అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ యువ నాయకులు షేక్ సోహెల్ అన్నారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
అకాల వర్షాలకు జాగ్రత్త: ప్రజలు అప్రమత్తంగా ఉండండి – షేక్ సోహెల్ బిఆర్ఎస్, తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు మాట్లాడుతూ ఇటీవలగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని, నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.ప్రజలు తక్కువ ప్రాంతాల నుంచి పర్యవేక్షణలో ఉండి, అలాంటి విపత్తులు ఎదురైతే అధికారులు లేదా స్థానిక నాయకులకు వెంటనే సమాచారం ఇవ్వాలని.”ప్రజల రక్షణకే ప్రాధాన్యం… ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు,”
ప్రజలకు సూచనలు:*
@ :- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
@ :- నీటిలో ఉండే వంతెనలు, కట్టలు దాటవద్దు
@ :- జలపాతాలు, వాగులు, నదులు, చెరువులకు వెళ్లవద్దు
@ :- ఎలక్ట్రిక్ పోల్‌లు, వైర్లను తాకవద్దు
@ :- బట్టలు అరేసే ఇనుప వైర్లను తాకవద్దు.
@ :- పురాతన భవనాలకు దగ్గరగా ఉండవద్దు*
@ :- చేపల వేటకు వెళ్ళవద్దు
@ :- తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి