పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం.

పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం.

ఎండి సలీం షరీఫ్, మండల విద్యాధికారి కోదాడ

కోదాడ, నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని కోదాడ మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ అన్నారు.గురువారం నాడు కోదాడ పట్టణంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆజాద్ నగర్ లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులకు రెండు జతల దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్నం పౌష్టికాహారం అందించబడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలో కంప్యూటర్ విద్య, వొకేషనల్ విద్య, నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత డిజిటల్ బోధన చేయబడుతుందని తెలియజేసినారు. బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని, ప్రభుత్వ బడుల బలోపేతానికి బడిబాట ప్రచార కార్యక్రమాన్ని ఉదృతం చేయాలని ఉపాధ్యాయులను కోరినారు. పాఠశాల మౌలిక సదుపాయాలు వసతులను తెలియజేస్తూ కరపత్రాలతో పట్టణంలో ఆజాద్ నగర్ పరిసర ప్రాంతాల్లో బడిబాట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె.పాండురంగ చారి, రవి, ధర్మ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చిగురుపాటి శ్రీనివాసరావు, యదా శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి…

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, నేటి ధాత్రి :

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండలం సీతారాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, మూత్రశాలలు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని తెలిపారు. పాఠశాలలో ఏమైనా మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, వేసవి అయినందున ఆరోగ్యం దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య…

విద్యార్థులకు సకల సదుపాయాలతో నాణ్యమైన విద్య

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం,షెడ్యూల్డ్ కులముల సంక్షేమ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న పాఠశాల,వసతి గృహాన్ని సందర్శించి తరగతి గదులు, విద్యార్థుల గదులు, వంటశాల,భోజనశాల, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అభివృద్ధి పనులు చేపట్టిందని, విద్యార్థులకు పూర్తి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకోవాలని,ఆ దిశగా అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు.నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుకను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని,ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం,త్రాగునీరు,ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని,గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.వేసవి అయినందున త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనపై కలెక్టర్ స్పష్టత

విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో గల ఆదర్శ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు,అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారం నాణ్యత,తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు.బాలికల వసతి గృహంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.అనంతరం హాజీపూర్ మండలం గుడిపేట లోని చందనాపూర్ లో గల పట్టణ ఆవాస పాఠశాలను సందర్శించి పాఠశాలలో చేపట్టిన అదనపు గదులు,ఇతర అభివృద్ధి పనులను పరిశీలించి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వంటశాలను సందర్శించి విద్యార్థుల ఆహారం తయారీలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని, ఆహారం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు.ప్రభుత్వం విద్యారంగా అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని,ఈ నేపథ్యంలో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సహకారం అందజేస్తాం-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

కరీంనగర్, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని బూరుగుపల్లి గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధి హామీ నిధులు ఎనిమిది లక్షలతో నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించారు. అనంతరం గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సహకారంతో పాఠశాలలో ఏర్పాటుచేసిన లైబ్రరీని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ విద్యార్థుల కోరిక మేరకు పాఠశాలలో డైనింగ్ హాల్, తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మాలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని కొత్త పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు సహకరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంను ఈసందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ఈకార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, స్థానిక సర్పంచ్ దూలం కల్యాణ్, తాహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రాము, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు ముద్దం నగేష్, ఉప సర్పంచ్ తిరుపతి, సాగి అజయ్ రావు, దూలం శ్రీనివాస్, దూలం అంజయ్య, బుర్గు గంగన్న, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

వార్షిక పరీక్షలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన

వార్షిక పరీక్షలకు..
విద్యార్థులను సిద్ధం చేయాలి..

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

నిజాంపేట: నేటి ధాత్రి

వార్షిక పరీక్షలు త్వరలో జరగనున్న నేపథ్యం లో ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చెయ్యాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. నిజాంపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్షిక పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే లక్ష్యంతో, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రత్యేక తరగతుల వల్ల నాణ్యమైన విద్య అందుతుందని దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన శైలిని పరిశీలిస్తూ.. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

చినిగేపల్లిలో ఉచిత ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

చినిగేపల్లిలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామంలో 59వ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఫ్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో

ఈ పాఠశాల మంజూరైంది. పాఠశాల ప్రారంభోత్సవంలో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువు కొనసాగించాలని వక్తలు సూచించారు. ఈ పాఠశాల మంజూరుపై గ్రామస్తులు, సర్పంచ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, కార్యదర్శి, సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

కలెక్టర్ పాఠశాల అభివృద్ధి పరిశీలన, వ్యవసాయ పరికరాలు పంపిణీ

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం,నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలో గల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు గడ్డం వినోద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు/పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేసేందుకు పంట సాగుకు అవసరమైన వ్యవసాయ అధునాతన పరికరాలను అర్హులైన రైతులకు అందించి పంట దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం ఎస్.ఎం.ఎ.ఎం. 2025-26 లో భాగంగా అర్హులైన రైతులకు యాంత్రికరణ పరికరాలను అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించి రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా లబ్ధి పొందేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి…

మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాలనేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థినీ, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం మెనూ అమలు, పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.మధ్యాహ్న భోజనం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.దేశంలోనే తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి అందించిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.విద్య అజ్ఞానాన్ని దూరం చేస్తుందని తెలియజేస్తూ బాలిక విద్యను ప్రోత్సహించారని,మహిళల హక్కుల కోసం తన వంతు కృషి చేశారని తెలిపారు.మహనీయులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి..

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోషక విలువలు కలిగిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు.విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.విద్యార్థులు చేసిన అల్లికలు,కళాకృతులను పరిశీలించారు.10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఏకాగ్రతతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి…

విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

ప్రభుత్వ విద్యా సంస్థలలో అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని,విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోషక విలువలు కలిగిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు.విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు.ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు.విద్యార్థులు చేసిన అల్లికలు,కళాకృతులను పరిశీలించారు.10వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఏకాగ్రతతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మొగుళ్ళపల్లిలోని వివిధ పాఠశాలలను తనిఖీ చేసిన….

మొగుళ్ళపల్లిలోని వివిధ పాఠశాలలను తనిఖీ చేసిన
* తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్
సెక్రెటరీ (జడ్జి) చిలుకమారి పంచాక్షరి గారు.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఎం. జె. పి స్కూల్ అలాగే కస్తూర్బా స్కూల్, గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన విలేజ్ లీగల్ కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ను తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్
సెక్రెటరీ (జడ్జి) చిలుకమారి పంచాక్షరీ గారు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలల ప్రిన్సిపాల్స్ తో కలిసి వంటగదులను, డైనింగ్ హాల్స్, టాయిలెట్స్ మరియు తరగతి గదులను జడ్జి గారు పరీశిలించారు. అనంతరం పంచాక్షరి జడ్జిగారు మాట్లాడుతూ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంచి నాణ్యతమైన భోజనం అందించాలని ,మంచి చదువు బోధించాలని, స్కూల్ ప్రిన్సిపాల్ లకు సూచించారు. అలాగే విద్యార్థులతో మాట్లాడుతూ భవిష్యత్తులో మీరు ఏ లక్ష్యం కోసం చూస్తున్నారో ఆ లక్ష్యం అందే వరకు ఉన్నతమైన చదువులు చదివి మీ లక్ష్యాన్ని చేరుకోవాలని జడ్జి గారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై బి అశోక్ పి.ఎల్.వి మంగళపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు

కేజీవిబి జూనియర్ కళాశాల భవనం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T152155.759.wav?_=1

 

కేజీవిబి జూనియర్ కళాశాల భవనం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

 

జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏ ఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
శుక్రవారం మహా ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీవిబి జూనియర్ కళాశాల భవన ప్రారంబోత్సవం,
మండలంలోని వివిధ గ్రామాల్లో 70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, 72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యకు పెద్ద పీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాణ్యమైన విద్యాబోధనకు డీఎస్సీ నిర్వహించి
టీచర్ల నియామకం చేపట్టామని, 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు
కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్ళపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. నా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోవడం వల్ల నన్ను ఆంగ్లమాద్యమంలో చదివానని, నాలాగే విద్యార్థులు ఇంగ్లీష్ లో చదవాలని, బాలికా విద్యకు ఇబ్బంది కలగకూడదని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మన ప్రాంతానికి పెద్ద ఎత్తున కెజిబివి, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం ఖచ్చితంగా చదవాలని, చదివిన చదువు తప్పక ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగ పడుతుందన్నారు.
గ్రామంలో ఒక్కరు చదువుకున్నా … వారు మాత్రమే కాకుండా మొత్తం గ్రామమే బాగుపడుతుందని తెలిపారు.
10 వతరగతి పరీక్షలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కెజిబివిలో 10 వతరగతి విద్యార్థులకు టి ఫైబర్ ద్వారా ఏ.ఐ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,
ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఈ.జి.ఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కోట రాజాబాపు, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిర్మల సమ్మయ్య, డీఈఓ రాజేందర్, ఈ ఈలు, కెజిబివి ఎస్ ఓ పుష్పవతి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుడే మార్గదర్శకుడు

ఉపాధ్యాయుడే మార్గదర్శకుడు

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర

గంగాధర మండలం మధురానగర్ లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే

గంగాధర నేటిధాత్రి :

 

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గంగాధర మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మండల స్థాయిలో ఎంపికైన 22 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేసే విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మైనారిటీ పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-94.wav?_=2

మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే.

వంటగదిలో ఆహార పదార్థాలను రుచి చూసిన ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం భూపాలపల్లి మంజూరునగర్ లోని ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వంట గదిలో విద్యార్థులకు పెట్టే ఆహార పదార్థాలను మీడియా మిత్రులతో కలిసి టేస్ట్ చూశారు. అనంతరం ఎమ్మెల్యే అన్ని తరగతి గదులను కలియ తిరుగుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. తరగతి గదుల్లో కూర్చోడానికి బెంచీలు కావాలని పలువురు విద్యార్థులు అడిగారు. అదేవిధంగా, తరగతి గదులకు కిటికీలు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు తరగతి గదుల్లోకి వస్తుందని పలువురు విద్యార్థులు తెలిపారు. సీసీ రోడ్లు, బాత్రూమ్స్, డార్మెటరీ, డ్రైనేజీ, తరగతి గదిలోకి పాములు రావడం తదితర సమస్యలను విద్యార్థులు వివరించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను అట్టి సమస్యలను త్వరితగతిగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంద న్నారు. అన్ని వసతి గృహాల్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే విద్యార్థులకు మెస్ చార్జీలతో పాటు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిరు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు దేవాన్ పిసిసి మెంబర్ చల్లూరు మధు ముంజాల రవీందర్ దాట్ల శ్రీనివాస్ భౌత్ విజయ్ ప్రజా ప్రతినిధులు, పట్టణ మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు,డైరీల పంపిణీ…

పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు,డైరీల పంపిణీ…

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చౌటుపర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అద్యక్షతన జరిగిన సమావేశంలో మండల విద్యాశాఖాధికారి కునుసోతు హనుమంతరావు ముఖ్యఅతిధిగా పాల్గొని విద్యార్థులకు టై, బెల్ట్.ఐడి కార్డు,డైరీలు పంపిణీ చేసి తదనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన జరుగుతున్నది.కావున విద్యార్థుల తల్లి దండ్రులు గ్రామంలో వున్న ప్రతి విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నాణ్యమైన విద్యను అందుకోవాలని,ప్రభుత్వము విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,స్కూల్ యూనిఫామ్స్,వినియోగించుకోవాలని,ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి నైపుణ్యంతో బోధించే ఉపాధ్యాయులచే బోధన జరుగుతుంది.కాబట్టి గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలిసి పాఠశాలలోని విద్యార్థుల నమోదును పెంచుటకు కృషి చేయాలని కోరారు
ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్. గూడెం రమ్య,పాఠశాల ఉపాధ్యాయులు సదానందం,రామయ్య జగదీశ్వర్,నాగరాజు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య

జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో నాణ్యమైన విద్య అందుతున్నదని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ అరిగకూటి శ్రీనివాస రెడ్డి, ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ ఖాదిర్ షరీఫ్ లు అన్నారు. జెఇఇ అడ్వాన్స్డ్ మైన్స్ లో రాష్ట్ర స్థాయిలో 1446 ర్యాంక్ సాధించిన బానోత్ సోమన్న, డైట్ సెట్ లో ప్రతిభ కనబరిచిన పరమేశ్వరి ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించడంతో పాటు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌సౌకర్యం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా చదువవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు శ్రీను, కవిరాజు, రఘురాం, నాగేశ్వరరావు, శ్రీనివాస్, సుధాకర్, మహేందర్, రామ్మూర్తి, బాబు, యాకన్న, సతీష్, అనిల్ కుమార్, సుభాష్ అధ్యాపకేతర బృందం సైదా, ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

— ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
• సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న డీఈవో రాధా కిషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో కూడా ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని ఆయన కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వచ్చే విధంగా చూడాలన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సంఘాన్ని యాదగిరి, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు నవీన్ రత్నాకర్, మోహన్, మమత, జ్యోతిలక్ష్మి ఉన్నారు.

నాణ్యమైన విద్యా హామీ ఇస్తున్నాం

నాణ్యమైన విద్యా హామీ ఇస్తున్నాం

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

టిఆర్టిఎఫ్ బడిబాట ర్యాలీ

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీని ఘనంగా నిర్వహించారు. టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ బోయన్న గారి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ర్యాలీని ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలో కంప్యూటర్ విద్య, ఏఐ ఆధారిత విద్య, డిజిటల్ విద్యను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి తరగతిగది సామర్ధ్యాన్ని విద్యా హామీగా మేము ఇస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నందున వాటిని ఉపయోగించుకోవాల ని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

We guarantee quality education.

ఒత్తిడి లేని విద్య, పౌష్టికాహారం ప్రభుత్వ పాఠశాలలతోనే సాకారం అని పేర్కొన్నారు.

 

 

 

తెలంగాణ రాష్ట్ర టీచర్ల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరచడం ద్వారా, ప్రభుత్వ విద్యను వారికి అందుబాటులో తెచ్చేందుకు, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ బడులను సమాజానికి దగ్గర చేసేందుకు, పాఠశాలల్లోని వివిధ కార్యక్రమాల్లో సమాజాన్ని అనుసంధానం చేయడం, తదితర అంశాలుగా ఈ బడిబాట విద్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బైక్ ర్యాలీ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ నుండి బయలుదేరి న్యూ బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌరస్తా వరకు సాగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, రాష్ట్ర మెంబర్షిప్ కన్వీనర్ సుంకిశీల ప్రభాకర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షులు మోతిలాల్, టిఆర్టిఎఫ్ నాయకులు పోతుగంటి రమేష్, మహేషుని లక్ష్మీనారాయణ , గోలీ రాధాకిషన్, ముత్తయ్య గారి నాగరాజు, జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, ఇప్పకాయల ప్రకాష్, రాజశేఖర్, దేవేందర్, పప్పుల శ్రీనివాస్ సామల రాములు, కుమారస్వామి, పులి ప్రవీణ్ కుమార్, కోల వినయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు బాలఎల్లయ్య, కొమురయ్య, సుల్తాన్ రాజు, బూట్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, మామిడాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

మండలంలోని చౌటుపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట గ్రామసభను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నడికూడ మండల విద్యాశాఖ అధికారి కె.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. అయితే దానికోసం మన ఊరిలో మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తూ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఐ ఎఫ్ పి టివి ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన చౌటుపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతుంది‌. నిరంతర సమగ్ర మూల్యాంకనం,కృత్యాధార, అనుభవజ్ఞులైన అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్,పాఠ్య పుస్తకాలు,వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తున్నారు, ప్రతిరోజు రుచికరమైన పౌష్టికాహారం మధ్యాహ్న‌ భోజనం,వారానికి మూడు గుడ్లు,మూడు రోజులు రాగి జావా,ప్రతినెల తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తున్నందున గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి,ప్రభుత్వ బడి అభివృద్ధి చెందేటట్లుగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు, యువజన సంఘాలు,పూర్వ విద్యార్థులు గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి గూడెం రమ్య విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు,మహిళా స్వయం సహాయక సంఘాలు,అంగన్వాడీ టీచర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,యువజన సంఘాల నాయకులు,పూర్వ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version