ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు
మహాదేవపూర్ (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రం లోని బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం రోజున సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి లో బాగంగా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల లో భాగంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూల మాలలు మరియు శాలువాలతో సత్కరించి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు. భారత దేశపు రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం మొత్తంలో ఉపాధ్యాయుడిగా చేసిన సేవలే అత్యంత తృప్తినిచ్చాయని తన జీవిత చరిత్రలో రాసుకున్న సందర్భాన్ని ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు. ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేది ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన రోజని ప్రధానోపాధ్యాయులు అనిల్ కుమార్ అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల గురించి కవితలు, పాటలు వినిపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాజయ్య, దేవేందర్ రెడ్డి, రమేష్, లచ్చయ్య, అనిల్ కుమార్, సమ్మయ్య,షాజహా, అనిత, కవిత, కిరణ్ కుమార్, కోటేశ్వర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు.