బిఆర్ఎస్వీ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు ఫయాజ్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శాలువా పూల మాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,మాజి సర్పంచ్ జగదీష్ రఘు రామ్ రాథోడ్ బిఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఓంకార్ మాజి ఆత్మ డైరెక్టర్ పరశురామ్ లవన్అక్షయ్ దేశ్పండే అశోక్ రెడ్డి రఘు తదితరులు.
గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ రావును బుధవారం మండల బిజెపి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్నం చందర్, మహిళా నాయకురాలు బొల్లం అరుణ, మండల ప్రధాన కార్యదర్శి చెలమల ప్రవీణ్, కోశాధికారి వడ్డెం రాజశేఖర్, బిల్లా దేవేందర్, రేపాక సంతోష్, భూక్యా హరిలాల్, దూడపాక సతీష్, సందీప్, దూడపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
ఝరాసంగం మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి ప్రియతమ నేత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవరణలో చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన జయంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నెంబర్ మల్లన్న పటేల్ మాజీ సర్పంచ్ పెంటయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రఘు మాజీ వార్డ్ మెంబర్ ఆన్సర్ సీనియర్ నాయకులు ల్యాఖత్ అలీ రాజేందర్ సింగ్ అశ్విరఫ్ అలీ రజాక్ రవి కృష్ణ ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు,
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సిరిసిల్ల జిల్లా మహిళా కాంగ్రెస్ సేవా కార్యక్రమం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణంలోని ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని, నేషనల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావు ఆదేశానుసారం, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల కొత్త బస్టాండ్ ప్రాంతంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించబడింది.జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత-నలినీకాంత్ నేతృత్వంలో ఈ కార్యక్రమంలో ఉచితంగా సానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగినది. మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ ద్వారా సమకూరిన నిధులతో సానిటరీ నాప్కిన్స్ మిషన్ కొనుగోలు చేసి, మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ఉత్పత్తి అయినటువంటి నాప్కిన్లను ఉచితంగా అందజేయడం ఎంతో మంచి కార్యక్రమం అని తెలిపారు .ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మడుపు శ్రీదేవి , టౌన్ అధ్యక్షురాలు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప జిల్లా జనరల్ సెక్రటరీ కోడం అరుణ, వైస్ ప్రెసిడెంట్ సామల రోజా, కోడం సుధా, సాగాల లత, మార్గం మంజుల మరియు అనేకమంది మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
గణపురం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఓసీ త్రీ మట్టిని ఉంచితంగా అందించాలి బీజేపీ మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎల్ భాస్కర్ కు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గణపురం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో అర్హులైన లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకుంటున్నారు. అయితే గృహ నిర్మాణంకు మట్టి తప్పనిసరి అవసరం ఏర్పడుతుంది, కానీ ఆయా గ్రామ పంచాయతీల్లో మట్టి లభ్యత లేకపోవడం, ఉన్న ప్రాంతంలో మట్టి తీసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖ నుండి అనుమతి లేకపోవడంతో ఇంటి నిర్మాణ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని 17 గ్రామపంచాయితీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఆయా గ్రామ పరిధిలో మట్టి లభ్యత లేదనందున సింగరేణి ఓసీ త్రీ మట్టిని సింగరేణి అధికారులతో మాట్లాడి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇప్పించాలని ఎంపీడీవోను కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు సోమా దామోదర్, దుగ్గిశెట్టి పున్ పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని దివంగత రాజీవ్ జాయతి వేడుకలు వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వనపర్తి లో ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు చీర్ల చందర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తో కలిసి నిర్వహించారు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సేవల ను కొనియాడారు కార్యకర్తలు దివంగత మాజీ ప్రధాని కి నివాళులర్పిం చి పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సబ్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా సోషల్ మీడియా యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఐ ఎన్ టి యు సి వర్క్స్ బోర్డ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో వారి పేరు మీద మొక్కలు నాటారు.ఈ సందర్బంగా కొయ్యాడా శ్రీనివాస్ మాట్లాడారు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుడు దేశం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం విషయంలో యువకుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి రాజీవ్ గాంధీఅని ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవత్మకంగా మార్పులను తీసుకొచ్చారు తన హయాంలో టెక్నాలజీకి పెద్దపీట వేశారన్నారు.
టెలి కమ్యూనికేషన్స్ రక్షణ వాణిజ్య విమానా సంస్కరణాల ప్రవేశపెట్టారని విద్యా అవకాశాలు సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారని అదేవిధంగా భారత దేశ యువకులకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతీ యువకులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి దేశ రాజకీయాలలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార వాణిజ్య రంగాలలో యువకులు ముందుండాలని వారి ఆలోచన విధానంతో ఈరోజు దేశ ప్రజలందరూ సెల్ఫోన్ ల్యాప్టాప్ ఐటీ రంగాన్ని ఉపయోగించుకుంటున్నారంటే యువత మొత్తం ఐటి రంగంలో ముందున్నారంటే అది రాజీవ్ గాంధీ యొక్క ఘనత అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అన్నారు.అదేవిధంగా దేశం కోసం తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజలే నా ప్రాణం అంటూ ప్రజాసేవలో ముందుకు సాగి ప్రాణాలర్పించిన మహా నాయకుడు రాజీవ్ గాంధని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బొచ్చు చందర్,బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్ల చిన్ని,సమన్వ కమిటీ సభ్యులు చిన్నల గోనాథ్,ఎండి రంజాన్ అలీ, పంచగిరి జయమ్మ,మడికొండ సంపత్,మెరుగు శ్రీశైలం గౌడ్,చందుపట్ల రాఘవరెడ్డి,సదానందం గౌడ్, మడికొండ శీను,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ ఒంటేరు శ్రవణ్ కుమార్,లక్కం వసంత,ఎండి కాయముదిన్,బొచ్చు భాస్కర్,దొమ్మటి బాబురావు,చిలువేరు రాఘవ,మహేందర్,బొచ్చు జెమిని,ఒంటేరు వరుణ్,వక్కేల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
1వ వార్డులో ఘనంగా రాజీవ్ గాంధి జయంతి
పరకాల మున్సిపాలిటిలోని ఒకటవ వార్డు సీఎస్ఐ కాలనిలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్ర పటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఐటీ రంగానికి పునాదులువేసి,భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన మార్గదర్శి,దివంగత ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ సమాన్వయ కమిటీ సభ్యులు నాయకులు డాక్టర్ మడికొండ శ్రీను,బొచ్చు భాస్కర్,యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాఘవ,సదయ్య,మడికొండ రాజు,వినయ్,మహేష్ సిద్దు,కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు.
పది సంవత్సరాలు పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ యువ నాయకులు అశ్విన్ పటేల్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న, జహీరాబాద్ నియోజకవర్గంలో వందకు వంద శాతం అన్ని గ్రామాలలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందుతమ్మనారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో, ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. జహీరాబాద్ నియోజకవర్గంలో, కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. పది సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి, పాలించింది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు, మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు తీర్చాడని అన్నారు, పార్టీలో పదవులు లేకపోయినా అందరూ కలిసి మండలంలో పని చేస్తున్నాము. అధికారం ముఖ్యం కాదు, ప్రజల కోసం పని చేస్తున్నాము. పార్టీలో ఎవర్ని నిలబెట్టిన గెలిపించుకుంటాం. పని చేసుకుంటూ పోతే పదవులు అవే వస్తాయన్నారు. ఝరాసంగం మొగుడంపల్లి కోహిర్ న్యాల్కల్ జహీరాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో, అత్యధిక శాతం స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం అని జహీరాబాద్ యువ నాయకులు అశ్విన్ పటేల్ సూచించారు.
*పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని
*అధికారులను అదేశించిన ఎమ్మేల్యే అమర్..
పలమనేరు(నేటిధాత్రి)అగస్టు19:
పలమనేరుకు తలమానికమైన పెద్ద చెరువును పరిరక్షించాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆక్రమణదారుల కోసం అధికారులు చెరువుకు గండి కొట్టి చెరువులోని నీటిని రైతుల పంట పొలాల్లోకి వదిలేసారని పత్రికలలో రావడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దీంతో మున్సిపల్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా చెరువుకు గండి కొట్టడానికి గల కారణాన్ని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.చెరువు ఆయకట్టు ప్రాంతంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో నీటిని మళ్లించినట్లు తెలిపారు. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిని మల్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కట్టను తవ్వేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పట్టణ ప్రజలకు మరియు ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే కట్ట మరమ్మతు పనులు పునరుద్ధరించి సప్లై ఛానల్ ద్వారా నీటిని తరలించే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అందుకోసం అవసరమైన నిధులను వెంటనే తెప్పించేందుకు కృషి చేస్తానని ఆ దిశగా రెవిన్యూ అధికారుల సహకారంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక చెరువు ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులను గుర్తించి పరిరక్షించాలన్నారు.ఈ సమావేశంలో తహసిల్దార్, ఇన్బనాధన్, మున్సిపల్ కమిషనర్ ఎన్వీ. రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్కల నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ లతో పాటు మున్సిపల్,రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
పలు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే అధైర్యపడొద్దు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని లక్ష్మారెడ్డిపల్లి, బుద్దారం గ్రామాలల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. ముందుగా లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మొగిలి కోమల కొంతకాలంగా అనారోగ్యం బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమల అంతిమ యాత్ర లో పాల్గొని పార్ధీవ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్దారం గ్రామంలో పెరుమాండ్ల మొగిలి, బండి శాంతమ్మ ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే వారి వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఎల్లవేళలా అండగా ఉంటానని, దైర్యంగా ఉండాలని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు
వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షణలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామి 11వ గిరి ప్రదక్షణ శ్రావణమాసం సందర్భంగా మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గిరి ప్రదక్షణలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు .ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్, ముఖ్య నాయకులు రిక్కుల మధుకర్ రెడ్డి,రవీందర్రావు, మేడి తిరుపతి,ఆర్నే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
దేశీయ ఆవుల లభ్యతపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సహజ పద్ధతులు పెరుగుతున్న వేళ, దేశీ ఆవుల కొరత రైతులకు పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు జాతుల సంరక్షణ, అభివృద్ధి, పెంపకానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సమాచారం కోరారు. అలాగే, రైతులకు దేశీ ఆవుల పెంపకం కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలు, గత మూడు సంవత్సరాల్లో లబ్ధిదారుల వివరాలు, భవిష్యత్‌లో తీసుకోబోయే కొత్త కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పశుసంవర్థక శాఖ సహాయ మంత్రి ఎస్.పి.సింగ్ బాఘెల్ సమాధానంగా, దేశీయ ఆవుల సంరక్షణకు కేంద్రం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. 2019 పశుగణన ప్రకారం, దేశంలో 193.46 మిలియన్ పశువులుండగా, వీటిలో 73.45% దేశీయ జాతులవని చెప్పారు. గత మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 8.55 కోట్ల కృత్రిమ గర్భధారణలు నిర్వహించగా, 2.78 కోట్ల రైతులు లబ్ధి పొందారని తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 91.61 లక్షల కృత్రిమ గర్భధారణలు జరిగి,18.52 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఆవుల నాణ్యత పెంపు కోసం లింగ క్రమబద్ధీకరించిన వీర్యం, ఐవిఎఫ్ టెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులు వినియోగిస్తున్నారని తెలిపారు. గుంటూరు, చింతలవెల్లి లాంటి ప్రాంతాల్లో ఐవిఎఫ్ కేంద్రాలు, గోకుల్ గ్రామాలు ఏర్పాటు చేశారన్నారు. దేశవ్యాప్తంగా 38,736 సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 4,746 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలన్నింటి ఉద్దేశ్యం దేశీయ ఆవుల రక్షణతో పాటు,సహజ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, రైతుల ఆదాయం పెంచడమే అని మంత్రి తెలిపారు. ఎంపి గురుమూర్తి కామెంట్స్ : రాష్ట్రాలతో సమన్వయం పెంచుకోవాలని, దేశీయ ఆవుల పెంపకాన్ని మరింత బలోపేతం చేయాలని ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ఫలితాలు ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయం, సహజ వ్యవసాయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మరింత బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
రాష్ట్ర పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
మహేశ్వర గార్డెన్స్ లో కేక్ కట్ చేసిన తూర్పు కాంగ్రెస్ నాయకులు. అనంతరం వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్. ఈ కార్యక్రమంలో తూర్పు కార్పొరేటర్లు, గణిపాక సుధాకర్, మీసాల ప్రకాశ్, సయ్యద్ మోసిన్, మహిళా నాయకురాళ్లు కొండా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
* మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీం భరత్
చేవెళ్ల, నేటిధాత్రి :
మొయినాబాద్ మండలం మోతుకు పల్లీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎరుకల మహేష్ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. మహేష్ మృతి చెందిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ పామేనా భీం భరత్, మహేష్ పార్టివదేహా నికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. అంతరం మహేష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపీ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆయనవెంట జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి దయానంద్ గౌడ్ , మురళి, పిరంగి భాస్కర్, గుడ్ల యాదయ్యా , బోద ప్రలద్ , బలరాజ్ , సునీల్ , సుబ్బారావు , పట్వారీ , దేవరాజ్ , మారాలి , చెంద్రయ్య ,రమేష్ , రాములు ,నరేష్ , శేఖర్ శంకరయ్య తదితరులు ఉన్నారు.
మంత్రి కొండా సురేఖ జన్మదినం..ప్రతి ఇంట్లో పండగ రోజు
-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి మంత్రి కొండా సురేఖ జన్మదినం..ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలోని ప్రతి ఇంట్లో పండగ రోజని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. మంగళవారం వరంగల్ ఖిల్లా కోటలోని వాకింగ్ గ్రౌండ్ లో జరిగిన మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను వరంగల్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళీ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కు నారగోని స్వప్న-మురళీ గౌడ్ దంపతులు కేక్ తినిపించి మంత్రి కొండా సురేఖ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేముల మహేందర్ గౌడ్ మాట్లాడారు. ఉమ్మడి ఓరుగల్లు జిల్లా ప్రజల ఆశాజ్యోతిగా..ఏ ఆపదొచ్చిన ఆ ఇంటి గడపను తట్టే లక్షలాది మంది ప్రజల ఇంటి ఆడపడుచుగా..బడుగు బలహీన వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటూ..వారి అభివృద్ధినే కోరుకుంటూ నిరంతరం శ్రమిస్తున్న శ్రామికురాలు కొండా సురేఖ అని కొనియాడారు. పేద ప్రజల గుండెల్లో కొలువైన వీర వనితగా..ధర్మంలో రుద్రమదేవిగా..ధీరత్వంలో ఝాన్సీ రాణిగా..ఓదార్పులో భూదేవిగా..గుణంలో సీతాదేవిగా..పేద ప్రజలను ఇబ్బంది పెట్టే వారి పట్ల కాళికాదేవిగా..అనునిత్యం ప్రజలను కాపాడుకునే భద్రకాళిగా పేరు ప్రఖ్యాతులు గడించిన మంత్రి కొండా సురేఖ ఆ తిరుమల-తిరుమలేశుని ఆశీస్సులతో..ఆ వేములవాడ రాజరాజేశ్వరుని దీవెనలతో..భర్త కొండా మురళీధర్ రావు చల్లని నీడలో..ప్రజల అండదండలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని, ఇంకా మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, తమరు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆ కట్ట మైసమ్మను, రేణుక ఎల్లమ్మ తల్లిని వేడుకుంటున్నట్లు మహేందర్ గౌడ్ తెలిపారు. అనంతరం ఆయన మొక్కలను నాటారు.
ఈ నెల 24న జహీరాబాద్ లో పెన్షన్ పెంపు కోసం నిర్వహించే మహా గర్జన సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తప్పక హాజరు కావాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు నర్సింహులు కోరారు.
తెలంగాణలో 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలన తర్వాత గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కొలువు దీరి 20 నెలల పాటు పాలన పూర్తయింది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి అంచనాలు ఉన్నా యని చర్చ ఆసక్తికరంగా నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. పదేండ్ల టిఆర్ ఎస్ పాలనలో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసంపాటు పడితే గెలిచిన అనంతరం తమను పట్టించుకోకుండా పార్టీ ఫిరాయింపుదార్లకే పెద్ద పీటా చేస్తున్నారని చాలా రకాలుగా పార్టీల క్యాడర్ మండిపడుతోంది.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన క్యాడర్ ని కాదని గత బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల వద్ద అనేక పైరవీలు ఎమ్మెల్యేని భ్రష్టుప ట్టిన వ్యక్తులు మళ్లీ తాజా ఎమ్మెల్యే వద్ద చేరినారని ఆరోపణలు వినిపిస్తున్నాయి పార్టీ జెండా మోసిన అసలు సిసలు కార్యకర్తలను పట్టించు కోకపోవడం లేదని తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి ప్రమాణం చేసిన నాటి నుండి నేటి వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు మరికొన్ని ప్రజలకు మేలు చేసేదిగా ఉన్నాయి. ప్రభుత్వం కొలువుదీరిన సమయం చాలా తక్కువగా ఉంది. అనేక సంక్షేమ పథకాల అమలుకు ప్రయత్నిస్తున్న మాట నిజమే అయితే అటు కేంద్రంలో కాం గ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకమైన బిజెపి అధికారంలో ఉంది. పదేళ్ల రాష్ట్రంలో పాలన సాగించిన కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల అమలుకు కట్టడాల పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఆరు గ్యారెంటీలు అమలు ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ముందున్న లక్ష్యం కాబట్టి ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుందో! ఆలోచించాల్సి ఉంది.
హైదరాబాద్,నేటిధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్పుదారి పట్టించేలా మాట్లాడిన ఐపీఎస్ అధికారి డి.ఎస్. చౌహాన్, ఐ.ఎ.ఎస్ అధికారి హరి చందనలపై ఆల్ ఇండియా సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో.. మంగళవారం ఢల్లీిలో కేంద్ర సిబ్బంది, ప్రజా వ్యవహారాల శాఖా మంత్రి జితేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ (ఎమ్మెల్సీ), బాల్క సుమన్, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లు
రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యంమనీ జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఊర్కొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. “మా ప్రభుత్వానికి పేదల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం. అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నాం. రేషన్ కార్డు కేవలం ఒక పత్రం కాదు, ఇది పేద కుటుంబానికి భరోసా, భవిష్యత్తుకు ఆర్థిక బలం.
MLA Janampally Anirudh Reddy.
పేదల ఆకలి తీర్చడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో ఇది కీలకం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డూ మంజూరు చేయలేదని విమర్శిస్తూ, అర్హులు ఎన్నో ఏళ్లు ఎదురు చూసినా.. దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ న్యాయం జరుగుతోందని తెలిపారు. “మా పాలనలో ఎవరూ ఆకలితో ఉండరని, ప్రతి అర్హుడికి సకాలంలో ప్రభుత్వం అందించే లబ్ధి చేరుస్తాం” అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఊర్కొండ మండలానికి 163 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం, 1619 పాత రేషన్ కార్డుల్లో ఆడిషన్స్ పూర్తయ్యాయని వివరించారు. ఇప్పటికే గుడిగానిపల్లి, మాదారం గ్రామాలకు రూ.12 లక్షల నిధులతో అంగన్వాడి భవనాలు మంజూరు అయ్యావని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా విద్యాధికారి మామిడి జ్ఞానేశ్వర్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూరైన సందర్భంగా ఘన సన్మానం చేశారు.ఈ నేపథ్యంలో డిఈఓ జ్ఞానేశ్వర్ ను ఏఎంఓ సృజనతేజ, జీఈసిఓ ఫ్లోరెన్స్, డిఎస్ఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్స్, కోఆర్డినేటర్లు, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం జగదీశ్వర్ లు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.