అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు రూ.5 ల‌క్ష‌లు…

అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు రూ.5 ల‌క్ష‌లు

వ‌చ్చేనెల‌ 15లోగా ఇండ్ల కేటాయింపు పూర్తి చేయాలి

ఇందిర‌మ్మ ఇండ్ల స‌మ‌స్య‌లు, ఫిర్యాదుల ప‌రిష్కారానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్‌

వ‌రంగ‌ల్ స‌మ‌గ్రాభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు

రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ ,వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి

హైద‌రాబాద్,నేటిధాత్రి:

ఇందిర‌మ్మ ఇండ్ల స‌ర్వేలో ఇండ్ల స్ధ‌లాలు లేని అర్హ‌త క‌లిగిన ల‌బ్దిదారుల‌కు అసంపూర్తిగా ఉన్న డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌ను వ‌చ్చే నెల 15వ తేదీలోగా కేటాయించాల‌ని, ఇందుకు అర్హులైన ల‌బ్దిదారుల ఎంపిక‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు.అంపూర్తిగా ఉన్న ఇండ్ల‌ను పూర్తిచేసుకోవ‌డానికి ప్ర‌భుత్వ‌మే ల‌బ్దిదారుల‌కు 5 ల‌క్ష‌ల రూపాయిలు ఆర్ధిక స‌హాయాన్ని అందిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్ల‌కు ద‌ర‌ఖాస్తు ఎప్పుడు చేసుకున్నార‌నేది ముఖ్యం కాద‌ని నిరుపేద‌ల‌కు ఇండ్లు ఇవ్వడ‌మే ప్ర‌ధాన‌మ‌న్నారు. ఇప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాకూడా వాటిని ప‌రిశీలించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి ఇసుక, చెల్లింపులు, ల‌బ్దిదారుల ఎంపిక‌లో ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. శ్రావ‌ణ మాసం మొద‌లైన నేప‌ధ్యంలో త్వ‌ర‌లోనే ఇందిర‌మ్మ ఇండ్ల గృహ ప్ర‌వేశాలు కూడా ఉంటాయ‌ని తెలిపారు. ఇందిర‌మ్మ ఇండ్ల‌కు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హైద‌రాబాద్‌లోని హౌసింగ్ కార్యాల‌యంలో త్వ‌ర‌లో ఒక టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని తెల‌పారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ల ప్ర‌కారం శాస‌న‌స‌భ్యుల‌ను భాగ‌స్వామ్యం చేసి ప్ర‌తి మండ‌లంలో రేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాల‌ని ఇందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు సూచించారు.వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ , హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధికారులను ఆదేశించారు.డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ రాష్ట్ర సచివాలయంలో శ‌నివారం వరంగల్ నగర అభివృద్ధిపై పంచాయితీరాజ్ శాఖ‌ మంత్రి సీత‌క్క‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ,ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డితో కలిసి వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం,మెగా టెక్స్‌టైల్ పార్క్‌, భద్రకాళి దేవస్థానం,అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ,ఔట‌ర్‌రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై మంత్రి పొంగులేటి స‌మీక్షించారు.ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌కు అనుగుణంగా చారిత్రాత్మ‌క వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా చేయాల‌న్ని సంక‌ల్పంతో ప‌నిచేస్తున్నామ‌ని పేర్కొన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా వ‌రంగ‌ల్ న‌గ‌రాభివృద్దికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌ను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ప‌నిచేయాల‌న్నారు. వ‌రంగ‌ల్ అభివృద్దికి చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలకు సంబంధించిన డి.పి.ఆర్‌. టెండ‌ర్‌, ప‌నులు ప్రారంభించ‌డానికి, పూర్తి చేయ‌డానికి ఒక‌ ల‌క్ష్యాన్ని నిర్ధేశించుకొని ప‌నిచేయాల‌ని మంత్రి సూచించారు.

Indiramma housing issues

వ‌రంగ‌ల్ ప్రాంత చిర‌కాల స్వ‌ప్న‌మైన మామునూరు ఎయిర్ పోర్ట్ క‌ల త్వ‌ర‌లో సాకారం కానుంద‌ని అయితే ఎయిర్ పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ యుద్ధ ప్రాతిప‌దికన చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌కు ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేవ‌ని రెండు రోజుల క్రితం 205 కోట్ల రూపాయిల‌ను విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని ఈ భూ సేక‌ర‌ణ‌కు గ్రీన్ ఛాన‌ల్ ద్వారా నిధులు విడుద‌ల చేస్తామ‌న్నారు.కాక‌తీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు సంబంధించి అక్క‌డ రాజీవ్ గాంధీ టౌన్ షిప్‌లో ఆర్ & ఆర్ ప్యాకేజీ కింద 1398 మంది ల‌బ్దిదారుల‌ను గుర్తించి 863 ప్లాట్‌లు కేటాయించ‌డం జ‌రిగింద‌ని తెల‌పారు. ఈ కాల‌నీకి సంబంధించి సెప్టెంబ‌ర్ నెలాఖరు నాటికి మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న పూర్తికావాల‌ని ఆదేశించారు. అలాగే వెట‌ర్న‌రీ హాస్పిట‌ల్‌, ప్రాధ‌మిక పాఠ‌శాల‌, గ్రామ పంచాయితీ కార్యాలయ భ‌వ‌నం నిర్మించాల‌ని, మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో స్ధానిక యువ‌తకు ఉపాధి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు.


రూ. 4170 కోట్ల‌తో 2057 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని వ‌రంగ‌ల్ ప‌ట్ట‌ణంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్ధ‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని
ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించ‌డానికి వీలుగా పనుల‌ను విభ‌జించుకొని ద‌శ‌ల వారీగా చేప‌ట్టాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు.భ‌ద్ర‌కాళి ఆల‌య మాడవీధుల‌తోపాటు క‌ల్యాణ మండ‌పం, పూజారి నివాసం,విద్యుత్ అలంక‌ర‌ణ‌లను వ‌చ్చే ద‌స‌రా నాటికి అందుబాటులోకి తెచ్చేవిధంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించుకొని ప‌నిచేయాల‌ని ఆదేశించారు. అమ్మ‌వారి ఆల‌య అభివృద్ది ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు తానే స్వ‌యంగా వ‌స్తాన‌ని చెప్పారు. రోప్‌వే, గ్లాస్‌బ్రిడ్జి తో స‌హా అన్ని ప‌నులు వ‌చ్చే డిసెంబ‌ర్ క‌ల్లా పూర్తిచేయాల‌న్నారు. భ‌ద్ర‌కాళి చెరువు ప్రాంతంలో ఇంత‌వ‌ర‌కు 3.5 ల‌క్ష‌ల క్యూబిక్ మీట‌ర్ల మ‌ట్టిని త‌ర‌లించామ‌ని, 2.06 కోట్ల రూపాయిల మ‌ట్టిని విక్ర‌యించామ‌ని అధికారులు తెలిపారు. ఈ వ‌ర్షాకాలం పూర్త‌యిన వెంట‌నే ఈ చెరువు మ‌ట్టిని త‌ర‌లించాల‌ని మంత్రి సూచించారు. ఆల‌యంలో యంత్రాల సాయంతో భోజ‌న త‌యారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌తామ‌ని దీనికి త‌గ్గ‌ట్టుగా నిర్మాణాలు చేయాల‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా వ‌రంగ‌ల్ జిల్లాలో క్రికెట్ స్టేడియానికి అవ‌స‌ర‌మైన భూమిని గుర్తించాల‌ని సంబంధిత అధికారులకు సూచించారు.హాస్ట‌ల్ లో విధ్యార్ధుల‌కు, హాస్పిట‌ల్ లో ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన సేవ‌లు అందేలా చూడ‌డానికి మండ‌లానికి సంబంధించిన ఒక ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ స‌మావేశంలో మహబూబాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు బ‌ల‌రాం నాయిక్‌, శాసన సభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కె.నాగరాజు,గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, నాయ‌ని రాజేంద‌ర్‌ రెడ్డి,శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,బస్వరాజు సారయ్య,అంజిరెడ్డి,బండ ప్ర‌కాష్‌, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో పాటు వివిధ శాఖ‌ల‌కు సంబంధించిన రాష్ట్ర స్ధాయి ఉన్న‌తాధికారులు, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన క‌లెక్ట‌ర్లు డాక్టర్ సత్య శారద,స్నేహ శబరీష్,ఎస్పీలు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి.

వికలాంగులకు 5శాతం రిజర్వేషన్ కల్పించాలి.

చిట్యాల, నేటిధాత్రి :

దేశ,రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, తప్పనిసరి అవకాశం ఉన్నకాడ రిజర్వెన్లలోపోటీ చేయడానికి అవకాశం కల్పించాలని వికలాంగుల సంఘం నాయకుడు పుల్ల మల్లయ్య* కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు
శమనవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో మల్లయ్య మాట్లాడుతూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగులకు అన్ని రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తూన్నాయని అన్నారు . ఈ ప్రభుత్వాలు కొత్త పించలు సంక్షేమ పథకాలు, , అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు , భూమి కొనుగోలు పథకాలు వికలాంగులకు రావలసిన అనేక పథకాలలో అన్యాయం జరుగుతుందని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బంధులను, అవస్తలను ప్రభుత్వాలు గుర్తించి 5% శాతం రిజర్వేషన్లు కల్పించారని ,త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 5 శాతం రిజర్వేషన్లు సంబంధించిన కేంద్ర , రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారులు అమలు చేసి వికలాంగుందరికి అవకాశం కల్పించాలని కోరారు

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ..

ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ

మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, మొగుళ్ళపల్లి (PACS) వద్ద యూరియా మరియు ఇతర ఎరువుల విక్రయాల పై స్థానిక ఎస్సై బి. అశోక్ , మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి తానిఖీ నిర్వహించడం జరిగింది. తానిఖీలో యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యత మరియు నిల్వలకు సంబంధించిన వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డు, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి రైతుకి వారి యొక్క వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సిఫారసు మేరకే యూరియా మరియు ఇతర ఎరువుల బస్తాలను రైతులకి పంపిణీ చేయాలని సూచించడం జరిగింది. అలాగే, నానో యూరియా మరియు నానో డి‌ఏ‌పి వాడకం, నానో యూరియా వాడడం వల్ల కలిగే లాభాలు మరియు సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి రైతులకు సూచించడం జరిగింది.
మొగుళ్ళపల్లి మండల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది ఈ PACS, మొగుళ్ళపల్లి వద్ద 444 బస్తాలు, PACS, మొట్లపల్లి వద్ద 444 బస్తాలు, PACS, ఇస్సిపేట వద్ద 444 బస్తాలు మరియు అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద 222 బస్తాలు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది, కావున రైతులు మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డు తో సంబంధిత కేంద్రాలనుండి ఎరువులను పొందగలరు.
ఇట్టి తానిఖీలో CEO A. సాగర్ PACS పంపిణీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ..

కోరపల్లి జెడ్ పి హెచ్ ఎస్ లో సైకిళ్ల పంపిణీ
జమ్మికుంట (నేటిధాత్రి)
ఈరోజు జమ్మికుంట మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని లకు కేంద్రమంత్రి బండి సంజయ్ సంకల్పంగా తీసుకున్నటువంటి నిజోయకవర్గ పదో తరగతి విద్యార్థినిలకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి కరీంనగర్ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఎర్రవెల్లి సంపత్ రావు సంపెల్లి సంపత్ రావు, పుల్లూరు ఈశ్వర్, పుల్లూరి రవి, ఈ కార్యక్రమంలో పాల్గొని సైకిల్లు పంపిణీ చేయడం జరిగింది.

నూతన దంపతులనుఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ..

నూతన దంపతులనుఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బొజ్జలక్ష్మీకాంతం శోభ గార్ల మరియు తిరుమలపురం గ్రామానికి చెందిన ఉప్పుల లక్ష్మీనారాయణ పద్మ దంపతుల ప్రథమ పుత్రిక దామిని,బొజ్జ అక్షయ్, గార్ల ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో హాజరై ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్ దంపతులు. వారి వెంట వీరాచారి దంపతులు పాల్గొన్నారు.

బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావుకు ఘన స్వాగతం

బీజేపీ అధ్యక్షులు రామచంద్ర రావుకు ఘన స్వాగతం

బాలానగర్/ నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి చౌరస్తాలో శనివారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఎంపీ డీకే అరుణ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గోపాల్ నాయక్ గజమాలతో రామచంద్రరావును సన్మానించారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ డీకే అరుణ, బీజేపీ నేత శాంత కుమార్ వర్గీయులు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దేవేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన.

దేవేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు

జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన నల్లబెల్లి దేవేందర్రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు తదితరున్నారు

భవిష్యత్ బిఆర్ఎస్ దే..!

భవిష్యత్ బిఆర్ఎస్ దే..!

స్థానికఎన్నికల్లో బి ఆర్ఎస్ విజయ డంక మోగించాలి.

కేటీఆర్ సేనమండల పార్టీ అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్

మొగుళ్ళపల్లినేటి ధాత్రి:

బారాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూపాలపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొనుటకై వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ మొగుళ్ళపల్లి మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొనుటకై రావడం తో సంతోషకరమని తెలిపారు కేటీఆర్ సేన మండల అధ్యక్షులు శనిగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అన్ని విధాలుగా ప్రభుత్వం విఫలం చెందిందని. కావున రాబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టని అనేక సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరే విధంగా చేసిన కృషిని ప్రజలకు తెలియపరుస్తూ. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండలానికి చేసిన అభివృద్ధిని చూపెడుతూ స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో అధికారం చేపట్టే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె పని చేయాలని ఆయన అన్నారు. మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు గారి పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు..

ప్రభుత్వ స్కూల్ ప్రాంగణంలో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు

పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి డిమాండ్

నేటిధాత్రి చర్ల

చర్ల మండలంలోని పులిగుండాల గ్రామపంచాయతీ పరిధిలో గల కొండేవాయి గ్రామంలో ఎంపీపీ స్కూల్ కి ఆనుకొని సెల్ టవర్ నిర్మాణం వద్దు గ్రామంలోనే వేరే దగ్గర స్థలం ఇస్తాము అని గ్రామస్తులు చెప్పిన వినకుండా సెల్ ఫోన్ టవర్ నిర్మాణానికి స్థలం కేటాయించడం అన్యాయమని పులిగుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి అన్నారు ఫారెస్ట్ అధికారులు మరొకసారి పునరాలోచించాలని అన్నారు సెల్ ఫోన్ టవర్ ఇంత దగ్గరగా నిర్మాణం చేపట్టడం విద్యార్థులపై రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఇకనైనా చర్ల మండల అధికారులు ఇటువంటి ఇటువంటి నిర్మాణాలను గ్రామంలోని వేరొక ప్రాంతానికి తరలించాలని అన్నారు వలన ఐదవ షెడ్యూల్ ప్రాతంలో పెసా గ్రామ సభ తీర్మానం చేయకుండా ఫారెస్ట్ అధికారులు బిఎస్ఎన్ఎల్ టవర్ కోసం విద్యార్థులు ఆటలు ఆడుకునే స్కూల్ స్థలంలో మార్కింగ్ ఇచ్చివున్నారు మరియు ఎంపీపీ స్కూల్ స్థలం లో కాకుండా గ్రామంలోనే వేరే దగ్గర టవర్ ఏర్పాటు చేయాలనీ చర్ల మండల తాసిల్దార్ కు చర్ల మండల విద్యాశాఖ అధికారికి విన్నతి పత్రం ఇచ్చినారు ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు పొడియంరాజేష్ పొడియం అంద్దయ్య మడకంరవి వినోద్ యాత్ కాంగ్రెస్ నాయుకులు సోడినాగరాజు తదితరులు పాల్గొన్నారు

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం..

బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం

మొగుళ్ళపల్లిబిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బలుగూరి తిరుపతిరావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T151132.047.wav?_=1

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 27న జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు హాజరవుతారని ఈ సమావేశానికి మొగుళ్ళపల్లిమండల మండలంలోని ఇస్సి పేట గ్రామంలో మాజీ సర్పంచ్ కీ.శే కొడాలి కొమురయ్య గారి విగ్రహావిష్కరణ అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్ నందు కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు మండలపరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మొగుళ్ళపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బలుగూరితిరుపతిరావు తెలిపారు

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి.

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలి. అనర్హులకు ఇవ్వడం సరైనది కాదు.

ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పథకాన్ని కొంతమంది అభాసుపాలు చేస్తున్నారు

పారదర్శకత లేనట్లయితే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలి

ఎన్ హెచ్ ఆర్ సి. సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మెహేందికార్ సందీప్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T143400.508.wav?_=2

“నేటిధాత్రి”,సూర్యాపేట టౌన్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు, గూడులేని నిరాశ్రయులకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తుంటే రాష్ట్రంలో చాలా చోట్ల అధికార పార్టీ పేరిట ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు కంకణం కట్టుకున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మెహిందీకార్ సందీప్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలు పిడమర్తి నాగేశ్వరితో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లను ఎంపిక చేయడం సరికాదని అసలైనటువంటి నిరుపేదలకు, ఒంటరి మహిళలకు చెందాల్సినటువంటి ఇండ్లను స్థానికంగా ఉన్నటువంటి కొందరు నాయకులు, ఎంపిక చేసి అధికారులు కుమ్మక్కై కార్లు , లక్షల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయిస్తున్నారని అక్కడక్కడ ఒకే ఇంట్లోనే రెండు ఇండ్లు కూడా కేటాయించి నిజమైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పారదర్శకత లేనట్లయితే సంబంధించిన అధికారులని బాధ్యులని చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ కమిటీకి సంబంధించిన అధికారుల జాబితాను తీసుకునే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలను అప్రతిష్టపాలు చేయడానికి అధికార పార్టీ పేరిట కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి అర్హులైన వారికే ఇండ్లను కేటాయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోటాచారి, అధికార ప్రతినిధి నామ వేణు, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు నెల్లుట్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

మంథని నియోజక వర్గ దళితులను దగా చేస్తున్న..

మంథని నియోజక వర్గ దళితులను దగా చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతి పెద్ది కిషన్ రెడ్డి

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T135658.497.wav?_=3

ముత్తారం :- నేటి ధాత్రి
భట్టి విక్రమార్క నియోజకవర్గంలో దళిత బంధు ఇస్తుంటే మంథని నియోజక వర్గంలో ఎందుకు అమలు చేయడం లేదని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పోతి పెద్ది కిషన్ రెడ్డి అన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన నియోజక వర్గంలో దళిత బంధు యూనిట్లను విడుదల చేస్తుంటే మంథని నియోజక వర్గంలో
మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబుకు దళిత బంధు ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.మంథని నియోజక వర్గంలో దళితులను ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంథని నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ప్రాంత దళితులందరికీ అంబేద్కర్ అభయాహస్తం ఇయ్యాలని కోరారు.

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు..

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T125709.628.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండల్ హద్నూర్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు బక్క రెడ్డి పరితపించడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, వారి నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామని మనోధైర్యాన్ని కల్పించారు.ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ ,మాజి మండల పార్టీ అధ్యక్షులు నరసింహ రెడ్డి ,రాజ్ కుమార్, ప్రవీణ్ ,శ్రీకాంత్ రెడ్డి ,అశోక్ పాటిల్ , మహేష్ తదితరులు ఉన్నారు.

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన…

కోహిర్ మండల్ నూతన ఎస్ ఐ కి స్వాగతం పలికిన పైడిగుమ్మల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T121657.839.wav?_=5

జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండల్ కు నూతనంగా ఎస్ ఐ గ బాధ్యతలు తీసుకున్న నరేష్ కు పైడిగుమ్మల్ యువ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు కోహీర్ మండల్ లోకి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్, మాజీ ఎంపీటీసీ జ్ఞనారత్నం నాయకులు దావీదు యేసయ్య రామయ్య లక్ష్మయ్య బాలయ్య నర్సిములు ఆనందం కాంగ్రెస్ యువ నాయకులు మధు శాంసన్ అశోక్ సంపత్ సుమన్ మహేందర్ ప్రేమ్ యూత్ కాంగ్రెస్ నాయకులు బన్నీ రాకేష్ భాస్కర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నూతన కూరగాయల హోల్ సేల్ రిటైల్ మార్ట్ ను ప్రారంభించిన..

నూతన కూరగాయల హోల్ సేల్ రిటైల్ మార్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-26T120520.991.wav?_=6

జహీరాబాద్ పట్టణం లోని కూరగాయల మార్కెట్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన సంగమేశ్వర కూరగాయల హోల్ సేల్ & రిటైల్ మార్ట్ ను ప్రారంభించి ప్రోప్రెటర్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారుడు అశోక్ రెడ్డి గారిని అభినందించి ,శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి…

భారతీయ జనతా పార్టీ మద్దూర్ మండలం, అధ్యక్షులు మోకు ఉదయ్ రెడ్డి

మద్దూరు నేటిధాత్రి

జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో నిర్వహించిన “స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల” లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉడుగుల రమేష్, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ . పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మద్దూరు మండల అధ్యక్షుడు మోకు ఉదయ రెడ్డి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. అని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొంగోని సురేష్ గౌడ్ అన్నారు గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోంది. అన్నారు బిజెపి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి. అని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యుల, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ నుండి, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బిజెపి కైవసం చేసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాపాక బుచ్చిరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ కూరెళ్ల కిరణ్ గౌడ్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కొండా నాగమణి, ప్రధాన కార్యదర్శులు బొంగోని బాలు, బియ్య రమేష్,సోగాలా మనోజ్,కృష్ణా రెడ్డి, మేక సుదర్మ, చింతల రాజు, చందు, శ్రీకాంత్, బాలకృష్ణ, రాజు మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు

ఏసీబీకి పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి..

ఏసీబీకి పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి

అవినీతిపరులను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటే ఏసీబీ శాఖను అవమానపరిచినట్లే

ఎన్ హెచ్ ఆర్ సి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బూర్ల వంశీ

పెద్దపల్లి టౌన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కు పట్టుబడ్డవారిని శాశ్వతంగా ఉద్యోగం తొలగించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూర్ల వంశీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏసీబీ నిర్వహించే దాడులలో లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారు ఎలా సుద్ధపూసలు అవుతారని, అసలు వారు నిర్దోషులు ఎలా అవుతారని ఆయన అన్నారు. కోర్టులలో నిర్దోషులమని క్లీన్ చీట్ తెచ్చుకొని మళ్లీ వారు ఉద్యోగంలోకి వస్తే ఇంకా వారి ఆగడాలకు హద్దు, అదుపు ఉండదని ఆయన అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ను అవమానపరిచినట్లేనని ఆయన అన్నారు. ఏసీబీకి చిక్కిన కూడా కోర్టుల ద్వారా మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చుననే అభిప్రాయం ఇప్పటికే ఉందని కాబట్టి పూర్తి ఆధారాలతో పట్టుబడ్డ వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన ప్రభుత్వానికి కోరారు. లేనట్లయితే ఏసీబీ పట్ల ఎవరికి భయం, భక్తి ఉండవని ఆ శాఖను ఎవరూ పట్టించుకోరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతి అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని వారు తీసుకునే నిర్ణయాన్ని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు గౌరవించాలని ఆయన కోరారు. ఏసీబీకి చిక్కిన అవినీతి అక్రమార్కుల విషయంలో చట్టాలను కఠినతరం చేయాలని, దోషులను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించి, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా గౌరవ కోర్టులు, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రతి రెవిన్యూ డివిజన్ కేంద్రాలలో ఎసిబి కోర్టులను ఏర్పాటు చేయాలని, ప్రజాధనం కాపాడడానికి ఏసీబీకి సమాచారం అందించిన వారిని దేశభక్తులుగా పరిగణించాలని, వారికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త కమలాకర్, నాయకులు రాజ్యలక్ష్మి, నంబయ్య, సదయ్య తదితరులు పాల్గొన్నారు.

దేవేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు..

దేవేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులు

జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన నల్లబెల్లి దేవేందర్రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి వారి వెంట పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నె మొగిలి మండల అధ్యక్షులు ఊర నవీన్ రావు తదితరున్నారు

27 న భూపాలపల్లి బి..

27 న భూపాలపల్లి బి
ఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేద్దాం

గణపురం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మోతే కర్ణాకర్ రెడ్డి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నేతృత్వంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు తారకరామరావు హాజరవుతారని ఈ సమావేశానికి మండల పరిధిలోని అన్ని గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు , పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గణపురం మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి తెలిపారు

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన..

మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల ,నేటి దాత్రి ;

భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని మాజీ ఉపసర్పంచ్ కోడెల రాజయ్య కుటుంబాన్ని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి శుక్రవారం రోజున పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
నేడు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసినారు,
వారి వెంట మండల అధ్యక్షులు అల్లం రవీందర్. వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ చిట్యాల యూత్ అధ్యక్షుడు తవటంనవీన్ టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ పెరుమాండ్ల రవీందర్ పసుపుల శీను కోడేలరాజమల్లు సదానందం రవి రాంబాబు నరేందర్ తాటిపల్లి శీను రజినికాంత్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version