22వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో మంగళవారం కేఫ్ ఎతనిక్ లో వివిధ కుల సంఘల నాయకులందరూ ఈ నెల 22వ తేదీన జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. జహీరాబాద్ పట్టణంలో బాహర్ వాలే హటావ్ తెలంగాణ బచావ్ అనే నినాదాలతో బంద్ కి పిలుపు ని ఇవ్వడం జరిగింది.తెలంగాణ తెచ్చుకుంది ఎవరి కోసం అని తెలంగాణ రాష్ట్ర ఉద్యమా కాలంలో ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది అని జహీరాబాద్ పట్టణంలో వివిధ కుల సంఘాల నాయకులు అన్నారు.ఈ కారిక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు రాములునేత,పెద్ద గోల్ల నారాయణ, తిన్మార్ నర్సిములు,మహమ్మద్ ఇమ్రాన్, మాదినం శివప్రసాద్, దిగ్వాల్ రామేష్,మంగాలి ప్రభు,దత్తు,ఉమేష్,సి.హేచ్ శ్రీనివాస్, ప్యార్ల దశరథ్, తదితరులు పాల్గొన్నాడం జరిగింది.