ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నంది అవార్డు పురస్కారాల పోస్టర్ ఆవిష్కరణ
శ్రీరాంపూర్,నేటి ధాత్రి:
ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ,స్వచ్చంద సేవ సొసైటీ సంస్థ దసరా పండుగ పురస్కరించుకొని రాష్టం లోని కళాకారుల ప్రతిభని గుర్తించి,వారిని ప్రోత్సహించేందుకు విజయదశమి ఉత్తమ కళారత్న నంది అవార్డ్ పురస్కారాలు సెప్టెంబర్ 28 న మంచిర్యాలలో నిర్వహించబడుతుంది.గురువారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు,జానపద కళాకారుల,ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హన్మాండ్ల మధుకర్,మంచిర్యాల జిల్లా నృత్య కళ సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్,ఉపాధ్యక్షులు రామగిరి అర్జున్,డాన్స్ మాస్టర్స్ రిథమ్ సది,మాస్టర్ రమేష్ బాబు, డైరెక్టర్ కె.తిరుపతి వర్మ ,రవీందర్ వర్మ ,స్టాలిన్,తిరుపతి,కార్య నిర్వాహకులు దుర్గం విజయ్,కొప్పర్తి సురేందర్,బెల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
విస్డం ఉన్నత పాఠశాలలో ఉల్లాసభరితంగా ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
రాయికల్: ఆగస్టు 14, నేటి ధాత్రి:
పట్టణంలోని విస్డం ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉల్లాసభరితంగా నిర్వహించారు. దీనిలో విద్యార్థిని విద్యార్థుల చిన్ని గోపిక కృష్ణ వేషధారణలు అందరికీ చూడముచ్చట గొలిపాయి. ఈ సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. దీనిలో గోపిక కృష్ణులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ డా. ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి మాట్లాడుతూ కృష్ణం వందే జగద్గురుం-మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించారని, జీవిత సత్యాలను, కర్మ సిద్ధాంతాన్ని, భక్తి మార్గాన్ని తన భగవద్గీత ద్వారా సమాజానికి అందించిన మహా పురుషుడు శ్రీకృష్ణుడు అని అన్నారు.అటువంటి శ్రీకృష్ణుడు అందించిన గీత సారాన్ని ప్రతి ఒక్కరూ వారి మనసులో నిలుపుకొని వాటి నియమాలను పాటిస్తూ మానవ జీవితాన్ని పునీతం చేసుకోవాలన్నారు. ఈ వేడుకల్లో డైరెక్టర్ ఎద్దండి నివేద రెడ్డి , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
చిట్యాల మండలంలోనీ గోపాలపురం గ్రామంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవి మరియు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యుల సమక్షంలో ఇదిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్, భూపాలపల్లి జిల్లా సేవదల్ అధ్యక్షులు ఏకు రవీందర్, గ్రామ కమిటీ అధ్యక్షులు నీలం కుమారస్వామి, పార్టీ సీనియర్ నాయకులు గన్నారపు సదయ్య, మాజి గ్రామ కమిటీ అధ్యక్షులు గోవిందుల భద్రయ్య, బత్తిని సదయ్య, గోవిందుల శంకరయ్య, చళ్ళ కుమార్, అంబాల రవి, గూడెపు చిన్ని, సంపెల్లి రాజు, చెవుల రమేష్, మరియు ఇతర పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వాతావరణ శాఖ సూచన మేరకు రాబోవు 2 రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని మంచిర్యాల పట్టణం తిలక్ నగర్ ప్రాంతంలో గల చెరువును డి.సి.పి. ఎ.భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు,ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లాలోని కాజ్ వేలు,వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్,రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని,లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను వరద పరిస్థితుల దృష్ట్యా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు 90 మంది సభ్యులతో 3 ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, జిల్లా అధికారులతో సిద్ధంగా ఉన్నామని,ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని,పోలీసు అధికారులకు శిక్షణ అందించడం జరిగిందని,గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని,జిల్లాలోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించడం జరిగిందని ఉన్నారు.జిల్లాలో ప్రాణ నష్టం,పశు నష్టం,ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని, ఉన్నతాధికారుల మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజల రక్షణకు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎలుకటి రాజయ్య మాదిగ. ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షుడు
భూపాలపల్లి నేటిధాత్రి
రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ఇసుకను అక్రమార్కులు డంపులు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ పీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతా గరిమిళ్లపెల్లి,రామకిష్టాపూర్ ( వి)గ్రామాల్లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఇసుక ను ఇందిరమ్మ ఇండ్లు పేరుతో గ్రామాల్లో డంపులు ఏర్పాటు చేసి, పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని, ఈ తతంగం అంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరుగుతుందని అన్నారు. టేకుమట్ల మండలంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం టేకుమట్ల మండలకేంద్రంలోని చలివాగు నుండి ఇసుక తరలించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు ఇష్టారీతినా వ్యవహారిస్తూ, అక్రమార్కులకు సహకరించే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇటీవల గరిమిళ్లపెల్లి, రామకిష్టాపూర్ ( వి )గ్రామాల్లోని ఇసుక డంపులు అందుకు నిదర్శనం అని,ఈ దందా ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి భవిష్యత్తులో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇకనైనా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, ఈ ప్రాంత సహజ వనరులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఎలుకటి రాజయ్య డిమాండ్ చేశారు
సింగరేణి 24-25-సంవత్సరపు లాభాల వాటా వెంటనే ఇవ్వాలని.
ఏఐ ఎఫ్ టియు నాయకుడు చంద్రగిరి. శంకర్.
భూపాలపల్లి నేటిధాత్రి
సింగరేణి కార్మికులు.24.25 సంవత్సరం లాభాల వాటా 40 శాతం ఇవ్వాలని ఏఐఎఫ్టీయూ నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా చెమటను రక్తంగా మార్చి. సింగరేణి సంస్థను కాపాడుకుంటున్నా ఈ దేశానికి వెలుగులు ఇవ్వాలని. 8 గంటలు. పనిచేస్తూ అధిక ఉత్పత్తి సాధించిన. సింగరేణి యజమాన్యం ఇప్పటివరకు. సాధించిన ఉత్పత్తి వేయాని ప్రకటించకపోవడం. విడ్డూరంగా ఉంది యజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ. ఇప్పటికైనా. సాధించిన ఉత్పత్తిని ప్రకటిస్తూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. వచ్చినా ఉత్పత్తి ఆదాయం నుండి. 40% ఎదురుచూస్తున్న సింగరేణి కార్మికులకు ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తున్నాం ఉత్పత్తిలో భాగస్వామ్యమైన కాంట్రాక్ట్ కార్మికులకు గత సంవత్సరము. ప్రభుత్వము లాభాల వాటగా. 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది 24-25-సంవత్సరం. కూడా. 10.000 రూపాయలు. ఇవ్వాలని ఏఐ ఎఫ్ టియు నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ డిమాండ్ చేశారు
శాయంపేట మండల కేంద్రంలో కూడలి వద్ద యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మాదకద్రవ్యాల నిర్మూలనపై సీఐ రంజిత్ రావు ఎస్సై పరమేష్ ప్రతిజ్ఞ చేయించారు. మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే శారీరక మానసిక సామాజిక దుష్పప్రహాలను వివరించారు అలవాటు పడితే వ్యక్తి ఆరోగ్యం భవిష్యత్తు కుటుంబం సమాజం నాశనం అవుతుందని హెచ్చరించారు కూడలి వద్ద ప్రజలతోని డ్రక్స్ రహిత జీవనశైలి పాటించడం చుట్టుపక్కల వారు మాదక ద్రవ్యాలకు బారిన పడకుండా చూడడం వాటి విక్రయం కొనుగోలు అక్రమ రవాణా వంటి కార్యక్రమాలపై అధికా రులకు సమాచారం అందిం చడం డ్రగ్స్ లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని ప్రతిజ్ఞ చేశారు. అదేవిధంగా మత్తుపదార్థా లకు బానిసలుగా మారితే చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బం ది, యువతీ యువకులు ప్రజ లు అధిక మొత్తంలో పాల్గొ న్నారు.
జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ మంచిర్యాల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ప్రాంతంలోని పీహెచ్సీ లో మెగా మెడికల్ క్యాంప్ గురువారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉచితంగా బీపీ, షుగర్,టీబీ,బ్లడ్,డెంగ్యూ, మూత్ర వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు.తీవ్ర ఆరోగ్య ఇబ్బందులతో ఉన్న పెషేంట్స్ ని అంబులెన్స్ ద్వారా మంచిర్యాలకు తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందజేశారు. ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ పూదరి కుమార్, హెచ్ఇ అల్లాడి శ్రీనివాస్, రమేష్ సిహెచ్ఓలు రమేష్, అక్తర్,టీబి ప్రోగ్రాం సూపర్వైజర్ సాయి రెడ్డి, ఐసిటిసి మెంబెర్స్ డా.పద్మశ్రీ ఆర్ బి హెచ్ కే మెడికల్ ఆఫీసర్,డా.మమత, ఎఎన్ఎం లు రజిత,వజ్ర, సునంద,ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు
మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు లో భాగంగా నడికూడ నుండి ధర్మారం వెళ్లే రోడ్డు ఒకవైపు రోడ్డు పూర్తయి ఇంకోవైపు రోడ్డు పూర్తి కాలేదు,వర్షపు నీరు మురికి నీళ్లు పోవడానికి కూడా కాలువలు లేవు, రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీళ్లు ఎటు పోకుండా ఒక వైపు రోడ్డు మధ్యలో గుంటలాగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉంది ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారు నీళ్లలో గుంటలు ఏర్పడక చాలామంది ప్రమాదానికి గురవుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న నడికూడ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కుడ్లమలహాల్ రావు ట్రాక్టర్లతో మట్టి (మొరం) తెప్పించి నేర్పించి చదునుచేపించి ప్రమాదాలు జరగకుండా చొరవ తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బిక్షపతి, గ్రామపంచాయసిబ్బంది కిన్నెర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన మండల భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర బైక్ ర్యాలీ
: రెబ్బెన, ( కొమురం భీం ఆసిఫాబాద్ ), నేటి ధాత్రి :
రెబ్బెన మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు పాల్గొని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ గారి హయాంలో దేశం నలుమూలలా అభివృద్ధి చెందుతుందుతుందని మన జాతీయ పౌరులు విదేశాలలో సైతం గర్వంతో తీరుగాగలుగుతున్నారంటే మన దేశ ప్రత్యేకత అని అన్నారు… ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వినర్ కొలిపాక కిరణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుల్బామ్ చక్రపాణి, బీజేపీ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, బీజేపీ రెబ్బన మండల అధ్యక్షులు Malraj రాంబాబు, జిల్లా నాయకులు గోలెం తిరుపతి, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, జిల్లా సీనియర్ నాయకులు రాచకొండ రాజయ్య, జగన్నాధ ఓదెలు, మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్, మండల నాయకులు బక్క ఆనంద్, శాంతయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు….
ఆగస్టు18 నుండి 25 వరకు పాపన్న గౌడ్ 375 వ జయంతి వరోస్తవాలు జయప్రదం చేయండి
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :
భారతదేశం మొట్టమొదటి దళిత బహుజన విప్లవ వీరుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధన మార్గాన్ని సూచించి మొగలు పాలకుల మెడలు వంచి పన్నులను రద్దు చేసిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతివారోత్సవాలను దేశవ్యాప్తంగా ఈ నెల 18 నుండి 25 వరకు గ్రామ గ్రామాన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని జయప్రదం చేయాలని రాష్ట్ర గౌడ సోదరులందరికి పిలుపునిస్తున్నాం.
నిరుపేద వధువు వివాహానికి బిఆర్ఎస్ నాయకులు కంట తిరుపతిరెడ్డి 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. నిజాంపేట కు చెందిన మామిడాల సరిత కూతురు తేజశ్రీ, వివాహం రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగింది. వధువు వివాహానికి కంట తిరుపతిరెడ్డి బిఆర్ఎస్ నాయకులతో కుటుంబానికి 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మావురం రాజు, సంఘ స్వామి, రాములు, తిరుమల గౌడ్, నగేష్ మవురం ఉన్నారు.
బిజెపి పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యఅతిథిగా బిజెపి పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్.పగడాల కాళీ ప్రసాద్ రావు,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,సిరంగి సంతోష్ కుమార్ పాల్గొని బస్టాండ్ కూడలి నుండి పట్టణ రహదారిపై,ఇళ్ళు ఇళ్ళు తురుగుతూ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో జాతీయ జెండాలు పంపిణి చేశారు.ఈ సందర్బంగా డాక్టర్.కాళీ ప్రసాద్ రావు,సిరంగి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ జాతీయవాదులుగా,దేశ భక్తులుగా తయారు కావాలని అలాగే ఇంటింటికి జాతీయ జెండా కలిగి యుండటం భారతీయులుగా మన కర్తవ్యమని అన్నారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటి పై త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేయాలన్నారు.ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా జాతీయ ఉద్యమం,మన దేశాన్ని ఒకే తాటిపైకి తెచ్చి,ప్రతి హృదయంలో దేశభక్తి జ్వాలను మరింత నింపే ప్రయత్నం అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ త్యాగం,అంకితభావంతో సాధించిన స్వేచ్ఛా భారత స్వప్నాన్ని,మన 140 కోట్ల భారతీయులు అభివృద్ధి చెందిన,శ్రేష్ఠమైన దేశంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి సంగా పురుషోత్తం, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు మాజీ కౌన్సిలర్ జయంత్ లాల్,9 వార్డ్ మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి,నాయకులు ఎర్రం రామన్న,దగ్గు విజేందర్ రావు,కుక్కల విజయ్ కుమార్, వేముల సదారాణి, వెనిశెట్టి శారద,ఆకుల రాంబాబు,పైండ్ల రంజిత్,ఆర్పీ సంగీత,బూత్ అధ్యక్షులు మరాఠీ నరసింహారావు,వెల్దండి హేమంత్,ముత్యాల దేవేందర్, ఉడుత చిరంజీవి,సదా మధుకర్,సారంగ నరేష్, కాగితపు చంద్రమోహన్,ఏకు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పటేల్ గార్డెన్స్ లో వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు పటేల్ గార్డెన్స్ లో జరిగన జాడి మల్కపూర్ మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మారుతి గారి కుమారుని వివాహం వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి మున్సిపల్ చైర్మన్ తాంజీమ్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్, చిన్న రెడ్డి ,గణేష్ చంద్రయ్య , రాథోడ్ భీమ్ రావు నాయక్,అశోక్ రెడ్డి, గ్రామ నాయకులు.ఎక్స్ ఆత్మ డైరెక్టర్ పరశురాం. పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి. తిరుమలేష్ . శ్రీధర్ రెడ్డి మొలాజీ. వార్డ్ మెంబర్ సిహెచ్. రవి. బాలప్ప. లక్ష్మన్న. రాజు బాబూలాల్ తదితరులు .
నర్సంపేట పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు బెజ్జంకి ప్రభాకర్ అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోగా ఎక్కువ మొత్తంలో ఖర్చులు అయ్యాయి.కాగా స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ. 21 వేలు మంజూరు అయ్యాయి.ఎమ్మెల్యే సూచనల మేరకు పట్టణ 21వ వార్డ్ ఇంచార్జి, మాజీ వార్డ్ మెంబర్స్ కొయ్యడి సంపత్, గాజుల రమేష్ లు ఆ చెక్కును బెజ్జంకి ప్రభాకర్ కు అందజేశారు.నిరుపేద కుటుంబాలకు చేయూతగా ముఖ్య మంత్రి సహాయ నిధి పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని బెజ్జంకి ప్రభాకర్ తెలియజేశారు.కార్యక్రమంలో గిరగాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణం లోని దత్తగిరి కాలనీ లో నూతనంగా ఏర్పాటైన ఉప్పిట్టు హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ 14వవార్డ్ అధ్యక్షులు నరేష్ రెడ్డి గారికి ,వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుత వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మనలను పొందాలని, వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చెందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి మున్సిపల్ చైర్మన్ తాంజీమ్,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, పాక్స్ చైర్మన్ మచ్చెందర్ , మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప, మాజి కేతకీ సంగమేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, చిన్న రెడ్డి ,రాజా రమేష్,అమిత్ కుమార్,సత్యం ముదిరాజ్ ,శ్రీనివాస్ ,గణేష్ చంద్రయ్య , దేవిదాస్, దీపక్ ,రాథోడ్ భీమ్ రావు నాయక్,అక్షయ్ , ,అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నేషనల్ స్కాలర్ షిప్ స్కీమ్ క్రింద వీడియో కార్మికుల పిల్లలకి అందించే ఉపకార వేతనాల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ & డోలో మైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్ , క్రోమ్ ఓర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పని చేసిన వారు, వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని అన్నారు. నేషనల్ స్కాలర్ షిప్ క్రింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు వెయ్యి రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2 వేల రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3 వేల రూపాయలు, డిగ్రీ, పిజి డిప్లమా కోర్సుల చదివే పిల్లలకు 6 వేల రూపాయలు, ఐటిఐ పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8 వేల రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25 వేల రూపాయల ఉపకార వేతనం అందుతుందని అన్నారు.
Collector Sandeep Kumar Jha
1 నుంచి 10వ తరగతీ వరకు చదివే విద్యార్థులు ఆగస్టు 31 లోపు,ఇంటర్ పై చదువు చదివి విద్యార్థులు అక్టోబర్ 31 లోపు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలోని బీడీ కార్మికుల పిల్లలందరూ ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తులు ఆగస్టు 31 లోపు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హత గల బీడీ కార్మికుల పిల్లలందరూ scholarships.gov.in , జాతీయ స్కాలర్షిప్ కోర్ట్ నందు దరఖాస్తుల సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఉప సంక్షేమ కమిషనర్ సాగర్ ప్రధాన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు కేంద్ర సంక్షేమ ఆసుపత్రి డా.మహేందేర్, డా.మధుకర్, డా.వెంకటేష్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ అదనాపు డిఆర్డిఏ శ్రీనివాస్ ఎంపీడీవోలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తంగళ్ళ పల్లి. ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి.
తంగళ్ళపల్లి మండల లో. ఇందిరమ్మ కాలనీ యందు. తేదీ 14 .8. 25 రోజున. ఇందిరమ్మ. పరిపాలనలో భాగంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని ఇందులో భాగంగా. కాలానుగుణంగా. వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని. పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత . పరి శుభ్రతపై. అవగాహన మంది ప్రజలకు. . 150 మందికి స్కానింగ్ లు.ప్రతి ఒక్కరికి స్కానింగ్. చేసి 25. మందికి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు అందరికీ మందు ల.పంపిణీ చేయడం జరిగింది. ఇంటింటికి డ్రై. డే. నిర్వహించడం జరిగిందని. అలాగే.. లార్వాన్ స్ప్రే చేయడం జరిగినది. నీటి నీ.లువలను. గుర్తించి ఆయిల్ బాల్స్. ను. వేయడం జరిగిందని . కూలర్లు మరియు డబ్బాలను. పరిశీలించి నీటిని పడవేయడం జరిగిందని ఇట్టి వైద్య శిబిరంలో. డాక్టర్ దీప్తి. హెల్త్. సూపర్వైజర్ .కే ప్రమీల. ఏఎన్ఎం ప్రమీల. జ్యోతి. సతీష్ కుమార్. ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ కార్యదర్శి. అనూష. పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
దొంగ ఓట్లతో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం సిగ్గుచేటు
సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ నాయకులతో కలిసి గోడపత్రికలను భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతు 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను ఈ నెల ఆగస్టు 19నుండి 22వరకు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అని తెలిపారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా,కార్యదర్శి కే నారాయణ లు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన నిరంతరం పేదల పక్షాన పోరాటం చేసేది కేవలం కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నకిలీ ఓట్లతో అధికారంలోకి రావడం చాలా సిగ్గుచేటు అని అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నికల కమిషన్, ఈడి తన గుప్పెట్లో ఉంచుకొని ఇష్టానుసారంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. దేశ ప్రజలకు ఎన్నికల వ్యవస్థ పైన నమ్మకం పోయిందని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యచరణ రూపొందించుకొని ఆందోళన పోరాటాలను కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. కొత్త పింఛన్లను మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. మేడ్చల్ జిల్లాలో జరిగే సిపిఐ 4వ రాష్ట్ర మహాసభలను ప్రజలు, మేధావులు, కార్మికులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎండి జాఫర్ నేరెళ్ల జోసెఫ్ వేముల శ్రీకాంత్ ఎండి యాకుబ్ పాషా గోనెలా తిరుపతి ఎన్ఎఫ్ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు గోలి లావణ్య, డిహెచ్ పీఎస్ నాయకురాలు పొన్నగంటి లావణ్య రమేష్ చారి శ్రావణ్ దేవేందర్ రవీందర్ స్వామి ఏకు రాములు పాండవుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్ అన్నారు.ఈసందర్బంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్నందు కార్మికులతో కలిసి పోస్టర్ లను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆగస్టు 19,21,22న మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని గాజుల రామారం మహారాజు గార్డెన్లో ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు.భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆర్భవించి దేశ సంపూర్ణ స్వతంత్ర కోసం తిరుగుబాటు చేసిన మొదటి రాజకీయపార్టీగా చరిత్ర సృష్టించిందన్నారు.మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 1000 మంది ప్రతినిధులు పాల్గొని నాలుగు రోజులు ప్రజా సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటం కార్యక్రమాలను నిర్ణయిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిపిఐ కార్యవర్గ సభ్యులు జక్కు రాజ్ గౌడ్,నకిరేత ఓదెలు,సిపిఐ మండల కార్యదర్శి ఇల్లందుల రాములు,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు లంకదాసరి అశోక్,రైతు నిరంజన్,కుమ్మరి సదనందం తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.