మెగా మెడికల్ క్యాంప్

మెగా మెడికల్ క్యాంప్

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ మంచిర్యాల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని పీహెచ్సీ లో మెగా మెడికల్ క్యాంప్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉచితంగా బీపీ, షుగర్,టీబీ,బ్లడ్,డెంగ్యూ, మూత్ర వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు.తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న పెషేంట్స్ ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాలకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, హెచ్ఇ అల్లాడి శ్రీనివాస్, రమేష్ సిహెచ్ఓలు రమేష్, అక్తర్,టీబి ప్రోగ్రాం సూపర్వైజర్ సాయి రెడ్డి, ఐసిటిసి మెంబెర్స్ డా.పద్మశ్రీ ఆర్ బి హెచ్ కే మెడికల్ ఆఫీసర్,డా.మమత, ఎఎన్ఎం లు రజిత,వజ్ర, సునంద,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

మానవత్వం చాటుకున్నా మలహాల్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T160400.440.wav?_=1

 

మానవత్వం చాటుకున్నా మలహాల్ రావు

నడికూడ,నేటిధాత్రి:

 

మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు లో భాగంగా నడికూడ నుండి ధర్మారం వెళ్లే రోడ్డు ఒకవైపు రోడ్డు పూర్తయి ఇంకోవైపు రోడ్డు పూర్తి కాలేదు,వర్షపు నీరు మురికి నీళ్లు పోవడానికి కూడా కాలువలు లేవు, రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీళ్లు ఎటు పోకుండా ఒక వైపు రోడ్డు మధ్యలో గుంటలాగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉంది ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారు నీళ్లలో గుంటలు ఏర్పడక చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్లమలహాల్ రావు ట్రాక్టర్లతో మట్టి (మొరం) తెప్పించి నేర్పించి చదునుచేపించి ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బిక్షపతి, గ్రామపంచాయసిబ్బంది కిన్నెర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన మండల భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర బైక్ ర్యాలీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T155608.410.wav?_=2

 

రెబ్బెన మండల భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర బైక్ ర్యాలీ

: రెబ్బెన, ( కొమురం భీం ఆసిఫాబాద్ ), నేటి ధాత్రి :

 

 

రెబ్బెన మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు పాల్గొని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ గారి హయాంలో దేశం నలుమూలలా అభివృద్ధి చెందుతుందుతుందని మన జాతీయ పౌరులు విదేశాలలో సైతం గర్వంతో తీరుగాగలుగుతున్నారంటే మన దేశ ప్రత్యేకత అని అన్నారు…
ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వినర్ కొలిపాక కిరణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుల్బామ్ చక్రపాణి, బీజేపీ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, బీజేపీ రెబ్బన మండల అధ్యక్షులు Malraj రాంబాబు, జిల్లా నాయకులు గోలెం తిరుపతి, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, జిల్లా సీనియర్ నాయకులు రాచకొండ రాజయ్య, జగన్నాధ ఓదెలు, మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్, మండల నాయకులు బక్క ఆనంద్, శాంతయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు….

నిరుపేద వధువుకు బిఆర్ఎస్ నాయకుడి సహాయం..

నిరుపేద వధువు వివాహానికి..
10 వేల ఆర్థికసాయం.

నిజాంపేట: నేటి ధాత్రి

నిరుపేద వధువు వివాహానికి బిఆర్ఎస్ నాయకులు కంట తిరుపతిరెడ్డి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిజాంపేట కు చెందిన మామిడాల సరిత కూతురు తేజశ్రీ, వివాహం రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగింది. వధువు వివాహానికి కంట తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ నాయకులతో కుటుంబానికి 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మావురం రాజు, సంఘ స్వామి, రాములు, తిరుమల గౌడ్, నగేష్ మవురం ఉన్నారు.

నిరంజన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T154652.777.wav?_=3

 

 

నిరంజన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ఇంటింటికి జాతీయ జెండా ఉంచడం మన కర్తవ్యం

డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు

పరకాల నేటిధాత్రి

 

బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా బిజెపి పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిరంగి సంతోష్ కుమార్ పాల్గొని బస్టాండ్ కూడలి నుండి పట్టణ రహదారిపై,ఇళ్ళు ఇళ్ళు తురుగుతూ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో జాతీయ జెండాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్.కాళీ ప్రసాద్ రావు,సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ
ప్రజలందరూ జాతీయవాదులుగా,దేశ భక్తులుగా తయారు కావాలని అలాగే ఇంటింటికి జాతీయ జెండా కలిగి యుండటం భారతీయులుగా మన కర్తవ్యమని అన్నారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటి పై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేయాలన్నారు.ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా జాతీయ ఉద్యమం,మన దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చి,ప్రతి హృదయంలో దేశభక్తి జ్వాలను మరింత నింపే ప్రయత్నం అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ త్యాగం,అంకితభావంతో సాధించిన స్వేచ్ఛా భారత స్వప్నాన్ని,మన 140 కోట్ల భారతీయులు అభివృద్ధి చెందిన,శ్రేష్ఠమైన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ కౌన్సిలర్ జయంత్ లాల్,9 వార్డ్ మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి,నాయకులు ఎర్రం రామన్న,దగ్గు విజేందర్ రావు,కుక్కల విజయ్ కుమార్, వేముల సదారాణి, వెనిశెట్టి శారద,ఆకుల రాంబాబు,పైండ్ల రంజిత్,ఆర్పీ సంగీత,బూత్ అధ్యక్షులు మరాఠీ నరసింహారావు,వెల్దండి హేమంత్,ముత్యాల దేవేందర్, ఉడుత చిరంజీవి,సదా మధుకర్,సారంగ నరేష్, కాగితపు చంద్రమోహన్,ఏకు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

పటేల్ గార్డెన్స్ లో వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
పటేల్ గార్డెన్స్ లో జరిగన జాడి మల్కపూర్ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మారుతి గారి కుమారుని వివాహం వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి మున్సిపల్ చైర్మన్ తాంజీమ్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, చిన్న రెడ్డి ,గణేష్ చంద్రయ్య , రాథోడ్ భీమ్ రావు నాయక్,అశోక్ రెడ్డి,
గ్రామ నాయకులు.ఎక్స్ ఆత్మ డైరెక్టర్ పరశురాం. పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి. తిరుమలేష్ . శ్రీధర్ రెడ్డి మొలాజీ. వార్డ్ మెంబర్ సిహెచ్. రవి. బాలప్ప. లక్ష్మన్న. రాజు బాబూలాల్ తదితరులు .

బెజ్జంకి ప్రభాకర్‌కు సీఎం సహాయ నిధి సాయం..

బెజ్జంకి ప్రభాకర్ కు రూ.21 వేల చెక్కు అందజేత.*

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు బెజ్జంకి ప్రభాకర్ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోగా ఎక్కువ మొత్తంలో ఖర్చులు అయ్యాయి.కాగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 21 వేలు మంజూరు అయ్యాయి.ఎమ్మెల్యే సూచనల మేరకు పట్టణ 21వ వార్డ్ ఇంచార్జి, మాజీ వార్డ్ మెంబర్స్ కొయ్యడి సంపత్, గాజుల రమేష్ లు ఆ చెక్కును బెజ్జంకి ప్రభాకర్ కు అందజేశారు.నిరుపేద కుటుంబాలకు చేయూతగా ముఖ్య మంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని బెజ్జంకి ప్రభాకర్ తెలియజేశారు.కార్యక్రమంలో గిరగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

20 మందితో బిజెపి పార్టీ నూతన జిల్లా కమిటీ ఎన్నిక.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-40.wav?_=4

20 మందితో బిజెపి పార్టీ నూతన జిల్లా కమిటీ ఎన్నిక

జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బిఎంఎస్ కార్యాలయంలో బిజెపి పార్టీ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి హాజరైనారు అనంతరం వారు మాట్లాడుతూ 20 మందితో బిజెపి పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ని రాష్ట్ర అధ్యక్షుడు నియమించడం జరిగింది ఆరుగురు ఉపాధ్యక్షులు ముగ్గురు జనరల్ సెక్రెటరీ ఐదుగురు జిల్లా సెక్రెటరీ మీడియా కోఆర్డినేషన్ ఆఫీస్ బాయ్ 20 మంది సభ్యులతో జిల్లా కమిటీగా ఎన్నిక చేయడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి తెలిపారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ నాయకుల పేర్లు చెప్పి కొంతమంది పాఠశాలలో కళాశాల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారు వారు ఎవరైనా ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాము అని వారు అన్నారు అనంతరం జిల్లా కమిటీని ప్రకటించారు జిల్లా ఉపాధ్యక్షులుగా దాసరి తిరుపతిరెడ్డి. మోరి రవీందర్ రెడ్డి. వేషాల సత్యవతి. పూడెపాక స్వరూప. శ్యామల మధుసూదన్ రెడ్డి. గొర్రె శశికుమార్. జిల్లా జనరల్ సెక్రెటరీగా దొంగల రాజేందర్. పెండ్యాల రాజు. తాటికొండ రవి కిరణ్. డిస్టిక్ సెక్రటరీగా రాజేందర్ రెడ్డి. రామకృష్ణ. శ్రీనివాస్. వేణు. జిట్టబోయిన సాంబయ్య. ఆఫీస్ సెక్రటరీ తిరుపతి సోషల్ మీడియా ఇన్ఛార్జి దుగ్యాల రామచంద్రరావు మీడియా కవరే జ్ మునీందర్ ఐటీ ఇన్చార్జి వేణు రావు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఎన్నికలకు సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డికి రాష్ట్ర కమిటీ సభ్యులకు అందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ పదవి మాకు ఇవ్వడంతో మా మీద మరింత భారం పెరిగింది బిజెపి పార్టీ స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలవడానికి మేము మా వంతుగా పాత్ర పోషించి మా నాయకులను కార్యకర్తలను స్థానిక సంస్థలు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నాం అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

టాప్ 100 ప్రభావవంతుల జాబితాలో శ్రీధర్ బాబు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-39-1.wav?_=5

మంత్రి శ్రీధర్ బాబు కి అరుదైన గౌరవం దక్కడం సంతోషకరం

ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముత్తారం :- నేటి ధాత్రి

 

తెలంగాణ రోడ్ మాడల్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అహర్నిశలు నిద్రాహారాలు మాని రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నటువంటి ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు కి ఇండియా 100 మోస్ట్ ఇన్ పూ యూనియల్ పీపుల్ ఏఐ జాబితాలో చోటు చేసుకోవడం సంతోషకరం ఎంతో గర్వకారణం అని ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు మంథని నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు కేవలం రెండు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఐ టి శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేస్తారని ఆశిస్తూ మా నాయకున్నీ అభివృద్ధి విషయంలో విమర్శిస్తున్న గులాబీ నాయకులకు ఇది ఒక చెంపపెట్టు అని అన్నారు

ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసిన ఐటిఐ విద్యార్థి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T125103.420-1.wav?_=6

ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసిన ఐటిఐ విద్యార్థి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామానికి చెందిన తెలుగు రాజశేఖర్ అనే విద్యార్థి ఐటిఐ డీజిల్ మెకానిక్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత, ఇటీవల తన తండ్రి నరసింహులు సహాయంతో జీప్ నమూనా తో కూడిన నాలుగు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారుచేసిన ఈ ఐటిఐ విద్యార్థిని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.

పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం:

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-14T124238.194.wav?_=7

 

పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలను ఎదిరించాం: సీఎం చంద్రబాబు

 

 

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. జిల్లాలో అందరు ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని ఉద్ఘాటించారు.

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘనవిజయం సాధించారు. 6,050 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పదించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో మాట్లాడారు. జిల్లాలో అందరు ఈ విజయం పట్ల రియాక్ట్ కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగాయని ఉద్ఘాటించారు.

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి 11 మంది నామినేషన్లు వేశారని వ్యాఖ్యానించారు. పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని స్లిప్ పెట్టారని .. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలని సూచించారు. టీడీపీ నేతలు పులివెందుల విజయంపై ప్రజలను చైతన్యం చేసే విధంగా మాట్లాడాలని నిర్దేశించారు. పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారని నొక్కిచెప్పారు. 30 ఏళ్ల తర్వాత వాళ్లు ఓటు వేశారనేది రాష్ట్రంలో ప్రజలకు తెలియచేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయి అనికూడా చెప్పాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

కోనాపూర్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ప్రజల్లో ఆనందం..

కోనాపూర్‌లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ప్రజల్లో ఆనందం..

రామాయంపేట ఆగస్టు 13 నేటి ధాత్రి (మెదక్)

రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కార్డు లేని నిరుపేదలకు, కొత్తగా పెళ్లయిన వారికి, పుట్టిన పిల్లల పేర్లతో సహా లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేశారు.
గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారందరికీ ఈ సదుపాయం లభించడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ రావు కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మామిడి సిద్ధిరాములు, గ్రామ అధ్యక్షులు గడ్డం సురేష్, గ్రామ యూత్ అధ్యక్షులు మామిడి సతీష్, మంద నర్సింలు, డీలర్ బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల సంక్షేమమే నాధ్యేయం..

పేద ప్రజల సంక్షేమమే నాధ్యేయం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

దుగ్గొండి మండలం రేకంపల్లి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం

నర్సంపేట,నేటిధాత్రి:

నియోజకవర్గ పేద ప్రజల అభివృద్దే తన లక్ష్యం అని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల దుగ్గొండి మండలంలో పైలెట్ ప్రాజెక్టు రేకంపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుడు ఇజ్జగిరి జయ చేరాలు ఇంటి నిర్మాణం పూర్తిచేసి గృహప్రవేశం కార్యక్రమం చేపట్టారు.

MLA Donthi Madhav Reddy

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాధవ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగానే ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేయడం సంతోషంగా ఉందన్నారు.నియోజకవర్గ పేద ప్రజల సంక్షేమమే నా ధ్యేయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.నియోజకవర్గం వ్యాప్తంగా మొదటి దఫాలో ప్రజలకు 3500 ఇండ్లు మంజూరు పత్రాలు ఇచ్చాము.రెండో దఫాలో మరో 3500 ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపల్లి దేవేందర్ రావు, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చుక్క రమేష్ గౌడ్,మాజీ సర్పంచ్ ఎర్రల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరు కిరణ్ రెడ్డి, ఒలిగే నర్సింగరావు,ఇంగోలి రాజేశ్వరరావు, క్లస్టర్ ఇంచార్జిలు మట్ట రాజు,రొట్టె రమేష్,మార్కెట్ డైరెక్టర్లు దంజానాయక్, హింగే రామారావు ,
మండల నాయకులు జంగిల్ రవి, అజ్మీర రవీందర్,నల్ల వెంకటయ్య, పొగాకు వెంకటేశ్వర్లు, బ్లాక్ యూత్ అధ్యక్షులు బొమ్మినేని భరత్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు మాదాసి సాంబయ్య, మండల యూత్ నాయకులు కోరే రాజేష్, సుకినె నాగరాజు, సుకినె శ్రీను, కొరకల ప్రశాంత్, ఈద సురేందర్, కొలుగూరి సుమంత్, గాండ్ల ప్రతిష్,నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

2,లక్షల రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొగుడంపల్లి గ్రామానికి చెందిన చాకలి అంజమ్మ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-( 2 లక్ష రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఈ సంధర్బంగా లబ్దిదారుని కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి ,మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారికి , ధన్యవాదాలు తెలిపారు

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో సోలార్ లైట్ ఏర్పాటు…

మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో సోలార్ లైట్ ఏర్పాటు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీ లోని దుబ్బపల్లి లో కార్మిక శాఖ మంత్రి గడ్డ వివేక్ సహకారంతో డిసిసి జనరల్ సెక్రెటరీ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సోలార్ లైట్ ఏర్పాటు చేశారు.రాత్రి పూట విద్యుత్ అంతరాయం కలిగి గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని గ్రహించి సోలార్ లైట్ ఏర్పాటుకు సహకరించిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన వారికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ షోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల.ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గాలి పెళ్లి బాలకృష్ణ కి..(40000). వేల రూపాయల సీఎంఆర్ఎఫ్. చెక్కుని లబ్ధిదారులకు స్థానిక. కాంగ్రెస్ పార్టీ నాయకుల. ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు సహకరించిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. శ్రీ ఏ నుముల. రేవంత్ రెడ్డికి. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి. ప్రభుత్వ . వీప్ . వేములవాడ శాసనసభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. శ్రీ ఆది శ్రీనివాస్ కి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. కంది గట్ల సదానందం. బై రీ. వేణు. జంగంపల్లి భాగ్యలక్ష్మి. ముందటి శారద. కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ధర్మారావుపేట లో గ్రామ దేవతలకు ఘనంగా పూజలు..

ధర్మారావుపేట లో గ్రామ దేవతలకు ఘనంగా పూజలు

ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

Akula Subhash Mudiraj

గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామములో లొ బుధవారం శ్రావణమాసం ఊర పోచమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమంలొ భాగంగా గ్రామ ప్రజలందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా చూడాలని తల్లిని గ్రామ ప్రజలు కలిసి గ్రామ దేవతలకు చిర సారె పసుపు కుంకుమ పూలు పండ్లు డప్పు చప్పుల్లతో శివసత్తుల ఆటపాటలతో కోడి మేకల తో భక్తులందరూ ఊరేగింపుగా ఊర పోచమ్మ తల్లి బోనాలు ఎత్తుకొని ఊరంత ఉత్సాహంతో ఉత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నామని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.

Akula Subhash Mudiraj

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచి ఉప సర్పంచ్ పోతుల ఆగమ్మ ఆకుల తిరుపతి సింగిల్ విండో డైరెక్టర్ పూజారి రాజేందర్ మత్స్య శాఖ అధ్యక్షులు ఆకుల రాజన్న గౌడ్ సంఘం అధ్యక్షులు నారగాని ఎల్ల స్వామి మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షులు బాపని రాజయ్య రజక సంఘం అధ్యక్షులు జాలిగాపు రాజయ్య అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కడారి బాబు కమిటీ సభ్యులు దూలం శంకర్ కాటకం స్వామి గ్రామస్తులు ఆకుల రవీందర్ నరసింహరావు ఆకుల దామోదర్ పని సాంబయ్య బెనికి రాజేందర్ కేసేటి కుమారస్వామి అక్క పెళ్లి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ..

తంగళ్ళపల్లి. నేటి దాత్రి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. అని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల. రాజు. మాట్లాడుతూ. సారంపల్లి గ్రామంలో. వంగరి సుమలత. భర్త శ్రీనివాస్. వారికి 32,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును.

గ్రామ శాఖ అధ్యక్షుడు. గుగ్గిల రాములు గౌడ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని. ఈ సందర్భంగా తెలియజేస్తూ చెక్కులు రావడానికి కృషిచేసిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి. సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో. మానవ హక్కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షులు గుగ్గిళ్ల భరత్ గౌడ్. కోలా గంగారాం. కూనవేణి. వినోద్. గుగ్గిల అభిషేక్. సాయిరాం. మహేష్. సంజయ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

వివాహాది శుభ కార్యంలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే గండ్ర..

వివాహాది శుభ కార్యంలో పాల్గొన్న మాజీఎమ్మెల్యే గండ్ర

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రానికి చెందిన శాయంపేట మాజీ వార్డు సభ్యులు గొట్టి ముక్కుల చక్రపాణి కుమారుడు రాజేష్- స్వాతి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వస్త్రాలు అందించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి నూతన వధూవరు లను ఆశీర్వదించారు.ఈ కార్య క్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి, మాజీ మార్కె ట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం, యూత్ అధ్యక్షులు మారేపల్లి మోహన్, మాజీ ఉపసర్పంచ్ ధైనంపల్లి సుమన్, గ్రామశాఖ అధ్యక్షులు గాదె రాజేందర్, సీనియర్ నాయకులు దైనంపల్లి కరుణ్ బాబు,సోషల్ మీడియా కన్వీనర్ దాసి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కుటుంబం…

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కుటుంబం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రథసారధి (డ్రైవర్) రంగు హరికృష్ణ-రమల వివాహం స్టేషన్ ఘనపూర్ వద్ద జరుగగా ఆ వివాహ వేడుకకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు భార్య శాలిని,కుమారుడు అవియుక్త్ రెడ్డి,కూతురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version