బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
పరకాల మండల మడికొండ ప్రశాంత్ అధ్యక్షుడు
పరకాల నేటిధాత్రి
బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు ప్రభుత్వం తక్షణమే బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ పరకాలమండల అధ్యక్షత మడికొండ ప్రశాంత్ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారని దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు,7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందని 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.