ఎమ్మెల్యే సంచలన కామెంట్స్..

ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారు..

తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్‌ అన్నారు. సోమవారం అడ్డగుట్టలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్‌నగర్‌ బస్తీలో ఫలహారబండి ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్తున్న తనపై 10 ద్విచక్రవాహనాలపై వచ్చిన 30 మంది దాడికి యత్నించారని తెలిపారు.

సికింద్రాబాద్‌: తనను టార్గెట్‌గా చేసుకుని దాడి చేశారని ఎమ్మెల్యే శ్రీగణేష్‌(MLA Sri Ganesh) అన్నారు. సోమవారం అడ్డగుట్టలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం రాత్రి మాణికేశ్వర్‌నగర్‌ బస్తీలో ఫలహారబండి ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్తున్న తనపై 10 ద్విచక్రవాహనాలపై వచ్చిన 30 మంది దాడికి యత్నించారని తెలిపారు. సినీ ఫక్కీలో తమ వాహనాలను వెంబడించారని తెలిపారు.
లైట్లు, సీసీ కెమెరాలు(CCTV cameras) లేని చోట తమ వాహనాలు, గన్‌మన్‌పై దాడి చేశారని వివరించారు. హత్యలు, నేరాలు చేసే వ్యక్తులకు భయపడేవాడిని కాదని, నేర చరిత్రగల వ్యక్తితో తనకు ముప్పు ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్‌(North Zone DCP Rashmi Perumal)కు విజ్ఞప్తి చేశారు. దాడి ఘటనపై పోలీసులకు మంగళవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని డీసీపీకి చెప్పానని ఎమ్మెల్యే తెలిపారు.

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.!

ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో

గణపురం నేటిధాత్రి

గణపురం మండలo చెల్పూరు గ్రామం లో ధర్నా చేసిన జర్నలిస్టు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ లో ప్లకార్డ్ తో రోడ్డుపై బైఠాయిచి రాస్తారోకో చేశరు. నేడు జిల్లాలో కొనసాగుతున్న ముగ్గురు మంత్రుల పర్యటనను బహిష్కరించి నిరసన తెలిపారు. జర్నలిస్టుల పై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

వనపర్తిలో ఎమ్మెల్యే కృషితో మిగిలిపోయిన..

వనపర్తిలో ఎమ్మెల్యే కృషితో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి ,

వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పాన్ గల్ కొత్తకోట రోడ్డులో నిలిచి పోయిన రోడ్ల విస్తరణ పనులు స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోరిక మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్నందుకు ప్రజలు హర్షం
వ్యక్తం చేస్తున్నారు ఎంతో కాలం గా కర్నూల్ రోడ్ పా న్ గల్ కొత్తకోటరోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో రోడ్డు కటింగ్ పెండింగ్ లో ఉంచినట్లు ప్రచారంలో ఉంది . వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కర్నూల్ రోడ్ పానగల్ రోడ్డు విస్తరణలో నష్టపోయే బాధితులను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు . కర్నూల్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తన భవనాన్ని స్వచ్ఛందంగా కూలగొట్టుటకు ముందుకు వచ్చినందుకు ఎమ్మెల్యే మెగా రెడ్డి అభినందించారు . భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వివేకానంద రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు నుండి మరి కుంట వరకు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు వెడల్పు పనులు చేయిస్తున్నందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతునారు వనపర్తి లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయించాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఫాదర్ పాషా ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి జిల్లా అధికారులకుఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు .

ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు రోగులను పళ్ళు పంపిణీ.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి పార్టీ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ బంజారా నాయకులు గోపాల్ బానోత్ మరియు సంజయ్ పవార్ గారి ఆధ్వర్యంలో లో ఎమ్మెల్యే మాణిక్ రావు గారి జన్మదిన సందర్బంగా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు బ్రేడ్ లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో నాయకులు మండల ముఖ్య నాయకులు దేవిదాస్ జాదవ్, పార్టీ నాయకులు జితేందర్ మాజీ సర్పంచ్, శంకర్ చౌహన్, జ్ఞానందర్ బానోత్, చందర్ సామి, బిక్కు, ఖిరుసింగ్, రాజు చౌహన్,యువ నాయకులు సంతోష్ జాదవ్, విన్నీ పవార్, రవికిరణ్ సంతు చౌహన్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు
స్థానిక ముద్దు బిడ్డ, శాసనసభ్యులు కొనింటి మానిక్ రావు గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాణిక్ రావు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని కోరారు…
ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేషం, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తాంజిమ్, సీనియర్ నాయకులు నామ రావికిరణ్, ఎస్సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్టణ అధ్యక్షులు యాకుబ్, మోహిద్దీన్,మాజీ కౌన్సిల్లర్ అబ్దుల్లా, మాజీ కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, బిఆర్ఎస్వి అధ్యక్షులు రాకేష్,ఎస్సి సెల్ పట్టణ్ణ అధ్యక్షులు శివప్ప,
పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు తాజా మాజీ సర్పంచ్ లు, మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు కమిటీ సభ్యులు ఉప సర్పంచులు ఉద్యమకారులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ ,బిఆర్ఎస్వి నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్ రేవూరి.

కామ్రేడ్ గాజర్ల రవి గణేష్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జీఎస్సార్, రేవూరి

భూపాలపల్లి నేటిధాత్రి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కింటుకూరు మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో ఈనెల 18వ తేదీ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కాగా, వారి సంస్మరణ సభ శనివారం గాజర్ల స్వగ్రామం వెలిశాలలో జరుగుతుంది. ఈ సంస్మరణ సభలో భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి లు పాల్గొన్నారు. గాజర్ల కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేలిద్దరూ పరామర్శ తెలిపారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గాజర్ల రవి యువకుడిగా ఉన్న రోజుల్లోనే బడుగు, బలహీన వర్గాల పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి, అడవి బాట పట్టి సుమారు 33 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఎన్కౌంటర్లో మృతి చెందారు. కాగా, వారి స్వగ్రామం వెలిశాలలో జరుగుతున్న సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో గాజర్ల అభిమానులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల నేతలు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో , పాల్గొన్నారు

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం

ఎమ్మెల్యే శ్రీహరి కారును ఢీకొన్న మరో కారు

తృటిలో తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపుతో వెళ్తున్న TG 38. 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి.

డిసిసి అధ్యక్ష పదవి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలి- అనుపురం పరశురాం గౌడ్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా డిసిసి అధ్యక్ష పదవిని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంకి కేటాయించాలని యువజన కాంగ్రెస్ రామడుగు మండల అధ్యక్షులు అనుపురం పరశురాం గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేడిపల్లి సత్యం పీహెచ్డీ చేసిన ఒక విద్యావేత్త, యువ నాయకులు, పేదల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకులు, పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే గొప్ప వ్యక్తి. మంచి నాయకత్వ లక్షణాలు కలిగివున్న సత్యంకు డిసిసి అధ్యక్ష పదవిని అందించడం ద్వారా ముందు ముందు పార్టీ మరింత బలోపేతం కావడమే కాకుండా యువత కూడా రాజకీయంగా ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

ఎస్పీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు శుక్రవారం సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్పీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిసి మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

పలమనేరులో ఎమ్మెల్యేల సందడి..

*పలమనేరులో ఎమ్మెల్యేల సందడి..

 

పలమనేరు(నేటి ధాత్రి) మార్చి 27:

 

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో మరియు జిల్లా ముఖ్య నేతలతో పలమనేరు గురువారం సందడిగా మారింది.

పుంగనూరులో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి బాధితులను వెళ్ళి పరామర్శించాలని పార్టీ ఆదేశించింది.

దీంతో చంద్రగిరి, కాళహస్తి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గురుజాల జగన్ మోహన్, మురళీ మోహన్ లు స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి స్వగృహనికి చేరుకున్నారు.

దీంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఇక్కడ అల్పాహార విందు అనంతరం ఎమ్మెల్యేలందరు కలసి పుంగనూరు నియోజకవర్గంలోని క్రిష్ణపురం గ్రామానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు జిల్లా అధ్యక్షులు సీఆర్ రాజన్, జయప్రకాశ్ నాయుడు, పలమనేరు కోఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు అర్వీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు..

రాజకీయ లబ్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే ధర్నా..

రాజకీయ లబ్ధి కోసమే మాజీ ఎమ్మెల్యే ధర్నా..

రైతులు ఆందోళన చెందవద్దు… పంటలకు రక్షణగా ఉంటాo

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ లబ్ధి కోసమే రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ధర్నా పేరుతో దివాలా కోరు రాజకీయాలు చేస్తున్నా డని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని చలివాగులో పరివాహక ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మాజీ ఎమ్మెల్యే ధర్నా నిర్వహించిన నేపథ్యంలో మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల తో కలిసి బుచ్చిరెడ్డి మాట్లా డుతూ రైతులు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి, ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, వరి పంటలకు కాంగ్రెస్ మండల నాయకులు రక్షణగా ఉంటారని భరోసా ఇచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో చలివాగులో నీటి లెవెల్స్ తగ్గడం జరిగిందని, అందుకు రైతులకు ఇబ్బంది కలగకుండా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయ ణరావు ఆదేశాలతో అధికా రులపై ఒత్తిడి తీసుకువచ్చి నీటి లిఫ్టింగ్ నిలిపివేయించడం జరిగిందని గుర్తు చేశారు. చలివాగు కాలువలమరమ్మత్తు లు జరుగుతున్న తరుణంలో క్రాప్ హాలిడే ప్రకటించినప్పటికీ రైతుల విజ్ఞప్తి మేరకు జాలు కాలువ ద్వారా నీటిని విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా చలివాగును అడ్డు పెట్టుకొని చాపల వ్యాపారం చేశారని, ప్రాజెక్టులో 15 ఫీట్లు మినిమం నీరు ఉండేలా కట్ట ఎత్తుగా పోయిస్తానని హామీ ఇచ్చి గెలిచాక విస్మరించారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చలివాగులో నీటి లెవెల్స్ తగ్గిపోయినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు ధర్నా చేస్తే అక్రమ కేసులు నమోదు చేయించిన హీన చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. ఉనికి కోసం రైతులను ఆందోళనకు గురి చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రవి, వలి హైదర్, దుబాసి కృష్ణమూర్తి, వైద్యుల వెంకటరాజు రెడ్డి, ఆదిరెడ్డి, లడే రాజ్ కుమార్, ఐలయ్య, కట్టయ్య, మార్కండేయ, డిటి రెడ్డి, బాసవి రవి, సదయ్య, జక్కుల నరేష్, రాజు, జగన్, రాజయ్య, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్.!

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ బిసి మాజీ ఎమ్మెల్యేల

పేరు ప్రకటించినందుకు సీఎం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

వనపర్తి నెటిదాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ దివంగత వనపర్తి బీసీ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాలకృష్ణయ్య ఎం జయ రాములు యాదవ్ పేర్లు వనపర్తి లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే జయ రాముల కుటుంబ సభ్యులు అరవిందు వశిష్ట భరణి అరుణ రోహిణి అల్లుడు రంగస్వామి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము 40 సంవత్సరాలు నుండి మా కుటుంబ సభ్యులం వనపర్తి లో లేకున్నా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ యాదవ్ పోరాటం చేసి బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకపోయినందుకు అభినందించారు .ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్ గౌని కార్డు యాదయ్య బొడ్డుపల్లి సతీష్ నాగవరం వెంకటేష్ పుట్టపాకల బాలు రాములు యాదవ్ రాజేష్ బాబుగౌడ్ నరసింహ తిమ్మన్న ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

ఎమ్మెల్యే నివాళి…!

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి

దేవరకద్ర/ నేటి ధాత్రి.

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం అన్నారు. నివాళులర్పించిన వారిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version