విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

స్వగ్రామ విద్య అభివృద్ధికి అంకితభావం…

కేసముద్రం,ఇనుగుర్తి హై స్కూల్స్ కి చెస్ బోర్డుల బహుకరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి అమెరికాలో నివాసముంటున్న వెంకటగిరి గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ గుజ్జ శ్రీనివాసరావు, ఆయన సతీమణి మంజుల దంపతులు విశేష సహకారం అందించారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, మేధస్సు అభివృద్ధి కోసం మండలంలోని 14 ప్రభుత్వ హైస్కూల్స్‌కి ఒక్కొక్క పాఠశాలకు 6 చొప్పున చెస్ బోర్డులు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, బండారు నరేందర్, ధన్నసరి సింగిల్ విండో చైర్మన్ మర్రి రంగారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, గుగులోత్ వీరునాయక్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా పేర్కొన్నారు.

అమెరికాలో నివసిస్తూ స్వగ్రామ విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో ముందుకు వస్తున్న గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతులు నిజమైన ఆదర్శ దాతలు అన్నారు.

చెస్ ఆట విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని దాత అభిప్రాయపడ్డారు.

స్వగ్రామ విద్యా అభివృద్ధికి అంకితభావంతో చేసిన గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతుల సహకారం కేసముద్రం మండల విద్యా రంగంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-63.wav?_=1

డిఈఓ జ్ఞానేశ్వర్ కు ఘన సన్మానం

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

వరంగల్ జిల్లా విద్యాధికారి మామిడి జ్ఞానేశ్వర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూరైన సందర్భంగా ఘన సన్మానం చేశారు.ఈ నేపథ్యంలో డిఈఓ జ్ఞానేశ్వర్ ను ఏఎంఓ సృజనతేజ, జీఈసిఓ ఫ్లోరెన్స్, డిఎస్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్స్, కోఆర్డినేటర్లు, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం జగదీశ్వర్ లు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఏడాకులపల్లిలో విద్యార్థులకు ఉచిత బ్యాగులు..

ఏడాకులపల్లి గ్రామంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రెస్టీజ్ వెంచర్ యజమాని సత్యనారాయణ ఝరాసంగం మండల గ్రామం ఏడాకులపల్లి ఎంపియుపిఎస్ పాఠశాల విద్యార్థులకు ఉచిత స్కూల్ బాగ్స్ పంపిణి చేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొప్పోజు శ్రీనివాస్,గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, సంగారెడ్డి మరియు వీరన్న పాల్గొనడం జరిగింది.మరియు పాఠశాల ఉపాధ్యాయులు రజిత రేణుక పాఠశాల చైర్మన్ కల్పన ఈ కార్యక్రమంలో పాల్గొని కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

9000 రూ తో పాఠశాలకు సౌండ్ సిస్టం బహుకరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-2.wav?_=2

9000 రూ తో పాఠశాలకు సౌండ్ సిస్టం బహుకరణ

గుర్రం వెంకన్న గౌడ్ సేవలు అభినందనీయం

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్.

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం గ్రామంలో ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ సేవలు అభినందనీయం అని జిల్లాపరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ అన్నారు,తాను పనిచేస్తున్న పాఠశాల కోసం వారి యొక్క నేస్తం మిత్రులు, వాకర్స్ మిత్రులు , ఫ్యామిలీ ఫ్రెండ్స్ మిత్రులు మరియు ఇంకా కొంతమంది దగ్గరి మిత్రుల నుండి సేకరించిన 9000/- రూలతో ఆహుజ కంపెనీ సౌండ్ సిస్టంను తీసుకొని రాంపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శశిధర్ మాట్లాడుతూ పాఠశాలకు వచ్చిన మొదటి రోజు నుండి మొదలుకొని ఇప్పటివరకు పిల్లల అవసరాలు తీర్చడానికి, పాఠశాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు గతం లో పిల్లలకు నోట్ పుస్తకాలు, పెన్నులు,పెన్సిల్ లు,నవోదయ పుస్తకాలు ఇవ్వడం జరిగిందని ఇప్పుడు ప్రార్థన సమయంలో, మరియు వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడే సౌండ్ సిస్టం ను తీసుకురావడం ఎంతో ఉపయోగం అన్నారు వెంకన్న గౌడ్ ను తోటి ఉపాద్యాయులు,పిల్లల తల్లిదండ్రులు అభినందించారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కనకం గణేష్, శ్రీధర్, కిన్నెర శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణవేణి స్కూల్‌లో స్వాతంత్ర్య, కృష్ణాష్టమి వేడుకలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-11-5.wav?_=3

శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

నృత్యాలతో అలరించిన విద్యార్థులు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.

Krishnaveni School

చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కృష్ణవేణి హైస్కూల్‌లో స్వాతంత్ర్యం & కృష్ణాష్టమి వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-53-1.wav?_=4

శ్రీ కృష్ణవేణి హైస్కూల్లో ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

నృత్యాలతో అలరించిన విద్యార్థులు

నస్పూర్(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు దేవన్న గౌడ్ ఘనంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల వేషధారణలో విద్యార్థులను అలంకరించి,ఆటపాటలతో చిందులు వేపించారు.అలాగే పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.

చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో నృత్యాలు చేసి అందరినీ ఆహ్లాదపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ బత్తిని రాకేష్ గౌడ్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జెండా పండుగ..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-48-1.wav?_=5

ప్రభుత్వం జూనియర్ కళాశాల లో ఘనంగా జెండా పండుగ

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 15నాడు 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ జెండావిష్కరించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ స్వతంత్రం కోసం మనము 1857 నుంచి 1947 వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగిందని తద్వారా మనకు స్వతంత్రం సిద్ధించింది కావున ప్రతి విద్యార్థి తప్పకుండా స్వతంత్ర పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈరోజు మనము కళాశాలలో ఉచిత విద్య మరియు ఉచిత హాస్టల్స్ గురుకులాలు స్కాలర్షిప్ సౌకర్యము పొందుతున్నాము విద్యార్థులందరూ దేశ రక్షణ కోసం అందరూ పాటుపడాలని ఉత్తమ పౌరులుగా తయారు కావాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు కళశాల సిబ్బంది పాల్గొన్నారు.

500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ..

500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుండి ఈ దేశానికి స్వాతంత్ర్యం ఊరికే రాలేదని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిందని అన్నారు.మహమ్మదీయుల నుండి బ్రిటిష్ పాలన వరకు మన దేశం బానిస సంకెళ్లను అనుభవించడానికి కారణం మన దేశ ప్రజల్లో ఐకమత్యం, దేశపట్ల ప్రేమ లేకపోవడమే కారణం అని అన్నారు. లక్షల మంది ప్రాణత్యాగంతో వచ్చిన ఈ స్వేచ్ఛను కాపాడుకునే బాధ్యత ఈ దేశ పౌరులుగా మన అందరి మీద ఉందని పునరుద్ఘాటించారు. దేశంలో ఇప్పుడు కూడా కొన్ని శక్తులు డీప్ స్టేట్ కనుసన్నల్లో, విదేశీ భావజాల ముసుగులో ఈ దేశాన్ని అస్థిర పరిచే కుట్రపన్నుతున్నారని దీనిని అడ్డుకొని తీరాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వ్యక్తి నిర్మాణమే ఆదర్శం కావాలి తప్ప నిర్మూలన కాదన్నారు. ఈ దేశం ప్రపంచానికి మానవ వనరులను అందించే కర్మాగారంగా ఉందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ విశ్వగురు స్థానం వైపు దూసుకెళ్తున్న సమయంలో మరోమారు దేశ విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగి పోతున్నారని బాధ్యత గల పౌరులుగా, దేశభక్తులుగా భరతమాతను కాపాడుకోవాలని యువతకు,విద్యార్థులకు పిలుపునిచ్చారు.పూర్వ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జుల.ప్రేమ్ కుమార్, ప్రదీప్, విఘ్నేష్, సాయితేజ, వైష్ణవి, సహస్ర, అభి, బంటి, పేట. సాయి, వరుణ్, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఒకరితో అభివృద్ధి సాధ్యం కాదు…

ఒకరితో అభివృద్ధి సాధ్యం కాదు
-జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

రాయికల్, ఆగస్టు 14, నేటి ధాత్రి:

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి కే. రాము గారు మాట్లాడుతూ ఏ ఒక్కరితో అభివృద్ధి సాధ్యం కాదని అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 2024- 25 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు చందాలు వేసుకొని పాఠశాలలో విద్యార్థుల కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. అలాగే బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహకరించిన గొడ్డండ్ల రాజగోపాల్, మ్యాలపు మురళి గార్లను ప్రత్యేకంగా డీఈఓ గారు అభినందించారు. ఈ పాఠశాలకు అభివృద్ధి కొరకు గతంలో సహకరించిన వారి విధంగానే భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. కలిసికట్టుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాన్ని డీఈవో గారు అభినందించారు. తదనంతరం దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ గారు, దాతలు గొడ్డండ్ల రాజగోపాల్ గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

విస్డం పాఠశాలలో ముందస్తు జన్మాష్టమి సంబరాలు…

విస్డం ఉన్నత పాఠశాలలో ఉల్లాసభరితంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రాయికల్: ఆగస్టు 14, నేటి ధాత్రి:

పట్టణంలోని విస్డం ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉల్లాసభరితంగా నిర్వహించారు. దీనిలో విద్యార్థిని విద్యార్థుల చిన్ని గోపిక కృష్ణ వేషధారణలు అందరికీ చూడముచ్చట గొలిపాయి. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. దీనిలో గోపిక కృష్ణులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ డా. ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ కృష్ణం వందే జగద్గురుం-మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించారని, జీవిత సత్యాలను, కర్మ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని తన భగవద్గీత ద్వారా సమాజానికి అందించిన మహా పురుషుడు శ్రీకృష్ణుడు అని అన్నారు.అటువంటి శ్రీకృష్ణుడు అందించిన గీత సారాన్ని ప్రతి ఒక్కరూ వారి మనసులో నిలుపుకొని వాటి నియమాలను పాటిస్తూ మానవ జీవితాన్ని పునీతం చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో డైరెక్టర్ ఎద్దండి నివేద రెడ్డి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42.wav?_=6

బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద వీడియో కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ & డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు, వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అన్నారు.
నేషనల్ స్కాలర్ షిప్ క్రింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2 వేల రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3 వేల రూపాయలు, డిగ్రీ, పిజి డిప్లమా కోర్సుల చదివే పిల్లలకు 6 వేల రూపాయలు, ఐటిఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8 వేల రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25 వేల రూపాయల ఉపకార వేతనం అందుతుందని అన్నారు.

Collector Sandeep Kumar Jha

 

1 నుంచి 10వ తరగతీ వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు,ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలందరూ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత గల బీడీ కార్మికుల పిల్లలందరూ scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ కోర్ట్ నందు దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కేంద్ర సంక్షేమ ఆసుపత్రి డా.మహేందేర్, డా.మధుకర్, డా.వెంకటేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ అదనాపు డిఆర్డిఏ శ్రీనివాస్ ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలి…

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త జీవోను వెంటనే రద్దు చేయాలి…

తంగళ్ళపల్లి మండలంలో. గురుకుల పాఠశాల ల.కాంట్రాక్టర్లు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలంలో పలు గురుకుల.పాఠశాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు మాట్లాడుతూ. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 17 జీవోను వెంటనే రద్దుచేసి. పిల్లలకు సంబంధించి పాత కాంట్రాక్టు పద్ధతిని. కొన సాగించాలని. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పాత పద్ధతిలోనే. కాంట్రాక్టు . విధానం. కొనసాగించాలని. గురుకుల పాఠశాలకు సంబంధించి. వంట చేసే బాధ్యతను కొనసాగించాలని. వారికి కిరణ్o. స్టోర్. బిల్లు గాని. సంబంధిత. కోడిగుడ్లు. కూరగాయలు గాని వెంటనే పాత పద్ధతి.కాంటాక్ట్ కొనసాగిస్తూ. పిల్లలకు ఎలాంటి అనారోగ్యం లేకుండా చూడాలని. వారు కూడా మా పిల్ల లెక్కనే కదా అని. అనవసరంగా. బాత్రూంలు.కలిగే వారి చేత ఇతర పనులు చేసేవారి చేత. వంటలు చేయిస్తూ. వారి ఆరోగ్యాలతో . చెలగాటం ఆడుతున్నారని.ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎలాంటి అనారోగ్యాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. మనదని. ఈ సందర్భంగా తెలియజేశారు.. లేనియెడల పెద్ద ఎత్తున మా కాంట్రాక్టులు అందరం కలిసి ధర్నాలు చేయడానికి ముందుకు రావడానికి. వెనుకాడబోమని. అలాగే. మాకు కాంట్రాక్టర్లకు. కొన్ని రోజులుగా డబ్బులు ఇవ్వకపోగా. వేరే వారితో పని చేయించుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకొని. మాకు రావాల్సిన బకాయిలు ఇప్పించి. స్కూల్ విద్యార్థుల ప్రాణాలతో చిలగాటం.తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లాకు. సంబంధించిన. గురుకుల పాఠశాల ఫుడ్ కాంట్రాక్టు. కాంట్రాక్టర్లు . కంసాని. మల్లేశం శంకర్.తదితరులు పాల్గొన్నారు

పఠనానికి గ్రేస్ మార్కులు – కేరళలో కొత్త నిర్ణయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-29-3.wav?_=7

కేరళ ప్రభుత్వం విద్యార్థుల్లో పఠన అలవాటును ప్రోత్సహించడానికి కొత్త నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పఠన సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వనుంది.

రాష్ట్ర సాధారణ విద్యాశాఖ మంత్రి వి.శివాంకుట్టి ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.
1వ తరగతి నుండి 4వ తరగతి వరకు ప్రతి వారం ఒక పీరియడ్‌ను పుస్తక పఠనం మరియు అనుబంధ కార్యక్రమాలకు కేటాయిస్తారు. 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు పత్రికలు చదవడం మరియు అప్పగించబడిన కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుంది.
అంతేకాక, పాఠశాల కళోత్సవాల్లో పఠన సంబంధిత విభాగాన్ని చేర్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు ఐడెంటి కార్డు ల పంపిణీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-4.wav?_=8

డబ్బా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు ఐడెంటి కార్డు ల పంపిణీ

గ్రామీణ వైద్యుడు నేమూరి శ్రీధర్

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామం లో ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కు సొంత డబ్బులతో ఐడెంటి కార్డులు లను గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు నేమూరి శ్రీధర్ అందజేశారు.ప్రభుత్వం పాఠశాల చదువుతున్న 70 మంది విద్యార్థిని విద్యార్థుల కోసం ఉదార భావం తో,గొప్ప సేవా భావం తో స హృదయము తో ముందుకు వచ్చి తమ వంతు పాఠశాల కు సహాయం అందిచడం జరిగిందని, ఇదే విధంగా ఇంకా పాఠశాల కు అవసరాలు ఏమి ఉన్న డబ్బా గ్రామ పెద్దలు అంద జెస్తామని తెలిపారు ఈ కార్యక్రమం లో డబ్బా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్. డబ్బా మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య , తాజా మాజీ ఉప సర్పంచ్ కోటి దేవ రెడ్డి, సాదాల మహేష్, రాపెల్లి మహేష్, వడ్డేపల్లి ప్రవీణ్ . సాదాల చిన్న రెడ్డి., నేరెళ్ల సత్తన్న. ఉపాధ్యాయులు మండలోజు అశోక్ గారు, అల్లకట్టు సత్యనారాయణ, చిలుముల రాజేష్ గారు, ఆడెపు నరేష్ గారు అల్లాడి హరి ప్రసాద్ గారు, బొల్లు శంకర్ గారు విద్యార్థులు తల్లి తండ్రులు పాల్గొన్నారు

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, ఐడికార్డ్ ల పంపిని

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-2.wav?_=9

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, ఐడికార్డ్ ల పంపిని

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం మల్యాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా పాఠశాలలో చేరిన 45 మంది 6 వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వామి వివేకానంద సేవాసమితి మల్యాల వారి సహకారంతో ఉచితంగా ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో టై, బెల్ట్, ఐడికార్డ్స్ అందించారు.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ చదువుల్లో, ఆటల్లో విద్యార్థులందరూ పోటీ తత్వంతో ముందుండాలని కోరారు. ప్రతి సంవత్సరం ఇలాగే జిల్లా పరిషత్ పాఠశాలలో చేరిన ఆరవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా టై,బెల్ట్, ఐడికార్డ్ లను అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో
ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర, మరియు టీచర్స్ అమర్ నాథ్, రవీందర్,రాజ్ కుమార్, లావణ్య, స్వర్ణలత, రజిత,స్వప్న,మమత,లావణ్య
స్వామి వివేకానంద సేవాసమితి సభ్యులు కొడకంటి గంగాధర్,పంచెరుపుల దివ్యసాగర్, మోత్కుపల్లి మధు,లోకోజు సతీష్, ఎన్నం శ్రీకాంత్, పొంచెట్టి నవీన్,సాన జలందర్,గొల్లపల్లి సాయి కృష్ణ,లక్క అనిల్, అనపర్తి వెంకటేష్ మరియు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ అందజేత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-08T132815.934-1.wav?_=10

ప్రతిభ చూపిన విద్యార్థులకు ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంఘం మండలం బిడెకన్నే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘స్టూడెంట్ ఆఫ్ మంత్’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. జూలై నెలలో క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపాధ్యాయులు గోరకనాథ్ ఈ అవార్డును అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

విలువలు కోల్పోతున్న విద్యా – వైద్య రంగాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-07T121613.360.wav?_=11

విలువలు కోల్పోతున్న విద్యా – వైద్య రంగాలు…

78 ఏళ్ళ స్వాతంత్రంలో దేశ ప్రజల అవసరాలకు తగినన్ని ఏర్పాటు కానీ విద్య -వైద్య శాలలు…

నిధుల కొరత, నిర్వహణ లోపం తో సక్రమంగా నడవని విద్య-వైద్య సంస్థలు…

విశ్వ జంపాల, న్యాయవాది మరియు విశ్వ సమాజం వ్యవస్థాపకులు…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలైనప్పటికీ మన దేశంలో ప్రజల అవసరాలకు తగినన్ని విద్యాలయాలు – వైద్య శాలలు ఇంకా ఏర్పాటు కాలేదు.ప్రస్తుతం ఉన్న వాటిపై ప్రజలకు విశ్వాసం లేదు.నిధుల కొరత, నిర్వహణ లోపం, పర్యవేక్షణ లోపం, ప్రజల అవగాహన లేమితో ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలు సక్రమంగా నడవడం లేదు.ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలలో పనిచేసే కొందరు ఉపాధ్యాయులు, డాక్టర్లు, ప్రయివేటు విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, అధికారిక, అనధికారిక లావాదేవీలు, వ్యాపారాలు నిర్వహిస్తూ మనసును,సమయాన్ని ఉద్యోగం కన్నా వాటిపైనే కేంద్రీకరిస్తున్నారు.కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.కొందరు ఉపాధ్యాయులు,డాక్టర్లు ఉన్నతాధికారులను, ప్రజాప్రతినిధులను ఏదోరకంగా మచ్చిక చేసుకొంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక అంకెకు మించిలేదు.ఒకప్పుడు ఊరుకొక్క బడి పేరుతో విస్తరింపజేసిన ప్రభుత్వాలు ఆచరణలో శ్రద్ధ చూపకపోవడం,సమాజంలో వచ్చిన పరిణామాలు ప్రభుత్వ పాఠశాలలను,వైద్య శాలలను మరింత అధ్వాన స్థితిలోకి నెట్టి వేశాయి.పేదలకో బడి, పెద్దలకో బడి అన్నట్లుగా మారి,ఒకప్పుడు ప్రజలందరి కోసం ఏర్పాటు చేయబడిన విద్య-వైద్య సంస్థలు కేవలం కఠిక పేద వాళ్ళ కోసమేనన్న విధంగా తయారయ్యాయి.ఎంతో కొంత నాణ్యత ప్రమాణాలు మానవీయ విలువలు పాటించే ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు నేడు నిర్లక్ష్యం నీడన నిరు పేదల బ్రతుకులు అన్న చందంగా మారాయి. “ధరిద్రులను దేవతలు కూడా బాగుచేయలేరు” అనే హితోపదేశాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలు-అధికారులు-విద్య-వైద్య సంస్థల ఉద్యోగులు బాధ్యతల నుండి తప్పుకుంటూ ఉద్యోగ వృత్తి ధర్మాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.రోగమొచ్చిన సమాజానికి శస్త్ర చికిత్స చేయగలిగిన వారు డాక్టర్లు-ఉపాధ్యాయులు మాత్రమే.ఉపాధ్యాయులు, డాక్టర్లు అపసవ్య పరిసరాలను-పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చుకునే శక్తి యుక్తులు-సామర్థ్యం కలిగి ఉంటారు. వీరు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దగలరు,రోగులను ఆరోగ్యవంతులుగా తయారు చేయగలరు.డాక్టర్లు-ఉపాధ్యాయులు సమాజాన్ని మానవీయ కోణంలో ముందుకు నడిపించేందుకు నిరంతరం శ్రమిస్తూ, నాయకులై నడిపిస్తూ సమాజ నిర్దేశకులుగా నిలువగలరు.వారికి ఆవిధమైన శక్తి యుక్తులు-సామర్థ్యం గలదు. కాని డాక్టర్లు-ఉపాధ్యాయులు కూడా ప్రపంచీకరణ- ప్రైవేటైజేషన్-లిబరలైజేషన్ ప్రభావానికి గురైనారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు నాటి ప్రేమ, ఆప్యాయతతో కూడిన పలకరింపులు మర్చిపోయినారు.కొందరైతే ఉన్నామా! తిన్నామా! పడుకున్నామా! అన్నట్లు ఉద్యోగ వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూన్నారు.తల్లి-తండ్రి-దైవం అనే నానుడి ఒకప్పుడు ఉండేది.కాలక్రమేణ అది తల్లి-తండ్రి-గురువు అయ్యింది.ఆ తరువాత తల్లి-తండ్రి-గురువు-వైద్యుడు అయింది. ఈ నలుగురి తర్వాతే దైవం అని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. రోగం వైద్యుడి వల్ల నయం కానప్పుడు మాత్రమే ప్రజలు దైవం మీద భారమేస్తారు.డాక్టర్లు-ఉపాధ్యాయులను దేవుడి కన్నా గొప్పగా సమాజం చూసేది. ప్రతి మనిషి తల్లిని, తండ్రిని గురువులో చూస్తారు. ఆ ముగ్గురిని వైద్యునిలో చూస్తారు. ఇప్పుడు గురువును-వైద్యున్ని అంతటి గౌరవ స్థానంలో చూడడానికి, గౌరవించడానికి, సమాజం సంకోచిస్తూంది. దీనికి కారణం గురువులు,వైద్యులు మానవీయ విలువలు పాటించక పోవడం. నేడు గురు శిష్యుల బందాలు కాని, డాక్టర్-రోగి సంబంధాలు కానీ లేవనే చెప్పాలి.అంకితా భావం కలిగిన తోటి ఉపాధ్యాయుల పట్ల కొందరు ఉపాధ్యాయులే చులకన చేసి మాట్లాడడం బాధాకరం. ఇది ఉపాధ్యాయ వృత్తికే అవమానం.ఎన్నికల్లో లక్షలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని, ప్రజా ప్రతినిదులై కోట్లు దండు కొంటున్న మాదిరిగానే, కార్పోరేట్ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు లక్షలు వెచ్చించి విద్యను కొనుక్కొని భవిష్యత్ లో కోట్లు గడించాలన్న భావన తప్పా, మానవీయ కోణం మచ్చుకైనా కానరాదు. పాలక వర్గాలు భారత రాజకీయాలను నోట్లు ఓట్లు కోట్లు అనే ఫార్ములాకు దిగజార్చారు.అదే మాదిరి విద్యా వైద్య రంగాలను కూడా పైసలు పట్టాలు ధనార్జన గా మార్చారు. విద్యా-వైద్య రంగాలలో విస్తరించిన ప్రైవేట్, కార్పోరేట్ యాజమాన్యాలు పచ్చదనం పరిశుభ్రత లాంటి ఆరోగ్య సేవల రంగంలో అడుగు పెట్టక పోవడం గమనించదగిన విషయం.దీనికి ప్రధాన కారణం ఆరోగ్య సేవల్లో లాభాలు లేకపోవడమే. ప్రజా ప్రతినిధులు, ఉన్నత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బడి బాటలో భాగంగా ఎవరైనా ఎక్కడైనా తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించారేమో ఆలోచించాలి? ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి.ఆచరణాత్మక ఆలోచనలతో నిర్మాణాత్మక ప్రతి పాధనలకు పూనుకోవాలి.

షైన్ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-21-1.wav?_=12

షైన్ హైస్కూల్ లో వ్యాసరచన పోటీలు

భూపాలపల్లి నేటిధాత్రి

టాటా బిల్డింగ్ ఇండియా టిసిఎస్ వారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని షైన్ హైస్కూల్ లో “ఆత్మనిర్చర భారత్” అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ‘మేము సైతం’ దేశ అభివృద్ధిపై సూచనలు, సలహలు ప్రభుత్వాలకు ఇవ్వగలమని సూచించారు. కార్యక్రమ అనంతరం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో టిసిఎస్ పర్యవేక్షక అధికారి రాజు, పాఠశాల చైర్మన్ మూగల కుమార్ యాదవ్, కరస్పాండెంట్ భాన్దుచందర్, ప్రిన్సిపాల్ స్రవంతి, ఉపాధ్యాయుడు రాజేష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు పిల్లలకు ఇంతమంచి కార్యక్రమాలు, పోటీలు జాతీయస్థాయిలో నిర్వహిస్తు నందుకు షైన్ పాఠశాల యాజమాన్యాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులు అభినంధిచారు.

ముందస్తు మధ్యాహ్న భోజన కార్మికులను అరెస్టు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-06T124246.239-1.wav?_=13

ముందస్తు మధ్యాహ్న భోజన కార్మికులను అరెస్టు

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిరసన, ధర్నా చేసుకునే హక్కు లేకుండా ప్రభుత్వాలు అణి చి వేత ధోరణి ఏదైతే ఉందో ప్రభుత్వాలు మానుకోవాలి.కార్మికులు ధర్నా చేసే హక్కులను కాలరాస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా లో మధ్యాహ్న భోజన కార్మికులను రాష్ట్ర సీఐటీయూ పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళుతున్న క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వ చ్చేముందు మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు కావస్తున్న కూడా ఆ దిశగా అమలు చేయడం లేదు. అదే సందర్భంలో మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, గౌరవేతనం, నెలల తరబడి రాకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా నలిగిపోతున్న కూడా ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించకపోవడం వల్ల ఈరోజు అనగా 6, తేదీన చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళుతున్నటువంటి కార్మికులను , నాయకులనుముందస్తు అరెస్టు చేయడాని తీవ్రంగా తప్పు పట్టడం జరుగుతుంది. జిల్లా సీఐటీయూ అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి గారిని, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులను వెంటనే విడుదల చేయాలి, అలాగే తక్షణమే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పూర్తిగా నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా పత్రిక ముఖంగా మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ డిమాండ్ చేయడం జరుగుతుంది..

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన…

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం

ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version