మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మహేష్ యాదవ్ నుండి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

 

అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున 30000 ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ .. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 మంది అనారోగ్యంతో మృతి చెందారు అదేవిధంగా బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి కింద పడి గాయాలవడం తో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ చనిపోయిన బుడ్డమ్మ , రాజు, పున్నమ్మ ,నరసింహ లకు అదేవిధంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాద వశాత్తు కిందపడ్డ యాదయ్య లకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు .ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 6 కుటుంబాలకు 30000 ఆర్థిక సాయం చేస్తూ ఎవరు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాకు తెలియజేయాలని మీ కుటుంబాలకు అండగావుంటా అని భరోసా ఇచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, చంటి, బిక్షపతి, నవీన్, సాదిక్, రాజేష్, లక్ష్మణ్,మధు,మహేష్, రాకేష్, వినోద్ రమేష్,శ్రీకాంత్, శ్రీధర్, వంశీ,శేఖర్ గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

గంగమ్మ దేవస్థానం కొత్త కమిటీకి ఘన సత్కారం…

గంగమ్మ దేవస్థానం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన – సుమన్ బాబు..

తిరుపతి(నేటిధాత్రి)సెప్టెంబర్

 

తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నూతనంగా ఏర్పాటైన చైర్మన్ మహేష్ యాదవ్, కమిటీ సభ్యులు రుద్ర కిషోర్, విమల, వరలక్ష్మి, మధులత, గుణ, భాగ్య వల్లి, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, శ్యామల, లక్ష్మనరావు లను.. గురువారం గంగమ్మ తల్లి దేవస్థానంలో తిరుపతి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సుమన్ బాబు ఘనంగా సత్కరించారు. చైర్మన్, కమిటీ సభ్యులందరికీ జనసేన నాయకులు సుధాకర్, పవన్ కుమార్, సుమంత్ లలో కలసి శుభాకాంక్షలు తెలియజేశారుకూటమి ప్రభుత్వంలో ఏర్పడిన ఈ కమిటీ సభ్యుల ద్వారా గంగమ్మ తల్లిని భక్తులకు మరింత చేరువయ్యేలా చేయాలని, ఆలయ అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలను అందించాలని సుమన్ బాబు కోరారు. ఈ క్రమంలో ఆముదాల వెంకటేష్, జానకిరామ్ రెడ్డి, పవన్ ముకేష్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.

బీజేపీ కార్యకర్తలపై దాడులు ఇకపై సహించం – ఖబర్దార్.

హెచ్చరించిన జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

చిట్యాల మండలం లోని కాల్వపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్ పై ఆగస్టు 15న జరిగిన దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్, ఆయన భార్యపై దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
గ్రామ సమస్యలు పరిష్కరించేందుకు చర్చించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దాడులకు పాల్పడటం పూర్తిగా బలహీనత రాజకీయాలు అని నేతలు విమర్శించారు. ఇలాంటి దాడులు ప్రజలలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేవని, దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు.

 

దాడికి వెనుక ఉన్న పులి తిరుపతి రెడ్డి – పులి అంజిరెడ్డి గ్యాంగ్.

జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ –
ఈ దాడి వెనుక తిరుపతి రెడ్డి, పులి అంజిరెడ్డి అనుచరులే ఉన్నారని స్పష్టమవుతోంది. వారే కుట్ర పన్ని, తమ అనుచరులను ప్రేరేపించి బీజేపీ కార్యకర్త పంచిక మహేష్ యాదవ్, ఆయన కుటుంబంపై దాడి చేయించారని ఆరోపించారు.

తమ వ్యక్తిగత స్వార్థం కోసం, రాజకీయ లాభాల కోసం గ్రామంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే ధైర్యం లేక భయపడి ఇలాంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి అనుచరులు గ్రామ ప్రజలను భయపెట్టడం, బెదిరించడం, బీజేపీ కార్యకర్తలను అణగదొక్కడమే తమ రాజకీయ విధానంగా మార్చుకున్నారు. కానీ ఈ పద్ధతులు ఇకపై పనిచేయవని, ప్రజలు వారిని తిప్పికొడతారని నేతలు స్పష్టం చేశారు.

నిషిధర్ రెడ్డి గారి హెచ్చరిక

“గ్రామాల్లో బీజేపీకి విపరీతమైన ప్రజా మద్దతు లభిస్తోంది. ఈ పెరుగుతున్న శక్తిని తట్టుకోలేక ప్రత్యర్థులు దాడులకు దిగుతున్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు తాత్కాలిక లాభాల కోసం పార్టీలను మార్చే వారు కాదు. వారు దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడే నిజమైన యోధులు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పార్టీలను చిన్న పిల్లలు ఆట వస్తువులు మార్చుకున్నట్లుగా మార్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సత్యనారాయణ అనుచరుడిగా మారి మా కార్యకర్తలపై దాడులకు ప్రోత్సహించడం ప్రజలు బహిరంగంగా గమనిస్తున్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా తన అనుచరులను అణగదొక్కే రాజకీయాలకు ఉపయోగించుకోవడం బాధాకరం. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత వహించాల్సింది పోయి, బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడమే ఆయన రాజకీయమైపోయింది.
ఇకనైనా మా కార్యకర్తలపై దాడులు జరిగితే బీజేపీ అస్సలు ఊరుకోదు. ప్రజాపరంగా, చట్టపరంగా గట్టి సమాధానం ఇస్తాం. ఇది మా చివరి హెచ్చరిక – ఖబర్దార్!” అని నిషిధర్ రెడ్డి గారు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:జిల్లా ప్రధాన కార్యదర్శి తాడికొండ రవికిరణ్
మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్టేకుమట్ల మండల అధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు చక్క నరసయ్య బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అశోక్ చారి బిస్కుల రవి ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T175746.314.wav?_=1

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి.

తీన్మార్ మల్లన్న బిసి జేఏసీ రవి పటేల్.

చిట్యాల, నేటిధాత్రి :

 


 

 

సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో
తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ రవి పటేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూచిట్యాల మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన పంచిని మహేష్ యాదవ్ పైన ఆగస్టు 15 రోజున అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్ భార్య పిల్లలు వారి మామ ఇతరులపై దాడి చేశారని బిసి పొలిటికల్ జేఏసీ నీ కలవడం జరిగింది, మహేష్ పై భౌతిక దాడులు సమంజసం కాదని ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్టడం బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం
గుడికి సంబంధించింది గానీ ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలి గాని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు
మహేష్ యాదవ్ కాల్వపల్లి గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తాడని అక్కస్సుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అగ్రవర్ణాలు అని మా దృష్టికి రావడంతో మహేష్ ను తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ నుండి సర్పంచి అభ్యర్థిగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబెట్టడానికి మేము కార్యచరణ తీసుకొని కాల్వపల్లి లో మహేష్ యాదవ్ ను గెలిపించుకుంటామని
రవి పటేల్ అన్నారు ఈ కార్యక్రమంలో
రోడ్డ శ్రీను ప్రణీత్ వెంకటేష్ అఖిల్ సమిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version