రిసెప్షన్ శుభకార్యంలో పాల్గొన్నా మాజీ మంత్రి

రిసెప్షన్ శుభకార్యంలో పాల్గొన్నా మాజీ మంత్రి

◆:- జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్:-రాంజోల్ గ్రామంలో గల నక్షత్ర వెంచర్ లో జరిగిన రవీందర్ రెడ్డి & అఖిల ల రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్, కాంగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు, ఖాజా, మొయిజ్,ముర్జల్, రాజ్ కుమార్ , గౌస్ ,అలెక్సజండేర్,తదితరులు పాల్గొన్నారు.

నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి…

నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడాలి
వరంగల్ ప్రాంతీయ కేంద్ర పరిశోధన శాస్త్రవేత్తలు

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు సాగు చేస్తున్న రైతులు పంట చేలలో వర్షపు నీటి నిలువలు లేకుండా జాగ్రత్త పడాలని వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్య, మొగుళ్లపల్లి మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డిలు సూచించారు. మొగుళ్ళపల్లి మండలంలో ఇటీవల ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గురువారం స్థానిక మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రమ్యతో కలిసి మొగుళ్ళపల్లి మండలంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మండలంలో సాగు చేస్తున్న పత్తి ,వరి, మొక్కజొన్న పంటల వద్ద ఉన్న రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు అందించారు. పత్తి పంటలో ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని చేనులో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు బయటకు తీసివేయాలని, పత్తి పంట అధిక వర్షాలకు గురైనప్పుడు ప్రతి మొక్క పెరుగుదలకై 19:19:19 పాలిఫీడ్ లేదా 13:0:45 మల్టీకే పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలని, వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియాతో పాటు 20 కిలోల మెరువట పోటాష్ ఎరువులను భూమిలో మొక్కకి 4 అంగుళాల దూరంలో మొదల దగ్గర వేసుకోవాలని, అలాగే పత్తి చేనులో గుంపులు గుంపులుగా మొక్కలు ఎండిపోవడం లేదా వాలిపోవడం గమనించినట్లయితే వేరు కుళ్ళు లేదా భావించి మొక్కలు మొదల చుట్టూ వేరు బాగా తడిచేటట్లు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును పోసుకోవాలని, పత్తి చేనులో అధికత్తమ ఉన్నప్పుడు ఎకరాకు 10 కిలోల ఏరియాతో పాటుగా 400 నుండి 5 గ్రాముల కార్బన్దజిం + మాన్కోజేబ్ కలుపుకొని మొక్క మొదల దగ్గర వేసుకుంటే పార విల్ట్ ను తగ్గించుకోవచ్చునని శాస్త్రవేత్తలు అన్నారు. ప్రస్తుతం వాతావరణంలో గాలి అధిక తేమతో ఉన్నందున పత్తిలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ, అసికోకైట బ్లైట్ వచ్చే అవకాశం ఉంది, కావున మల్టీకే లాంటి పోషకాలతో పాటుగా క్యాప్తన్+ హెక్సకోనజోల్ 1.5 గ్రాములు లేదా ప్రోపీకొనుజోల్ 1 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే నివారించవచ్చునని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. అలాగే వరి పంటలో ఒకవేళ వరి నారు ముదిరినట్లయితే రైతు సోదరులు తప్పకుండా కొనలు తుంచి నాటు వేసుకోవాలి. దీని ద్వారా కాండం తొలచు పురుగు గుడ్లను నిర్మూలించుకోవచ్చన్నారు. నాటు వేసిన 20-25 రోజుల తర్వాత ఎకరానికి 8 నుండి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3జి గుళికలు తప్పకుండా వేసుకోవాలి తద్వారా కాండం తొలుచు పురుగును నిర్మూలించవచ్చన్నారు. కావున రైతు సోదరులు పైన సూచించిన సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలని శాస్త్రవేత్తలు పలు గ్రామాల రైతులకు సూచించారు. అలాగే పత్తి పంటలో నీరు నిలబడి మొక్కలు వదలిపోయిన చోట కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు, మరియు ప్లాంటమైసిన్ ఒక గ్రామ్, 10 లీటర్ల నీటితో కలిపి మొక్కల మొదలు దగ్గర పోయాలని, అదేవిధంగా రసం పీల్చే పురుగు ఉధృతి ఉన్నచోట ఇమిడాక్లోఫ్రైడ్ 2.5 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలని, గులాబీ రంగు పురుగు ఉధృతి గమనించడం కోసం లింగాకర్షక బట్టలు పెట్టుకోవాలని, అదేవిధంగా మొక్కజొన్నలో మువ్వు పురుగు ఉన్నచోట ఇమమెక్టిన్ బెంజోట్ నాలుగు మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలన్నారు. పెసర పంటలో క్లోరాంత్రిని రోల్ 60 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేయాలని, వరి పంటలో నీరు తీసివేసి 35 కిలోల యూరియా, 15 కిలోల పోటాష్ వారం రోజుల్లో రెండు దాఫాలుగా వేసుకోవాలని, అదేవిధంగా వరిలో తుంగ నివారణ కోసం florpyrauxifen benzyle+సైహలొఫోప్ butyl, 500 మిల్లీలీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేయాలని రైతులకు తెలపడం జరిగిందన్నారు.

అర్హులైన వారందరికీ పించన్లు ఇవ్వాలి

అర్హులైన వారందరికీ పించన్లు ఇవ్వాలి

సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

కరకగూడెం: అర్హులైన పేదలందరికి వృధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో ప్రతి గ్రామం నుండి ఇప్పటికే దరఖాస్తు తీసుకుని ఉన్నప్పటికీ వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గత ప్రభుత్వంలో కూడా వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని అర్హులైన వారికీ అందించడంలో ప్రజా ప్రభుత్వం విఫలమవుతుందని వారన్నారు పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అంటున్న పాలకవర్గ పెద్దలు వికలాంగులకు పింఛన్లు ఇచ్చే దిక్కు లేదా అని వారు తీవ్రంగా విమర్శించారు వారికి ఇందిరమ్మా రాజ్యం వర్తించదా అని వారు ఎదేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఒక్కరికి కూడా కొత్తగా పింఛన్ ఇచ్చిన దాఖలు లేవని వారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఇచ్చిన వాగ్దానం ప్రకారం పింఛన్దారులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సత్యం కనితి రాజు తాటి దేవయ్య తదితరులు పాల్గొన్నారు

500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ..

500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ

భూపాలపల్లి నేటిధాత్రి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 500 మీటర్ల జాతీయ జెండా తో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ బ్రిటిష్ వలస పాలన నుండి ఈ దేశానికి స్వాతంత్ర్యం ఊరికే రాలేదని లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చిందని అన్నారు.మహమ్మదీయుల నుండి బ్రిటిష్ పాలన వరకు మన దేశం బానిస సంకెళ్లను అనుభవించడానికి కారణం మన దేశ ప్రజల్లో ఐకమత్యం, దేశపట్ల ప్రేమ లేకపోవడమే కారణం అని అన్నారు. లక్షల మంది ప్రాణత్యాగంతో వచ్చిన ఈ స్వేచ్ఛను కాపాడుకునే బాధ్యత ఈ దేశ పౌరులుగా మన అందరి మీద ఉందని పునరుద్ఘాటించారు. దేశంలో ఇప్పుడు కూడా కొన్ని శక్తులు డీప్ స్టేట్ కనుసన్నల్లో, విదేశీ భావజాల ముసుగులో ఈ దేశాన్ని అస్థిర పరిచే కుట్రపన్నుతున్నారని దీనిని అడ్డుకొని తీరాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, వ్యక్తి నిర్మాణమే ఆదర్శం కావాలి తప్ప నిర్మూలన కాదన్నారు. ఈ దేశం ప్రపంచానికి మానవ వనరులను అందించే కర్మాగారంగా ఉందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ విశ్వగురు స్థానం వైపు దూసుకెళ్తున్న సమయంలో మరోమారు దేశ విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగి పోతున్నారని బాధ్యత గల పౌరులుగా, దేశభక్తులుగా భరతమాతను కాపాడుకోవాలని యువతకు,విద్యార్థులకు పిలుపునిచ్చారు.పూర్వ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జుల.ప్రేమ్ కుమార్, ప్రదీప్, విఘ్నేష్, సాయితేజ, వైష్ణవి, సహస్ర, అభి, బంటి, పేట. సాయి, వరుణ్, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు.

మొగుళ్ళపల్లి మండలంలో ఉచిత వైద్య శిబిరాలు

ఉచిత వైద్య శిబిరం.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ములకలపల్లి, రంగాపూర్ ,ఇప్పలపల్లి గ్రామాలలో మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లిలో డాక్టర్ సరళ ,రంగాపూర్ లో డాక్టర్ వాణి క్యాంపు నిర్వహించినారు .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,కాచి చల్లార్చిన నీరు తాగాలని ,వేడివేడి ఆహార పదార్థాలు తినాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలని, దోమలు కుట్టడం వల్ల మలేరియా ,చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,జ్వరాలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని తెలిపారు ములకలపల్లి లో 71 మందికి రంగాపూర్ లో 66, ఇప్పలపల్లిలో 56, మందికి వైద్య పరీక్షలు చేసి 5 రక్తనాళాలు తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ కార్యక్రమంలో కమిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,ఏఎన్ఎమ్స్ శ్రీలత ,భారతి, సువర్ణ ,సబిదా ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

నూతన హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

నూతన హోటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లోని హుగెల్లి వై-జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటైన స్టార్ నసీబ్ హోటల్ను ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మన్ననలను పొందాలని, వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్షద్ పటేల్‌ను పరామర్శించిన జ్యోతి పండాల్..

ఆర్షద్ పటేల్ గారిని పరామర్శించిన బీజేపీసీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మొగుడంపల్లి మండలం మాడ్గ్గి గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ నాయకులు ఆర్షద్ పటేల్ కొద్దీ రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతు ఆసుపత్రిలో చికిత్స పొంది పూర్తి ఆరోగ్యం తో కోలుకున్న సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్ ఈ రోజు పట్టణంలోని రాంనగర్, బృందావన్ కాలనిలో వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థిని తెలుసుకోవడం జరిగింది,ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాయికోటి నర్సిములు ఉన్నారు.

చిట్యాలలో హర్ ఘర్ తిరంగా జెండా పంపిణీ…

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి ;

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా.ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ భావాన్ని కలిగి ఉండే విధంగా భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కలిసికట్టుగా దేశం కోసం పనిచేయాలని సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా , చిట్యాల మండల కేంద్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం, శ్రీకాంత్, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు గుండ సురేష్, రాష్ట్ర నాయకులు నరసయ్య గారు, తీగల వంశీ,కేంసరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

మాజీ మంత్రి హరీష్ రావు కు స్వాగతం పలికిన బిఆర్ ఎస్ శ్రేణులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

సిద్దిపేట శాసనసభ్యులు,మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు నర్సంపేటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రాగా నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో
బారాస పార్టీ రాష్ట్ర నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిపి జిల్లా నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ, ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి , ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి,పట్టణ కమిటీ నాయకులు, యూత్ కమిటీ సభ్యులు,మహిళా విభాగం నాయకులు,మాజీ కౌన్సిలర్స్, వార్డు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఉప్పిట్ హోటల్ ప్రారంభం…

ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహిరాబాద్ పట్టణం దత్తగిరి కాలనిలో జరిగిన ఉప్పిట్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు,ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నామా రవికిరణ్,విష్ణువర్ధన్ రెడ్డి,చల్లా శ్రీనివాస్ రెడ్డి,చెంగల్ జైపాల్,సంగారెడ్డి,బి.విఠల్,నరేష్,మనోజ్,దిలీప్,తదితరులు పాల్గొన్నారు

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి..

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతులకు,యూరియా పంపిణీ తగ్గించడం దుర్మార్గమైన చర్య

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు మానుకొని రైతులకు న్యాయం చేయాలి
ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల దోపిడి అరికట్టాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ముషo రమేష్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

ఈరోజు జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు వానకాలానికి సరిపోవు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు అలాగే జిల్లాలోని సహకార సంఘ గోదాముల వద్ద తెల్లవారుజాము నుండే బార్లు తీరుతున్న రైతుల బాధలు పట్టించుకునే నాధుడే లేడని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లాలో యూరియా కొరతలేదని రైతులు ఆందోళన చెందవద్దని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు అలాగే ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే అదునుగా భావించి ఒక యూరియా బస్తా 310 రూపాయల నుండి 350 వరకు అమ్ముతూ యూరియాతోపాటు మిగతా పెటిలైజర్ కొంటేనే యూరియా ఇస్తామని అవసరం లేకున్నా దంటు గోళీలు గడ్డి మందు తదితర ఫెర్టిలైజర్ అంట కడుతున్నారని వారిపై వ్యవసాయ శాఖ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు గతంలో ప్రతి సహకార సంఘ గోదాముల్లో నిల్వ ఉండే యూరియా బస్తాలు నేడు కనిపించడం లేదని యూరియా బస్తాలు కేటాయింపుల్లో కూడా పెద్ద రైతులు భూస్వాములు లైన్లో ఎక్కడ కనిపించడం లేదని ఎక్కడ చూసినా సన్నకారు చిన్న కారు రైతులే ఇబ్బందులు పడుతున్నారని మరి వారికి యూరియా ఎలా అందుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సీజనకు సరిపడా యూరియా సప్లై చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ,జవ్వాజి విమల పాల్గొన్నారు

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు.

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ తొలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి,రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మాజీ తన్నీరు హరీష్ రావు నర్సంపేట పట్టణంలో
నెక్కొండ రోడ్డులో నూతనంగా నిర్మించిన గ్రీన్ స్టార్ హాస్పిటల్ ను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,రాష్ట్ర సివిల్ సప్లై మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట ప్రాంతంలో కిడ్నీ,గుండె,బ్రెయిన్ తదితర అత్యాధునిక పరికరాలతో సర్జరీలు,వైద్య సదుపాయం సేవలు చేయనున్నట్లు తెలిపారు.ఆసుపత్రికి ఆరోగ్య శ్రీ పథకం వచ్చే వరకు తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ రోగికి ఉచిత ఓ.పి సేవలు అదుబాటులో ఉంటాయని హామీ ఇచ్చారు.

Green Star Hospital

ర్యామినార్ ఆపరేషన్ దియేటర్ ఏర్పాటు ద్వారా అడ్వాన్స్డ్ శస్త్ర చికిత్సలు నర్సంపేటలో మొదటిసారి వచ్చాయని డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.ఎన్నారై,ఆసుపత్రి డైరెక్టర్ శానబోయిన రాజ్ కుమార్ మాట్లాడుతూ నర్సంపేట పరిదిలో ప్రజలకు తక్కువ ఖర్చులతో కార్పొరేట్ వైద్యం అందుబాటులో తెచ్చమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సుంకరి సంతోష్ రెడ్డి,స్వప్న సుదర్శన్ రెడ్డి, గోనె యువరాజు,డాక్టర్ శ్రీకృష్ణుడు, డాక్టర్ కృష్ణ కిషోర్ రెడ్డి,డాక్టర్ ఓం ప్రకాష్,డాక్టర్ రాహుల్,డాక్టర్ విద్య,డాక్టర్ కిరణ్ రెడ్డి,రాష్ట్ర మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్,వై.సతీష్ రెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు,ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ,పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ,నియోజకవర్గ యూత్ కన్వీనర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మాజీ ఎంపీపీలు, జడ్పిటిసిలు, పిఎసిఎస్ చైర్మన్ లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు,ప్రజాసంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

నరువిలో అత్యాధునిక లివర్ క్లినిక్ ప్రారంభం

నరువిలో అత్యాధునిక లివర్ క్లినిక్ ప్రారంభం

తిరుపతి(నేటి ధాత్రి(ఆగస్టు 13:

 

 

వేలూరులోని నరువి ఆసుపత్రిలో ప్రత్యేకంగా గురువారం అత్యాధునిక లివర్ క్లినిక్ నరువి హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ జీవీ సంపత్ ప్రారంభించారుఇక్కడ ప్రత్యేకంగా లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ చేయడానికి అనువుగా పరికరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లివర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు అనేకం చేసిన నరువి ఆసుపత్రి, దీనికి గాను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.ఈ సర్జరీలకు ఎల్. క్యూబ్ మెడికల్ టీమ్ సహకరించగా, ఈ టీమ్ కు డాక్టర్ జాయ్ వర్గీస్,డాక్టర్ వివేక విజ్ లు నాయకత్వం వహించారు. వీరు ఇకపై నరువి ఆసుపత్రిలోనే తమ సేవలను అందించనున్నారు.ఈ టీమ్ ఇటీవల ఒకే రోజులొ నాలుగు లివర్ ట్రాన్స్ ప్లాంట్స్ చేసినట్లు ఈ సందర్భంగా డాక్టర్ జీవి సంపత్ తెలిపారు. ఇందులో భాగంగా ఎల్ క్యూబ్,నరువి ఆసుపత్రిల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పటికే లివర్ సమస్యలతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నరువి ఆసుపత్రికి వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అనితా సంపత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పాల్ హెన్రీ, జాకబ్ జోస్, శరవణన్ రామన్, నితిన్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

అపదలో అండగా నిలిచే అనుమండ్ల తిరుపతి రెడ్డి…

అపదలో అండగా నిలిచే అనుమండ్ల తిరుపతి రెడ్డి…

అనుమాండ్ల మాధవ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా

సేవల పతాకం ఎగురవేస్తున్న చెర్లపాలెం గర్వకారణం

– తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

చెర్లపాలెం గ్రామానికి చెందిన అనుమండ్ల తిరుపతి రెడ్డి సమాజంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే జీవిత ధ్యేయంగా భావించి, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ఇటు ప్రజలకు సేవ చేయడంలో తనకంటూ ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్న మన తిరుపతిరెడ్డి, నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ కార్యకర్తలను ఎల్లవేళలా వెన్ను తడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి గుర్తిస్తూ, నమ్మిన నాయకులను వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తూ తిరుపతిరెడ్డి అంటే నమ్మకానికి మరో పేరుగా నిలుస్తూ పాలకుర్తి నియోజకవర్గం లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు..

రైతుల సంక్షేమానికి కట్టుబాటు..

వ్యవసాయ రంగంలో పారదర్శకత, పంటలకు న్యాయమైన ధరలు, మార్కెట్ సౌకర్యాల విస్తరణ వంటి పలు సంస్కరణలను అమలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విని, తక్షణ చర్యలు తీసుకోవడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. చర్లపాలెం గ్రామంలో యాదవుల భూముల దగ్గరికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న రైతులను సమస్యను దగ్గర నుండి చూసి తక్షణ సహాయంగా రైతుల కోసం రహదారి ఏర్పాటు చేసి మరియు 40 వేల రూపాయల తోటి మోరీలను ఏర్పాటు చేసి రైతుల ప్రయాణానికి సుగమం చేశారు..

హనుమాన్ల మాధవ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ – సేవకు ప్రతీక….
సమాజంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు, అనాథలు, పేద విద్యార్థుల కోసం “హనుమాన్ల మాధవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్” ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు వందలాది మందికి వైద్య సహాయం, విద్యా సహాయం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సాయం అందించారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు..

చెర్లపాలెం గ్రామంలో ప్రజల కోరిక మేరకు ఎల్లమ్మ గుడి నిర్మాణానికి తన సొంత గా రెండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రజల కోరిక మేరకు గుడి నిర్మాణం పూర్తి చేసి గత నెలలో ప్రారంభించడం జరిగింది. అలాగే గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కోసం రెండు లక్షల 16 వేల రూపాయలు అందించడం జరిగింది. చర్లపాలెం మరియు గోపలగిరి గ్రామాలకు ముత్యాలమ్మ గుడిలను నిర్మించడానికి గ్రామస్తుల కోరిక మేరకు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.వైద్య ఖర్చులు భరించడం, రోగులకు సహాయం పాఠశాలల అభివృద్ధి కోసం నిధుల సమకూర్చడం,పేద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫార్ములు, స్కాలర్‌షిప్‌లు తాగునీటి సదుపాయాల ఏర్పాటు ఆపదలో అండగా
వరదలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తిరుపతి రెడ్డి ముందుండి సహాయం అందించారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన క్షణం ఆయన వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించి సాయం అందించడం ఆయన సహజ స్వభావం.

 

భవిష్యత్ లక్ష్యం…
జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ సేవలను విస్తరించి, మరింత మంది పేదలకు, రైతులకు అండగా నిలవాలని తిరుపతి రెడ్డి సంకల్పం. గ్రామీణాభివృద్ధి, విద్యా అవకాశాల పెంపు, రైతుల సంక్షేమం ఆయన ప్రధాన లక్ష్యాలు. నియోజకవర్గంలో మరియు మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడమే కాకుండా నమ్మిన కార్యకర్తలను వెన్న0టూ ఉంటూ ఆపదలో ఆదుకొని కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా చూడాలన్న సంకల్పం నెరవేరుతుందని ఆశిద్దాం.తన గ్రామం నుంచి మొదలైన సేవా యాత్రను జిల్లాలో వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అనుమండ్ల తిరుపతి రెడ్డి, “మన సమాజంలో ఎవ్వరూ ఆపదలో ఒంటరిగా ఉండకూడదు” అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం

కార్యకర్తలను గెలిపించడమే ఝాన్సీ,యశస్విని రెడ్డి లక్ష్యం
-కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య

తొర్రూరు డివిజన్ నేటి ధాత్రి

 

 

 

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రజా ప్రతినిధులుగా చేయడమే ఝాన్సీ యశస్విని రెడ్డి లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులను ఝాన్సీ యశస్విని రెడ్డిలు గుర్తిస్తారని అన్నారు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లో తీసుకుపోయి ప్రచారం చేయాలని అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎలా గెలిపించారో రాబోయే ఎన్నికల్లో వారు కష్టపడి కార్యకర్తలను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కోసమే నిరంతరం ప్రజల మధ్యలో ఉండి సేవలందించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఝాన్సీ యశస్విని రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ జెండాకు అండగా ఉన్నారని, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు తీసుకుంటారని అన్నారు. పాలకుర్తిలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన వ్యక్తులపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ కోసం ఎంతమంది బలైన కాంగ్రెస్ పార్టీ గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఇచ్చిందన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చి లక్షలాది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశాడని అన్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, ఎస్టి సేల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, నాయకులు అలువాల సోమయ్య, బిజ్జాల అనిల్, గోపి నాయక్, సురేందర్ నాయక్, పరశురాములు, రమేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మెట్‌పల్లి గోదాములో అగ్నిప్రమాదం…

మెట్ పల్లి ఆగస్టు 14 నేటి ధాత్రి

 

 

వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి మార్కెట్ యార్డు నందు 2000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల నాన్-నాబార్డు గోదాము నందు అగ్ని ప్రమాదం జరిగినది. ఇట్టి అగ్ని ప్రమాదం నందు సివిల్ సప్లయిన్ వారి పాత గోనె సంచులు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలిసు శాఖ, రెనెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ మరియు వివిధ శాఖలకు సంబందించిన ఉద్యోగులు మరియు కార్మికులు మంటలను అదుపులోకి తేవడానికి సహాయ సహకారాలు అందించారు.
తదుపరి తెలియజేయునది ఏమనగా, వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి అధ్యక్షులు కూన గోవర్ధన్ పైన తెలిపిన డిపార్ట్ మెంట్ వారు అందించిన సహాయ సహాకారాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..

రిసెప్షన్‌లో మాజీ చైర్మన్ హాజరు…

రిసెప్షన్ వేడుకలలో పాల్గొన్న మాజీ చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని నక్షత్ర వెంచర్లో జహీరాబాద్ మున్సిపల్ శాంట్రి ఇన్స్పెక్టర్ రవీందర్ గారి రిసెప్షన్ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ వారితోపాటు మాజీ కౌన్సిలర్లు జాంగిర్ మొతిరం రాములు నేత యూనుస్ మజాహార్ బిజీ సందీప్ తదితరులున్నారు.

వర్షపు నీటిలో ఎద్దు మృతి…

ప్రమాదవశాత్తు ఎద్దు మృతి

బోరన వినిపించిన రైతు ఎల్లయ్య

#నెక్కొండ ,నేటి ధాత్రి:

మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన రైతు బైరు ఎల్లయ్య వ్యవసాయ పనుల నిమిత్తం తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పనులు ముగించుకొని వస్తున్న సమయంలో మడిపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ లోతుగా ఉండడంతో అకాల వర్షాలకు కురిన వర్షపు నీరు రైల్వే అండర్ బ్రిడ్జి లో ఎక్కువగా ఉండడంతో పాడి ఎద్దు మృత్యువాత పడినట్టు రైతు బైరు ఎల్లయ్య తెలిపారు. వ్యవసాయానికి చేదోడు వాదోడుగా ఉన్న ఎద్దు మృత్యువాత పడడంతో రైతు బైరు ఎల్లయ్య బోరుణ విలపించారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

వనపర్తి లో చిగుళ్ల పల్లి వారి వివాహ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి లో చిగుళ్ల పల్లి వారి వివాహ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో ఎం బి గార్డెన్ లో చిగుళ్ల పల్లి శ్రీనివాస్ శెట్టి కూతురు శ్రీజ సాయి కుమార్ వివాహ వేడుకలలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్లోని నూతన వదూవరులను ఆశీర్వదించారు మాజీ మంత్రి వెంట మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ బీ ఆర్ ఎస్ నేతలు ఉన్నారు

ఒకరితో అభివృద్ధి సాధ్యం కాదు…

ఒకరితో అభివృద్ధి సాధ్యం కాదు
-జగిత్యాల జిల్లా విద్యాధికారి రాము

రాయికల్, ఆగస్టు 14, నేటి ధాత్రి:

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అల్లీపూర్ నందు వాటర్ ప్లాంట్ మరియు బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి కే. రాము గారు మాట్లాడుతూ ఏ ఒక్కరితో అభివృద్ధి సాధ్యం కాదని అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. 2024- 25 10వ తరగతి బ్యాచ్ విద్యార్థినీ విద్యార్థులు చందాలు వేసుకొని పాఠశాలలో విద్యార్థుల కొరకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు. అలాగే బాస్కెట్బాల్ కోర్టు ఏర్పాటుకు పూర్తిస్థాయిలో సహకరించిన గొడ్డండ్ల రాజగోపాల్, మ్యాలపు మురళి గార్లను ప్రత్యేకంగా డీఈఓ గారు అభినందించారు. ఈ పాఠశాలకు అభివృద్ధి కొరకు గతంలో సహకరించిన వారి విధంగానే భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. కలిసికట్టుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాన్ని డీఈవో గారు అభినందించారు. తదనంతరం దాతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ గారు, దాతలు గొడ్డండ్ల రాజగోపాల్ గారు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version