యూరియా కుంభకోణానికి పాల్పడుతున్న రేవంత్ ప్రభుత్వం..
రైతుల సమస్యలు విస్మరించి.. కాంగ్రెస్ రాజకీయ యాత్రలు..
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందించని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కుంభకోణానికి పాల్పడుతున్నదని రాష్ట్ర సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్
రాష్ట్ర నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.యూరియా కొరత వనల రైతులు పడుతున్న ఇబ్బందుల వల్ల స్పందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అండగా ఉంటున్నారు.నిత్యం ప్రజలు,రైతుల కోసం మరోసారి పోరాటం చేయకతప్పలేదు.నర్సంపేట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న రైతు పోరాటాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని అధికారులను,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ యూరియా కొరత సృష్టించి మార్కెట్ ధర కంటే అధిక ధరకు నానో యూరియా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోచుకుంటున్న ప్రభుత్వాలపై పెద్ది మండిపడ్డారు.పంటలు పాడవుతున్నాయని యూరియా కోసం ఆడిగిన రైతులపైన పిడిగుద్దులతో కాంగ్రెస్ పార్టీ దండయాత్ర చేస్తున్నదని విమర్శించారు.సన్నరకం వడ్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు రూ.1267 కోట్లా బోనస్ కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో రూ. 262 కోట్లు బోనస్ ఎగవేసిందని,రైతులు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అంగు ఆర్భాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ యాత్రలు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ కౌలు రైతులు ,రైతు కూలీలకు ఇచ్చిన హామీలు,ఎగబెట్టిన రైతూ భరోసాపై ఎందుకు ప్రస్తావించడం లేదని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.యూరియా కొరత పైన కాంగ్రెస్, బిజెపి పార్టీల మధ్య ఉన్న లాలూచీ ఒప్పందం ఏంటని.. 52 సార్లు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రైతుల కోసం కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని పత్రికా సమావేశంలో ఎందుకు అడగడంలేదని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శించారు.యూరియా జాతీయ సమస్య ఐతే పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు.
యూరియా కోసం క్యూలైన్లలో నిలబడే వేలమంది రైతులు బిఆర్ఎస్ పార్టీ రైతులే అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.యూరియా కొరత అనేది కాంగ్రెస్ పార్టీ సృష్టించిన కృత్తిమ కొరతే అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును చేపట్టి పూర్తిచేయలేదని,సాగునీరు అందివ్వని ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి యాత్రలు చేసే అర్హతలేదని ఆరోపించారు.ఆరు గ్యారెంటీలు 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పదానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.