బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-14-5.wav?_=1

బిజెపి జిల్లా కార్యదర్శిగా జిట్టబోయిన సాంబయ్య

గణపురం నేటి ధాత్రి :

గణపురం మండలం
భూపాలపల్లి జిల్లా బీజేపీ నూతన కమిటీలను ప్రకటించింది.జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కమిటీలను ప్రకటించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామ్ చందర్రావు ఆదేశాలతో నూతన కమిటీని ప్రకటించినట్లు జిల్లా అధ్యక్షులు తెలిపారు. గణపురం మండలానికి చెందిన జిట్టబోయిన సాంబయ్యను జిల్లా కార్యదర్శిగా ప్రకటించారు. జిల్లా నూతన కమిటీలో స్థానం పొందిన సాంబయ్య రాష్ట్ర జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి కొండా సురేఖకు శాలువా కప్పి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43-1.wav?_=2

జననేత మంత్రి కొండా సురేఖకు శాలువా కప్పి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

ప్రజల హృదయాలను గెలుచుకున్న జననేత అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జన్మదినం ఈనెల 19న ఉన్నందున..శనివారం హన్మకొండ రాంనగర్ లోని కొండా దంపతుల నివాసంలో మంత్రి సురేఖను బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఆమెకు అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడారు. నిస్వార్థ సేవకు నిలువెత్తు ప్రతిరూపం..ఆపదోస్తే అండగా ఉండే ఆపద్బాంధవురాలు..నిరుపేదల పక్షపాతి అయినటువంటి కొండా సురేఖ గొప్పతనాన్ని మహేందర్ గౌడ్ అభివర్ణించారు. పేద ప్రజలకు సేవ చేయడంలోనే దైవత్వం దాగి ఉందని భావించే గొప్ప మనసున్న మహా నాయకురాలని, నిరుపేద ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే కొండా సురేఖ..వీరత్వంలో ఝాన్సీరాణిలాగా..ధీరత్వంలో ఓరుగల్లు రుద్రమదేవిలాగా..గుణంలో సీతాదేవిలాగా..రూపంలో పార్వతీ దేవిలాగా..ఓర్పులో భూమాతలాగా..శత్రువుల పాలిట కాళికాదేవిలాగా..ఓరుగల్లు ప్రజలను కాపాడే భద్రకాళి లాగా నిత్యం ప్రజల గుండెల్లో కొలువైన అమ్మవారిలాగా..జనహృదయాలను గెలుచుకున్న కొండా సురేఖ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవున్ని వేడుకుంటున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన కొండా సురేఖ..నమ్ముకున్న నిరుపేద ప్రజలు, అభిమానుల కోసం ఎంతటి వారినైనా ఎదిరించే వీరత్వం కలిగిన ధీరవనిత అని కొనియాడారు. పదవుల కోసం కాకుండా..ప్రజాసేవలో నిమగ్నమయ్యే కొండా సురేఖ నమ్ముకున్న వారికోసం పదవులను సైతం త్రుణప్రాయంగా వదిలిపెట్టి..మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా..మంత్రి పదవికి రాజీనామా చేసిన దమ్మున్న నాయకురాలు కొండా సురేఖన్నారు. నమ్ముకున్న ప్రజలు అభిమానుల కష్టాలను తీర్చేందుకు..కొండా దంపతులు ఎన్నో కష్టాలను అనుభవించారన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన తప్ప..ఎలాంటి స్వార్థం లేని నిస్వార్ధ సేవకురాలు కొండా సురేఖని, ఇలాంటి అరుదైన నాయకురాలు నేటి తరంలో ప్రపంచంలో ఎక్కడ కనుచూపు మేరలో దొరకరన్నారు. అందుకే కొండా సురేఖ-మురళీధర్ రావులది భిన్నమైన నాయకత్వమని, పార్టీలు కాదు ముఖ్యం..ప్రజాసేవ చేయడమే తన కర్తవ్యమని భావించే..అరుదైన నాయకులు కొండా దంపతులన్నారు. అందుకే పార్టీలకతీతంగా ఆ ఇంటి గడపను తట్టే లక్షలాది మంది సమస్యల పరిష్కారమే ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీలు ఏవైనా..ప్రజలంతా తనవారేనని నమ్మే కొండా దంపతులు..ఎలక్షన్ల వరకే పార్టీలు..ఆ తర్వాత అభివృద్ధి అనే ఏజెండాతోనే ముందుకు సాగుతారన్నారు. వరంగల్ జిల్లా గ్రామీణ ప్రాంతంకు చెందిన ఉక్కల్ లో తుమ్మ రాధ-చంద్రమౌళి దంపతులకు జన్మించిన ఈ కోహినూర్ వజ్రం..మహిళా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ భర్త కొండా మురళీధర్ రావు చల్లని నీడలో..ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని..ఆ దేవదేవుని ఆశీస్సులతో..ప్రజల నిండు దీవెనలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని..మంత్రిగా ప్రజలకు ఉన్నతమైన సేవలను అందిస్తూ..రాజకీయ రంగంలో మరింతగా రాణించాలని ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు.

జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి హరీష్ రెడ్డి ఎన్నిక

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-42-1.wav?_=3

జాగృతి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి హరీష్ రెడ్డి ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ జాగృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి మాడ హరీష్ రెడ్డి ఎన్నికైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా మీద నమ్మకం తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నన్ను రెండోసారి అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని వారు అన్నారు తెలంగాణ జాగృతిని ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి తీసుకెళ్తానని వారు అన్నారు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-40-1.wav?_=4

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

తొర్రుర్ డివిజన్ నేటి ధాత్రి

తెలంగాణ, ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి గర్వంగా నిలిచిన బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 16, 2025 (శనివారం)న వైభవంగా ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా మోకు దెబ్బ కార్యదర్శి మెరుగు మల్లేశం గౌడ్ గారు ప్రతి గౌడ బిడ్డ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేక పిలుపునిచ్చారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ – ప్రేరణాత్మక జీవితం
17వ శతాబ్దాది చివరి, 18వ శతాబ్దాది మొదటిబాగంలో (1650–1710) జనగామ జిల్లా, ఖిలాషాపూర్ గ్రామంలో గౌడ్ కుటుంబంలో పుట్టిన పాపన్న.

తండ్రి నాసగోని ధర్మన్న గౌడ్, తల్లి సర్వమ్మ. చిన్నతనం నుంచే సామాజిక సమస్యలను గమనించే శీలం.

ధూళిమిట్ట శాసనం ప్రకారం తన జననం “ఆగస్టు 18, 1650″గా గుర్తించబడింది.

గౌడ వృత్తిని స్వీకరించిన అతను, తాటిచెట్లు ఎక్కి (కలాలి) కల్లు గీయడంలో ప్రావీణ్యం గలవాడు.

పశువులను కాస్తూ, చుట్టుపక్కల గ్రామస్తులతో సామరస్యాన్ని పాటిస్తూ అభినవ దళిత & బహుజన ఉద్యమానికి నాయకుడుగా ఎదిగాడు.

పాపన్న గొప్పతనం, పోరాటం
అగ్రకులాల ఆధిపత్యం, జమీందార్ల అరాచకపు పాలనకు వ్యతిరేకంగా తన సిద్ధాంతాలు, ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు.

స్వీయ సైన్యంతో దాదాపు 20 కోటలను జయించాడు; గోల్కొండ కోటను స్వాధీనపర్చుకుని 7 నెలలు పరిపాలించాడు.
మొగలయ్యిన అధికారులను తెలంగాణ లో తొలిసారి ఎదుర్కొన్న బహుజన నాయకుడు పాపన్న గౌడ్.
బహుజనుల ఏకత్వం, మత-కుల-వర్గ వైషమ్యాలు లేకుండా సాగిన రాజ్యానికి ఆయనే పరిచయమిచ్చిన గొప్ప చక్రవర్తి.
విగ్రహావిష్కరణ కార్యక్రమం మహత్యం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇది గౌడ జాతి గర్వానికి, అనేక తరాల పాపన్న ఆశయాలకు కొత్త ప్రేరణనిచ్చే వేడుకగా నిలుస్తుంది.
ప్రతి గౌడ బిడ్డ, గౌడ కుటుంబం, బహుజన సమాజం పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను గౌడ జాతి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు కూడా స్మరిస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణ సంస్కరణాత్మక చాయలను ప్రజల్లోకి చాటిచెప్పే అవకాశం. పాపన్న తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించి, సామాన్య ప్రజానీకానికి న్యాయం అందించేందుకు చేసిన పోరాటం అందరికీ ఆదర్శంగా నిలవాలి.
ఈ కార్యక్రమంలో ప్రతి గౌడ బిడ్డ, సామాజిక భావాలుతో మహబూబాబాద్ జిల్లా యువత పాల్గొనాలి

దళిత ఎమ్మెల్యే అవమానం – జహీరాబాద్‌లో ఉద్రిక్తత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-22-5.wav?_=5

దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారు

◆:- తీవ్రంగా ఖండించిన ఝరాసంగం దళిత నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఫ్రెండ్స్ ఫంక్షనల్ లో నిరుపేదలకు గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇంటి తాళాలను ఇవ్వడం గురించి సభ నిర్వహించడం జరిగింది అక్కడికి జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వెళ్లడం జరిగింది అక్కడ అధికార సభ కాబట్టి స్థానిక అధికారులు సమక్షంలో నిర్వహించాలి కానీ కాంగ్రెస్ కు సంబంధించిన నాయకునితో సభ అధ్యక్షత నిర్వహించడం జరిగింది.ఎమ్మెల్యే మీటింగ్ ప్రాంతానికి వెళ్లిన అక్కడ అధికారులు వేదికపై పిలవకుండా అవమానించడం జరిగింది దీన్ని మేము ఒక దళితుడు అన్న కారణంగా ఎమ్మెల్యే గారిని అవమానించారని అనుకుంటున్నామని దళిత సంఘాల నాయకులు వ్యతిరేకించారు.గత ప్రభుత్వం టిఆర్ఎస్ నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పట్టాలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ అర్హులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అది తెలుసుకొని బి ఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు ఇట్టి విషయంపై కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల తాళాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది గురువారం జరిగిన మీటింగ్ లో శాసనసభ్యులు మాణిక్ రావు వేదికపై పిలవకుండా అవమానించడం ఇది కాంగ్రెస్ రౌడీ రాజకీయానికి నిదర్శనం అని కాంగ్రెస్ నాయకులు రౌడీల్ల వివరిస్తున్నారని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత సంఘాల నాయకులము చూస్తూ ఊరుకోమని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమం లో దళిత సంఘాల నాయకులు సామెల్ బాలరాజ్ సంగమేష్ రాజకుమార్, సుధాకర్ ప్రభాకర్ శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-20-5.wav?_=6

ఒకవైపు రక్షకభటుడు, మరొకవైపు రచయిత
కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ముడారి సాయి మహేష్ ఒకవైపు రక్షక భటుడిగా,మరొకవైపు రచయితగా ఎదుగుతూ అనేకమైన అంశాలపై సాహిత్యంలో పెన్నును,గన్నుగా చేస్తూ రానిస్తున్నటువంటి సాయి మహేష్ సమాజంలో జరిగే అంశాలను తన లోతుల వైపు చూస్తూ గన్నును పెన్నుగా మారుస్తూ సమాజ శ్రేయస్సుకు వివిధ అంశాలతో కూడిన కవిత్వాన్ని క్రూడీకరించి విశ్లేషించి అనేక అంశాలను కవితలుగా మార్చి సమాజాన్ని తట్టు లేపుతున్నటువంటి ముడారి సాయి మహేష్ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి సభ్యులు గా మరియు అనేక అవార్డులు రివార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి ముడారి సాయి మహేష్. అంతేకాకుండా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పథకం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ చేతులమీదుగా,,జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, మరియు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే చేతుల మీదుగా అందుకోవడం విశేషం. అలాగే జిల్లా కవులు రచయితలు, రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, బురదేవానందం,అంకారపు రవి ,గుండెల్ని వంశీ కృష్ణ, మొదలైన సాహితీ మిత్రులు అభినందించారు.

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-36-2.wav?_=7

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా శ్యామల మధుసూదన్ రెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిషిధర్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా శ్యామల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నా నియమాకానికి సహకరించిన బిజెపి పార్టీ అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న నన్ను జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించిన జిల్లా అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతను అప్పగించారు కావున బిజెపి పార్టీ జిల్లాలో మరింత అభివృద్ధి చెందింది నా వంతు కృషి చేస్తాను

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని..

79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి:

మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, విద్యార్థిని, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక 79వ భారత స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు.
ప్రపంచ చరిత్రలో ఆగస్టు,15కు విశిష్ట స్థానం ఉంది. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మహాత్ముడి సారథ్యంలో బయట శతృవులైన బ్రిటీషర్లపై యుద్ధం గెలిచిన మనం.. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శతృవులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి, భారతదేశ పునాది పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పౌరులకు, అణగారిన వర్గాలకు సమానత్వం, సామాజిక న్యాయం, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం నిబంధనలు ఉండేలా చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరులు ఊదారు. మనం సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం.
2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం.
స్థానిక సంస్థలలో… విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.
యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీజీపీఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.
ములుగు జిల్లా 2019లో ఏర్పడినప్పటి నుండి వెనుకబడిన జిల్లాగా ఉండగా ఇప్పుడు కొత్త మెరుగులతో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్లుటకు నూతన ప్రణాళికలు రూపొందించాం. అందులో భాగంగా జిల్లాలో నూతన ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం, జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు జిల్లా ప్రజలకు అందించుటకు నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, శాశ్వత భవనాల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుంది. జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకశాలను పెంచుటకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. తద్వారా 51 మంది యువతకు ఉపాధి కల్పించడం జరిగింది. ములుగు, బండారుపల్లి, జీవింతరావుపల్లి గ్రామాలతో ములుగు మున్సిపాలిటీగా ఏర్పాటు చేయటకు కృషి చేయడం జరిగింది. మల్లంపల్లిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం, జిల్లాలో మరో 15 సబ్ సెంటర్ల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2026 లో జరగనున్న శ్రీ సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు దాదాపు ఒక కోటి 50 లక్షల మంది భక్తులు దర్శించుకొనున్ననేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లకై ప్రతి శాఖను సమాయత్తం చేయడం జరుగుతుంది.
ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా సంక్షేమం కోసం మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.

మహాలక్ష్మి పథకం :
ఆడబిడ్డలకు పైసా ఖర్చు లేకుండా ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించుటకు ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకం ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఒక కోటి 35 లక్షల మంది మహిళలకు 81 కోట్ల 23 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయడం జరిగినది. జిల్లా ప్రజల సౌకార్యార్ధం జిల్లా కేంద్రంలో 4 కోట్ల 80 లక్షలతో మాడల్ బస్టాండ్, ఏటూరునాగారంలో 6 కోట్ల 28 లక్షలతో కొత్త బస్ డిపో నిర్మాణ పనులు ప్రారంభమైనవి. మంగపేటలో 52 లక్షల నిధులతో బస్టాండ్ నిర్మాణ పనులు తుది దశలో ఉన్నవి త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుంది.

వైద్య ఆరోగ్య శాఖ :
ఆరోగ్య శ్రీ బ్రాండ్ స్కీం : మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్యం పొందేలా తెచ్చిన ఈ పథకం ద్వారా ఈ సంవత్సరం జిల్లాలో 2800 మందికి వైద్య సేవలకుగాను 10 కోట్ల 99 లక్షలకు పైగా రూపాయాల లబ్ది చేకూర్చడం జరిగింది. ఈ సంవత్సరం 1056 గర్భిణి స్త్రీలకుగాను 748 స్త్రీలకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు (71 శాతం) చేయడం జరిగినది. సీజనల్ వ్యాధుల నిర్మూలన కొరకు ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా 24 వేల 38 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 34 మలేరియా 10 డెంగ్యూ కేసులను నిర్ధారించి, వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం జరిగినది. అటవీ ప్రాంతాలలో తక్షణ వైద్య సహాయం అందించుటకు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నూతన ఆలోచనతో 3 తాత్కాలిక కంటైనర్ సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి 4182 మంది పేద గిరిజన ప్రజలకు పరీక్షలు నిర్వహించి, 19 లక్షల 56 వేల రూపాయలను లబ్ది చేకూర్చడం జరిగింది.

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్:
ఓ.పి, ఐ.పి. సేవలు గత సంవత్సరం కన్నా 10 శాతం పెరిగినవి. రోజువారి ఓపి 715, ఐ.పి. 165 గా ఉన్నది. మాతా శిశు సంబంధిత సేవలు మరింతగా పెరిగాయి. జనరల్ సర్జరీ విభాగంలో క్యాన్సర్ శస్త్ర చికిత్సలు జరుగుతున్నవి. ఈ నెల ఇద్దరికీ రొమ్ము కణితి, ఒకరికి దవడ కణితి విజయవంతంగా తొలగించి మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గాను ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని అభినందిస్తున్నాను.

ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాల :
ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం కొరకు 50 సీట్లకు ఎన్.ఎం.సి. నుండి అనుమతి పొందడం జరిగింది. కళాశాలలో కావాల్సిన మైక్రోబయాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫార్మా కాలేజీ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబిబిఎస్ కోర్స్ తో పాటు పారామెడికల్ కోర్స్ డి.ఎం.ఎల్.టి., డి.ఎం.ఎస్.టి. 60 సీట్లతో ల్యాబ్, తరగతి గదుల సౌకర్యాలను కల్పిస్తూ తరగతులను ప్రారంభించడం జరిగింది.

వ్యవసాయ శాఖ : రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించాం. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ రైతు భరోసా పథకం కింద వ్యవసాయ భూములకు వానా కాలానికి ఎకరానికి 12 వేల చొప్పున 79 వేల 481 మంది రైతుల ఖాతాలో 99 కోట్ల 10 లక్షల జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం కింద 2024-25 సంవత్సరంలో 218 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున 10 కోట్ల 90 లక్షలను రైతుల నామినిల కుటుంబ ఖాతాలో జమ చేయడం జరిగింది. సబ్ మిషన్ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ఎస్సీ, ఎస్టీ మహిళా సన్న చిన్న కారు రైతులకు 50% రాయితీపై 79 లక్షల 60 వేల రూపాయలను వ్యవసాయ పరికరాలు అందించుటకు కేటాయించడం జరిగింది. జిల్లాలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన 671 మంది రైతులకు 3 కోట్ల 80 లక్షల 97 వేల రూపాయలను నష్టపరిహారం ఇప్పించడం జరిగింది.

విద్యుత్ శాఖ : గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200యూనిట్ల వరకు 39వేల 79 విధ్యుత్ వినియోగదారులకు ఉచితంగా జీరో బిల్లులు అందించడం జరిగింది. తద్వారా ఇప్పటి వరకు 39 కోట్ల 44 లక్షల రూపాయలను లబ్దిదారులకు సబ్సిడీ కల్పించాము. 21 కోట్ల 29 లక్షల నిధులతో బుచ్చంపేట, అడవీరంగాపూర్, గట్టమ్మ, జగ్గన్నపేట, నార్లపూర్, లింగాల, రోయ్యూరు గ్రామాల్లో నూతన 33 / 11 కె.వి. విద్యుత్ ఉప కేంద్రాలు ఏర్పాట్లకు శంకుస్థాపన చేయడం జరిగినది. కోడిశాల కుంటలో 2 కోట్ల 70 లక్షలతో నిర్మించుకున్న 33 / 11 కె.వి. విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించడం జరిగింది.

పౌర సరఫరాల శాఖ :70 ఏళ్లుగా పిడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. సన్నధాన్యానికి ఇప్పటివరకు 52 కోట్ల 70 లక్షల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు యాసంగి సీజన్ పంటలకు కనీస మద్దతు ధర పై 78 వేల 701 టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలలో 485 కోట్ల 49 లక్షల రూపాయలను చెల్లింపు చేయడం జరిగింది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ భారంగా మారకుండా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో 50 వేల 64 మందిని అర్హులుగా గుర్తించి, ఇప్పటి వరకు 500 రూపాయల చొప్పున ఒక లక్ష 64 వేల 169 సిలెండర్లను డెలివర్ చేసి, 4 కోట్ల 39 లక్షల సబ్సిడీని లబ్దిదారుల ఖాతాలో జమ చేశాం. రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుండి లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు జిల్లాలో 6 వేల 207 కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. పేదల ఆకలి తీర్చటంతో పాటు, వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు జిల్లాలో ప్రతినెల 97 వేల 634 రేషన్ కార్డుదారులకు, ప్రతి నెల 7 కోట్ల 88 లక్షల రూపాయలను వెచ్చించి 1,751 టన్నుల పోషకాలతో కూడిన సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతున్నది.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ : గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా మహిళ శక్తి పథకం లో భాగంగా ఎస్.హెచ్.జి. లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జిల్లాలోని 28 వేల 797 మంది విద్యార్థులకు ఏకారూప దుస్తులను వీరి ద్వారా కుట్టించి విద్యార్థులకు అందజేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల ద్వారా జిల్లాలో పౌల్ట్రీ మదర్ యూనిట్లు 5, మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు యూనిట్లు 2 ఏర్పాటు చేయడం జరిగినది. సదరం క్యాంపు ద్వారా 6,776 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. బ్యాంకు లీకేజీ కింద 1060 మహిళా సంఘాలకు 80 కోట్ల 54 లక్షల రుణాలు మంజూరు చేశాం. స్త్రీ నిధి కింద 33 వి.ఓ. లకు, 136 సంఘాల సభ్యులకు 4 కోట్ల 50 లక్షలు మంజూరు చేశాం. చేయూత పెన్షన్ పథకం ద్వారా 38 వేల 60 మంది లబ్దిదారులకు 9 కోట్ల 87 లక్షల రూపాయలను ప్రతి నెల పెన్షన్స్ అందిచడం జరుగుతుంది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం 7లక్షల 57 వేల పనిదినాలు కల్పించి, 47 వేల 50 మంది కూలీలకు 20 కోట్ల 80 లక్షల రూపాయలను వేతనంగా చెల్లించడమే కాకుండా, 12 కోట్ల 32 లక్షల రూపాయలను మెటీరియల్ కొరకు ఖర్చు చేయడం జరిగింది.

జిల్లా పంచాయతీ శాఖ : జిల్లాలోని 171 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి, డంపింగ్ యార్డులకు తరలించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం జరుగుతుంది. జిల్లా లోని 171 పంచాయితిలలోని నర్సరిలలో 11 లక్షల 39 వేలకు పైగా మొక్కలను సంరక్షించడం జరుగుతుంది.

నీటిపారుదల శాఖ : యాసంగి పంట సాగుకు 53 వేల 278 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడం జరిగింది. అంతేగాకుండా ప్రస్తుత సంవత్సరం వానకాల పంటల కొరకు సుమారు 88 వేల 18 ఎకరాలకు పైగా సాగునీరు అందించుటకు చర్యలు తీసుకొన బడుచున్నవి.

మిషన్ భగీరథ: జిల్లాలో 601 ఓ. హెచ్.ఎస్.ఆర్. లతో 88 వేల 30గృహాలకు అన్ని అవసరాలకు సరిపడు సురక్షిత మంచినీరు సరఫరా చేయడం జరుగుతున్నది.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం: నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని అమలుపరుస్తోంది. మొదటిదశలో నిరుపేదలై ఉండి.. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారిని ప్రామాణికంగా తీసుకుని 5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో బాగంగా జిల్లాలోని 10 మండలాలు, ఒక మున్సిపాలిటీకి మొదటి దశలో 4601 ఇండ్లు మంజూరు కాగా 3 వేల 678 ఇండ్లు గ్రౌండ్ అయ్యాయి. 1561 ఇండ్లు నిర్మాణ పనులు వివిద దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు 9 కోట్ల 81 లక్షలు చెల్లించాం. ఈ పథకంతో పేదవాళ్లకు సొంతింటి కల సాకారమైంది.

కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకం:
2025-26 సంవత్సరంలో కళ్యాణ లక్ష్మీ/షాదీముబారక్ పథకాల క్రింద వివాహాలు జరిగిన పేద కుటుంబాలకు రూ.1 లక్ష 116/- ల చొప్పున 2 కోట్ల 71 లక్షల రూపాయలను 271 మంది లబ్దిదారులకు అందించడం జరిగినది.

అటవీశాఖ : వనమహోత్సవములో భాగంగా 171 గ్రామపంచాయితీలలో 14 లక్షల 26 వేల మొక్కలను నాటడం జరుగుతుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా వివిధ శాఖలలోని నర్సరీలలో 25 లక్షల 40 వేల మొక్కలను పెంచడం జరిగినది. తూనికాకు సేకరణలో 10వేల 359 “ఎస్. బి. “లకు 341 లక్షల 86 వేల కలెక్షన్ చేసి, 10 వేల 631 కూలీలకు రుసుముగా ఇవ్వడం జరిగింది. కాంపా అభివృద్ధి పనుల కింద ఒక లక్ష 33 వేల పని దినాలు కల్పించడం జరిగింది.

పశు వైద్య, పశుసంవర్ధక శాఖ : పాడి పశువులకు ఒక లక్ష 75 వేల గాలి కుంటు, జబ్బ వాపు, గురక వ్యాది టీకాలను, 65 వేల లంపి చర్మవ్యాధి టీకాలను వేయడం జరిగింది. గొర్రెలలో మేకలలో చిటుకు రోగం నీలి నాలుక వ్యాధి నివారణకు 42 వేల 194 టీకాలు వేయడం జరిగింది.

పరిశ్రమల శాఖ : టీజీ ఐపాస్ క్రింద 24 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు 40 వివిధ రకముల అనుమతుల మంజూరు చేయడం జరిగింది. ఇట్టి పరిశ్రమల ద్వారా 38 కోట్ల 20 లక్షల పెట్టుబడితో 221 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నది. టీ ప్రైడ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, పి.హెచ్.సి. పారిశ్రామిక వేత్తలకు 10 యూనిట్లకు 33 కోట్ల 32 లక్షల రూపాయలు రాయితి మంజూరు చేయడం జరిగింది.

పర్యాటక శాఖ : రామప్ప ఐలాండ్ వద్ద 13 కోట్ల నిధులతో అభివృద్ది పనులను, ప్రసాద్ స్కీమ్ లో భాగంగా 61 కోట్లతో యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పర్యాటక ప్రాంతం పాలంపేట గ్రామంలో ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఫుడ్ కోర్టులు, సావనీర్ షాప్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపట్టడం జరుగుతుంది.

రెవెన్యూ శాఖ : రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను అత్యంత పారదర్శకంగా, సరళతరంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుటకు గాను నూతన ఆర్.ఓ.ఆర్. భూ భారతి చట్టంను రూపొందించినది. ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుండి 36 వేల 673 అర్జీలను స్వీకరించి, రికార్డులు పరిశీలన అనంతరం 6 వేల 284 దరఖాస్తులను ఆమోదించడం జరిగినది. భూములను రీసర్వే నిమిత్తం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను ఎంపిక చేసిన దానిలో వెంకటాపురం మండలంలోని నూగూరు రెవెన్యూ గ్రామం ఒకటి. దీనిలో భాగంగా ప్రతి భూ భాగాన్ని సర్వే చేసి రైతుల యొక్క విభాగానికి ల్యాండ్ పార్సెల్ మ్యాప్ తయారు చేసి రైతుల యొక్క ఆమోదం ద్వారా రెవెన్యూ రికార్డులలో అప్ డేట్ చేయుటకు ప్రక్రియ మొదలైనదని తెలుపుతున్నాను.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖలు : జిల్లాలోని 48 వసతి గృహాల్లోని విద్యార్థులకు కామన్ డైట్ అమలు చేస్తున్నాం. ఆహార నాణ్యత పరిశీలనకు ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేశాం. సంక్షేమ, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆహార తనిఖీలు నిర్వహించడం, నాణ్యత పరిశీలనకు ప్రతి వారం ఫుడ్ విత్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రత్యేక అధికారులు వారంలో 3 రోజులు విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి నాణ్యత, సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాం. డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాం. ఈ శాఖల ద్వారా విద్యనభ్యసించే విద్యార్థులకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, బెస్ట్ అవైలబుల్ స్కీం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి తదితర పథకాలు అమలు చేస్తున్నాం.

విద్య శాఖ : ఈ విద్య సంవత్సరము ఇంటర్మీడియట్ ఫలితాలలో 81.12 శాతం సాదించి ములుగు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన, విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు. ఈ విద్య సంవత్సరం కన్నాయిగూడెం మండలంలోని కే.జి.బి.వి. పాఠశాలను జూనియర్ కాలేజీగా ఉన్నతీకరించడం జరిగినది. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన, నాణ్యమైన విద్యా బోధనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 6 కోట్ల 91 లక్షలతో 239 పాఠశాలల్లో మరమ్మత్తు పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 413 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 20 వేల 112 మంది విద్యార్థులకు లక్షా 27 వేల 880 ఉచిత పాఠ్య పుస్తకాలు, లక్షా 9 వేల 215 వ్రాత పుస్తకాలను పంపిణీ చేశాం.

State Minister Danasari Anasuya Seethakka

ఉద్యానశాఖ : జిల్లాలో సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం, తెలంగాణ సూక్ష్మనీటి పారుదల పథకం, సమీకృత జాతీయ నూనె గింజల ఆయిల్ పామ్ పథకాలు అమలు చేస్తున్నాం. సమీకృత జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ పథకం లో భాగంగా 265 మంది రైతులకు 343.78 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగుకు పరిపాలన అనుమతులు, 72 మంది రైతులకు 88.74 హెక్టార్లలో 33.35 లక్షల రూపాయలను సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు, రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం12 ఎకరాల్లో ఆయిల్ ఫ్యాక్టరీకోసం కేఎన్ బయోసైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి అనుమతి ఇచ్చి, నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది.

సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ: బీఏ ఎకనామిక్స్ హానర్స్, ఇంగ్లీష్ హానర్స్ కోర్సులతో ప్రారంభమైన యూనివర్సిటీ లో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత యూనివర్సిటీ భవనాల నిర్మాణం కోసం జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయానికి ఎదురుగా 287 ఎకరాల రెవెన్యూ భూమిని, 50 ఎకరాల అటవీ భూమిని కేటాయించి, త్వరలో యూనివర్సిటీ శాశ్వత భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.

మహిళా, శిశు సంక్షేమ శాఖ : ఈ సంవత్సరంలో సఖి కేంద్రం ద్వారా 196 మంది మహిళలకు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. 1372 మంది గర్భిణి స్త్రీలకు, 1037 మంది పాలిచ్చే తల్లులకు ప్రతి రోజు అన్నము, పప్పు, కూరగాయలు పాలు, గుడ్డుతో కూడిన ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాము. 5,938 మందికి 7 నెలల నుండి 3 సం.ల లోపు చిన్నారులకు నెలకు 2.5 కేజీల బాలామృతముతో పాటు 16 గుడ్లను అందిస్తున్నాము. 6 వేల 424 మందికి 3 నుండి 6 సం.ల లోపు పిల్లలకు ఒక గ్రుడ్డు, అన్నము, పప్పు, కూరగాయలు, స్నాక్స్ ప్రతి రోజు పంపిణి చేయడం జరుగుతున్నది. వికలాంగుల కోసం సదరం సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేసాము. గతంలో కేవలం 7 రకాల వైకల్యాలను మాత్రమే సదరం క్యాంపులలో గుర్తించే వారు. ఇప్పుడు 21 రకాల వైకల్యాలను గుర్తించి సర్టిఫికెట్లను జారీ చేస్తున్నాం. జిల్లాలో 600 మంది దివ్యాంగులను గుర్తించి వారికి బ్యాటరీ వీల్ చైర్స్- 150, వీల్ చైర్స్- 250, హియరింగ్ ఎయిడ్స్- 40, ట్రై సైకిల్స్ 150, మోటరైజ్డ్ వెహికల్స్ 10, అందించడం జరిగింది. జిల్లాలో ఐదుగురు దివ్యాంగులు సకలాంగులను వివాహం చేసుకున్న 3 జంటలకు లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది.

గిరిజన అభివృద్ధి శాఖ : జనవరి 28 నుండి 31 వరకు మేడారం శ్రీ సమ్మక్క- సారలమ్మ మహా జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఎస్టి, ఎన్డీ.ఎఫ్ పథకంలో భాగంగా గత రెండు సంవత్సరాలలో 52 రోడ్లు, 68 కోట్ల 51 లక్షలతో మంజూరు కాగా 12 రోడ్లు పూర్తి అయినవి. మిగతావి ప్రగతిలో ఉన్నవి. 25 గ్రామ పంచాయతీ బిల్డింగ్ పనులు 5 కోట్లతో మంజూరు కాగా 2 పూర్తి అయి మిగతావి పురోగతిలో ఉన్నవి. అసిస్టెంట్ టు ఐటీడీఏ లో భాగంగా గత రెండు సంవత్సరములలో 110
పనులు 723 లక్షల 30 వేలతో మంజూరు కాగా 70 పనులు పూర్తి అయినవి. అంగన్వాడి కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలలు, సబ్ సెంటర్ల రిపేర్ల నిమిత్తము 227 పనులు, 11 కోట్ల 65 లక్షలతో మంజూరు కాక 126 పనులు పూర్తయినవి. 101 పనులు పూర్తి దశలో ఉన్నవి.

రహదారులు, భవనముల శాఖ :జిల్లాలో ఎస్టి.యస్.డి.ఎఫ్., ఆర్.డి.ఎఫ్., తదితర పథకాల ద్వారా 93 పనులకు గాను 228 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. 12 పనులు పూర్తికాగా 81 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. సమీకృత జిల్లా కార్యాలయముల సముదాయ భవనం (కలెక్టరేట్), నివాస గృహముల నిమిత్తం 63 కోట్ల 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగినది. శరవేగంగా నిర్మాణం పనులు జరుగుచున్నవి. కోర్టు సముదాయ భవన నిర్మాణం కొరకు 81 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగినది. త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుంది.

పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ :జిల్లాలో మహత్మా గాంధీ జాతీయ ఉపాది హామీ పథకం క్రింద 9 కోట్ల 52 లక్షల అంచనా వ్యయంతో 22 గ్రామ పంచాయతీ భవనాలు 30 అంగన్వాడి కేంద్రాలు 76 స్కూల్ టాయిలెట్స్ పనులు చేపట్టడం జరిగింది. సి.ఆర్.ఆర్. పథకం ద్వారా 73 కోట్ల 98 లక్షలతో 37 రోడ్లు, ఎం.ఆర్.ఆర్. పథకం ద్వారా 109 కోట్ల 76 లక్షలతో 62 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎఫ్ డి ఆర్, ఎస్టి ఆర్ పథకాల ద్వారా 28 కోట్ల 49 లక్షల నిధులతో 24 పనులు వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. ఎస్.డి.ఎఫ్. గ్రాంటు క్రింద ఎస్.టి కాంపోనెంట్ లో 33 కోట్ల 25 లక్షల తో 10 రోడ్లు మంజూరు చేయడం జరిగినది. ఎస్.ఎస్.ఎం. జె. గ్రాంట్ క్రింద 7 కోట్ల 14 లక్షలతో 11 కూడలి అభివృద్ధి వివిధ దశలలో పురోగతిలో ఉన్నవి. 6 కోట్ల అంచనా వ్యయంతో 3 ఎం.పి.డి.ఓ. కార్యాలయ భవనాలు, ఒక కోటి 80 లక్షలతో 2 పి. ఆర్. సబ్ డివిజన్ ఆఫీస్ భవనాలు, 2 కోట్లతో ఒక పి.ఆర్.ఎస్. ఈ. ఆఫీస్ భవనం మంజూరు చేయడం జరిగినది.

యాస్పిరేషన్ అవార్డు : మన జిల్లాకు యాస్పిరేషన్ అంశాలలో రాష్ట్రస్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లాకు అవార్డు ఇవ్వడం ఎంతో గౌరవంగా ఉంది. ఈ సందర్భంగా కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ ని, జిల్లా యంత్రాంగాన్ని అభినందిస్తున్నాను. మన జిల్లా యాస్పిరేషన్ నుండి ఇన్పిరేషన్ జిల్లాగా అభివృద్ధి చెంది రోల్ మాడల్ గా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను.

పోలీస్ శాఖ : శాంతి భద్రతల పరిరక్షణకు పొలిసుశాఖ పటిష్ట చర్యలు తీసుకుంటూ, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో నేరాలను చేధించడంతో పాటు నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమైన జిల్లా ఎస్పి, పోలిస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు.
మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న మన జిల్లా సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గారికి, జిల్లాలో ప్రభుత్వ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేసేందుకు తమ పూర్తి సహకారం అందిస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి, పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, వివిధ సంస్థల గౌరవ చైర్మన్లు. డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక గౌరవ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న ఈ పండుగ వేళ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ముగిస్తున్నాను.

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-13-6.wav?_=8

బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్‌గా మునెందర్ నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్‌గా ఊరటి మునెందర్ నియమితులయ్యారు.బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఆదేశాల మేరకు,జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఊరటి మునెందర్ మాట్లాడుతూ “బీజేపీ భావజాలాన్ని,కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు స్వచ్ఛందంగా చేరవేయడం, పార్టీ కార్యకలాపాలను విస్తృతంగా ప్రచారం చేయడం నా ప్రధాన బాధ్యత అని జిల్లా లోని ప్రతి గ్రామం,ప్రతి మండలానికి పార్టీ స్వరం చేరేలా కృషి చేస్తాను”అని అన్నారు.జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ… మునెందర్ పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు అని మీడియా విభాగంలో ఆయన అనుభవం పార్టీకి మరింత బలాన్నిస్తుంది అని అభిప్రాయపడ్డారు.ఈ నా పార్టీ పదవికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి కి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి సత్యపాల్ రెడ్డి కి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న కి కన్నం యుగదీశ్వర్ కు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు.

జాతీయ జెండాకు అవమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T123932.348-1.wav?_=9

 

జాతీయ జెండాకు అవమానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను అవమానపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో జెండా ఎగరేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాతీయ జెండాను అవమాన పరిచారు. సంబంధిత అధికారి సెలవులో ఉన్నట్టు నీ లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతగల వ్యక్తులే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకపక్క భారత్ మాతాకీ జై అంటూ దేశం పట్ల ప్రజలకు ప్రేమ ఉండాలని దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై భారత జాతీయ జెండా ఎగరేస్తూ దేశభక్తిని చాటుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు
ఆ పార్టీ వారు చెప్పే మాటలకు చాలా తేడా కనిపిస్తున్నట్టు పలు వర్గాల ప్రజలు విమర్శిస్తున్నాయి.

తండ్రికి తగ్గ తనయుడు సిరికొండ ప్రశాంత్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-7-5.wav?_=10

తండ్రికి తగ్గ తనయుడు సిరికొండ ప్రశాంత్

-సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

-మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఘనంగా సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలు

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుడి భుజంలా ఉంటూ..2021లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యవస్థాపక సభ్యుడిగా..పొలిట్ బ్యూరో సభ్యుడిగా కేసీఆర్ తో పాటు తెలంగాణ ఉద్యమాన్ని గ్రామీణ స్థాయి వరకు ఉవ్వెత్తున ఉగిసి పడేలా కార్యాచరణను రూపొందించిన అపర మేధావి మాజీ స్పీకర్..ప్రస్తుత శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాడని సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అన్నారు. శుక్రవారం సిరికొండ ప్రశాంత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని..బీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కేక్ ను చదువు అన్నారెడ్డి కట్ చేసి సిరికొండ ప్రశాంత్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు ప్రజలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిరికొండ ప్రశాంత్ తండ్రి సిరికొండ మధుసూదనా చారి అడుగుజాడల్లో పయనిస్తూ..ఏ పదవి లేకున్నా భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేస్తూ..ఎవరికి ఏ ఆపదోచ్చినా తానున్నానంటూ..భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ..ప్రజల మన్ననలను పొందుతున్నయువనేతగా ఆయనకు ప్రజల్లో విశేషమైన ఆదరాభిమానాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ చింతలపల్లి దార్ల ఆనంద్ అరికాంతపు అన్నారెడ్డి, దేవునూరి కుమారస్వామి, కక్కెర్ల ప్రశాంత్ గౌడ్, గుడిమల్ల రమేష్, ఎరబాటి మహేందర్, మల్సాని బాపురావు, రాస శ్రీనివాస్, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

రుణమాఫీ చేయాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్..

జాతీయ జెండా ఆవిష్కరించిన మండల పార్టీ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 వరకు పూర్తి రుణమాఫీ చేస్తానన్న ముఖ్యమంత్రి మాటలు ఏమయ్యాయని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నప్పటికీ ఇంకా రుణమాఫీ కాకపోవడం రైతులను విస్మరించడమే అని అన్నారు. ఇప్పటికైనా రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు బైరగాని కుమారస్వామి, పెంచల రవీందర్, మాజీ సర్పంచ్ లు కట్ల శంకర్, పల్లెబోయిన సదయ్య, నాయకులు జానయ్య, మామిండ్ల సాంబయ్య యాదవ్, రజాక్, శామ్యూల్ శ్రావణ్, లాలూ, మార్క సాయి, వాజిద్, చక్రి, హాఫీజ్, శివ,గౌతమ

త్రివర్ణ పతాకాన్ని ఎగరావేసిన బీజేపీ శ్రేణులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-44.wav?_=11

త్రివర్ణ పతాకాన్ని ఎగరావేసిన బీజేపీ శ్రేణులు

*అహింసా పదం మన మార్గం తగధనాల త్యాగాలతో సూర్యునిగా వెలుగొందుతున్న దేశం మన భారతదేశం

 

వర్ధన్నపేట (నేటిధాత్రి):
మండల కేంద్రంలోని వివేకానంద మండల అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ కొండేటి అనిత ఆధ్వర్యంలో బిజెపి నాయకులతో కలిసి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం బైక్ ర్యాలీ తో ముగించారు.

79th Independence Day.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొండేటి అనిత సత్యం , జిల్లా కౌన్సిల్ మెంబర్ మైస రాము, మాజీ మండల అధ్యక్షులు మండల కన్వీనర్ రాయపురం కుమారస్వామి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి సిందం శ్రీనివాస్, మాజీ పట్టణ అధ్యక్షులు పెద్దూరి రాజు, బిజెపి సీనియర్ నాయకులు చేపూరి వెంకటస్వామి, మండల కార్యదర్శి మల్లెపక అనిల్, బోయినపల్లి దేవేందర్ రావు, వెల్మకంటి గిరిప్రసాద్, ఎస్సీ సీ మోర్చా మండల అధ్యక్షులు, నక్క రవి ఓబీసీ మోర్చా, పెన్ తోటి మహంత్ యువమోర్చా, రాకేష్ వెలిశాల, నిమ్మాని సోమేశ్వరరావు, తక్కలపల్లి విష్ణు, వడ్లకొండ మణిదీప్, బొంత రవి, ఆలకుంట లక్ష్మణ్, కుసుమ రాంబాబు, వెలమ కంటి వేణు, తాళ్లపల్లి కృష్ణమూర్తి,అనపర్తి శ్రీకాంత్, కొండేటి శివ, తదితరులు పాల్గొన్నారు

ఉప్పిట్టు నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-6-8.wav?_=12

ఉప్పిట్టు నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నా

◆:- ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆:- డా౹౹ఏ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని దత్తగిరి కాలనీ లోని యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారి నూతన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మాక్సూద్ అహ్మద్, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఆర్షద్ అలీ,కాంగ్రెస్ నాయకులు మంకలి శభాష్, హుగ్గేలి రాములు,ఖాజా,శుక్లవర్ధన్ రెడ్డి, షాకిర్ అలీ, గౌసోద్దీన్, మొయిజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నూతన హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

నూతన హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని హుగెల్లి వై-జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటైన స్టార్ నసీబ్ హోటల్ను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మన్ననలను పొందాలని, వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్షద్ పటేల్‌ను పరామర్శించిన జ్యోతి పండాల్..

ఆర్షద్ పటేల్ గారిని పరామర్శించిన బీజేపీసీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం మాడ్గ్గి గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఆర్షద్ పటేల్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యం తో కోలుకున్న సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్ ఈ రోజు పట్టణంలోని రాంనగర్, బృందావన్ కాలనిలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థిని తెలుసుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాయికోటి నర్సిములు ఉన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సిద్దిపేట శాసనసభ్యులు,మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు నర్సంపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాగా నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో
బారాస పార్టీ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపి జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి,పట్టణ కమిటీ నాయకులు, యూత్ కమిటీ సభ్యులు,మహిళా విభాగం నాయకులు,మాజీ కౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో చిగుళ్ల పల్లి వారి వివాహ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి లో చిగుళ్ల పల్లి వారి వివాహ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎం బి గార్డెన్ లో చిగుళ్ల పల్లి శ్రీనివాస్ శెట్టి కూతురు శ్రీజ సాయి కుమార్ వివాహ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్లోని నూతన వదూవరులను ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ బీ ఆర్ ఎస్ నేతలు ఉన్నారు

గోపాలపురంలో ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ…

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల మంజూరి పత్రాలు అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల మండలంలోనీ గోపాలపురం గ్రామంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి మరియు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో ఇదిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్, భూపాలపల్లి జిల్లా సేవదల్ అధ్యక్షులు ఏకు రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు నీలం కుమారస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గన్నారపు సదయ్య, మాజి గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందుల భద్రయ్య, బత్తిని సదయ్య, గోవిందుల శంకరయ్య, చళ్ళ కుమార్, అంబాల రవి, గూడెపు చిన్ని, సంపెల్లి రాజు, చెవుల రమేష్, మరియు ఇతర పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో విచ్చలవిడిగా ఇసుక రవాణా.

పట్టణాలకు తరలిస్తూసొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

ఎలుకటి రాజయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుకను అక్రమార్కులు డంపులు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ పీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతా గరిమిళ్లపెల్లి,రామకిష్టాపూర్ ( వి)గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక ను ఇందిరమ్మ ఇండ్లు పేరుతో గ్రామాల్లో డంపులు ఏర్పాటు చేసి, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఈ తతంగం అంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని అన్నారు. టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం టేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు నుండి ఇసుక తరలించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారీతినా వ్యవహారిస్తూ, అక్రమార్కులకు సహకరించే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇటీవల గరిమిళ్లపెల్లి, రామకిష్టాపూర్ ( వి )గ్రామాల్లోని ఇసుక డంపులు అందుకు నిదర్శనం అని,ఈ దందా ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ఈ ప్రాంత సహజ వనరులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలుకటి రాజయ్య డిమాండ్ చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version