మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం
#మట్టి వినాయకులని పూజించాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు…
#క్యాంపు కార్యాలయం వేదికగా నగరవాసులకు మట్టి గణపతులను పంపిణీ…
హన్మకొండ, నేటిధాత్రి:
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ మేరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగరంలోని భక్తులకు,ప్రజలకు స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
పంపిణీ అనంతరం వారు మాట్లాడుతూ హనుమకొండ జిల్లా ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు పర్యావరణ హితంగా ఉండాలని కోరుతూ నగరంలో 30000 విగ్రహాలకు అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచిత విద్యుత్తు సరఫరా అందిస్తున్నదని వెల్లడించారు.మా వంతుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు.ఈ మట్టి గణపతుల పూజతో పాటుగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని అన్నారు.
ఇప్పటికే అధికారులకు కచ్చితమైన ఆదేశాలను ఇచ్చామని నవరాత్రి వేడుకలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని,నగరంలో ఏర్పాటు చేసిన మండలాలలో పర్యవేక్షణను చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పాల్గొన్నారు.