చిన్నదగడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన రాష్ట్ర మంత్రి
వనపర్తి నేటిదాత్రి .
రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక ,శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం నాడు వనపర్తి జిల్లా పానగల్, చిన్నంబావి మండలాల పర్యటి oచారు చిన్నదగడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడిన మంత్రి వర్షం పడిన ప్రతిసారీ పాఠశాల భవనం కురుస్తుందని, భవనం శిథిలావస్థకు చేరిందని కొత్తగా మంజూరు అయి నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారని ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.వెంటనే స్పందించిన మంత్రి పాఠశాల నిర్మాణానికి 96 లక్షలు మంజూరు చేస్తే గత నాలుగు సంవత్సరాల నుండి పూర్తి చేయకుండా మధ్యలోనే అసంపూర్తిగా వదిలేసిన కాంట్రాక్టును వెంటనే రద్దు చేసి కొత్తగా టెండర్ పిలవాలని పంచాయతీ రాజ్ ఎస్ ఈ ను ఫోన్ ద్వారా ఆదేశించారు. రేపే కొత్తగా టెండరు పిలిచి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చూడాలని ఆదేశించారు ఇప్పటికే మంజూరు అయిన 96 లక్షల నిధులను అదనంగా మరో 50 లక్షల రూపాయలు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు పాఠశాలకు అన్నిమౌలిక వసతులతో నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు
గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామస్థులు మంత్రి వెంట ఉన్నారు