ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు…

 ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు

 

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి….

తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్‌.ఎ. అంటే మెంబర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజలపాలిట సమస్యగా మారుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింప జేసుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2004 నుంచి ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెర్రితలలు వేస్తోంది. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో శాసనసభ్యులకు అపరిమిత స్వేచ్ఛను ఇవ్వడంతో వారు ప్రభుత్వ కార్యాలయాలను తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకూ అదే ఆదర్శమైంది. గతానికి భిన్నంగా ఈ జాడ్యం ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించింది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వారిని ఉద్దేశించి, వాటి గురించి స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు చెప్పాలని సూచించేవారు. ఇది ప్రజలకు రుచించలేదు. అది వేరే విషయం! 1983కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికి ఉండేది కాదు. అక్కడి ప్రజా సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించేవి. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కారు. ఎమ్మెల్యేలను కలుసుకోగలిగే పరిస్థితి జిల్లా స్థాయిలో కొద్దిమందికే ఉండేది. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లను కలుసుకోవడం అరుదైన అవకాశంగా ఉండేది. అలా కలుసుకోగలిగిన వారికి పలుకుబడి ఉన్నట్టు పరిగణించేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హయాంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగక తప్పలేదు. ఫలితంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను, కుటుంబ పంచాయితీలను పరిష్కరించవలసిందిగా కూడా ఎమ్మెల్యేలను కోరేవారు. మొగుడూ పెళ్లాల పంచాయితీలు తామెందుకు పరిష్కరించాలని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు విసుక్కొనేవారు. హైదరాబాద్‌లో ఉండే తమ ఎమ్మెల్యేలను తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు వచ్చి కలుసుకొని బాధలు చెప్పుకొనేవారు. కొంతమందైతే తిరుగు ప్రయాణాలకు చార్జీలు ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యేలను కోరేవారు. తమను కలవడానికి వచ్చిన వారికి కాఫీ, టీలు తాగించడంతో పాటు భోజనం, వసతి కూడా ఏర్పాటు చేయవలసి రావడంతో శాసనసభ్యులు ఆర్థికంగా నలిగిపోయేవారు. పెళ్లిళ్లు, చావులకు వెళ్లడం విధిగా మారింది. అదే సమయంలో ఖర్చుల కోసం డబ్బు కూడా డిమాండ్‌ చేసేవారు. తెలంగాణలో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది. కొంత కాలం క్రితం ఒక లారీ డ్రైవర్‌ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి తాను డ్యూటీ మీద దూరంగా ఉన్నాననీ, పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి ప్రసవం చేయించవలసిందిగా కోరారు. ఇలాంటి విచిత్రమైన అనుభవాలను శాసనసభ్యులు గతంలో పంచుకొనేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా, దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది.

రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తిచేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ వ్యవహారం మంత్రి, ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్దిచెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులు ఏరుకోవడానికి ప్రయత్నించినట్టుగా లేదా? కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో ఒకరికొకరు ఆదర్శం అయ్యారు. ఫలితంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ కట్టాలన్నా శాసనసభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. దీంతో యావత్‌ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ, మరోవైపు భూ కబ్జాలు, దందాలలో ఎమ్మెల్యేలు మునిగితేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో కేసీఆర్‌ అభ్యర్థులను మార్చకుండా పాతవాళ్లు అందరికీ టికెట్లు ఇచ్చారు. అప్రతిష్ఠపాలైన శాసనసభ్యులను మార్చి ఉంటే కేసీఆర్‌ అధికారం కోల్పోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం భారత రాష్ట్ర సమితి ముఖ్యులలో ఇప్పటికీ ఉంది.

డ్రాగన్‌ లేటెస్ట్‌ షెడ్యూల్‌ ఎప్పట్నుంచి అంటే..

డ్రాగన్‌ లేటెస్ట్‌ షెడ్యూల్‌ ఎప్పట్నుంచి అంటే..

 

 

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) సినిమా షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. 

ఓటీటీ సినిమాలు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR) ‘వార్‌-2’ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించిన సినిమా ఇది. అలాగే తారక్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన సినిమా కూడా. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులకు నిరాశే మిగిల్చింది. ఎన్టీఆర్‌ కూడా ఈ సినిమాపై ఎంతో నమ్మకంతో సూపర్‌హిట్‌ అవుతుందని కాలర్‌ ఎగరేసి మరీ సవాల్‌ విసిరారు తారక్‌. అయితే అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) సినిమా షూటింగ్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల మొదటి వారంలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోనందని తెలిసింది.

ఓటీటీ సినిమాలు

హైదరాబాద్‌లో నెలకు పైగా సాగనున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్‌లో తారక్‌పై భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ షెడ్యూల్‌ కోసం సన్నాహాలు మొదలుపెట్టారు నీల్‌. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్‌ సరసన రుక్మిణి వసంత్‌ నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్‌’ (Dragon) టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే అధికారికంగా ప్రకటించలేదు.

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు..

వార్‌2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎన్టీఆర్ దుమ్ము దులిపేశాడు

హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్‌2 ట్రైల‌ర్ విడుద‌లైంది.

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan), టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr Ntr) న‌టించి భారీ బ‌డ్జెట్ చిత్రం వార్‌2 (War 2). మ‌రో నెల రోజుల్లో ప్రేక్ష‌కుల‌కు ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. బ్ర‌హ్మాస్త్ర త‌ర్వాత అయాన్ ముఖర్జీ (Ayan mukharji) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు షురూ చేసేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అంతేగాక హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ తమ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘వార్ 2’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj films) సంస్థ ఇప్ప‌టికే వెల్లడించింది. ఈ క్ర‌మంలో వీరు చెప్పిన‌ట్లుగానే స‌రిగ్గా శుక్ర‌వారం ఉద‌యం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ముందుగా వ‌చ్చిన టీజ‌ర్‌ను మించి విజువ‌ల్ గ్రాండియ‌ర్గా ఉంది. యాక్ష‌న్ సీన్స్ హాలీవుడ్ లెవ‌ల్‌లో, మొద‌టి భాగాన్ని మించి స‌న్నివేశాలు తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా దుమ్ము లేపుతోంది. కియారా గ్లామ‌ర్‌తోనే కాకుండా యాక్ష‌న్ సీన్ల‌లోనూ అద‌ర‌గొట్టింది.

ఇదిలాఉంటే.. ఈ మూవీలో య‌శ్‌రాజ్ యూనివ‌ర్స్‌ చిత్రాల నుంచి ప‌లు స‌ర్‌ప్రైజ్‌లు ఈ సినిమాలో స‌ర్‌ఫ్రైజ్ క్యామియోలు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.ఇక వార్ మ‌రో 20 రోజుల్లో రిలీజ్ సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇప్ప‌టికే హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైల‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ థియేట‌ర్ వ‌ద్ద ప్యాన్స్ చెల‌రేగి పోయారు. భారీ క‌టౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, హ‌ర‌తులు ఇస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారిని ఆప‌డం ఇప్ప‌ట్లో కుద‌ర‌ద‌నేలా వారు హంగామా సృష్టిస్తున్నారు. ఇది ఇలానే సినిమా రిలీజ్ వ‌ర‌కు కొన‌సాగేలా తెలుస్తోంది.

నెలరోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం.

 

 

నెలరోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం

యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘స్పై యూనివర్స్’ నుండి రాబోతున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘వార్ -2’ (War -2). ఇవాళ్టి నుండి సరిగ్గా 30 రోజుల్లో ‘వార్ 2’ ఆగస్ట్ 14న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటు హృతిక్ రోషన్ (Hrithik Roshan), అటు ఎన్టీఆర్ (NTR) నడుమ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తుపాకీ గురిపెడుతూ ఉండటం విశేషం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అని ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు.

 

శేషం ఏమంటే… ‘వార్ 2’ కథానాయిక కియారా అద్వానీ జూలై 16 ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ఆమె డెలివరీ ఆగస్ట్ లో జరగాల్సి ఉంది. కానీ నెల రోజుల ముందే బిడ్డను కనేసింది కియారా. 2023లో ఆమె తన సహ నటుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకుంది. ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఆస్పత్రిలో కియారా ప్రసవం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే… ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృతిక్, ఎన్టీఆర్ అభిమానులు ‘వార్ 2’ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామా మరో ముప్పై రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రాబోతోందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో రాబోతున్న ‘వార్ -2’ ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా రికార్డులు క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు.

సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అవార్డు

చిన్నతనం నుండే ఫిమేల్ వాయిస్ తో రాణింపు

దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బొటికే సుదర్శన్..

నర్సంపేట నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన బొటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ అవార్డు వరించింది.ఈనెల 28న నిర్వహించిన ఖమ్మం వారి సర్వమాలిక కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నందమూరి తారక రామారావు 102 వ జయంతి సందర్భంగా దుగ్గొండి మండలానికి చెందిన బోటికే సుదర్శన్ కు ఎన్టీఆర్ ఐకానిక్ అచీవ్మెంట్ 2025 అవార్డు దక్కింది. ఈ అవార్డును తుమ్మలపల్లి నాగేశ్వరరావు తనయుడు తుమ్మలపల్లి యుగేందర్ చేతుల మీదుగా తీసుకున్నాడు.తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల నుండి ఈ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉంది అని సుదర్శన్ తెలియజేశ

అలాగే గత ఏప్రిల్ 13 న ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకోవడం జరిగిందని సుదర్శన్ పేర్కొన్నారు.కాగా విశాఖపట్నంలోని డాలి ఫంక్షన్ హాల్ లో సినీ హీరో నరేన్ తేజ్,పబ్లిక్ ఫైటర్ మహేష్ యాదవ్ చేతుల మీదగా ఉగాది పురస్కార్ నంది అవార్డు తీసుకున్నాడు.గత ఫిబ్రవరి 27 న కరీంనగర్ లో జరిగిన వెంకట్ మ్యూజికల్ తరపున ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బెస్ట్ ఫిమేల్ అవార్డు ఏసిపి విజయ్ కుమార్ చేతుల మీదగా తీసుకున్నాడు.   చిన్నతనం నుండి సుదర్శన్ ఫిమేల్ వాయిస్ లో పాట పాడడం అలవాటు చేసుకున్నాడు. 2025 సంవత్సరంలో ఇన్ని అవార్డులు రావడం చాలా గౌరవంగా ఉందని సుదర్శన్ తెలియజేశారు.ఈ సందర్భంగా సుదర్శన్ కు కుటుంబ సభ్యులు,గ్రామస్తులు పలువిధాల సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగే ముందు ముందు మంచి అవార్డులు తీసుకొని దుగ్గొండి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version