడ్‌ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌ అఖండ మెజార్టీతో గెవడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర రాజకీయ పండితులే అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే అభ్యర్ధి ఎంపిక నాడే గెలుపును కాంగ్రెస్‌ వైపు తిప్పిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. అంత దూరదృష్టితో ఎన్నికలను ఎదుర్కొవడం ఒక్క రేవంత్‌ రెడ్డికే సాద్యమైంది. ఆరు నెలలుగా బిఆర్‌ఎస్‌ పెంచుకున్న ఆశలను వారం రోజుల్లో పటాపంచెలు చేసి, కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అటు పాలనలో సిఎం. రేవంత్‌ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇటు ఎదురయ్యే ఎన్నికలను గెలిపించుకుంటూ పార్టీకి వరుస విజయాలు అందిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి రచించే వ్యూహాలు చేదించడం బిఆర్‌ఎస్‌ వల్ల కాదని మరోసారి నిరూపించారు. తన రాజకీయం ముందు బిఆర్‌ఎస్‌ రాజకీయాన్ని తుత్తునీయం చేశారు. గెలుపుంటే ఇదీ అని మరోసారి బిఆర్‌ఎస్‌ గుండెలు అదిరేలా కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన రాజకీయాలకే పాఠం నేర్పిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఇక జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్ర స్ధాయిలోనే కాదు, జాతీయ స్దాయిలో కూడా సిఎం. రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా తెలంగాణ వైపు చూసేలా చేశాయి. రేవంత్‌ రెడ్డి నాయకత్వ పటిమ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. జూబ్లీహిల్స్‌ ప్రజుల సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనకు డిస్టింక్షన్‌ మార్కులేశారు. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన కన్నా సిఎం. రేవంత్‌రెడ్డి పాలన ఎంతో బెటర్‌ అని నిరూపించారు. సాదారణ ఎన్నికలను ఒంటి చేత్తో సిఎం. రేవంత్‌ రెడ్డి గెలిపించారు. తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు కాంగ్రెస్‌కు సాదించిపెట్టారు. 8 మంది పార్లమెంటు సీట్లను గెలిపించారు. బిఆర్‌ఎస్‌కు రాష్ట్ర రాజకీయాల్లో చోటు లేకుండా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ సున్నా చుట్టేలా చేశారు. తర్వాత వచ్చిన వరుస ఉప ఎన్నికలు గెలిపిస్తూ వస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిపించారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారు. పార్టీకి కొండంత బలాన్ని అందిస్తున్నారు. వరుస గెలుపులను పార్టీకి అందిస్తూ పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి ఉత్తమైన పాలన అందిస్తున్నారు. ఏ ానాయకుడైనా తన పాలన చరిత్రలో నిలిచిపోవాలనే కోరుకుంటారు. అలాగే తనదైన పాలన సాగించేందుకు, తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు

 కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T140436.606.wav?_=3

 కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి

 

హైదరాబాద్ రహమత్ నగర్‌‌లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్‌ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

 జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో రహమత్ నగర్‌లో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్‌ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం కార్యకర్తపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవకముందే కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము పదేళ్లు అధికారంలో ఉన్నామని, ఎన్నో ఉప ఎన్నికల్లో గెలిచామని కానీ, ఎప్పుడు కాంగ్రెస్‌ సభ్యులపై తాము దాడులు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఅర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, తమ కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. దొంగ ఓట్లు, గూండాగిరి, డబ్బులు పంచడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.తాను అహంకారం తగ్గించుకోవాలన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఎవరిదీ అహంకారమో ప్రజలే గమనిస్తున్నారన్నారు. ఒకే ఒక్క ఎన్నికలో గెలిచిన ఆనందంలో నిన్న ఊరేగింపు చేశారని, తాము ఎన్నో ఎన్నికలు గెలిచినా పార్టీ గుర్తును గాడిదపై పెట్టి ఊరేగింపులు చేయలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గూండాయిజం ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

నవీన్ యాదవ్ గెలుపు ఆనందదాయకం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-15T120933.523.wav?_=4

 

 

నవీన్ యాదవ్ గెలుపు ఆనందదాయకం

ప్రజలు మద్దతు ప్రజా ప్రభుత్వం వైపే

సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్

పరకాల,నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ జెండా ఎగురవేయడం సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు,సమన్వయ కమిటీ సభ్యులు మార్క రఘుపతి గౌడ్ అన్నారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరో అద్భుత విజయాన్ని అందుకుందని ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఎన్ని రకాల దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేక పోయారని అన్నారు.జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు బీసీలకు రాజకీయ ప్రాధాన్యం,సమాగ్ర హక్కులు సాధించడంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నవీన్ యాదవ్ గెలుపు ప్రజల విజయమని అన్నారు.

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు…

నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీతో ఇక కాంగ్రెస్ కు తిరుగులేదు

అభివృద్ధికి డోకా లేదు

ఇక నుంచి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ దే గెలుపు-కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన నవీన్ యాదవ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలిపిన వెలిచాల

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ సాధించడంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ కు తిరుగులేదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తారని తెలిపారు. శుక్రవారం వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అక్కడి ప్రజలు నిరూపించారనీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసంతోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టారని ఆనందం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇరవై ఐదు వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ కు రాజేందర్ రావు హర్థిక శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి సింపతి ఏమాత్రం పని చేయలేదని ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం రికార్డని రాజేందర్రావు అన్నారు. నవీన్ యాదవ్ అతని తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ పై బీఆర్ఎస్ నేతలు విష ప్రచారం చేశారనీ, వాటిని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పి కొట్టారని బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెప్పారని మండిపడ్డారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి రాజేందర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి జూబ్లీహిల్స్ లో అన్ని వర్గాల ప్రజలు మైనార్టీలు సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీ యమని పేర్కొన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తారని రాజేందర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ ఫలితాలు పునరావృతం అవుతాయనీ, ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని రాష్ట్రంలో తిరుగులేదని రాజేందర్రావు పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు…

కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని బాణసంచా కాల్పులు జరిపి సంబురాలు చేసుకున్నారు.అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నందు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఝరాసంగం మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం పైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మంత్రులుమంత్రులు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఎంతో కృషి చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయమని రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సానుభూతిపరులను గెలిపించి రేవంత్ రెడ్డి ప్రజా పరిపాలనకు పట్టం కట్టి వారికి మరింత బలం చేకూర్చాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-14T143615.810.wav?_=5

రిగ్గింగ్ చేసి గెలిచిన కాంగ్రెస్: మాగంటి సునీత

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత స్పందించారు.

జూబ్లీహిల్స్‌లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని ఆమె అభివర్ణించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలో మాగంటి సునీత తనదైన శైలిలో స్పందించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ రిగ్గింగ్‌ చేసి గెలిచిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ది అసలు గెలుపే కాదని.. నైతికంగా తానే గెలిచానని ఈ సందర్భంగా మాగంటి సునీత స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. 24, 658 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇక ఈ ఉపఎన్నికలో బీజేపీ డిపాజిట్‌ గల్లంతయింది.
ఈ ఏడాది జూన్ 8వ తేదీన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నేత మాగంటి గోపినాథ్ తీవ్ర అనారోగ్యంతో మరణించారు. దీంతో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో నవంబర్ 11వ తేదీన ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం అంటే.. నవంబర్ 14వ తేదీన జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ ఘన విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలో సైతం కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించిన విషయం విదితమే.

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు.. అసలు విషయమిదే..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T111939.734.wav?_=6

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు.. అసలు విషయమిదే..

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌లో ఈసీ నిబంధనలు అతిక్రమించారనే కారణంతో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారని పోలీసులు పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిన్న(మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు ఘర్షణలకి దిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి  ఎన్నికల నిబంధనలు పాటించలేదని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే మధురానగర్ పోలీసు స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిన్న ఎన్నికల సందర్భంగా యూసఫ్‌గూడ పోలింగ్ కేంద్రాల వద్ద కౌశిక్‌రెడ్డి హల్‌చల్ చేశారని పోలీసులు చెప్పుకొచ్చారు. పాడి కౌశిక్‌రెడ్డి తన అనుచరులతో కలిసి మహ్మద్ ఫంక్షన్ హాల్లోకి చొచ్చుకెళ్లారని పోలీసులు వెల్లడించారు. తాము వద్దని చెప్పినా ఆయన వినకుండా లోపలికి నెట్టుకెళ్లారని పోలీసులు వివరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారనే కారణంతో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ట్రేస్ పాసుతో పాటు న్యూసెన్స్ కేసు నమోదు చేశామని మధురానగర్ పోలీసులు పేర్కొన్నారు.

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T145837.753.wav?_=7

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎన్నికల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈరోజు (సోమవారం) హరీష్ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌ను (సీఈవో) బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పోలీసులు, అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ పంపిణీ చేస్తోన్న చీరలు, మద్యం పంపిణీ వీడియోలను ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిపారు. యూసుఫ్‌గూడాలో పోలింగ్ కేంద్రం పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయన్నారు. రెండేళ్ళుగా ఆరు గ్యారెంటీల అమలుపై రివ్యూ చేయని సీఎం.. ఈరోజే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ ఓటమిని అంగీకరించారు… అందుకే ఆరు గ్యారెంటీలపై రివ్యూ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఓటర్లను మభ్యపెడ్తున్నారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి

 

జూబ్లీహిల్స్ నియోజవర్గానికి రేపు ఎన్నిక జరుగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సిబ్బందికి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల 1,365 మంది ఓటర్లు ఉన్నారు. 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 407 పోలింగ్ కేంద్రాలనుు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నాలుగు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలింపు ప్రక్రియ మొదలైంది. సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించనున్నారు.
3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులతో కలిపి మొత్తం 5 వేల మంది పోలీసులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విధుల్లో ఉన్నారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈసారి డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ జరుగనుంది. 103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. సమస్యత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. 45 ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఎంసీసీ నిబంధనలు అతిక్రమించిన 27 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కాగా.. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో‌ ఉపఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్ నుంచి మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉండగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైన ఉప ఎన్నికలో గెలవాలని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీవ్రంగా కృషి చేశాయి. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి మరి.

గల్లీ గల్లీకి మంత్రులు గల్లి గల్లి లో నాయకులు…!

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-06T114450.368.wav?_=8

 

గల్లీ గల్లీకి మంత్రులు గల్లి గల్లి లో నాయకులు…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ఉప ఎన్నికల్లో అధికారకాంగ్రెస్పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. నియోజకవర్గం లోని డివిజన్ల వారీగా మంత్రులు ప్రచారంలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రుల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ను ఇన్చార్జిలుగా నియమించిన కాంగ్రెస్ మిగతా మంత్రులకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించింది. ఇక నియోజకవర్గంలో నేతలు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తు న్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదప్పైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తిప్పికొడుతూ ప్రజలకు వివరిస్తున్నారు. నామినేషన్లు ఉపసంహరణ ముగియడంతో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రచారంలో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రతి డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున 13 మందికి ప్రచార బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది. మంత్రితో పాటు నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు ఒక బృందంగా ప్రచార బాధ్యతలు చేపట్టారు. కాగా, ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వంశీచంద్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ సమావేశమయ్యారు.జూబ్లీహిల్స్ఎన్నిక ప్రచార తీరు, వ్యూహాలను చర్చించినట్లు సమాచారం.

గల్లీ గల్లీకి మంత్రులు

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్? ను గెలిపించాలని కోరుతూ మంత్రి సీతక్క శనివారం బోరబండలో దోశలు వేసి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. యూసుఫ్గూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో నడిపి ఓట్లు అభ్యర్థించారు. షేక్?పేట డివిజన్ లో మంత్రి వివేక్? ఇంటింటి ప్రచారం చేశారు. అలాగే ఎర్రగడ్డ రైతు బజార్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో సమష్టిగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!

◆:- మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం!

◆:- రహ్మత్ నగర్ డివిజన్ శ్రీ రామ్ నాగర్ లో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ 190,191 బూత్ లలో గడప గడప తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ నాయకులు ముర్తుజా చంద్రన పటేల్ బాబర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లో ఉండే నేత నవీన్ యాదవ్…

ప్రజల్లో ఉండే నేత నవీన్ యాదవ్

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశంలో వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ నవీన్ యాదవ్ విద్యావంతుడు స్థానికుడు నిత్యం ప్రజల్లో ఉండే నేతగా పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారని పేద ప్రజలకు చిన్న శ్రీశైలం యాదవ్ సాయం చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు. తండ్రి బాటలో నడుస్తున్న నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఓటర్లు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో పెద్ద ఎత్తున చేపడుతున్నారని రాజేందరావు పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన ఇంటలెక్చువల్ విద్యావంతులు ప్రముఖులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వారితోను రాజేందర్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రచారం నిర్వహించిన…

షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రచారం నిర్వహించిన

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం షేక్ పేట్ డివిజన్‌లోని బూత్ నెంబర్ 63 కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులూ డాక్టర్” సిద్ధం ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా, హస్తం గుర్తుకే ఓటు వేయించి భారీ మెజారిటీతో గెలిపించాల‌న్నారు.మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీతో గెలుపించాలన్నారు.ఈకార్యక్రమంలో షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు జహీరాబాద్ నాయకులూ పి శ్రీకాంత్ రెడ్డి రంగ అరుణ్ జావీద్ మొహిన్ ఆత్మ డైరెక్టర్ బి రవి కుమార్ లాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం

◆:- బీఆర్ఎస్ నాయకులు షేక్ సోహెల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్. టిఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపుకు దారి కాబోతున్నారని గతంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు హైదరాబాద్ మహానగర అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని ఇప్పుడు అవే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మ విజయానికి సూచిక కాబోతున్నాయని ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు షేక్ సోహెల్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళా ఖాతాలో 2500 రుపాయలు, వృద్ధులకు 2 వెయ్యిల నుంచి 4 వెయ్యిలకు, వికలాంగులకు రెట్టింపు చేస్తామని విస్మరించారని అన్నారు.

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం…

బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం

భూపాలపల్లి నేటిధాత్రి

 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తు పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ యూసుఫ్ గూడ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి నేడు ఇంటింటి ప్రచారం చేస్తే ప్రజలు మాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అన్నారు
ముఖ్యమంత్రి మాట చెప్పితే ప్రజలు మాకు మంచి జరుగుతుంది అని నమ్మేవారు…
కానీ నేటి ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లు వేసి దేవుళ్ళనే మోసం చేసిండు మనం ఎంత అంటూ తిట్ల దండకం వల్లిస్తున్నారు.
పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క మజ్లిస్ పార్టీ నుండి పార్టీలోకి తీసుకుని నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఒక్క వర్గం ఓట్ల కోసం ఒక్క చెల్లని వ్యక్తి గతంలో పోటీ చేసిన వ్యక్తికి ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జోరుగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

జోరుగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ డివిజన్ లో లక్ష్మీనరసింహ నగర్ (L.N )డోర్ టు డోర్ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లా మూడ చైర్మన్ & పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ పాల్గొని ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటు వేసి గెలిపించాలని ఓట్లరను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా మైనారిటీ ప్రెసిడెంట్ ఫయాజ్, టీం పట్వారీ శశిధర్, బి. రాజేష్ యాదవ్, ప్రేమ్, కలముద్దీన్, వెంకటమ్మ, పద్మమ్మ, రాజేష్, చిన్ను, హానీబ్, హనీఫ్, అతిఫ్, మన్సూర్, నద్దు మరియు బూత్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!
◆:- మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం!

◆:- రహ్మత్ నగర్ డివిజన్ శ్రీ రామ్ నాగర్ లో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ తో కలిసి రహమత్ నగర్ డివిజన్ గడప గడప తిరుగుతూ బి.ఆర్.ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గంగా నగర్ 110,151, బూత్ లలో ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ముర్తజా నియోజకవర్గ సీనియర్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్ ప్రచారంలో బిఆర్ఎస్ నేతల పిలుపు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న షేక్ ఫరీద్ మరియు షేక్ సోహెల్ నాయకులు

మాగంటి సునీత గోపీనాథ్‌ ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు ఇంటింటి ప్రచారంలో పాల్గొని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ కు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓట్లను కోరారు. బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ ఫరీద్ తో కలిసి ఝరాసంగం మండల తుమ్మన్ పల్లి గ్రామ మైనారిటీ సీనియర్ నాయకులు షేక్ సోహెల్ బీఆర్ఎస్ దే విజయం ఖాయమని జూబ్లీహిల్స్ – ఉపఎన్నికలో గులాబీకే 100% విజయావకాశాలు..కారుతో పోటీపడి గెలవడం కాంగ్రెస్ కు అసాధ్యం..45 రోజుల సర్వే లో 55.2శాతం ప్రజా మద్దతు బెదిరింపు రాజకీయాలకు భయపడే లేదు – మీ నకిలీ వాగ్దానాలు,దబాయింపులకు జూబ్లిహిల్స్ ఓటమితో ముగింపు..2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? : టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించి, అభివృద్ధిలో పాలి భాగస్తులు కావాలని ఓటర్లను కోరారు.
వారితోపాటు శశివర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version