సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే..

సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

అత్యంత ప్రాచీనమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంటుందని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు అన్నారు భారత అడవుల, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రీన్ కార్ప్స్ వారి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్
ఏ రమణారావు
హాజరైనారు అనంతరం మాట్లాడుతూ నేటి అనిశ్చిత వాతావరణం దృష్ట్యా పర్యావరణ రహిత, భారత సాంప్రదాయ ఉత్పత్తులతో దీపావళి పండుగను సమాజ హితం దృష్టిలో ఉంచుకొని నిర్వహించుకోవాలని సూచించారు. ప్రకృతి హితమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సూచించారు. అంతకుముందు కళాశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సందర్శించారు. హస్తకళలు, చేతివృత్తులు, పేపర్ బ్యాగ్స్,గాజులు,మట్టి దీప ప్రమిదలు, తృణధాన్యాలతో చేసిన పిండి వంటకాలు, జావా చెత్తను వేరు చేయు విధానం, వివరించే స్టాల్స్ సందేశకులందరినీ ఆకట్టుకున్నాయని విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రుక్షాన మహమ్మద్, చంద్రకళ, కవిత, కాత్య, కుమారస్వామి, ఆర్ శ్రీధర్, టీ శ్రీధర్, హైమావతి, రామచందర్, దేవేందర్, శ్రీనివాస్, వరలక్ష్మి, సమీరా, హనుము, శిరీష, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్ ప్రధానం చేశారు.

చిట్యాలలో హర్ ఘర్ తిరంగా జెండా పంపిణీ…

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాల పంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి ;

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా.ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క భారతీయ పౌరుడు జాతీయ భావాన్ని కలిగి ఉండే విధంగా భారతీయ సంస్కృతిని కాపాడే విధంగా ప్రతి ఒక్క భారతీయుడు కలిసికట్టుగా దేశం కోసం పనిచేయాలని సంకల్పంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా , చిట్యాల మండల కేంద్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి మైదం, శ్రీకాంత్, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు గుండ సురేష్, రాష్ట్ర నాయకులు నరసయ్య గారు, తీగల వంశీ,కేంసరపు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version