హద్నూర్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులు ఆసక్తిగా పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు. గ్రామానికి మంజూరైన 58 ఇండ్లలో ఇప్పటివరకు 46 మంది లబ్దిదారులు బేస్మెంట్ స్థాయిని పూర్తి చేశారు. ఈ దశలో పనులు పూర్తి చేసిన ప్రతి లబ్దిదారుడికి ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున వారి ఖాతాలలో జమ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి ధనరాజ్ వివరించారుసోమవారం ఆయన నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు నరేష్, రమేష్, శుకూర్ మియా తదితరులు పాల్గొన్నారు.