ఉచిత వైద్య శిబిరం.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ములకలపల్లి, రంగాపూర్ ,ఇప్పలపల్లి గ్రామాలలో మొగుళ్ల పెళ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లిలో డాక్టర్ సరళ ,రంగాపూర్ లో డాక్టర్ వాణి క్యాంపు నిర్వహించినారు .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వర్షాలు అధికంగా పడటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,కాచి చల్లార్చిన నీరు తాగాలని ,వేడివేడి ఆహార పదార్థాలు తినాలని ,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకోవాలని, దోమలు కుట్టడం వల్ల మలేరియా ,చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ,జ్వరాలు ఉన్నట్లయితే మా వైద్య సిబ్బంది తెలియజేయాలని తెలిపారు ములకలపల్లి లో 71 మందికి రంగాపూర్ లో 66, ఇప్పలపల్లిలో 56, మందికి వైద్య పరీక్షలు చేసి 5 రక్తనాళాలు తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ కార్యక్రమంలో కమిటీ హెల్త్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ,ఏఎన్ఎమ్స్ శ్రీలత ,భారతి, సువర్ణ ,సబిదా ఆశా కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.