తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ మన దేశ మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ అలాగే ఇందిరాగాంధీ కోడలైన సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన రోజున వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలియజేస్తూ ఆమె పుట్టినరోజు సందర్భంగా మండపల్లి చౌరస్తాలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడంతో పాటు ఆమె దేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్న ఎన్ని ప్రభుత్వాలు మారిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోగా కాలయాపన చేస్తూ వచ్చాయని రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి ప్రత్యేక ధన్యవాదాలుతెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది యువత విద్యార్థులు ప్రజలు కుల సంఘాల పెద్దలు చిన్న పెద్ద అని తేడా లేకుండా ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు పణంగా పెట్టి పోగొట్టుకొని ఉద్యమం దిశగా విద్యార్థులు యువత అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపై తీసుకువచ్చి తెలంగాణ నినాదంతో ఉవ్వెత్తున ఉద్యమం చెలరేగడంతో నా కనుల ముందే నా ప్రజలు ఉద్యమం చేపట్టి ప్రాణాలు పోతున్నాయనిగ్రహించి ఇకనైనా ప్రాణ నష్టం జరగకూడదని పార్లమెంటులో కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన తెలంగాణ ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని బిల్లు పాస్ చేయించి తెలంగాణ ఇచ్చిన ఘనత శ్రీమతి.సోనియాగాంధీకే దక్కుతుందని అలాంటి అమ్మను ఆమెను సోనియా గాంధీని స్మరించుకుంటూ ఆమె పుట్టినరోజు వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి జన్మదిన వేడుకల్లో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్లనర్సింగమ్
గౌడ్. చుక్క శేఖర్.మునిగల రాజు. బైరీనేని రాము.సత్తు శ్రీనివాస్ రెడ్డి.కొత్త రవి. భాస్కర్ గౌడ్.శేఖర్.ఎగురులప్రశాంత్. బండిపరశురాములు.సుద్దాల కరుణాకర్. బండి పరశురాం.మీరాలశ్రీనివాస్. రాపెల్లిఆనందం.రెడ్డి పరశురాములు.నరసయ్య. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
