లింగగూడెం పాఠశాలను సందర్శించిన ఆదివాసీ పరిషత్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
ఆదివాసి సంక్షేమ పరిషత్ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని లింగగూడెం మండల పరిషత్ పాఠశాలను సోమవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు మాట్లాడుతూ పాఠశాల దుస్థితి శిథిలావస్థకు చేరి ఉన్నదని ఈ యొక్క పాఠశాల ను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అలాగే మండలంలోని వివిధ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి గుత్తేదారులు అసంపూర్తిగా పనులు చేశారని వాటినన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెండెకట్ల మహేందర్ ఉపాధ్యక్షులు ఇసం లెనిన్ కోశాధికారి అరేం సందీప్ దొర మండల కార్యదర్శి ఇసం శివాజీ సలహాదారులు పెండేకట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.