కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి… తక్షణం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

మంగళవారం మహా ముత్తారం మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అపరిశుభ్రతగా ఉంటే పరిసరాల్లోకి విష జంతువులు వచ్చే అవకాశం ఉన్నందున, విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అందువల్ల తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా పరిశుభ్రంగా మార్చాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. చేపట్టిన పారిశుద్ధ్య పనుల ఫోటోలను తనకు పంపించాలని సూచించారు. అదనంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచాలని సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు మరియు విద్యుత్ పనులను వెంటనే ప్రారంభించి, బుధవారం నుండి పనులు వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరా విషయమై మిషన్ భగీరథ అధికారులు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

తనిఖీ అనంతరం
జిల్లా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు. హలో స్టూడెంట్స్… ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు వ్రాసారు? ఎలా వ్రాసారు? ఇంకా ఎన్ని పరీక్షలు మిగిలి ఉన్నాయి?” అని అడిగి తెలుసు కున్నారు. మిగిలిన పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని, బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డీఈఓ రాజేందర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ ప్రకాష్, సర్పంచ్ బాబు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలను సందర్శించిన సర్పంచ్ మోరనిర్మల….

పాఠశాలను సందర్శించిన సర్పంచ్ మోరనిర్మల….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ గ్రామ సర్పంచ్ స్థానిక .కేజీబీవీ. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈరోజు కేజీబీవీ పాఠశాలను సందర్శించడం జరిగిందని అందులో చదువుతున్న పిల్లల బాగోబాగులు ఎలా ఉన్నాయని పిల్లలకి.టిఫిన్లతో భోజనాలు సదుపాయాలు సరిగ్గా మెనూ ప్రకారం టైముకి అందుతున్నాయా లేదా అడిగి తెలుసుకుని పిల్లలకి ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడంతో పాటు పాఠశాల సిబ్బందితో వంటశాల. పిల్లలు చదువుతున్న క్లాస్.రూములు పడక గదులు స్నానపు గదులుబాత్రూములుపాఠశాల ఆవరణమునులుపరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నచో మా దృష్టికి తీసుకురావాలని వాటిపై పై అధికారులతో చర్చించి పిల్లల అవసరాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలందరూ ఆటపాటలతో చదువులో మెరుగ్గా రాణించాలని మిమ్మల్ని కన్నా తల్లితండ్రుల పేరు ప్రతిష్టలు నిలిపాలనిఅలాగే మీరు చదువుతున్న పాఠశాల పేరు ప్రఖ్యాతలు పెంపొంచేదిశగా చదువులో రాణిస్తూ అన్ని రంగాల్లో ముందు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల.పద్మనగర్.గ్రామ సర్పంచ్ మోర నిర్మల. పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల వైద్య శిబిరం…

కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షల నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జంగేడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది విద్యార్థినులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు, టాబ్లెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. మధుసూదన్
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సి.హెచ్. రఘు, మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, రోహిణి, నిహారిక, పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరి ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్.

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం రేగొండ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఈ సందర్బంగా పాఠశాలలోని విద్యార్థులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి భోజనం, వసతి, విద్యా ప్రమాణాలు,బోధన గుణనిల్వ వంటి అంశాలపై విద్యార్థులను,ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని అన్నారు.గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం విద్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని,విద్యార్థులను పట్టించుకున్న పాపాన పోలేదు అని, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేనీ వారు ఇప్పుడు హాస్టల్స్ సందర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.పాఠశాలలో కొరతలున్న వసతులు, మౌలిక సదుపాయాలపై స్పందించిన ఆయన, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి అని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి పాఠశాలల పరిరక్షణపై మరింత శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గూటిజు కిష్టయ్య, పిఏసిఎస్ చైర్మన్ విజ్జాన్ రావు,సంబధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version