కిష్త్వార్ జిల్లా చిసోటీ గ్రామంలో, ఆగస్టు 14న జరిగిన క్లౌడ్‌బర్స్ కారణంగా భారీ ఫ్లాష్ ఫ్లడ్‌లు చోటుచేసుకున్నాయి. 60 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మంది ఇంకా అదృశ్యంగా ఉన్నారు. 167 మంది గాయాలతో రక్షించబడ్డారు. ఫ్లాష్ ఫ్లడ్‌ల కారణంగా మార్కెట్, లంగర్ స్థలాలు, 16 ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, 3 ఆలయాలు, 4 వాటర్ మిల్స్, 30 మీటర్ల పొడవైన వంతెన, పలు వాహనాలు నశించాయి.
సమగ్ర రక్షణ చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, BRO, పోలీస్, స్థానిక వాలంటీర్లు పాల్గొని, రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నారు. 17 మీటర్ల బ్రీడ్జ్ నిర్మాణం జరుగుతూ, రోడ్డు కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. బాధితులకు ఆహారం, మందులు, మరియు ఇతర సహాయాలు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. Machail Mata యాత్ర నాలుగో రోజు కూడా నిలిపివేయబడింది.
Tag: rescue operation
మెట్‌పల్లి గోదాములో అగ్నిప్రమాదం…
మెట్ పల్లి ఆగస్టు 14 నేటి ధాత్రి
వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి మార్కెట్ యార్డు నందు 2000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల నాన్-నాబార్డు గోదాము నందు అగ్ని ప్రమాదం జరిగినది. ఇట్టి అగ్ని ప్రమాదం నందు సివిల్ సప్లయిన్ వారి పాత గోనె సంచులు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలిసు శాఖ, రెనెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ మరియు వివిధ శాఖలకు సంబందించిన ఉద్యోగులు మరియు కార్మికులు మంటలను అదుపులోకి తేవడానికి సహాయ సహకారాలు అందించారు.
తదుపరి తెలియజేయునది ఏమనగా, వ్యవసాయ మార్కెట్ కమిటి మెట్ పల్లి అధ్యక్షులు కూన గోవర్ధన్ పైన తెలిపిన డిపార్ట్ మెంట్ వారు అందించిన సహాయ సహాకారాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..