పాలకుర్తి విద్యార్థులకు ఆర్థిక సాయం చేసిన హనుమాండ్ల కుటుంబం..

పాలకుర్తి నియోజకవర్గ నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించిన హనుమాండ్ల కుటుంబం

ఈ ప్రాంత అభివృద్దే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి కుటుంబం సదాశయం

మరోసారి తమ చేతలతో నిరూపించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు

తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

తొర్రూరు క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఒక హృద్యమైన కార్యక్రమం జరిగింది. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, హనుమాండ్ల ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, వారి కుటుంబం ఒక సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన 14 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విద్యా ఖర్చుల కోసం మొత్తం రూ.4,84,000 విలువైన చెక్కులను వారి కుటుంబాలకు అందజేశారు..

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందించారు. నిరుపేద విద్యార్థులు చదువు ఆపకుండా ముందుకు సాగాలని, తమ సపోర్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. విద్య మాత్రమే సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుందని, వెనుకబడిన వర్గాలకు మద్దతుగా నిలవడం తమ కుటుంబం యొక్క ప్రధాన బాధ్యత అని ఝాన్సీ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు.

తాము ఈ ప్రాంతానికి రుణపడి ఉన్నామని, ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ తమకు శక్తినిస్తాయని ఆమె అభివర్ణించారు. నేను చేస్తున్నది దాతృత్వం కాదు, నా కుటుంబానికి చేస్తున్న బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా, ఒక తల్లి హృదయంతో సమాజంలోని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా పాలకుర్తి నియోజకవర్గంలో విద్యా అభివృద్ధి పట్ల కుటుంబం ఎంత అంకితభావంతో ఉన్నామో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు.. మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతీ విద్యార్తి చదువుకోవాలి, ఎవరూ ఆర్థిక సమస్యల వలన వెనుకబడి పోకూడదు. ఇందుకు కావాల్సిన సహాయం, ప్రోత్సాహం అందించడంలో మా కుటుంబం ఎప్పటికీ ముందుంటుంది. పాలకుర్తి అభివృద్ధి మా బాధ్యత మాత్రమే కాదు, మా జీవిత ధ్యేయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిరుపేద విద్యార్థులు, వారి కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇంత పెద్ద సహాయం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆగిపోతుందనే ఆందోళనలో ఉన్నామని, ఇప్పుడు కొత్త ఆశలు కలిగాయని వారు పేర్కొన్నారు. కొందరు తల్లిదండ్రులు కంటతడి పెట్టుకుంటూ తమ పిల్లల భవిష్యత్తు కోసం ఇంతటి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపన తర్వాత విద్యా రంగం, ఆరోగ్య రంగం, సామాజిక సేవా రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ ట్రస్ట్ చేస్తున్న కృషి పాలకుర్తి ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తోంది. గతంలోనూ పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందించిన ఈ కుటుంబం, ఈసారి కూడా ఆర్థిక సాయం అందించడం విశేషం. విద్యా హక్కు ప్రతి పిల్లవాడికి లభించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి కుటుంబం చర్యలు స్థానిక ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.

కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన పలు కాంగ్రెస్ నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోమరాజశేఖర్ మాజీ కౌన్సిలర్ భూసాని రాము బసవ బోయిన రాజేష్ యాదవ్ హనుమండ్ల దేవేందర్ రెడ్డి చెర్లపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటీ నాగిరెడ్డి కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని, విద్యార్థులను అభినందిస్తూ, వారి భవిష్యత్తు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

అపదలో అండగా నిలిచే అనుమండ్ల తిరుపతి రెడ్డి…

అపదలో అండగా నిలిచే అనుమండ్ల తిరుపతి రెడ్డి…

అనుమాండ్ల మాధవ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా

సేవల పతాకం ఎగురవేస్తున్న చెర్లపాలెం గర్వకారణం

– తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి

చెర్లపాలెం గ్రామానికి చెందిన అనుమండ్ల తిరుపతి రెడ్డి సమాజంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే జీవిత ధ్యేయంగా భావించి, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ఇటు ప్రజలకు సేవ చేయడంలో తనకంటూ ప్రత్యేక శైలిలో దూసుకుపోతున్న మన తిరుపతిరెడ్డి, నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ కార్యకర్తలను ఎల్లవేళలా వెన్ను తడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి గుర్తిస్తూ, నమ్మిన నాయకులను వారికి ఎల్లవేళలా అండగా నిలుస్తూ తిరుపతిరెడ్డి అంటే నమ్మకానికి మరో పేరుగా నిలుస్తూ పాలకుర్తి నియోజకవర్గం లో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు..

రైతుల సంక్షేమానికి కట్టుబాటు..

వ్యవసాయ రంగంలో పారదర్శకత, పంటలకు న్యాయమైన ధరలు, మార్కెట్ సౌకర్యాల విస్తరణ వంటి పలు సంస్కరణలను అమలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విని, తక్షణ చర్యలు తీసుకోవడంలో ఆయన ఎల్లప్పుడూ ముందుంటారు. చర్లపాలెం గ్రామంలో యాదవుల భూముల దగ్గరికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న రైతులను సమస్యను దగ్గర నుండి చూసి తక్షణ సహాయంగా రైతుల కోసం రహదారి ఏర్పాటు చేసి మరియు 40 వేల రూపాయల తోటి మోరీలను ఏర్పాటు చేసి రైతుల ప్రయాణానికి సుగమం చేశారు..

హనుమాన్ల మాధవ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ – సేవకు ప్రతీక….
సమాజంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు, అనాథలు, పేద విద్యార్థుల కోసం “హనుమాన్ల మాధవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్” ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు వందలాది మందికి వైద్య సహాయం, విద్యా సహాయం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సాయం అందించారు.

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు..

చెర్లపాలెం గ్రామంలో ప్రజల కోరిక మేరకు ఎల్లమ్మ గుడి నిర్మాణానికి తన సొంత గా రెండు లక్షల రూపాయలు ఇచ్చి ప్రజల కోరిక మేరకు గుడి నిర్మాణం పూర్తి చేసి గత నెలలో ప్రారంభించడం జరిగింది. అలాగే గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కోసం రెండు లక్షల 16 వేల రూపాయలు అందించడం జరిగింది. చర్లపాలెం మరియు గోపలగిరి గ్రామాలకు ముత్యాలమ్మ గుడిలను నిర్మించడానికి గ్రామస్తుల కోరిక మేరకు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.వైద్య ఖర్చులు భరించడం, రోగులకు సహాయం పాఠశాలల అభివృద్ధి కోసం నిధుల సమకూర్చడం,పేద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫార్ములు, స్కాలర్‌షిప్‌లు తాగునీటి సదుపాయాల ఏర్పాటు ఆపదలో అండగా
వరదలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తిరుపతి రెడ్డి ముందుండి సహాయం అందించారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన క్షణం ఆయన వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించి సాయం అందించడం ఆయన సహజ స్వభావం.

 

భవిష్యత్ లక్ష్యం…
జిల్లా వ్యాప్తంగా ట్రస్ట్ సేవలను విస్తరించి, మరింత మంది పేదలకు, రైతులకు అండగా నిలవాలని తిరుపతి రెడ్డి సంకల్పం. గ్రామీణాభివృద్ధి, విద్యా అవకాశాల పెంపు, రైతుల సంక్షేమం ఆయన ప్రధాన లక్ష్యాలు. నియోజకవర్గంలో మరియు మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేయడమే కాకుండా నమ్మిన కార్యకర్తలను వెన్న0టూ ఉంటూ ఆపదలో ఆదుకొని కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా చూడాలన్న సంకల్పం నెరవేరుతుందని ఆశిద్దాం.తన గ్రామం నుంచి మొదలైన సేవా యాత్రను జిల్లాలో వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అనుమండ్ల తిరుపతి రెడ్డి, “మన సమాజంలో ఎవ్వరూ ఆపదలో ఒంటరిగా ఉండకూడదు” అనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version