చిట్యాల పాఠశాలలో ఉపాధ్యాయులకి అవార్డు…

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలం లోని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో జూకల్ లక్ష్మీ విద్యానికేఆతన్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కవి రచయిత మ్యాదరి సునీల్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అంద జేయడం జరిగిందని తెలిపారు, ఈ కార్యక్రమ నికి ముఖ్య అతిథిగా తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ పాల్గొని ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందించడం అభినందనీయం అని అన్నారు , అనంతరం
మాజీ ఎంపీటీసీ జంబుల తిరుపతి ,మాజీ సర్పంచ్ పుట్టపాక మహేందర్ , నూనె స్వామి , కసిరెడ్డి మహేందర్ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్వర్యంలో ఉపాధ్యాయులకు వారు చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది అని చేయూత పౌండర్ మ్యాదరి సునీల్ తెలిపారు ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి వేమునూరి ధనలక్ష్మీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసిల్దార్ ఇమామ్ బాబా షేక్ గారు మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయికి దీటుగా కంప్యూటర్ ప్రొజెక్టరులతో విద్యాను అందించే పాఠశాల మీ ఊరిలో ఉండడం గర్వకారణం అని కొనియాడారు
ఈ సందర్భంగా చేయూత పౌండేషన్ వారు ఇలాంటి విద్యాసంస్థలను గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు ఇవ్వడం అభినందనియం అని అన్నారు.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత.

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

 

పాలకుర్తి నేటిధాత్రి

 

ఎస్సీ కాలనీకి చెందిన గాయాల మధు (మానసిక వికలాంగుడు) అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ట్రస్ట్ తరుపున పూర్తి సహకారంగా ఉంటామని ధైర్యం చెప్పి 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి హరీష్, కోశాధికారి ఒర్రె కుమారస్వామి, ట్రస్ట్ సభ్యులు పెండ్లి భాస్కర్, తాళ్లపెళ్లి రత్నాకర్, ఈ కార్యక్రమంలో గాదేపాక భాస్కర్, మృతుడి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version