అబాకస్ స్టేట్ లెవెల్ కు ఎంజీఎం హైస్కూల్ విద్యార్థిని ఎంపిక
భూపాలపల్లి నేటిధాత్రి
గణపురం (ము). ప్రఖ్యాత ఎన్జీవో సంస్థ విశ్వం ఎడ్యుటెక్ అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ వారు అంకగణిత సమస్యలను క్యాలిక్యులేటర్, కంప్యూటర్ వంటి పరికరాలు లేకుండా అవలీలగా సాధించడానికి అబాకస్ అనే పూసల చట్రం ద్వారా విద్యార్థులకు నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించడానికి ప్రతి ఏటా మండల, జోనల్, రాష్ట్రస్థాయిలో అబాకస్ పోటీలు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఆదివారం పరకాల సి,హెచ్,స్ గ్రౌండ్ యందు జరిగిన జోనల్ లెవెల్ అబాకస్ కాంపిటీషన్లో ఎంజీఎం హైస్కూల్ విద్యార్థిని పి.క్రుతిక శ్రీ (ఐదవ తరగతి) పాల్గొని మొదటి బహుమతి సాధించి స్టేట్ లెవెల్ కు ఎంపికయ్యారు,ఈ సందర్భంగా కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్,ప్రిన్సిపల్ మధుకర్ తో పాటు మిగతా ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు
