ఘనంగా వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం…

ఘనంగా వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోనిబాలాజీ టెక్నోస్కూల్( సీబీఎస్ఈ)లో 150 సంవత్సరాల వందేమాతరం- సంస్మరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ .రాజేంద్రప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ వందేమాతర గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ నవలా ప్రక్రియను పరిచయం చేసిన సాహితీ సుప్రసిద్ధులు భారతమాతకు వందనం అంటూ మొదటి చరణంతో ప్రారంభమైన గేయం స్వాతంత్ర్య సమరంలో ఎందరికో ప్రేరణ ఇచ్చిందని గుర్తు చేశారు.భారత జాతీయ గేయమైన వందేమాతరంను రచించి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిందని తెలియజేశారు.బెంగాల్ సాయిధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకు గురైన తొలి యువకుడు కుదీరామ్ బోస్, వీర సావర్కర్ వంటి ఉద్యమకారులు ఉరికంబాన్ని ఎక్కే ముందు కూడా చిరునవ్వుతో వందేమాతరం అంటూ ఉరికొయ్య వైపు నడిచారని, ఈ గేయం ఎంతటి స్ఫూర్తినిచ్చిందో తెలియజేస్తుందని తెలిపారు.ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ బిబిసి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోలో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాలలో వందేమాతరం రెండో స్థానం దక్కించుకుందని , ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను చాటుతోందని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ఎన్.సి.సి క్యాడెట్ లు జాతీయ పతాకముతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు సామూహికంగా వందేమాతరం రాగయుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, క్రాంతి కుమార్, రవీందర్ రెడ్డి ,ప్రదీప్ ,వినోద్, స్వప్న, సంగీత, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version