గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి….

గ్రంథాలయానికి 40 వేల రూపాయల పుస్తకాలు అందించిన నరహరి

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి తన తల్లిదండ్రులు దివంగత గుండు రాధ,రామలక్ష్మన్ జ్ఞాపకార్థం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు గౌడు కు రూ 40 వేల రూపాయల విలువగల పుస్తకాలను అందించి ఔదార్యం చాటుకున్న భూపాలపల్లి రూరల్ మండలం కమలాపురం గ్రామానికి చెందిన పూజిత,నరహరి దంపతులు. సందర్భంగా వారు మాట్లాడుతూ
నేటి సమాజంలో పుట్టినరోజు చనిపోయిన రోజుల పేరుతో ఎన్నో డబ్బులు వృధా చేస్తున్నారని,ఏదైనా ఒక మంచి పని చేయాలని ఉద్దేశంతో విజ్ఞానాన్ని అందించడానికి పుస్తకాలను గ్రంధాలయానికి అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ఏఐటీయుసి నాయకుడు రమేష్. బాలగొని రమేష్ మంతెన సమ్మయ్య తిరుపతి తదితరులు పాల్గొన్నారు

కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం.

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పీసీసీ సభ్యులు పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట పట్టణ కేంద్రానికి చెందిన విగ్నేశ్వర రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ బుదవారం ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అజ్మీర మేఘ్య నాయక్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, మాజీ కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, 13వ వార్డు ఇంచార్జ్ శ్రీరామోజు మురళి, బీరం భరత్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, విగ్నేశ్వర రైతు సంఘం అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి, విజ్ఞేశ్వర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రేమిడి శ్రీనివాసరెడ్డి, ఇంచార్జ్ రాజా మల్లారెడ్డి, మేడబోయిన కుమార్, విగ్నేశ్వర రైతు సంఘం సభ్యులు, రైతులు, పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version